హరీశ్ ఆత్మహత్యతో ఖాళీ అయిన స్థానం
విధుల్లో చేరిన ఎస్సై రాజ్‌కుమార్
వాజేడు: వాజేడు ఎస్సైగా రాజ్‌కుమార్ శుక్రవారం విధుల్లో చేరారు. ఇక్కడ ఎస్సైగా పనిచేస్తున్న రుద్రారపు హరీశ్ డిసెంబర్‌లో వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
దీంతో అప్పటి నుంచి ఖాళీగా ఉన్న ఈ పోలీస్ స్టేషన్ పరిధిని వెంకటాపురం(కె) సీఐ బండారి కుమార్, పేరూరు ఎస్సై కృష్ణప్రసాద్ పర్యవేక్షించారు. ఈక్రమంలో ప్రస్తుతం మహదేవ్‌పూర్‌లో ఎస్సైగా పని చేస్తున్న రాజ్‌కుమార్‌ను ఉన్నతాధికారులు వాజేడుకు పంపించారు. దీంతో ఆయన వాజేడు స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌గా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment