బస్సు డ్రైవర్‌కు ఫిట్స్ : తప్పిన ప్రమాదం
సిరిసిల‍్ల : డ్యూటీలో ఉన్న ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు ఫిట్స్ రావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన సిరిసిల‍్ల జిల్లాలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది.
కామారెడ్డి డిపోకు చెందిన బస్సు సిరిసిల‍్ల నుంచి రగుడు గ్రామం వైపు వెళ్తున్న సమయంలో డ్రైవర్ నరసింహులుకు ఒక్కసారిగా ఫిట్స్ వచ్చింది. దీంతో బస్సు రోడ్డుపక‍్కకు ఒరిగిపోయింది. అదృష‍్టవశాత్తూ ఆ సమయంలో డ్రైవర్ బ్రేకుపై కాలు వేసి ఉండడంతో బస్సుపక్కకు ఒరిగి ఆగిపోయింది. దీంతో పెద‍్ద ప్రమాదం తప్పింది. ఇది గమనించిన ప్రయాణికులు కిటికీ అద్దాల నుంచి బయటకు దూకారు. వెంటనే డ్రైవర్‌ను ప్రభుత్వాస‍్పత్రికి తరలించారు.