Womens safety
-
అవగాహన పెంచుకో... అస్త్రాలను వాడుకో..!
అప్రమత్తత, అవగాహన ఉంటే ఎలాంటి ఆపద నుంచైనా బయటపడే ఉపాయం మనకు తడుతుంది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు వెన్నంటి ఉండేలా ఎంతో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా ఆశించిన స్థాయిలో వీటి వినియోగం ఉండడం లేదు. ఒంటరిగా ప్రయాణం చేసే మహిళల భద్రత కోసం అమ్ముల పొదిలిలో అస్త్రం వంటి టీ–సేఫ్ యాప్(T-Safe App)ను తెలంగాణ మహిళా భద్రత విభాగం గతేడాది అందుబాటులోకి తెచ్చింది. ఎంతో ఉపయుక్తమైన ఈ యాప్ తెలంగాణలోని ప్రతి మహిళ మొబైల్ఫోన్లో తప్పక ఉండాల్సిన అవసరం ఉందని పోలీసులు చెబుతున్నారు. టైంపాస్ కోసం సోషల్ మీడియా, గేమింగ్ యాప్‌లకు బదులు ఇలాంటి సాంకేతిక అ్రస్తాలను మన ఫోన్లో ఉంచుకుంటే ఆపద సమయంలో వాడుకోవచ్చని అంటున్నారు. మహిళా భద్రత కోసం పోలీసులు అందుబాటులో ఉంచిన సాంకేతికతపై ప్రత్యేక కథనం. – సాక్షి, హైదరాబాద్టీ–సేఫ్ యాప్ ఏంటి?ఒంటరిగా ప్రయాణం చేసే మహిళలు, బాలికలు, ఇతర పౌరులెవరైనా సురక్షితంగా గమ్యం చేరే వరకు పోలీసుల పర్యవేక్షణ కొనసాగేలా తెలంగాణ పోలీస్ మహిళా భద్రత విభాగం రూపొందించిన నూతన సాంకేతికతే టీ–సేఫ్ (ట్రావెల్–సేఫ్) యాప్. దేశంలోనే తెలంగాణ పోలీసులు ఈ తరహా సేవను మొదటిసారిగా అమల్లోకి తెచ్చారు. స్మార్ట్ఫోన్తోపాటు సాధారణ ఫోన్లు ఉన్నవారు సైతం టీ–సేఫ్ సేవలను పొందేలా దీన్ని రూపొందించారు. ఎన్ని రకాలుగా వాడుకోవచ్చంటే.. 1.స్మార్ట్‌ఫోన్‌లో టీ–సేఫ్ యాప్...: స్మార్ట్‌ఫోన్ వినియోగించే వారు గూగుల్‌ప్లే స్టోర్‌లో( https: //play.google. com/store/apps/ details?id=com.tswome nsafety.tsafe) టీ– సేఫ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రయాణ సమయంలో యాప్‌లో సూచించిన విధంగా మన వివరాలు నమోదు చేస్తే.. యాప్ ద్వారా పోలీసులు లైవ్ ట్రాకింగ్ ద్వారా ప్రయాణాన్ని పర్యవేక్షిస్తారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే రంగంలోకి దిగుతారు.2 టీ–సేఫ్ వెబ్సైట్ ద్వారా...:మొబైల్లో టీ–సేఫ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఉండకపోతే, https://tsafe.tspoli ce.gov.in/wap/ వెబ్‌సైట్‌ను వినియోగించుకోవచ్చు. ఇందులోకి లాగిన్ అయిన తర్వాత.. పేరు, మొబైల్ నంబర్, ఏ వాహనంలో ప్రయాణిస్తున్నారు, ఎక్కడికి వెళ్లాలి తదితర వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత స్టార్ట్మై ట్రిప్ ఆప్షన్ ఓకే చేయాలి. అంతే ప్రయాణికురాలు లేదా ప్రయాణికుడు సురక్షితంగా గమ్యం చేరే వరకు పోలీసులు పర్యవేక్షిస్తారు.3 సాధారణ ఫోన్‌తోనూ... డయల్ 100 ద్వారా...:స్మార్ట్ ఫోన్ లేకపోయినా టీ–సేఫ్ సేవలు వాడుకోవచ్చు. సాధారణ ఫోన్ ఉన్నవారు ప్రయాణం ప్రారంభించే ముందు డయల్ 100కు కాల్ చేయాలి. అందులో వచ్చే ఐవీఆర్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్) ఆప్షన్లో 8 నంబర్‌ను నొక్కాలి. వ్యక్తిగత వివరాలు, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తున్నాం.. ప్రయాణించే వాహనం నంబర్ లాంటి వివరాలు ఇస్తే సరిపోతుంది. వెంటనే ఒక కోడ్ నంబర్‌ను పెట్టుకోవాల్సిందిగా సూచిస్తారు.ఆ తర్వాత గమ్యం చేరేవరకు పోలీసుల నుంచి ప్రతీ 15 నిమిషాలకు మీకు అలర్ట్ మెసేజ్, మధ్యలో ఐవీఆర్ పద్ధతిలో ఫోన్‌కాల్స్ వస్తుంటాయి. ఆ ఫోన్లో ఇతరులు ఆన్సర్ చేసేందుకు అవకాశం లేకుండా ముందే సిద్ధం చేసి పెట్టుకున్న కోడ్ ఉపకరిస్తుంది. ఒకవేళ సరైన స్పందన లేకపోతే వెంటనే వాహనం వివరాలు, రూట్, లైవ్ ట్రాకింగ్ లింక్ ఆ పరిధిలోని పోలీస్ ప్యాట్రో వాహనాలకు వెళ్తాయి. నిమిషాల వ్యవధిలోనే వారు సదరు వాహనం వద్దకు చేరుకుంటారు.తెలంగాణలో మొబైల్ ఫోన్ల వాడకం ఇలా...2025 మార్చినాటికి తెలంగాణలో 4 కోట్లకు పైగా మొబైల్ ఫోన్లు వినియోగంలో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. వీటిలో సుమారు 1.9 నుంచి 2.2 కోట్ల మంది మహిళలు వాడుతున్నట్లు అంచనా. ఈ లెక్కన చూస్తే మహిళల భద్రతకు సంబంధించి పోలీసులు అందుబాటులోకి తెచి్చన యాప్‌లు, ఇతర సాంకేతికతకు సంబంధించిన యాప్‌ల వినియోగం ఎంతో పెరగాల్సి ఉంది. పోలీస్ రెస్పాన్స్ టైం ఇదీ... ఆపదలో ఉన్నామని పౌరుల నుంచి ఫోన్ కాల్ వచి్చన తర్వాత తెలంగాణ పోలీస్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టైం హైదరాబాద్ సహా నగర, పట్టణ ప్రాంతాల్లో సగటున 5–10 నిమిషాలు కాగా.. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇది 15–20 నిమిషాలకుపైగా ఉంది. ఆపదలో ఉన్నారా..?⇒ డయల్ 100కు ఫోన్ చేయొచ్చు. ⇒ డయల్ 112 ఎమర్జెన్సీ నంబర్‌కు కాల్ చేయొచ్చు. ⇒ ఒంటరి ప్రయాణ సమయంలో టీ–సేఫ్ యాప్‌ను వాడోచ్చు. టీ–సేఫ్ యాప్ ఆండ్రాయిడ్ డౌన్లోడ్లు: 42,000+ టీ–సేఫ్ యాప్ వాడిన మొత్తం ట్రిప్పులు: 36,263 ఎస్ఓఎస్ అలర్ట్‌లు వాడిన వారి సంఖ్య: 26,000+ ఆటోమేటెడ్ వెరిఫికేషన్ కాల్స్: 78,000+ టీ–సేఫ్ ఏజెంట్ కాల్స్: 65,000+ గూగుల్ రేటింగ్: 4.8టీ–సేఫ్ వాడిన వారిలో కొందరు గూగుల్ రివ్యూలో ఇలా పేర్కొన్నారు..బోది జియన్నా.. ఫిబ్రవరి 19, 2025 టీ–సేఫ్ మహిళల భద్రతకు ఎంతో ఉపయోగపడే యాప్. నేను అర్ధరాత్రి సమయంలో ఎయిర్‌పోర్టు నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు ఈ యాప్‌ను వినియోగించాను. నా ప్రయాణం పూర్తయ్యే వరకు పోలీస్ టీం ఫాలోఅప్ చేస్తూనే ఉంది. థాంక్యూ తెలంగాణ పోలీస్.సీహెచ్. కీర్తిశ్రీ.. జనవరి 23, 2025 నేను హైదరాబాద్‌లో ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు నా ప్రాణ స్నేహితుడు దీన్ని సిఫార్సు చేశాడు. ప్రతి అమ్మాయి భద్రత కోసం దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ యాప్‌ను ఉపయోగిస్తున్నప్పుడు నేను సురక్షితంగా ఉన్నానో లేదో తనిఖీ చేయడానికి నాకు చాలా కాల్స్ వచ్చాయి. మొత్తం పోలీసు శాఖ నా వెనుక ఉందని నాకు అనిపించింది.హన్సిక.. డిసెంబర్ 18, 2024నేను చాలా సురక్షితంగా నా ఇంటికి వెళ్తున్నాను. ప్రతి అమ్మాయికి ఇది చాలా మంచి యాప్. మీరు డయల్ 100కు కాల్చేసినా కూడా పోలీసులు చుట్టూ ఉంటారు. మీరు సురక్షితంగా మీ గమ్యస్థానానికి వెళ్తారు. నేను చాలా రోజులుగా దీనిని ఉపయోగిస్తున్నా. సురక్షిత ప్రయాణానికి టీ–సేఫ్...టీ–సేఫ్ అనేది దేశంలో మొట్టమొదటి రైడ్–మానిటరింగ్ సేవ. ఇది ప్రత్యక్ష ట్రాకింగ్, పోలీసు హెచ్చరికలతో కాల్ లేదా యాప్ ద్వారా మహిళలకు సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తుంది. యాప్ డౌన్లోడ్ ద్వారానే కాదు.. 100కు డయల్ చేసి ఐవీఆర్‌లో 8 నొక్కవచ్చు. ప్రయాణికుడు గమ్యస్థానానికి వెళ్లే మార్గంలో ఏవైనా ఇబ్బందులుంటే వెంటనే పోలీసులు అప్రమత్తం అవుతారు. వెంటనే అక్కడకు చేరుకుంటారు. – శిఖాగోయల్, మహిళా భద్రత విభాగం డీజీ -
Hyderabad: ఎంఎంటీఎస్ రైళ్లలో భరోసా లేని భద్రత
సాక్షి.హైదరాబాద్ : ఎంఎంటీఎస్ రైళ్లు, స్టేషన్లలో మహిళా ప్రయాణికుల భద్రత మరోసారి చర్చనీయాంశంగా మారింది. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్‌కు వెళ్తున్న ఎంఎంటీఎస్ ట్రైన్‌లోని మహిళా కోచ్‌లోకి ప్రవేశించిన ఒక వ్యక్తి ప్రయాణికురాలిపై అత్యాచారయత్నానికి పాల్పడడం, అతడి నుంచి తప్పించుకొనేందుకు ఆమె కదులుతున్న రైలులోంచి దూకి తీవ్ర గాయాలపాలు కావడంతో ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళా ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి వరకు నడుస్తున్న కొన్ని రైళ్లలో ఆరీ్పఎఫ్ శక్తి బృందాలు, జీఆర్పీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నప్పటికీ హైదరాబాద్ డివిజన్ పరిధిలో ఎంఎంటీఎస్లలో మహిళలకే కాకుండా సాధారణ ప్రయాణికుల భద్రతపైన కూడా ఆందోళన నెలకొంది. తరచూ ఏదో ఒక స్టేషన్ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసిరి దాడులకు పాల్పడుతున్నారు. ఫలక్‌నుమా నుంచి సికింద్రాబాద్, మేడ్చల్, నాంపల్లి, తదితర మార్గాల్లో నడిచే రైళ్లపైన ఎలాంటి నిఘా వ్యవస్థలు పని చేయడం లేదు. ఆర్పీఎఫ్, జీఆర్పీ భద్రత కూడా లేదు. నగరంలో సుమారు 30 ఎంఎంటీఎస్ స్టేషన్ల నుంచి రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా కేవలం 10 స్టేషన్ల మాత్రమే ఆరీ్పఎఫ్ విధులు నిర్వహిస్తోంది. సికింద్రాబాద్ డివిజన్లో ఒక ఎస్ఐతోపాటు 16 మంది మహిళా కానిస్టేబుళ్లతో శక్తి టీమ్‌ను ఏర్పాటు చేశారు. కానీ ఈ బృందాల పనితీరు కొన్ని స్టేషన్లకు పరిమితం. అలాంటి నిఘా, భద్రతా బృందాలు హైదరాబాద్ డివిజన్లో లేకపోవడం గమనార్హం. సీసీ కెమెరాల నిఘా లేదు... ప్రస్తుతం లింగంపల్లి–ఫలక్‌నుమా, మేడ్చల్–సికింద్రాబాద్–లింగంపల్లి, ఫలక్‌నుమా–సికింద్రాబాద్–మేడ్చల్, ఫలక్‌నుమా–నాంపల్లి–లింగంపల్లి, తదితర మార్గాల్లో ప్రతి రోజు సుమారు 75 సరీ్వసులు నడుస్తున్నాయి. ఈ సరీ్వసుల సమయ పాలన, నిర్వహణ, భద్రతను అధికారులు కొంతకాలంగా గాలికి వదిలేశారు. ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్రమే స్పందిస్తున్నారు. ఏ రైలుఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రతి ట్రైన్లో మహిళల కోసం ప్రత్యేకంగా కోచ్‌ను ఏర్పాటు చేసినా ఆయా బోగీల్లోకి పురుషులు యథేచ్చగా రాకపోకలు సాగిస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. మహిళలు అభ్యంతరం చెబుతున్నా పట్టించుకోకుండా కొందరు ఆకతాయిలు ఇష్టారాజ్యంగా ఒక స్టేషన్లో ఎక్కి మరో స్టేషన్లో దిగిపోతూ మహిళలను వేధింపులకు గురిచేస్తున్నారు. మగ ప్రయాణికులు ఈ బోగీల్లోకి ప్రవేశించకుండా అరికట్టేందుకు ప్రతి బోగీలో ఆరీ్పఎఫ్ మహిళా సిబ్బందిని ఏర్పాటు చేయాలని గతంలో ప్రతిపాదించినా ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. మరోవైపు అన్ని బోగీల్లోనూ సీసీకెమెరాలను ఏర్పాటు చేసి ఆరీ్పఎఫ్ డివిజన్ కార్యాలయాలతో అనుసంధానం చేయాలనే ప్రతిపాదనను కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, బేగంపేట్, హైటెక్‌సిటీ, లింగంపల్లి, మల్కాజిగిరి, చర్లపల్లి, ఘట్కేసర్ వంటి ప్రధానమైన స్టేషన్లలో మినహా మిగతా స్టేషన్లలో కూడా సీసీ కెమెరాలు సరిగ్గా పని చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ‘ప్రస్తుతం దూరప్రాంతాలకు రాకపోకలు సాగించే రైళ్లలో మాత్రమే సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అలాగే మహిళా ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఎంఎంటీఎస్ రైళ్లలో కూడా ఏర్పాటు చేస్తే ఎంతో బాగుంటుంది. ఆ దిశగా దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.’అని ఆరీ్పఎఫ్ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. సిబ్బంది కొరత దృష్ట్యా అన్ని చోట్ల ఏర్పాటు చేయడం సాధ్యం కాకపోవచ్చునని, సీసీకెమెరాలు ఉంటే పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేసి నేరాలు జరగకుండా నిరోధించవచ్చునని పేర్కొన్నారు.భద్రతా విభాగాల మధ్య సమన్వయం కరువు మరోవైపు ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసుల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల కూడా నేరాల నియంత్రణ సవాల్‌గా మారిందనే అభిప్రాయం కూడా ఉంది. ప్రయాణికుల భద్రత తమ పరిధిలోని అంశం కాదన్నట్లుగా, రైల్వే ఆస్తుల రక్షణ మాత్రమే తమ బాధ్యత అన్నట్లుగా ఆర్పీఎఫ్ వ్యవహరిస్తుందని జీఆర్పీ పోలీసులు ఆరోపిస్తున్నారు. కానీ జీఆర్పీ నిర్వర్తించాల్సిన విధులను తామే నిర్వహిస్తున్నామని, జీఆర్పీ పోలీసులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆర్పీఎఫ్ పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇలా ఇరువర్గాల మధ్య సమన్వయం లేకపోవడం కూడా నేరస్తులకు అవకాశంగా మారుతోంది. -
బటన్‌తో భద్రతకు భరోసా
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ వంటి నగరాల్లో ఉద్యోగాలు చేసే మహిళలు రాత్రుళ్లు కూడా క్యాబ్‌లు, ప్రైవేటు బస్సుల్లో ప్రయాణించాల్సి వస్తోంది. ఇలాంటి సమయాల్లో వారి భద్రత ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంటోంది. త్వరలో ఈ పరిస్థితి మారిపోనుంది. మహిళలు క్యాబో.. ప్రైవేటు బస్సో ఎక్కినప్పుడు వేధింపులు ఎదురైతే అందులో ఉండే ఒక్క బటన్ నొక్కితే చాలు.. పోలీసులు క్షణాల్లో అక్కడ వాలిపోతారు. ఇలాంటి వ్యవస్థ ఏర్పాటుపై రవాణాశాఖ దృష్టి సారించింది. ప్రైవేటు ప్రజా రవాణా బస్సులు, క్యాబ్‌లు, మ్యాక్సీ క్యాబ్‌లలో ‘వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజ్’లను తప్పనిసరి చేసింది. నిర్భయ చట్టం ప్రకారం కొత్తగా నమోదయ్యే వాహనాలతో పాటు, పాత వాటిలోనూ ఈ పరికరాలు ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. వీటికి అదనంగా ప్రతి వాహనంలో ‘ప్యానిక్ బటన్’ను కూడా తప్పనిసరి చేయనుంది. మహిళలకు వేధింపులు ఎదురైనప్పుడు ఆ బటన్ నొక్కితే చాలు.. వెంటనే పోలీస్ కంట్రోల్ రూంకు సందేశం వెళ్లిపోతుంది. వాహనం లొకేషన్ ఆధారంగా పోలీసులు వాహనం వద్దకు చేరుకుంటారు. ఆర్టీసీ బస్సుల్లో వెహికల్ ట్రాకింగ్ విధానం ఇప్పటికే అమలవుతోంది. త్వరలో ప్రైవేట్ ప్రజా రవాణా వాహనాల్లో కూడా అందుబాటులోకి రానుంది. ఇలాంటి వ్యవస్థ ఏర్పాటుచేయాలని నిర్భయ చట్టంలోనే స్పష్టంగా ప్రతిపాదించినా అమల్లోకి రాలేదు. కొన్ని క్యాబ్ సంస్థలు వేటికి అవే స్వయంగా ఏర్పాటు చేసుకున్నా మహిళా ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకంగానే ఉంది. ఈ క్రమంలో తాజాగా ట్రాకింగ్ పరికరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని రవాణాశాఖ నిర్ణయించింది. రెండు లక్షల వాహనాల్లో.. – గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 8,000 లకు పైగా ప్రవేట్ బస్సులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల మధ్య స్టేజీ క్యారేజీలుగా నడిచే బస్సులతో పాటు నేషనల్ పర్మిట్లపై టూరిస్టు్ట బస్సులుగా వివిధ రాష్ట్రాలకు మరికొన్ని రాకపోకలు సాగిస్తున్నాయి. – బస్సులకు అదనంగా 1.2 లక్షల క్యాబ్‌లు, సుమారు 30 వేల మ్యాక్సీ క్యాబ్‌లు, మినీ బస్సులు, ట్యాక్సీలు సేవలందిస్తున్నాయి. మొత్తంగా దాదాపు రెండు లక్షల ప్రైవేటు ప్రజా రవాణా వాహనాలు తిరుగుతున్నాయి. – కొవిడ్ అనంతరం నగరంలో రకరకాల క్యాబ్ అగ్రిగేటర్లు అందుబాటులోకి వచ్చాయి. కొన్నిసార్లు వాహనాన్ని ఆన్లైన్లో బుక్ చేసుకొన్న సమయంలో నమోదయ్యే వాహనం నంబర్‌కు, అందుబాటులోకి వచ్చే వాహనానికి సంబంధం ఉండడం లేదు. చివరకు ఏ క్యాబ్ వినియోగంలోకి వస్తుందో తెలియని గందరగోళం నెలకొంటోంది. – శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు రాకపోకలు సాగించే క్యాబ్‌లలోనూ డ్రైవర్ల తీరుపై మహిళా ప్రయాణికులు తరచుగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే ప్రైవేట్ బస్సుల్లో కూడా డ్రైవర్లు, సిబ్బంది తరచుగా మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఈ క్రమంలో వెహికిల్ ట్రాకింగ్ అనివార్యంగా మారింది.ఎలా పనిచేస్తుందంటే.. -
ప్రొటెక్షన్ ప్లీజ్...హెల్త్ చూస్తుంది
కుటుంబ ఆరోగ్యాన్నే కాదు సమాజ ఆరోగ్యాన్నీ రెప్పవేయకుండా కనిపెట్టుకోగలదు స్త్రీ! ఆ ఓపిక, శ్రద్ధ మెడిసిన్ డిగ్రీతో వచ్చినవి కావు.. డీఎన్ఏలో భాగమై వచ్చినవి!వాటి బలంతోనే డాక్టరమ్మగా అలుపులేని సేవలందిస్తోంది.. దేశ ఆరోగ్య నాడి లయ తప్పకుండా చూసుకుంటోంది! కానీ ఆమె సహనాన్ని బలహీనతగా తీసుకుని.. వైద్యరంగంలో ఆమె భద్రతను ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు! అది ప్రభుత్వ వైద్యరంగంలో స్త్రీల ప్రవేశానికి అడ్డంకిగా మారకముందే మేలుకుని.. నాయకత్వ హోదాల్లో మహిళలకు అవకాశాన్ని ఇచ్చి.. భద్రతను కల్పిస్తే... హెల్త్‌కేర్ సెక్టార్లో సాధికారత సాధ్యం కాదు తథ్యం!→ ఆనందిబాయీ జోషీ ఆమె బాల్యవివాహ బాధితురాలు. వైద్య సదుపాయాల్లేక పురిట్లోనే బిడ్డను పోగొట్టుకుంది. అప్పుడనుకుంది.. మెడిసిన్ చదవాలని! చదివింది.. అదీ అమెరికా, పెన్సిల్వేనియాలోని విమెన్స్ మెడికల్ కాలేజ్‌లో. అలా చేతిలో మెడిసిన్ డిగ్రీ, మెడలో స్టెత్, దేశ తొలి మహిళావైద్యురాలిగా సొంతగడ్డ మీద అడుగుపెట్టింది. ఆవిడే డాక్టర్ ఆనందీబాయి జోషీ. మన సమాజం ఆమెను ప్రశంసించక పోగా.. తీవ్రంగా విమర్శించింది. వివక్షకు గురైనా వెరవక వైద్యసేవలందించింది. దురదృష్టం.. పిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయింది. → డాక్టర్ కాదంబినీ గంగూలీ మన దేశ తొలి మహిళావైద్యుల్లో మరో డాక్టర్.. కాదంబినీ గంగూలీ. యూరప్‌లో శిక్షణ పొందిన ఆమె మెడికల్ కెరీర్ అంతా దేశంలోని మహిళల ఆరోగ్యం, మాతా.. శిశు మరణాలను అరికట్టే ప్రయత్నానికే అంకితమైంది. → ఇంకా.. ∙మేరీ పూనెన్ ల్యుకోస్ మన తొలి మహిళా గైనకాలజిస్ట్ మేరీ పూనెన్ లుకోస్, దేశంలో క్యాన్సర్ రీసెర్చ్ సాగడానికి శ్రమించిన కమల్ రణదివే.. వీళ్లంతా స్వాతంత్య్రానికి పూర్వమే తమ ప్రతిభతో ప్రపంచాన్ని ఆకట్టుకున్నారు. స్త్రీ సాధికారతకు చిహ్నంగా నిలిచారు. వీళ్ల స్ఫూర్తితో స్వాతంత్య్రానంతరం.. దేశంలో క్యాన్సర్ చికిత్సలో సమర్థమైన మార్పులకై కృషి చేసిన డాక్టర్ వి.శాంత, రేడియాలజిస్ట్ డా. కె.ఎ.దిన్షా, కార్డియాలజిస్ట్ డా.పద్మావతి అయ్యర్, డా. నీలమ్ క్లేర్, డా. అజితాచక్రవర్తి, డా. శశి వాధ్వా, డా. కామినీ రావు, డా. ఇందిరా హిందుజా లాంటివాళ్లెందరో వారి వారి విభాగాల్లో రాణించారు. మహిళలకు ఆరోగ్యం పట్ల స్పృహ కల్పించేందుకు కృషి చేస్తున్నారు. ఈ పాజిటివ్ నోట్ చూస్తుంటే వైద్యరంగంలో మన మహిళలు ఎంతో ముందుకెళ్లారనే భావన కలుగుతుంది. కానీ అధ్యయనం (2021 ప్రకారం) చేసి లెక్కలు తీస్తే ఆ సంఖ్య 29 శాతమే అని తేలింది. బోర్డ్ మెంబర్స్‌గా ఉన్నది 17 శాతమే. నర్సింగ్సేవల్లో మహిళల సంఖ్య 80 శాతం. దేశంలోని మొత్తం హెల్త్‌కేర్ వర్క్‌ఫోర్స్‌లో 54 శాతం ప్రైవేట్ వైద్యరంగానిదే వాటా! అందులో కూడా నాయకత్వ హోదాల్లో ఉన్న మహిళల సంఖ్య 30 శాతానికి మించిలేదు. అంతర్జాతీయ స్థాయిలో.. హెల్త్‌కేర్ ఇండస్ట్రీలో ఆంట్రప్రెన్యూర్స్ గా రాణిస్తున్న అను ఆచార్య, కిరణ్ మజుందార్ షా, మీనా గణేశ్, డాక్టర్ నందితా షా, నాన్కీ లఖ్విందర్‌సింగ్, నటాషా పూనావాలా, సునీతా మహేశ్వరి, సమీనా హమీద్, సౌమ్య స్వామినాథన్, డాక్టర్ వి. శాంత సహా తెలుగు వనితలు సంగీతారెడ్డి, శోభనా కామినేని, ప్రీతా రెడ్డి, సునీతా రెడ్డి లాంటి వాళ్లెందరి పేర్లో వినిపిస్తాయి. వీళ్లంతా తమ రంగాలలో తమ ముద్రను చూపించుకుంటున్నారు.ప్రమాదం అంచున... జాతీయ ఆరోగ్య సర్వే ప్రకారం ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు ఏదో ఒకరకమైన శారీరక హింసకు గురవుతున్నారు. ఇది హెల్త్‌కేర్ సెక్టార్లోకీ విస్తరించి మహిళావైద్యులు, నర్సుల భద్రతను ప్రమాదంలోకి నెడుతోంది. దీనికి ఉదాహరణ ఇటీవలి కోల్‌కతా కేజీ కర్ ఆసుపత్రి పీజీ స్టూడెంట్ హత్యాచారమే! ఈ దారుణాలకు కారణం ఆయా విభాగాల్లో నాయకత్వ హోదాలో మహిళల సంఖ్య కనీసం 30 శాతం కూడా లేకపోవడమే. పైస్థాయిలో ఎక్కువమంది మహిళలున్న చోట పనిప్రదేశం భద్రంగా ఉంటుంది. భరోసా పెరుగుతుంది. మహిళలకు మౌలిక సదుపాయాల ఏర్పాటు జరుగుతుంది.ముంబై.. దిక్సూచీ... ఈ విషయంలో ‘దిలాసా క్రైసిస్ సెంటర్’ను ఏర్పాటు ద్వారాదేశానికి మార్గదర్శిగా నిలిచింది ముంబై! ఇది మహిళల మీద హింస ఎన్ని రకాలుగా జరుగుతుంది, దాన్నెలా గుర్తించాలి, ఎలా ఎదుర్కోవాలి, ఎలా సహాయం పొందాలి, ఎలా సహాయం అందించాలి వంటి వాటి మీద ఆసుపత్రుల్లోని సిబ్బందికి శిక్షణనిచ్చింది. జనాభాలో సగభాగం ఉన్న మహిళల ఆరోగ్య సంరక్షణ, అవగాహనలో వైద్యరంగంలోని మహిళలదే కీలకపాత్ర. కానీ విధాన నిర్ణయాల్లో మాత్రం వీరి ప్రాతినిధ్యం శూన్యం. అది గ్రహించి ఇటు ప్రభుత్వ రంగం, అటు ప్రైవేట్ రంగం మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచి, వచ్చే మహిళా దినోత్సవానికల్లా వైద్యరంగంలో మహిళల విజయగా«థను చెప్పుకునే అవకాశాన్నిస్తాయని ఆశిద్దాం! మహిళలతోనే భరోసానేను మహిళా బాస్‌ల కిందే పనిచేస్తున్నాను. ఏ చిన్న సమస్య అయినా వారితో షేర్ చేసుకుంటాను. వెంటనే స్పందిస్తారు. నేను కూడా నా కింది ఉద్యోగుల విషయంలో అలాగే ఉంటాను. మన బాసులుగా కానీ, కొలీగ్స్‌గా కానీ మహిళలే ఉంటే ఇలాంటి భరోసా వస్తుంది. అయితే అవకాశాలను వెదుక్కుంటేనే మహిళా శక్తి పెరుగుతుంది. ఆ బలం పెరిగితే ఆటోమేటిగ్గా పని ప్రదేశం విమెన్ ఫ్రెండ్లీగా మారుతుంది. – డాక్టర్ మౌనిక నేలపట్ల అసిస్టెంట్‌ప్రొఫెసర్, జనరల్ సర్జన్, ప్రభుత్వాసుపత్రి, కామారెడ్డిమేము వారధులంఒక రకంగా మేము ప్రభుత్వాలకు.. ప్రజలకు మధ్య వారధిలాంటి వాళ్లం. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో, వారి ఆరోగ్యసంరక్షణలో మా పాత్ర ముఖ్యమైనది. వృత్తిరీత్యా ఎప్పుడూ ప్రజల్లోనే ఉండాలి కాబట్టి.. భద్రత, రక్షణ వంటి వాటిలో ఇబ్బందులుంటాయి. కొన్నిసార్లు అవమానాలూ ఎదురవుతుంటాయి.– జంగం రమాదేవి, ఆశ వర్కర్,పాల్వంచ, కామారెడ్డి జిల్లా. -
’అతివ’కు హైదరాబాద్ భేష్
సాక్షి, హైదరాబాద్: మహిళలకు భద్రత, నైపుణ్యాలు, ఉద్యోగావకాశాలతో పాటు ఇతర ప్రామాణిక అంశాల్లో దేశవ్యాప్తంగా అత్యుత్తమ 5 నగరాల్లో హైదరాబాద్ నగరం ఒకటిగా నిలిచింది. దేశవ్యాప్తంగా 120 నగరాల్లో అవతార్ గ్రూప్ చేపట్టిన సర్వేలో 2024 సంవత్సరానికి హైదరాబాద్ 4వ స్థానంలో ఉండగా.. ఈ టాప్ 5 (బెంగళూరు, చెన్నై, ముంబై, హైదరాబాద్, పుణె) నగరాల్లో 3 దక్షిణాది నుంచే ఉండటం విశేషం. ఇందులో బెంగళూరు మొదటి స్థానంలో నిలిచింది. అవతార్ గ్రూప్ నిర్వహించిన ‘టాప్ సిటీస్ ఫర్ ఉమెన్ ఇన్ ఇండియా–2024’ (టీసీడబ్ల్యూఐ) ఇండెక్స్ సర్వేను బుధవారం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ సౌందర్య రాజేశ్ వెల్లడించారు. ఈ ఇండెక్స్ సెంటర్ ఫర్ మానిటరింగ్ ది ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ), వరల్డ్ బ్యాంక్, క్రైమ్ రికార్డ్స్, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వంటి వివిధ డేటా వనరుల ఆధారంగా తయారు చేశారు. మౌలిక సదుపాయాలు, టెక్ జాబ్స్ భేష్... 120 నగరాల్లో సర్వే చేపట్టగా, మౌలిక సదుపాయాల కల్పనలో 8.01 పాయింట్లతో హైదరాబాద్ అత్యధిక స్కోర్‌ను సాధించింది. మెరుగైన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ప్రయాణ సౌకర్యాలలోనూ ఆదర్శ నగరంగా నిలిచింది. ముఖ్యంగా మహిళ భద్రత కోసం షీ టీమ్స్, మెట్రో రైలు ప్రధానాంశాలుగా నిలిచాయి. టెక్నాలజీ రంగంలో మహిళలు అత్యధిక ఉద్యోగాలు పొందిన నగరాల జాబితాలో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. భద్రతలో 6.95 పాయింట్ల తో 2వ స్థానంలో ఉంది. నైపు ణ్యం, ఉపాధిలో 6.95 పాయింట్లతో 5వ స్థానంలో నిలువగా... ఈ వరుసలో ముంబై, బెంగళూరు, గురుగ్రామ్ ముందంజలో ఉన్నా యి. మొత్తంగా మహిళలకు అత్యుత్తమ నగరాల్లో దక్షణాది రాష్ట్రాలు భేష్ అనిపించుకున్నాయి. హక్కులు, సమానత్వం అందాలిఅవతార్ గ్రూప్ ఆధ్వర్యంలో గత మూడేళ్లుగా ఈ సర్వే నిర్వహిస్తున్నాం. అభివృద్ధి చెందుతున్న నగరాల్లో మహిళలకు రక్షణ, ఆరోగ్యం, వారు చేసే ఉద్యోగాల్లో సురక్షిత వాతావరణం, జీవన నాణ్యత తదితర అంశాలు ప్రధానమైనవి. 2047 వరకు వికసిత్ భారత్‌గా నిర్మించుకోవడంలో మహిళల హక్కులు, సమానత్వం కీలకం. – డాక్టర్ సౌందర్య రాజేశ్, అవతార్ గ్రూప్ అధ్యక్షురాలు -
వెనక్కి నడవమంటున్నారా?
మహిళల భద్రత కోసమని చెబుతూ ఈమధ్య ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ కొన్ని మూర్ఖపు సలహాలిచ్చింది. వాటి ప్రకారం... మగ టైలర్లు ఆడవాళ్ల దుస్తుల కొలతలు తీసుకోకూడదు; మగవాళ్లు జిమ్ముల్లో ఆడవాళ్లకు ట్రెయినర్లుగా ఉండకూడదు. వాళ్ల ఉద్దేశం మంచిదే కావొచ్చు. కానీ ఇది ఇంకో రకమైన తాలిబనిజం అవుతుంది. ఎందుకంటే, ఇలాంటివి చివరకు మహిళలకు కీడే చేస్తాయి. వారి వ్యక్తిగత ఎంపికకు భంగం కలిగిస్తాయి. ఇది ఇంతటితోనే ఆగుతుందా? ఫిజియోథెరపిస్టులుగా, దంతవైద్యులుగా, డాక్టర్లుగా, ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న మహిళల పరిస్థితి ఏమిటి? వీరందరినీ కేవలం మహిళలకు మాత్రమే సేవలందించేలా చేయాలా? అందుకే ఈ ప్రతిపాదనలు హాస్యాస్పదమైనవే కాదు, అర్థంలేనివి కూడా!మన మంచి కోసమేనని చెబుతూ కొందరు తరచూ కొన్ని పిచ్చి సూచనలు చేస్తూంటారు. వీటిని నేను పెద్దగా పట్టించుకోను. కానీ ఈ మధ్య ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ కొన్ని మూర్ఖపు సలహాలిచ్చింది. అవి ఎంత మూర్ఖమైనవంటే మనం వాటిని గట్టిగా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. వీటిపట్ల మౌనంగా ఉంటే, అవన్నీ సమ్మతమే అనుకునే ప్రమాదముంది.‘బహిరంగ, వాణిజ్య స్థలాల్లో మహిళల భద్రతను పెంచడం ఎలా?’ అన్న అంశంపై ఈ సూచనలు వచ్చాయి. ఉద్దేశం చాలామంచిది. కానీ ప్రతిపాదించిన సలహాలు మాత్రం నవ్వు పుట్టించేలా ఉన్నాయి. మగ టైలర్లు ఆడవాళ్ల దుస్తుల కొలతలు తీసుకోకూడదన్నది ఒకానొక సలహా. అలాంటప్పుడు పురుషులు మహిళల వస్త్రాలు కూడా తయారు చేయకూడదా? మహిళలు మాత్రమే సిద్ధం చేయాలా? బహుశా ఇది ఇకపై అమల్లోకి తెస్తారేమో! సెలూన్లలోనూ మహిళలకు క్షౌర క్రియలు చేయడం ఇకపై పురుషులకు నిషిద్ధం. అలాగే జిమ్, యోగా సెషన్లలోనూ మగవాళ్లు మహిళలకు శిక్షణ ఇవ్వడానికి అనుమతి లేదు.ఇంతటితో అయిపోయిందనుకోకండి. అన్ని పాఠశాలల బస్సు ల్లోనూ మహిళా సెక్యూరిటీ సిబ్బంది ఉండాలన్న సలహా కూడా వచ్చింది. బహుశా పురుషులు ఎవరూ యువతులను, చిన్న పిల్లలను భద్రంగా ఉంచలేరని అనుకున్నారో... వారి నుంచి ముప్పే ఉందను కున్నారో మరి! మహిళల వస్త్రాలమ్మే చోట మహిళా సిబ్బంది మాత్రమే ఉండాలట. పురుషులను అస్సలు నమ్మకూడదన్న కాన్సెప్టు నడుస్తోందిక్కడ. మహిళలను ప్రమాదంలో పడేయకుండా పురుషులు వారికి సేవలు అందించలేరన్నమాట.ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ బబితా చౌహాన్ ఈ సలహాలు, సూచనలపై ఏమంటున్నారంటే... మహిళల భద్రతను పటిష్ఠం చేసేందుకు మాత్రమే కాకుండా, మహిళల ఉపాధి అవకాశా లను మెరుగుపరిచేందుకు కూడా వీటిని ఉద్దేశించినట్లు చెబుతున్నారు. ఈ సలహాలను ‘‘మహిళల భద్రత కోణంలోనూ, అలాగే ఉపాధి కల్పన కోణంలోనూ’’ ఇచ్చినట్టు మొహమాటం లేకుండా ఆమె చెబు తున్నారు. ఇంకోలా చెప్పాలంటే, రకరకాల ఉద్యోగాల్లో పురుషులపై నిషేధం విధిస్తున్నారన్నమాట. తద్వారా మహిళలకు కొత్త రకమైన అవకాశాలు కల్పిస్తున్నారనుకోవాలి. సరే... వీటి ద్వారా మనకర్థమయ్యేది ఏమిటి? అసలు ఏమైనా అర్థముందా వాటిల్లో? అలాటి ప్రతిపాదనలు అవసరమా? న్యాయ మైనవేనా? అనవసరంగా తీసుకొచ్చారా? మరీ నమ్మశక్యం కాని విధంగా ఉన్నాయా? ఇప్పటివరకూ చెప్పినదాన్ని బట్టి నా ఆలోచన ఏమిటన్నది మీకు అర్థమై ఉంటుంది. కొంచెం వివరంగా చూద్దాం. మొదటగా చెప్పు కోవాల్సింది... ఈ ప్రతిపాదనల వెనుక పురుషులపై ఉన్న అప నమ్మకం గురించి! పురుష టైలర్లు, క్షురకులు, దుకాణాల్లో పనిచేసే వారి సమక్షంలో మహిళల భద్రతకు ముప్పు ఉందని భావిస్తున్నారు. చిన్నపిల్లల రక్షణ విషయంలోనూ మనం మగ సిబ్బందిని నమ్మడం లేదంటే... వాళ్లకేదో దురుద్దేశాలను ఆపాదిస్తున్నట్లే! పైగా... ఈ ప్రతిపాదనలు కాస్తా మహిళల జీవితాల తాలూకు వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేవి కూడా! తాము సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకుండా చేస్తున్నాయి. పురుషులు బాగా రాణిస్తున్న రంగాల్లో, వారి సేవలను తాను వినియోగించు కోవాలని ఒక మహిళ నిర్ణయించుకుంటే ఈ ప్రతిపాదనల పుణ్యమా అని అది అసాధ్యమవుతుంది. ఇంకోలా చూస్తే ఇది తాలిబనిజంకు ఇంకో దిశలో ఉన్న ప్రతిపా దనలు అని చెప్పాలి. అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్లు మహిళలను తిరస్క రిస్తున్నారు. ఇక్కడ పురుషులను మహిళలకు దూరంగా ఉంచు తున్నారు. వారి దుర్మార్గమైన మనసులను విశ్వసించకూడదు; కాబట్టి వారిని మహిళలకు దూరంగా ఉంచాలి.