ఫోన్ మాట్లాడుతూ బస్సు డ్రైవింగ్ | Speaking on the phone while driving the bus | Sakshi

ఫోన్ మాట్లాడుతూ బస్సు డ్రైవింగ్

Published Sat, Jul 16 2016 12:20 AM | Last Updated on Mon, Sep 4 2017 4:56 AM

ఫోన్ మాట్లాడుతూ బస్సు డ్రైవింగ్

ఫోన్ మాట్లాడుతూ బస్సు డ్రైవింగ్

ఆర్టీసీ డ్రైవర్‌కు రూ. వెయ్యి జరిమానా
 
భాగ్యనగర్‌కాలనీ : ఫోన్ లో మాట్లాడుతూనే బస్సు నడుపుతూ ఓ ఆర్టీసీ డ్రైవర్ కూకట్‌పల్లి ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు.  సదరు డ్రైవర్‌కు పోలీసు లు చలానా విధించారు.  మియాపూర్ డిపోకు చెంది న బస్సు (ఏపీ11జెడ్ 6563) శుక్రవారం కూకట్‌పల్లి వై జంక్షన్ వద్దకు చేరుకుంది. ఆ సమయంలో డ్రైవర్ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ ఆ బస్సు నడుపుతున్నాడు.

ఈ విషయం గమనించిన ట్రాఫిక్ పోలీసులు డ్రైవర్‌ను పట్టుకున్నారు. అతడికి రూ. వెయ్యి చలాన్ విధించారు. అనంతరం ట్రాఫిక్ ఎస్‌ఐ సైదులు మాట్లాడుతూ... వాహనం నడుపుతూ ఫోన్‌లో మాట్లాడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారిపైనైనా చర్యలు తీసుకుంటామన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement