ములుగు: ములుగు జిల్లా వాజేడు ఎస్సై హరీశ్ అనుమానాస్పద ఆత్మహత్యపై పలు రకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ కేసులో కీలక వ్యక్తిగా భావిస్తున్న గన్‌మన్ అందుబాటులో లేకపోవడం అనుమానాలకు దారితీస్తోంది. కేసును ఛేదించేందుకు వెంకటాపురం(కె) సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో వాజేడు కేంద్రంగా పూర్తి స్థాయి సమాచారం రాబట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఇప్పటికే ఆత్మహత్య అనంతరం సంఘటనా స్థలం నుంచి క్లూస్ టీమ్ సభ్యులు ఎస్సై హరీశ్‌కు సంబంధించిన రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి ముందు మాట్లాడిన సూర్యాపేట జిల్లా పరిధి చిలుకూరు మండలానికి చెందిన యువతి ఫోన్‌కాల్ లిస్టుపైన మదింపు జరుగుతున్న ట్లుగా సమాచారం. ఇదంతా పోలీసు శాఖ పరిధిలో సాఫీగానే జరుగుతున్నా.. వాజేడు ఎస్సైగా హరీశ్ బాధ్యతలను స్వీకరించిన నాటి నుంచి అతను ఆత్మహత్య చేసుకునే వరకు ఎస్‌ఐతో ఉన్న గన్‌మన్ మరుసటి రోజు నుంచి అందుబాటులో లేకపోవడంపై పలు అనుమానాలకు దారితీస్తోంది.
సంచలనంగా మారిన ఈ కీలక కేసులో గన్‌మన్‌కు పోలీస్ ఉన్నతాధికారులు సెలవు ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్ధం కావడం లేదు. వివాదాస్పద కేసు వివరాలను బయట పెడతాడని అధికారులు అతడిని సెలవుపై పంపించారా? లేక అతడిని కూడా విచారిస్తున్నారా? అన్న చర్చ జరుగుతోంది. ఘటన జరిగి ఐదు రోజులు గడుస్తున్నా పోలీస్ శాఖ తరఫున అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇంతవరకు రాకపోవడం గమనార్హం.
రాంగ్ కాల్ ఫలితం.. యువతి వేధింపులకు ఎస్‌ఐ ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment