మంత్రులు, ఉన్నతాధికారులతో కోర్‌కమిటీ ఏర్పాటు: మంత్రి సీతక్క
సాక్షి, హైదరాబాద్: పని ప్రదేశంలో మహిళలు ధైర్యంగా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోందని మంత్రి సీతక్క వెల్లడించారు. ఇటీవల దేశవ్యాప్తంగా జరుగుతున్న ఘటనలతో మహిళలు భయాందోళనకు గురవుతున్నారని, ఈ పరిస్థితిని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. మహిళలపై దాడులు చేసిన వారికి వెంటనే శిక్ష అమలయితేనే ఇలాంటి ఘటనలు తగ్గుతాయని మంత్రి అభిప్రాయపడ్డారు.
మహిళల భద్రతపై బుధవారం సచివాలయంలో మంత్రి సీతక్క సమావేశం నిర్వ హించారు. మహిళలపై హింస పెరగడానికి డ్రగ్స్, గంజాయి కూడా కారణమవుతున్నాయని వివరించారు. ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల్లో షీ టీమ్స్ గస్తీ పెంచుతామన్నారు. పబ్లిక్ ప్లేసుల్లో, ఆసుపత్రుల్లో సీసీ కెమెరాలను పెంచుతామన్నారు. మంత్రులు, ఉన్నతాధికారులతో కోర్ కమిటీని ఏర్పాటు చేస్తామని, అన్ని శాఖల్లో త్వరలో ఉమెన్ సేఫ్టీ కమి టీలు నియమిస్తామని తెలిపారు.
మహిళల భద్రత కోసం ప్రతి శాఖకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించే అంశాన్ని తమ ప్రభు త్వం పరిశీలిస్తోందన్నారు. మహిళా ఉద్యోగుల భద్రతపై ప్రతీ కార్యాలయంలో కమిటీలు ఏర్పాటు చేయాలని మహి ళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద సూచించారు.
బచ్‌పన్ బచావోతో కలసి పనిచేస్తాం..
బాల కారి్మకులు, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న బచ్‌పన్ బచావో ఆందోళన్ ప్రతినిధుల బృందం బుధవారం సచివాలయంలో మంత్రి సీతక్కతో సమావేశమయింది. నోబెల్ అవార్డు గ్రహీత కైలాశ్ సత్యార్థి నేతృత్వంలో బచ్‌పన్ బచావో ఆందోళన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సంపూర్ణ బెహరా, ధనుంజయ్ తింగాల్, ప్రతినిధులు వీఎస్ శుక్లా, చందన, వెంకటేశ్వర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బచ్‌పన్ బచావో ఆందోళన్‌తో రాష్ట్ర ప్రభుత్వం కలసి పనిచేస్తుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment