సేలం: తిరుపూర్‌లో సహజీవనాన్ని బ్రేకప్ చేయడంతో ఆవేశపడి నడి రోడ్డుపై ప్రేయసిని కత్తితో పొడిచిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతని స్నేహితుడి కోసం గాలిస్తున్నారు. వివరాలు.. తిరుపూర్ కుమార్ నగర్‌లోని కొత్త బస్టాండ్‌కు వెళ్లే 60 అడుగుల రోడ్డులో సోమవారం సాయంత్రం ఇద్దరు యువతులు సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ స్కూటర్‌పై రోడ్డు పక్కన నిలిచి ఉన్నారు.
అప్పుడు ఆ మార్గంలో హెల్మెట్ ధరించిన ఇద్దరు యువకులు బైక్‌పై వచ్చారు. బైక్‌పై వెనుక కూర్చుని ఉన్న ఒక యువకుడు అకస్మాత్తుగా బైక్ దిగి రోడ్డు పక్కన నిలిచి ఉన్న వారిలో ఒక యువతిని కత్తితో ఇష్టం వచ్చినట్లు పొడిచి, అక్కడి నుంచి వచ్చిన బైక్‌లోనే పరారయ్యాడు. సమాచారం అందుకుని హుటాహుటిన అక్కడికి చేరుకున్న వెస్ట్ పోలీసులు ఆ యువతిని తిరుపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల విచారణలో.. తిరుపూర్ కల్లంకాడు ప్రాంతానికి చెందిన శరణ్య (29) అని తెలిసింది. ఆమెకు బంధువు ఒకరితో ఏడేళ్ల క్రితం వివాహమై, ఒక బిడ్డ కూడా ఉన్నట్టు సమాచారం.
భర్త మృతి చెందిన తర్వాత ఆమె అవినాశిలో ప్రింటింగ్ పని చేస్తున్న కార్మికుడు రమేష్ (33)తో సహజీవనం చేస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం శరణ్య 60 అడుగుల రోడ్డులో ఉన్న ఒక సంస్థలో సూపర్‌వైజర్‌గా పని చేస్తోంది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ స్థితిలో గత 11 నెలలుగా శరణ్య, రమేష్‌తో బ్రేకప్ చేసి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. రమేష్‌కు తెలియకుండా శరణ్య వేరే చోటుకు నివాసం మార్చి పిల్లలతో ఉంటూ వస్తోంది. ఈ స్థితిలో సోమవారం రమేష్ తీవ్ర ఆవేశంతో తన స్నేహితుడు భూపతితో కలిసి అక్కడికి వచ్చి శరణ్యను కత్తితో పొడిచి, పరారైనట్లు తెలిసింది. దీంతో పోలీసులు రమేష్‌ను అరెస్టు చేసి, పారిపోయిన భూపతి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.
Comments
Please login to add a commentAdd a comment