
సాక్షి, న్యూఢిల్లీ : సీనియర్ నేత రేవంత్‌రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరిన ములుగు మాజీ ఎమ్మెల్యే సీతక్కకు జాతీయస్థాయిలో పార్టీ పదవి లభించింది. ఆలిండియా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఆమె శనివారం నియమితులయ్యారు.
మాజీ మావోయిస్టు, టీడీపీలో సీనియర్ మహిళా నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన సీతక్క ఇటీవల చంద్రబాబునాయుడు తెలంగాణలో టీడీపీకి ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో రేవంత్‌రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. రేవంత్ వెంట కాంగ్రెస్‌లో చేరిన ఆమెకు మంచి ప్రాధాన్యం లభిస్తోంది. జాతీయ స్థాయిలో సీతక్కకు పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రాధాన్యమిస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే ఆదివాసీ కాంగ్రెస్ విభాగంలో సీతక్కకు రాహుల్ పదవి ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా ఆలిండియా మహిళా కాంగ్రెస్ పదవి ఆమెను వరించడంతో సీతక్క అనుచరుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.