డ్రైవర్‌కు చలానా విధిస్తున్న ట్రాఫిక్ ఎస్‌ఐ
భాగ్యనగర్‌కాలనీ(హైదరాబాద్): రకరకాల కారణాలతో ప్రైవేటు వాహనదారుల నుంచి భారీగా చలాన్లు వసూలుచేసే ట్రాఫిక్ పోలీసులు.. ప్రభుత్వ వాహనాల విషయంలో మాత్రం కాస్త చూసీచూడనట్లు వ్యవహరిస్తారనే విమర్శ ఉంది. ఆ అపవాదు నుంచి బయటపడాలనుకున్నారో ఏమోగానీ ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన టీఎస్ఆర్టీసీకి చెందిన బస్సు డ్రైవర్ కు వెయ్యి రూపాయల జరిమానా విధించారు.
హయత్‌నగర్ –2 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (ఏపీ 28జెడ్ 3543) ఆదివారం సాయంత్రం కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు వైపుగా వెళుతునప్పుడు. కూకట్‌పల్లి వై జంక్షన్ సమీపంలోకి రాగానే బస్సు నడుపుతున్న డ్రైవర్ శ్రీనివాస్ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ ట్రాఫిక్ పోలీసుల కంట పడ్డాడు. ట్రాఫిక్ ఎస్‌ఐ సైదులు బస్సును పక్కకు పెట్టించి, డ్రైవర్‌కు వెయ్యి రూపాయల జరిమానా విధించారు.