ఇప్పుడు చెప్పండి... ఈ ప్రతిపాదనలు వాస్తవంగా అవసరమా? ఇలాగైతే పురుషుల దుస్తులమ్మే దుకాణాల్లో మహిళలు పని చేయకూడదు మరి! మహిళా జిమ్ శిక్షకులు పురుషులకు ట్రెయినింగ్ ఇవ్వకూడదు. ఫిజియోథెరపిస్టులుగా, దంతవైద్యులుగా, డాక్టర్లుగా, ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న మహిళల పరిస్థితి ఏమిటి? వీరందరినీ కేవలం మహిళలకు మాత్రమే సేవలందించేలా చేద్దామా?పురుష రోగులకు, వినియోగదారులకు సేవలు అందించడానికి అను మతిద్దామా? మగ శిక్షకులు, దుకాణాల్లోని మగ సేవకులను నమ్మలేని పరిస్థితి ఉన్నప్పుడు... స్త్రీలు పేషెంట్లుగా, వినియోగదారులుగా వచ్చినప్పుడు వాళ్లు ఎలా ఎక్కువ నమ్మకస్తులవుతారు?నేను ఇదంతా ఎందుకు చెబుతున్నానో మీకు ఇప్పటికి అర్థమైందనే అనుకుంటున్నా. పురుషులు నిర్వహిస్తున్న పనులపై నమ్మకం లేకపోతే... మహిళలపై కూడా అదే అవిశ్వాసం ఉంటుంది కదా! అప్పుడు అదే ప్రశ్న కదా ఉత్పన్నమయ్యేది! పురుషులను అస్సలు నమ్మడం లేదని చెప్పడం ద్వారా ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఏ రకమైన సందేశం ఇవ్వదలచుకున్నారు?కొంచెం ఆలోచించి చూడండి. మహిళల విషయంలో వివక్ష చూపేవారిని మిసోజినిస్ట్ అంటూ ఉంటారు. ఈ లెక్కన బబితా చౌహాన్‌ను మిసాండ్రిస్ట్ అనాలి. మహి ళల పట్ల వివక్ష చూపడం ఎంత తప్పో... పురుషులపై చూపడం కూడా అంతే తప్పు. అయితే మిసోజినీ గురించి మనకు కొద్దోగొప్పో పరిచయం ఉంది కానీ మిసాండ్రిస్టుల విషయం నేర్చుకోవాల్సే ఉంది. ఈ పనికిమాలిన విషయానికి మనం బబితా చౌహాన్‌కు కృతజ్ఞులుగా ఉండాలి.కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
మహిళల భద్రతకు ప్రత్యేక నిధి!
సాక్షి, హైదరాబాద్: పని ప్రదేశంలో మహిళలు ధైర్యంగా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోందని మంత్రి సీతక్క వెల్లడించారు. ఇటీవల దేశవ్యాప్తంగా జరుగుతున్న ఘటనలతో మహిళలు భయాందోళనకు గురవుతున్నారని, ఈ పరిస్థితిని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. మహిళలపై దాడులు చేసిన వారికి వెంటనే శిక్ష అమలయితేనే ఇలాంటి ఘటనలు తగ్గుతాయని మంత్రి అభిప్రాయపడ్డారు.మహిళల భద్రతపై బుధవారం సచివాలయంలో మంత్రి సీతక్క సమావేశం నిర్వ హించారు. మహిళలపై హింస పెరగడానికి డ్రగ్స్, గంజాయి కూడా కారణమవుతున్నాయని వివరించారు. ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల్లో షీ టీమ్స్ గస్తీ పెంచుతామన్నారు. పబ్లిక్ ప్లేసుల్లో, ఆసుపత్రుల్లో సీసీ కెమెరాలను పెంచుతామన్నారు. మంత్రులు, ఉన్నతాధికారులతో కోర్ కమిటీని ఏర్పాటు చేస్తామని, అన్ని శాఖల్లో త్వరలో ఉమెన్ సేఫ్టీ కమి టీలు నియమిస్తామని తెలిపారు. మహిళల భద్రత కోసం ప్రతి శాఖకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించే అంశాన్ని తమ ప్రభు త్వం పరిశీలిస్తోందన్నారు. మహిళా ఉద్యోగుల భద్రతపై ప్రతీ కార్యాలయంలో కమిటీలు ఏర్పాటు చేయాలని మహి ళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద సూచించారు. బచ్పన్ బచావోతో కలసి పనిచేస్తాం.. బాల కారి్మకులు, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న బచ్పన్ బచావో ఆందోళన్ ప్రతినిధుల బృందం బుధవారం సచివాలయంలో మంత్రి సీతక్కతో సమావేశమయింది. నోబెల్ అవార్డు గ్రహీత కైలాశ్ సత్యార్థి నేతృత్వంలో బచ్పన్ బచావో ఆందోళన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సంపూర్ణ బెహరా, ధనుంజయ్ తింగాల్, ప్రతినిధులు వీఎస్ శుక్లా, చందన, వెంకటేశ్వర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బచ్పన్ బచావో ఆందోళన్‌తో రాష్ట్ర ప్రభుత్వం కలసి పనిచేస్తుందని తెలిపారు. -
Manipur violence: రాజ్యాంగ యంత్రాంగం కుప్పకూలింది
న్యూఢిల్లీ: మణిపూర్‌లో జాతుల మధ్య వైరంలో మహిళలు సమిధలుగా మారిన వైనాన్ని సర్వోన్నత న్యాయస్థానం మరోమారు తీవ్రంగా తప్పుబట్టింది. మే నాలుగో తేదీన ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరులో తిప్పిన ఘటనకు సంబంధించిన కేసుల విచారణ సందర్భంగా మణిపూర్‌లో శాంతిభద్రతలు, పోలీసుల పనితీరును సుప్రీంకోర్టు తూర్పారబట్టింది. సోమవారం జరిగిన కేసుల వాదోపవాదాలు మంగళవారమూ కొనసాగాయి. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందించింది. ‘ కేసులను సమర్థవంతంగా దర్యాప్తుచేయలేని స్థితిలో పోలీసులున్నారు. దర్యాప్తులో దమ్ము, చురుకుతనం లేదు. మణిపూర్‌లో హింసాత్మక ఘటనల్లో ఆరువేలకుపైగా ఎఫ్ఐఆర్లు నమోదైతే ఎంత మందిని అరెస్టుచేశారు? నగ్న పరేడ్‌కు సంబంధించిన జీరో ఎఫ్ఐఆర్, సాధారణ ఎఫ్ఐఆర్, పూర్తి వివరాలు ఉన్నాయా ? హేయమైన ఘటన జరిగిన చాలా రోజులకు ఎఫ్ఐఆర్ నమోదైంది. కొన్ని ప్రాంతాల్లోకి పోలీసులు కూడా వెళ్లలేని అసమర్థత. పరిస్థితి చేయి దాటడంతో అరెస్టులు చేయలేని దుస్థితి. అక్కడ అసలు శాంతిభద్రతలు అనేవే లేవు. రాజ్యాంగ యంత్రాంగం కుప్పకూలింది’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 6,523 ఎఫ్ఐఆర్ల నమోదు కేంద్ర ప్రభుత్వం, మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాల తరఫున కోర్టుకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి వివరణ ఇచ్చారు. ‘ మేలో హింస మొదలైననాటి నుంచి ఇప్పటిదాకా 6,523 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. నగ్న పరేడ్ ఉదంతంలో జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసులో జువెనైల్సహా ఏడుగురిని అరెస్ట్‌చేశారు. ఘటన తర్వాత బాధిత మహిళల వాంగ్మూలం తీసుకున్నారు’ అని తెలిపారు. ఈ కేసులో 11 కేసులను సీబీఐకి బదిలీచేస్తున్నట్ల అట్నారీ జనరల్ ఆర్.వెంకటరమణి తెలిపారు. కాగా, వాంగ్మూలాల కోసం ఆ మహిళలను మళ్లీ విచారించవద్దని సీబీఐకు కోర్టు సూచించింది. తమ ముందు హాజరుకావాలని బాధిత మహిళలను సీబీఐ ఆదేశించిందన్న అంశాన్ని వారి లాయర్ నిజాం పాషా మంగళవారం కోర్టు దృష్టికి తీసుకురావడంతో ధర్మాసనం పై విధంగా మౌఖిక ఆదేశాలిచ్చింది. ఏడో తేదీ(సోమవారం రోజు)న స్వయంగా హాజరై వివరాలు తెలపాలని మణిపూర్ డీజీపీని కోర్టు ఆదేశించింది. 6,523 కేసుల్లో హత్య, రేప్, బెదిరింపులు, లూటీలు, విధ్వంసం ఇలా వేర్వేరుగా కేసులను విభజించి వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. -
మహిళల భద్రతకు పెద్దపీట
నాగోలు: మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ.. దాడులకు గురైన మహిళలకు బాసటగా నిలిచేలా భరోసా కేంద్రాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని మహిళా భద్రతా విభాగం అదనపు డీజీపీ శిఖా గోయల్ అన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎల్బీనగర్లోని సీపీ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం నూతనంగా ఏర్పాటు చేసిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ (సీడీఈడబ్ల్యూ) ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌ను రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహన్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళ భద్రత కోసం ఈటీమ్స్ పనిచేస్తూన్నాయని తెలిపారు. మహిళలకు ఎలాంటి సమస్య ఎదురైనా ఆదుకోవడానికి మేం ఉన్నాం అన్న భరోసా కలి్పస్తామని పేర్కొన్నారు. మహిళల సౌకర్యార్థం నగరంలోని కమిషనరేట్లలో పరిధిలో 26 సీడీఈబ్ల్యూ సెంటర్ ఉన్నాయని తెలిపారు. భవిష్యత్తులో ప్రతి ప్రధాన సబ్ డివిజన్లో సీడీఈడబ్ల్యూ సెంటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు స్థానిక పోలీస్ స్టేషన్లో, భరోసా కేంద్రంలో కౌన్సెలింగ్ నిర్వహించే వారని తెలిపారు. కౌన్సెలింగ్ చాలా ప్రొఫెనల్ సబ్జెక్ట్, వృత్తిపరమైన సహాయం పొందడానికి కౌన్సెలర్లను నియమించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా నమోదైన నేరాలలో గృహహింస ఒకటి అనిపేర్కొన్నారు. రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ మాట్లాడుతూ.. మహిళా సాధికారత, మహిళా రక్షణ, మహిళల భద్రత, గృహ హింస, ఇతర వేధింపుల రక్షణ కల్పించేందుకు కేంద్రాలను వీలైనంత త్వరగా ప్రారంభించాలని నిర్ణయించారన్నారు. ఆన్లైన్, ఆన్‌రోడ్ ఈవ్‌టీజింగ్, వేధింపులను అరికట్టేందుకు సైబర్ స్టాకింగ్‌పై అవగాహన కార్యక్రమాలు, షార్ట్ఫిల్్మను రూపొదిస్తున్నట్లు ఆయన తెలిపారు. మహిళల భద్రతకు, భరోసా ఇవ్వడానికి రాచకొండ పోలీస్‌లు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో మహిళా భద్రత డీసీపీ శ్రీబాల, ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, షీ టీమ్స్ ఏసీపీ వెంకట్‌రెడ్డి, సరూర్‌నగర్ మహిళా పీఎస్ సీఐ మంజుల, ఎల్బీనగర్ సీఐ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
డిజిటల్ కూడలిలో మహిళ
వందన డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఇంటా బయట చురుగ్గా ఉండే వందన వారం రోజులుగా ఇంటి గడప దాటి కాలు బయట పెట్టలేకపోతోంది. కారణం, తన వ్యక్తిగత ఫొటోలు, వీడియో క్లిప్పింగ్స్ ఒక సైట్లో కనపడటం ఆమెను కలవరపరుస్తోంది. వ్యక్తిగత పరువుకు సంబంధించిన విషయాలు బయటకు రావడం ఆమెను తీవ్ర మనో వేదనకు గురి చేస్తోంది. ఈ విషయాలను ఇంట్లోవారితో పంచుకోలేక, స్నేహితులతో చెప్పలేక ఇబ్బంది పడుతూ ఎటూ తేల్చుకోలేక ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. రకరకాల డిజిటల్ సమస్యలను ఎదుర్కొనే యువతుల సంఖ్య ఇటీవల విపరీతంగా పెరుగుతోంది. ఇటీవల కాలంలో మహిళల అవకాశాలు ఇంటర్నెట్ ద్వారా విస్తృతమయ్యాయి. ఉపా ధి అవకాశాలను పెంచుకోవడానికి, అదనపు ఆదాయాన్ని సంపా దించడానికి, జ్ఞానాన్ని, ఆర్థికవృద్ధిని, మరింత సమగ్రమైన డిజిటల్ ప్రపంచాన్ని సృష్టించడానికి వీలు కల్పిస్తుంది. అయితే, సైబర్ శాఖ ఆన్లైన్లో పెరుగుతున్న మహిళా ప్రయోజనాలనే కాదు, వారికి సమస్యగా మారే అంశాలను కూడా పరిశీలిస్తుంది. మహిళలు ఆన్ లైన్ లో తమ సురక్షిత ప్రయాణం సాగించడానికి డిజిటల్ భద్రత తెలుసుకోవడం అత్యవసరం. డిజిటల్ నేరాలలో ప్రధానమైనవి.. డాక్సింగ్ : ఇది ఒక వ్యక్తి లేదా సంస్థకు సంబంధించిన గతంలోని వ్యక్తిగత సమాచారాన్ని డిజిటల్ మాధ్యమం ద్వారా బహిర్గతం చేసే చర్య. మోసగాళ్లు సాధారణంగా పబ్లిక్‌గా అందుబాటులో ఉన్న డేటాబేస్లు, గత సోషల్ మీడియా పోస్టింగ్‌లు, సోషల్ ఇంజనీరింగ్ నుండి సమాచారాన్నిపొంది, ఆన్ లైన్ షేమింగ్ లేదా దోపిడీకి దారితీయవచ్చు. సైబర్‌స్టాకింగ్: ఇది ఎలక్ట్రానిక్ మార్గాలను ఉపయోగించి ఒక