ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్ రోడ్డు రవాణా శాఖ ఏ వింతైన నిబంధనను తీసుకువచ్చింది. ఇకపై బస్సుల్లో డ్రైవర్లు, కండక్టర్ల ఫోన్‌లను కూడా తనిఖీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. చెకింగ్ అధికారుల రూట్ వివరాలను బస్సు డ్రైవర్లు తమ సహోద్యోగులకు చేరవేస్తున్నారని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. చెకింగ్ అధికారుల రూట్‌కు అనుగుణంగా ఇతర రూట్‌లలోని ఉద్యోగులు విధులను నిర్వర్తిస్తున్నారని తమ దర్యాప్తులో తేలినట్లు వెల్లడించింది. సంస్థ ప్రయోజనాల కోసం ఈ నియమాన్ని తీసుకొచ్చినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.
అధికారులు బస్సుల్లో చెకింగ్ చేసే సమయంలో మొదట బస్సు డ్రైవర్, కండక్టర్ ఫోన్‌లను చెక్ చేస్తారని మేనేజింగ్ డైరెక్టర్ అన్నపూర్ణ గార్గ్ తెలిపారు. చెకింగ్ సమయంలో డ్రైవర్, కండక్టర్ సహోద్యోగులకు సంబంధిత వివరాలను పంపినట్లు తేలితే కఠిన శిక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా ఉద్యోగులు ఈ అక్రమాలకు పాల్పడుతున్నారని కనుగొన్నట్లు వ్లెడించారు.
రాష్ట్ర రోడ్డు రవాణా శాఖా మంత్రి దయా శంకర్ సింగ్ కూడా ఈ నిబంధనలపై స్పందించారు. ఉద్యోగులందరూ ఈ నియమాలను పాటించాలని సూచించారు. అక్రమాలకు పాల్పడితే విధుల నుంచి తప్పిస్తామని ఉద్యోగులను హెచ్చరించారు.
దీనిపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఫోన్‌ను వాడడం తమ వ్యక్తిగత హక్కు అని చెబుతున్నాయి. వ్యక్తిగత వివరాలు సెల్‌ఫోన్‌లో భద్రపరుచుకుంటామని వెల్లడించాయి. చెకింగ్‌ల పేరిట తమ వ్యక్తిగత హక్కుకు భంగం వాటిల్లుతుందని తెలిపాయి. ఈ నిబంధనల నుంచి ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించాయి.
ఇదీ చదవండి: పండుగ సెలవుల్లో విషాదం: రెస్టారెంట్‌లో పేలిన సిలిండర్.. 31 మంది దుర్మరణం
Comments
Please login to add a commentAdd a comment