suspicious suicides
-
ఆ కానిస్టేబుల్ ప్రైవేట్ వెహికిల్ ఎందుకు నడిపారు?
ములుగు : వాజేడు ఎస్సై హరీశ్ ఆత్మహత్యకు గల ప్రధాన కారణాలను పోలీసులు ఇప్పటి వరకూ వెల్లడించలేకపోతున్నారు. ఎస్సై ఆత్మహత్య రోజు ఏమి జరిగిందనే అంశం మిస్టరీగా మారుతోంది. నల్లగొండ జిల్లా చిలుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ తండాకు చెందిన యువతి బ్లాక్ మెయిలింగ్ కారణంగానే ఎస్సై ఆత్మహత్యకు పాల్పడ్డాడనే వార్తలు వెలువడుతున్నాయి. దీంతోపాటు మరేమైన బలమైన కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసు యంత్రాంగం రహస్యంగా వివరాలు సేకరిస్తోంది. సదరు యువతి ఈ నెల 1వ తేదీన ఎస్సై హరీశ్ కోసం వచ్చినట్లు ఆధారాలతో పూర్తి సమాచారం ఉంది. ఈ క్రమంలో ఫెరిడోస్ రిసార్ట్‌లోని ఓ గదిలో ఎస్సై ఆత్మహత్య అనంతరం సదరు యువతిని పోలీస్ శాఖతో పాటు ఇతరులు గమనించారు. దీంతో ఎస్సై హరీశ్ ఆత్మహత్య ఘటనలో ఆమె ప్రధాన కారణమా లేక ఇతర విషయాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. హరీశ్ చనిపోక ముందు రోజు యువతితో మాట్లాడే క్రమంలో ఒత్తిడికి లోనై స్నేహితులకు ఫోన్ చేశారు. దీంతో ఓ స్నేహితుడు రిసార్ట్‌కు చేరుకుని యువతితో మాట్లాడి ఆమెను ఒప్పించినట్లు సమాచారం. సమస్య సద్దుమనిగినట్లు భావించిన ఎస్సై హరీశ్ స్నేహితుడిని వెళ్లిపోవాలని సూచించినట్లు తెలిసింది. దీంతో అతను అక్కడి నుంచి బయలుదేరి ములుగు చేరుకున్నాడు. తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో నిద్ర నుంచి లేచిన సదరు యువతి.. ఎస్సైతో గొడవకు దిగినట్లు సమాచారం. దీంతో మరోసారి ఒత్తిడికి లోనైన హరీశ్ ఫోన్ ద్వారా స్నేహితుడిని సంప్రదించాడు. అప్రమత్తమైన స్నేహితుడు ములుగు నుంచి బయలుదేరి వాజేడుకు చేరుకోకముందే ఎస్సై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. ఆ కానిస్టేబుల్ ప్రైవేట్ వెహికిల్ ఎందుకు నడిపారు?వాజేడు ఎస్సై ఆత్మహత్యకు పాల్పడడానికి ప్రధాన కారణంగా తెలుస్తున్న సదరు యువతి ఈనెల 1వ తేదీ వాజేడు స్టేషన్ ముందు నుంచి ఎస్సై హరీశ్‌కు కాల్ చేసింది. ఈ క్రమంలో ఓ ప్రైవేట్ వెహికిల్ ద్వారా ఆమెను రిసార్ట్‌కు పంపించారు. అయితే ఈ వాహనాన్ని నడిపిన వాజేడు పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ ఎవరు అనే అంశం ఇప్పటికీ తెలియడం లేదు. చివరికి ఆ యువతిని రిసార్ట్‌లో డ్రాప్ చేసిన అనంతరం రెండు, మూడు సార్లు సదరు వ్యక్తి ప్రైవేట్ వాహనంలో కనిపించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.ఎస్సై హరీశ్ విషయంలో కీలక ఆధారాలు అతని వద్దే? -
కీలక ఆధారాలు అతని వద్దే?
