
మల్లేష్‌ను తాళ్లతో కట్టేసిన గ్రామస్తులు
యాదగిరిగుట్ట (ఆలేరు) : ఓ యువకుడు మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. గ్రామానికి వచ్చిన ఆర్టీసీ బస్సు అద్దాలు పగులగొట్టి.. డ్రైవర్‌పై దాడిచేశాడు. ఈ ఘటన యాదగిరిగుట్ట మండలం మహబూబ్‌పేటలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన గాజుల మల్లేషం కూలీ పని చేస్తుంటాడు. సాయంత్రం మోటకొండూర్ మండలం అమ్మనబోలు నుంచి యాదగిరిగుట్ట మండలం మహబూబ్‌పేట గ్రామం నుంచి భువనగిరికి వెళ్తున్న ఆర్టీసీ బస్సును గ్రామంలోకి రాగానే రాళ్లతో దాడికి దిగి నిలిపాడు.
చొక్కా, ప్యాంట్ విప్పుకుంటూ బస్సులోకి వెళ్లి డ్రైవర్ రమేష్‌పై దాడి చేశాడు. దీనిని గమనించిన కండక్టర్, సుమారు 20 మంది ప్రయాణికులు భయాందోళనతో బస్సు దిగి వెళ్లిపోయారు. ఈ క్రమంలో డ్రైవర్ కాపాడేందుకు వచ్చిన గ్రామస్తులను తీవ్రమైన పదజాలంతో దూషిస్తు దాడికి యత్నించాడు. దీంతో వారంతా భయంతో పరుగులు తీశారు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించి, గ్రామానికి చెందిన కొందరు ధైర్యంతో మల్లేష్‌ను తాళ్లతో కట్టేశారు. సంఘటన స్థలానికి యాదగిరిగుట్ట పోలీసులు చేరుకుని విషయం తెలుసుకున్నారు. మల్లేష్‌ను యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment