తమిళనాడు, తిరువొత్తియూరు: ప్రయాణిస్తున్న బస్సు తలుపులు మూయకుంటే డ్రైవర్, కండక్టర్‌లపై చర్యలు తీసుకుంటామని రవాణశాఖ అధికారులు హెచ్చరించారు. రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ తరపున నిత్యం 19 వేల బస్సులు నడుస్తున్నాయి. ఇందులో చెన్నై, కోవై, మదురై, తిరుచ్చి నగరాలకు వెళ్లే బస్సుల్లో రద్దీ ఉంటుంది. ఉదయం, సాయంత్రం సమయాల్లో పాఠశాల, కళాశాల విద్యార్థులు, ప్రజలు ఫుట్‌బోర్డుపై వేలాడుతున్నట్టు ప్రయాణం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో బస్సు తలుపులను మూయడానికి వీలు పడడం లేదు. తద్వారా పెద్ద ప్రమాదం జరుగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు బస్సు ఫుట్‌రోడ్డుపై నుంచి కింద పడిన కొన్ని సంఘటనలు ఉన్నాయని, ఈ ప్రమాదాలను నివారించటానికి తప్పనిసరిగా డ్రైవర్లు బస్సు ప్రయాణిస్తున్న సమయంలో డోర్లు మూసి ఉంచాలని లేని పక్షంలో బస్సు డ్రైవర్, కండక్టర్‌లకు నోటీసులు పంపించి చర్యలు తీసుకుంటామని రవాణ శాఖ ఉన్నతాధికారి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment