బస్సు నడుపుతూ.. ఫోన్‌లో హలో హలో! | rtc driver fined rs 1000 for cellphone drive | Sakshi
Sakshi News home page

బస్సు నడుపుతూ.. ఫోన్‌లో హలో హలో!

Published Wed, Apr 13 2016 3:19 PM | Last Updated on Sun, Sep 3 2017 9:51 PM

బస్సు నడుపుతూ.. ఫోన్‌లో హలో హలో!

బస్సు నడుపుతూ.. ఫోన్‌లో హలో హలో!

హైదరాబాద్‌:

కూకట్‌పల్లి టు బీహెచ్‌ఈఎల్‌.. దాదాపు ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది. బాగా రద్దీగా ఉండే ఈ రోడ్డుపై వాహనాలు నడుపడమంటే మాటలు కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశముంటుంది. కానీ ఓ ఆర్టీసీ డ్రైవర్‌ మాత్రం ఇదేమీ పట్టనట్టు.. తాపీగా బస్సు నడుపుతూ.. మరోవైపు సెల్‌ఫోన్‌లో బాతాఖానీ పెట్టాడు. ఓ చేతితో స్టీరింగ్‌ తిప్పుతూ.. మరో చేతితో సెల్‌ఫోన్‌ పట్టుకొని ముచ్చట్లు నడిపాడు. ఆ సమయంలో బస్సులో పలువురు ప్రయాణికులు కూడా ఉన్నారు.

సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడుపుతున్న ఆ ఆర్టీసీ డ్రైవర్‌ను ట్రాఫిక్‌ ఎస్సై రవి గుర్తించి వెంటనే.. బస్సును ఆపేయించాడు. సెల్‌ఫోన్‌ డ్రైవ్‌ చేస్తున్నందుకు డ్రైవర్‌పై రూ. వెయ్యి జరిమానా విధించాడు. బుధవారం ఆర్టీసీ బస్సు కూకట్‌పల్లి నుంచి బీహెచ్‌ఈఎల్‌ వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement