వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరి

Published Thu, Apr 17 2025 1:15 AM | Last Updated on Thu, Apr 17 2025 1:15 AM

వ్యాధ

వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరి

ములుగు: వైద్య ఆరోగ్యశాఖ తరఫున ప్రతీ బుధ, శనివారాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందించే వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు సూచించారు. జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో ఆయన సర్వేలైన్స్‌ మెడికల్‌ ఆఫీసర్‌ అతుల్‌, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ విపిన్‌కుమార్‌, వ్యాధి నిరోధక టీకాల ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రణధీర్‌తో కలిసి పీహెచ్‌సీల వారీగా టీకాల కార్యక్రమంపై ఆరా తీశారు. సబ్‌సెంటర్ల వారీగా తూచ తప్పకుండా టీకాలు అందించాలన్నారు. ఐదేళ్ల లోపు పిల్లల్లో జ్వరం, దగ్గు, దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటే తక్షణమే రక్త నమూనాలను సేకరించాలన్నారు. అనంతరం ములుగు జిల్లా కేంద్రంలోని సబ్‌ సెంటర్‌ను ఆయన తనిఖీ చేశారు. వ్యాక్సిన్‌ వీవీఎం, కండీషనింగ్‌ ఐస్‌ పైప్స్‌ లబ్ధిదారుల లిస్టును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అసంక్రమిత వ్యాధుల ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ పవన్‌ కుమార్‌, డెమో సంపత్‌, కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ పూర్ణ సంపత్‌రావు, సూపర్‌వైజర్లు దేవమ్మ, దేవేందర్‌, ఏఎన్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు.

మహాముత్తారం అడవిలో పులి కలకలం

కాటారం: మహాముత్తారం మండలంలో పులి సంచారం కలకలం సృష్టిస్తుంది. పులి అటవీ ప్రాంతంలోకి వచ్చిందనే పుకార్లతో అటవీ సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కాగా స్తంభంపల్లి(పీకే), మద్దిమడుగు గ్రామాల మధ్య గల అటవీ ప్రాంతంలో పులి అడుగులను అటువైపు వెళ్లిన పలువురు గుర్తించారు. సమాచారం అందుకున్న దూదేకులపల్లి రేంజర్‌ రాంమూర్తి ఆధ్వర్యంలో సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని పులి పాదముద్రలు (ప్లగ్‌ మార్క్స్‌)ను నిర్ధారించారు. కానీ, అవి తాజా పాదముద్రలు కావని.. నాలుగు రోజుల క్రితం పులి ఇటువైపుగా వెళ్లినట్లుగా ఉన్నాయని రేంజర్‌ తెలిపారు.

గుడుంబా స్థావరాలపై

ఎకై ్సజ్‌ దాడులు

కాటారం: మహాముత్తారం మండలం స్తంభంపల్లి, రేగులగూడెం, బోర్లగూడెం గ్రామాల్లో అక్రమంగా నిర్వహిస్తున్న గుడుంబా స్థావరాలపై బుధవారం డీటీఎఫ్‌ సీఐ రాజసమ్మయ్య, ఎకై ్సజ్‌ ఎస్సై కిష్టయ్య ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. నాటుసారా నిర్మూలన ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా గుడుంబా స్థావరాలపై దాడి చేసినట్లు ఎకై ్సజ్‌ ఎస్సై పేర్కొన్నారు. 20 లీటర్ల గుడుంబా, 35 కిలోల చక్కెర స్వాధీనపర్చుకొని 1,100 లీటర్ల చక్కెర పానకం ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఐదుగురిపై కేసు నమోదు చేసి నలుగురిని అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించారు. ఈ దాడుల్లో ఎకై ్సజ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

చట్టాలను నిర్వీర్యం చేసే కుట్ర

భూపాలపల్లి అర్బన్‌: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తుందని, దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు తుమ్మల రాజిరెడ్డి, మంద నరసింహరావు డిమాండ్‌ చేశారు. ఏరియాలోని సింగరేణి గెస్ట్‌హౌజ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా మే 20వ తేదీన దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. బీజేపీ, బీఎంఎస్‌లు మినహా ఇతర పార్టీలు, సంఘాలు సమ్మెలో పాల్గొంటున్నట్లు తెలిపారు. 51 శాతం మంది కార్మికులు సమ్మెను అంగీకరిస్తేనే సమ్మె చేయాలని, సీఎంపీఎఫ్‌ కాంట్రీబ్యూషన్‌ 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గించడం. 12 గంటలకు పని వేళలను పెంచడం, లేబర్‌ ఇన్‌స్పెక్టర్‌ను ఫెసిలిటేటర్‌గా మార్చడం వంటి చర్యలను మానుకోవాలని డిమాండ్‌ చేశారు. అప్రెంటీస్‌ విధానం ద్వారా కార్మికులను నియమించుకుంటూ వారితో ఏళ్ల తరబడి పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం సింగరేణి సంస్థను నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. సంస్థకు రావాల్సిన బాకాయిలను చెల్లించడం లేదని, సింగరేణికి ప్రైవేట్‌ గనులను అప్పగించాలని ఎటువంటి పోరాటం చేయడం లేదన్నారు.

వ్యాధి నిరోధక టీకాలు  తప్పనిసరి 
1
1/2

వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరి

వ్యాధి నిరోధక టీకాలు  తప్పనిసరి 
2
2/2

వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement