సమావేశంలో మాట్లాడుతున్న సతీశ్‌రెడ్డి
ములుగు: రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలవుతుందని సర్వేల్లో తేలినప్పటి నుంచి స్థానిక ఎమ్మెల్యే సీతక్క ఓటమి భయంతో డ్రామాలు మొదలుపెట్టిందని రెడ్కో చైర్మన్ యేరువ సతీశ్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయంలో జెడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్‌నాయక్‌తో కలిసి మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన నాలుగు రోజుల్లో వెంకటాపురం(ఎం) మండల పరిధిలోని బూర్గుపేట, కన్నాయిగూడెం మండలాల్లో కొంతమందిని ఎమ్మెల్యే సీతక్క ప్రలోభాలకు గురిచేసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పిందన్నారు.
జెడ్పీ చైర్మన్ జగదీశ్ మృతితో బాధలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు ధైర్యం కోల్పోయే విధంగా ప్రయత్నాలు చేస్తుందని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్ బూర్గుపేట గ్రామ పార్టీ అధ్యక్షుడు ప్రస్తుతం పార్టీలో ఉన్నారని తెలిపారు. గడిచిన తొమ్మిది సంవత్సరాల కాలంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూడకుండా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతున్నారన్నారు. ఏం సాధించారని దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నారని అడుగుతున్న వారికి కాళేశ్వరం ద్వారా 30 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం తెలంగాణలోనే 160లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరుగుతుందని తదితర అభివృద్ధి పథకాల గురించి వివరించారు. ములుగులో పార్టీ అభ్యర్థి ఓటమి చెందినా ములుగు జిల్లాను ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దని తెలిపారు. పార్టీ శ్రేణులు ఏకతాటిపై వచ్చి రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే బీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం నేడు మల్లంపల్లిలో కుసుమ జగదీశ్ దశదిన కర్మకు జిల్లాలోని నాయకులు తరలిరావాలని రెడ్కో చైర్మన్ సతీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ వెంకటాపురం(ఎం) మండల అధ్యక్షుడు లింగాల రమణారెడ్డి, నాయకులు మల్క రమేష్, సానికొమ్ము రమేశ్‌రెడ్డి, మాసిపెద్ది సత్యనారాయణరావు, అశోక్, లింగాల రమణారెడ్డి, రమేష్, బుర్ర సమ్మయ్య, రామాచారి, స్వరూప పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment