
ఆర్టీసీ డ్రైవర్‌పై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు
హైదరాబాద్: మద్యం సేవించి బస్సు నడుపుతున్న ఆర్టీసీ డ్రైవర్‌పై శనివారం మలక్‌పేట ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. పికెట్ డిపోకు చెందిన ఏపీ29 జెడ్1319 నంబర్ బస్సు జేబీఎస్ నుంచి శ్రీశైలం వెళ్తుండగా.. డ్రైవర్ తాగి బస్సు నడుపుతున్నాడని గమనించిన ప్రయాణికులు మలక్‌పేట ట్రాఫిక్ పోలీసులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆజంపుర చౌరస్తా వద్ద బస్సును ఆపి డ్రైవర్ కె. ఆప్సర్‌ను తనిఖీ చేశారు. బీఏసీ 181 ఎంజీ లెవల్.. ఆల్కహాల్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో అతనిపై కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకట్‌రెడ్డి తెలిపారు.