ములుగు: ములుగు జిల్లా వాజేడు ఎస్సై హరీశ్ అనుమానాస్పద ఆత్మహత్యపై పలు రకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ కేసులో కీలక వ్యక్తిగా భావిస్తున్న గన్‌మన్ అందుబాటులో లేకపోవడం అనుమానాలకు దారితీస్తోంది. కేసును ఛేదించేందుకు వెంకటాపురం(కె) సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో వాజేడు కేంద్రంగా పూర్తి స్థాయి సమాచారం రాబట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే ఆత్మహత్య అనంతరం సంఘటనా స్థలం నుంచి క్లూస్ టీమ్ సభ్యులు ఎస్సై హరీశ్‌కు సంబంధించిన రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి ముందు మాట్లాడిన సూర్యాపేట జిల్లా పరిధి చిలుకూరు మండలానికి చెందిన యువతి ఫోన్‌కాల్ లిస్టుపైన మదింపు జరుగుతున్న ట్లుగా సమాచారం. ఇదంతా పోలీసు శాఖ పరిధిలో సాఫీగానే జరుగుతున్నా.. వాజేడు ఎస్సైగా హరీశ్ బాధ్యతలను స్వీకరించిన నాటి నుంచి అతను ఆత్మహత్య చేసుకునే వరకు ఎస్ఐతో ఉన్న గన్‌మన్ మరుసటి రోజు నుంచి అందుబాటులో లేకపోవడంపై పలు అనుమానాలకు దారితీస్తోంది.సంచలనంగా మారిన ఈ కీలక కేసులో గన్‌మన్‌కు పోలీస్ ఉన్నతాధికారులు సెలవు ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్ధం కావడం లేదు. వివాదాస్పద కేసు వివరాలను బయట పెడతాడని అధికారులు అతడిని సెలవుపై పంపించారా? లేక అతడిని కూడా విచారిస్తున్నారా? అన్న చర్చ జరుగుతోంది. ఘటన జరిగి ఐదు రోజులు గడుస్తున్నా పోలీస్ శాఖ తరఫున అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇంతవరకు రాకపోవడం గమనార్హం.రాంగ్ కాల్ ఫలితం.. యువతి వేధింపులకు ఎస్ఐ ఆత్మహత్య -
అనుమానాస్పద స్థితిలో వివాహిత ఆత్మహత్య
పుట్టపర్తి టౌన్ : సత్యసాయి సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి తూర్పుగేట్ వద్ద సాయిబాలాజీ లాడ్జిలో యశోద(35)అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి తెలిపిన మేరకు.. పుట్టపర్తి రూరల్ మండలంలోని చిన్ననిడిమామిడప్ప కుమార్తె యశోదను 15 సంవత్సరాల క్రితం పుట్టపర్తికి చెందిన శేఖర్ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశా రు. వీరికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నా రు. యశోద అమడగూరు మండలం తంగేడుకుంట కు చెందిన రామాంజనేయులుతో వివాహేతర సం బంధం కొనసాగిస్తున్న విషయం ఎనిమిది నెలల క్రి తం బయటపడడంతో భర్త ఆమెకు దురమయ్యా డు. అప్పటి నుంచి ఆమె నిడిమామిడిలోని తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. శనివారం ప్రియుడు రామాంజనేయులుతో కలసి మధ్యాహ్నం 12 గం టల ప్రాంతంలో సాయిబాలాజీ లాడ్జిలోని గది అ ద్దెకు తీసుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాం తంలో రామాంజనేయులు బయటికి వెళ్లిపోయాడు. సాయంత్రం 5.30కు గదులు శుభ్రం చేసే సిబ్బంది అనుమానం వచ్చి కిటికీలో నుంచి గదిలోకి తొంగి చూడగా యశోద ఫ్యా¯ŒSకు ఉరివేసుకుని ఉండడం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ తన సిబ్బందితో కలసి సంఘటనా స్థలాన్ని పరిశీలించి బంధువులకు సమాచారం అందించారు. కే సు నమోదు చేసుకుని విచారణ చేపడతావ సీఐ తెలిపారు. ప్రియుడితో విబేధాల కారణంగా ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా, లేదా ఇతరత్రా కారణాలేవైనా ఉన్నాయా అన్నది విచారణలో తేలనుందని సీఐ తెలిపారు.