చంద్రబాబు పోస్టర్‌తో నిందితుడు అరుణ్‌కుమార్
సాక్షి, అమరావతి: ఆర్టీసీ డ్రైవర్‌పై కావలిలో దాడి చేసిన రౌడీలు విపక్ష టీడీపీ, జనసేన, బీజేపీకి చెందినవారేనని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. దాడి చేసిన రౌడీలు ‘ఐ సపోర్ట్ బాబు..’ బ్యానర్లు పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుల్లో ఒకరు జనసేన జెండా కప్పుకోగా మరొకరు బీజేపీ నేత అనుచరుడిగా ఉన్నట్లు చెప్పారు.
ఆధారాలతో సహా రౌడీ మూకల ఫోటోలను మీడియాకు ఆయన విడుదల చేశారు. ప్రశాంత ప్రాంతం కావలిలో ఎవరు ఎటువంటి వారో ప్రజలకు బాగా తెలుసన్నారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వాస్తవాలు తెలుసుకోకుండా లోకేశ్, పవన్ కల్యాణ్ బుర్రలేని మాటలు మాట్లాడారని విమర్శించారు.
దొంగలే.. దొంగ దొంగ అంటూ దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. సాయంత్రం 6.30 గంటల సమయంలో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో కలసి తాను ఆర్టీవో కార్యాలయాన్ని ప్రారంభించి వెళ్తుండగా సంఘటన స్థలం వద్ద ఏం జరిగిందో వివరాలు సేకరించాలని పోలీసులకు సూచించినట్లు చెప్పారు. టీడీపీ, దాని తోక పార్టీలు ప్రతి విషయాన్ని వైఎస్సార్ సీపీకి ఆపాదించే యత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. డ్రైవర్‌పై దాడి చేసిందెవరో కావలి ప్రజలందరికీ తెలుసని చెప్పారు.
నిందితుడు సుధీర్‌పై నాలుగు రాష్ట్రాల్లో వందల కేసులున్నాయని, అవన్నీ బయటకు తీస్తామని తెలిపారు. ఈ ఘటనలో తమ పార్టీకి చెందిన వారు ఒక్కరున్నా రాజకీయాల నుంచి తప్పుకుంటానని మరి లోకేశ్ అందుకు సిద్ధమేనా? అని సవాల్ చేశారు. ప్రధాన ముద్దాయి సుధీర్ గతంలో తన కారుపై కూడా దాడి చేసినట్లు పేర్కొన్నారు. టీడీపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్న పసుపులేటి సుధాకర్ అనే వ్యక్తి పక్కన నిందితుడు గుర్రంకొండ అరుణ్ కుమార్ ఉన్నట్లు వెల్లడించారు.
గతంలో జనసేన తరఫున తనపై పోటీ చేసిన సుధాకర్ వద్ద ఇలాంటి గ్యాంగులు చాలా ఉన్నాయని, వాటిని హైదరాబాద్‌లో మోహరించి ఏం చేస్తున్నాడో తమకు సమాచారం ఉందన్నారు. అరుణ్ కుమార్ అనే వ్యక్తి ‘ఐ సపోర్ట్ బాబు’ అనే బ్యానర్ పట్టుకున్నాడని చెప్పారు. శివారెడ్డి జనసేన కార్యకర్తే అనే విషయాన్ని పవన్ తెలుసుకుంటే మంచిదన్నారు. ఎవరు రౌడీ షీటర్లను పక్కన పెట్టుకుని తిరుగుతున్నారో గుర్తు పెట్టుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment