
కామారెడ్డి: ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై టోల్‌ప్లాజా మేనేజర్, సిబ్బంది దాడిచేశారు. ఈ సంఘటన కామారెడ్డిజిల్లా భిక్కనూర్ టోల్‌ప్లాజాలో జరిగింది. నిజామాబాద్ నుంచి తిరుపతి వెళ్లే నిజామాబాద్ డిపో-1కు చెందిన బస్సు భిక్కనూర్ టోల్ ప్లాజాకు చేరింది. అక్కడ బస్సును పక్కకు తిప్పే క్రమంలో టోల్‌ప్లాజా డివైడర్‌కు చిన్న పెచ్చు ఊడింది. దీంతో టోల్‌ప్లాజా సిబ్బంది, మేనేజర్ సంతోష్‌లు బస్సు డ్రైవర్‌ను దుర్భాషలాడారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో డ్రైవర్ మారుతిపై టోల్‌ప్లాజా మేనేజర్ సంతోష్ దాడిచేశాడు. పైగా సుమారు గంటపాటు బస్సును నిలివేశారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేసి బస్సును పంపించేశారు. అయితే ఇంత జరిగినా టోల్‌ప్లాజా సిబ్బందిపై చర్యలు తీసుకోలేదు. బస్సు డ్రైవర్‌పై దాడిచేసినట్లు సంతోష్ స్వయంగా ఒప్పుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment