బస్సు డ్రైవర్‌ను బెదిరిస్తున్న దృశ్యం
షాద్‌నగర్: ఆర్టీసీ బస్సు తమ వాహనానికి సైడ్ ఇవ్వలేదని ఓ ఎమ్మెల్యే అనుచరులు హల్‌చల్ చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలోని బూర్గుల గ్రామ శివారులో చోటు చేసుకుంది. వనపర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి షాద్‌నగర్ మీదుగా వనపర్తికి వెళ్తోంది. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన ఓ వాహనంలోని వ్యక్తులు బస్సును ఓవర్ టేక్ చేసి బెంగళూరు హైవేపై మధ్యలో నిలిపేశారు.
కొందరు వ్యక్తులు వాహనంలోనుంచి దిగి ఎమ్మెల్యే వాహనానికే సైడ్ ఇవ్వవా.. అంటూ ఊగిపోయారు. బస్సు దిగి కిందికి రావాలంటూ బూతు మాటలతో విరుచుకుపడి కర్రతో డ్రైవర్‌పై దాడికి యత్నించారు. దీంతో వాహనాలు కొద్ది సేపు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఎమ్మెల్యే అనుచరులమని చెప్పుకుంటున్న వ్యక్తులు జాతీయ రహదారిపై హల్‌చల్ చేస్తున్న దృశ్యాలను అటువైపు నుంచి వెళ్తున్న ప్రయాణికులు చిత్రీకరించారు.
ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. జాతీయ రహదారిపై హల్‌చల్ చేసిన వ్యక్తులు అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే అనుచరులని సమాచారం. కాగా, ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎలా స్పందిస్తారో అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment