
నిబంధనల ప్రకారమే తునికాకు సేకరణ
ఏటూరునాగారం: ప్రభుత్వ నియమనిబంధనల ప్రకారమే తునికాకు సేకరణ చేపట్టాలని కాంట్రాక్టర్లకు అటవీశాఖ సౌత్ రేంజ్ అధికారి అబ్దుల్ రహమాన్ సూచించారు. మండల కేంద్రంలోని తన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏజెన్సీలో పేదవారి ఆర్థికాభివృద్ధికి వేసవిలో చేపట్టే తునికాకు సేకరణ టార్గెట్ చేరుకునే విధంగా చేపట్టాలన్నారు. ఆకు సేకరణలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా చూస్తామన్నారు. వన్యప్రాణులను వేటాడితే కఠినంగా శిక్షిస్తామన్నారు. అలాగే వన్యప్రాణులకు తాగునీటి వసతి కల్పించినట్లు తెలిపారు. అడవుల సంరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, అడవులను ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడానికి చర్యలు చేపట్టామన్నారు.
ఎఫ్‌ఆర్‌ఓ అబ్దుల్‌రహమాన్