అన్నానగర్: మహిళ పోలీసును టిక్కెట్ కొనమన్నందుకు ఆగ్రహంతో ప్రభుత్వ బస్సు కండక్టర్, డ్రైవర్‌పై దాడి చేసిన సంఘటన గురువారం రాత్రి శివగంగై జిల్లాలో కలకలం రేపింది. సదరు మహిళా పోలీసు చర్యను ఖండిస్తూ రవాణా శాఖ కార్మి కులు శుక్రవారం ఉదయం బస్సులను నిలిపివేసి ఆందోళన నిర్వహించారు. శివగంగై జిల్లా, తిరుపుత్తూర్ నుంచి గురువారం రాత్రి 10 గంటల సమయంలో మాణామదురైకి ప్రభుత్వ బస్సు బయలుదేరింది. బస్సుని డ్రైవర్ సెంథిల్ కుమార్ నడిపాడు. శివగంగై రాగానే బస్సులో ఓ మహిళ ఎ క్కింది. బస్సు కండక్టర్ మురుగానందం ఆమెను టిక్కెట్ తీసుకోవాలని కోరాడు. సదరు మహిళ తాను తిరువాడనై పోలీస్‌స్టేషన్‌లో పోలీసులుగా పని చేస్తున్నానని, టిక్కెట్ తీసుకోనని బదులిచ్చిం ది. కండక్టర్ ఆమెను పోలీస్ ఐడెంటీ కార్డు చూపాలని, లేకపోతే టిక్కెట్ తీసుకోవాలని కోరాడు.
దీంతో టిక్కెట్ కన్న మహిళ మాణామదురైలో బ స్సు దిగగానే తొటి పోలీసులకు విషయాన్ని తెలి పింది. ఆ సమయంలో పని ముగించుకుని బస్సు ని మాణామదురై సిప్‌కాట్ బస్సు డిపోలో నిలిపి, అక్కడున్న విశ్రాంతి గదిలో కండక్టర్ మురుగానం దం, డ్రైవర్ సెంథిల్‌కుమార్ నిద్రిస్తున్నారు. అర్థరాత్రి 12 గంటల సమయంలో పోలీసులు డిపోకి వెళ్లి నిద్రిస్తున్న ఇద్దరిపై తీవ్రంగా దాడి చేసి మా ణామదురై పోలీస్‌స్టేషన్‌కి తీసుకొచ్చి జైల్లో ఉంచా రు. దీనిపై సమాచారం అందుకున్న రవాణా శాఖ కార్మికులు శుక్రవారం వేకువజామున మాణామదురై డిపో నుంచి బస్సులను నడపకుండా ఆందోళనకు దిగారు. జిల్లాలోని తిరుప్పువణం, శివగంగై, తిరుప్పత్తూర్, దేవకోట, కారైక్కుడి ఆరు డిపోల్లో ఉదయం 7 గంటల వరకు బస్సులు తీయలేదు. దీనికి సంబంధించి రవాణా శాఖ అధికారులు మాణామదురై పోలీసు స్టేషన్‌కి వెళ్లి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీస్‌స్టేషన్‌లో ఉన్న మురుగానందం, సెంథిల్ కుమార్‌ను విడిపించి చికిత్స కోసం శివగంగై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అధికారుల చర్చల అనంతరం రవాణా సిబ్బంది బస్సులను నడిపారు.
Comments
Please login to add a commentAdd a comment