వ్యక్తిని పదేపదే ట్రాక్ చేయడం. ఉదాహరణకు: అసందర్భంగా ఫోన్ కాల్స్ చేయడం, వాయిస్ సందేశాలు లేదా మెసేజ్‌లు చేయడం, గూఢచర్యం లేదా సోషల్ మీడియా కార్యకలాపా లను పర్యవేక్షించడం లేదా ఇంటర్నెట్లో తగని సమాచారాన్ని పోస్ట్ చేస్తామని బెదిరించడం.. వంటి సైబర్‌స్టాకింగ్ శారీరక, మానసిక క్షోభకు దారితీయవచ్చు. స్వాటింగ్: ఇది పోలీసులను రెచ్చగొట్టడానికి, మనల్ని మోసం చేయడానికి అత్యవసర ఫోన్ కాల్స్ చేయడం వంటి చర్య. ఇది సైబర్ దోపిడీకి ఒక రూపం. దీని ద్వారా వ్యక్తులు లైంగిక ప్రయోజనాలనుపొందాలని చూస్తారు. లైంగిక వేధింపులు వ్యక్తిగత, సన్నిహిత ఫొటోల పంపిణీకి దారితీయవచ్చు. రివెంజ్ పోర్న్: అసభ్యకరమైన చిత్రాలు లేదా వీడియోలను ఆన్ లైన్ లో అప్లోడ్ చేసి వేధిస్తారు. ఏ మాత్రం మన అనుమతి లేకుండా ఆన్లైన్లో షేర్ అవుతుంటాయి. ఇవి ఎక్కువగా బాధితురాలి మాజీ జీవిత భాగస్వామి లేదా బాయ్‌ఫ్రెండ్ ద్వారా జరిగేవి ఉంటాయి. లైంగిక వేధింపులు: తెలియకనో లేక ఏదైనా భావోద్వేగ సమయంలోనో లైంగిక అనుకూల రిక్వెస్ట్‌లకు అనుమతి ఇస్తుంటారు. అంటే, ఫొటోలు, కంటెంట్, జోక్స్, మరొక స్త్రీ ద్వేషానికి సంబంధించినవి అయి ఉండవచ్చు. ఇవి ఒకరి ప్రతిష్ఠకు హాని కలిగించే వాస్తవాలు. ఉదాహరణకు.. ‘దొంగ, అబద్ధాలకోరు లేదా అనైతిక ప్రవర్తన’.. వంటివి. వంచన: మోసగాళ్లు మీలా నటిస్తూ నకిలీ ఖాతాను సృష్టిస్తారు. మీ సోషల్ మీడియా పరిచయాల నుండి డబ్బు అడుగుతారు, ఇది బాధితు లను వేధించడానికి ఇతరులకు ్రపోత్సాహకంగా కూడా ఉపయోగపడుతుంది. ద్వేషపూరిత ప్రసంగాల ద్వారా రెచ్చగొట్టడం, జాతి విద్వేషాన్ని ్రపోత్సహించడం లేదా సమర్థించడం, రాజకీయ, కార్పొరేట్ లేదా పోటీదారుల పోటీలో పా ల్గొనడం వంటివి ఉంటాయి. సేఫ్టీ చిట్కాలు: సమస్యలు వస్తాయని ఎవరూ తమ ప్రయోజనాలను వదులుకోరు. అయితే, బయట మన క్షేమం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో, ఆన్లైన్ బజార్లోనూ అంతే భద్రంగా ఉండటం ముఖ్యం. ► HTTPS:// (ప్యాడ్‌లాక్ సింబల్) ఉన్న వెబ్సైట్లను మాత్రమే బ్రౌజ్ చేయండి. ► పెద్ద అక్షరాలు, సంఖ్యలు, ప్రత్యేక అక్షరాలను కలిగి ఉన్న సంక్లిష్ట పా స్వర్డ్ను ఉపయో గించండి. ► అన్ని సామాజిక, ఇ–మెయిల్, బ్యాంకింగ్ లాగిన్ ల (2ఊఅ) కోసం రెండు–దశల ప్రమాణీకరణను పా టించండి. ► ఎస్సెమ్మెస్, వాట్సప్, సోషల్ మీడియా మెసెంజర్ల ద్వారా వచ్చిన చిన్న లింక్‌లను ఎప్పుడూ క్లిక్ చేయవద్దు. ► సామాజిక మాధ్యమాలలో ఫొటోలను చూస్తున్నప్పుడు లేదా అప్లోడ్ చేస్తున్నప్పుడు మీ లొకేషన్ స్టేటస్‌ను స్టాప్ చేయండి. ► ఎండ్–టు–ఎండ్ ఎన్ క్రిప్షన్ మెసెంజర్లను మాత్రమే ఉపయోగించండి. ► అన్ని సోషల్ మీడియా, మెసెంజర్, ఇ– మెయిల్ అప్లికేషన్ ల కోసం ప్రైవసీ సెట్టింగ్స్‌ను సెట్ చేయండి. ► సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో (ఆర్థిక, లాగిన్ ఆధారాలు, సంస్థ, వ్యక్తిగత సమాచారం... వంటి) సెన్సిటివ్ సమాచారాన్ని పంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ► నిజమైన, తెలిసిన వ్యక్తులతో మాత్రమే కనెక్ట్ అవ్వండి. ప్రత్యామ్నాయంగా, గోప్యతా సెట్టింగ్‌లను ఉపయోగించి మీరు మీ ప్రొ ఫైల్‌లను లాక్ చేయడాన్ని ఎంచుకోవచ్చు. ► ఆఫ్‌లైన్, ఆన్ లైన్ పరస్పర చర్యలలో సమ్మతిని ఒకే విధంగా పరిగణించాలి. ► మీ వెబ్‌క్యామ్‌ను ఎప్పుడూ ప్లగ్ ఇన్ చేసి ఉంచవద్దు. ► యాంటీ–వైరస్, యాంటీ–మాల్వేర్ సాఫ్ట్వేర్లతో మీ స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లను సురక్షితం చేయండి. ► ఇది సురక్షితమైన నెట్వర్క్ అని మీరు నిర్ధారించుకునే వరకు పబ్లిక్ వై ఫైని ఎప్పుడూ యాక్సెస్ చేయవద్దు. ► ప్రసిద్ధ మూలాధారాల నుండి మాత్రమే యాప్‌లను డౌన్ లోడ్ చేయండి (ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ వంటివి). సైబర్ టాక్ ఆన్లైన్లో మహిళా భద్రతకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చే సైట్స్.. https://securityinabox.org/en/ https://exposingtheinvisible.org/resources/# filter=.watching-out-yourself https://ssd.eff.org/ https://hackblossom.org/cybersecurity/ https://www.accessn మీరు సైబర్ క్రైమ్‌కు గురైతే జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ https://www.cybercrime.gov.in/ కు లాగిన్ చేసి, ఫిర్యాదును ఫైల్ చేయండి. నేషనల్ టోల్ ఫ్రీ నంబర్ 1930 కి ఫోన్ చేసి, సహాయంపొందవచ్చు. - ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
మహిళా భద్రతకు షీ టీం భరోసా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మహిళలకు భద్రమైన వాతావరణం కల్పించేందుకు 2014లో ఏర్పాటైన మహిళా భద్రతా విభాగం (షీ టీం) ఈ ఏడాది కూడా ఆసాంతం అతివల సమస్యలపై సత్వరమే స్పందించింది. 2022లో మొత్తం 6,157 ఫిర్యాదులు అందుకొని అందులో 521 ఎఫ్ఐఆర్లు నమోదు చేయడంతోపాటు మరో 1,206 పెట్టి కేసులు నమోదు చేసి 1,842 మందికి కౌన్సెలింగ్ ఇచ్చింది. మరోవైపు గృహహింస బాధితులకు భద్రత, భరోసా కల్పించేందుకు ధైర్య అనే యాప్‌ను ప్రత్యేకంగా రూపొందించి దీన్ని డయల్ 100, అన్ని మహిళా పోలీసు స్టేషన్లకు అనుసంధానించింది. ఎన్ఆర్ఐ భర్తల మోసాలకు సంబంధించి 85 ఫిర్యాదులు స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టింది. సైబర్ నేరాలపై స్కూలు విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు, రాష్ట్రవ్యాప్తంగా 250 మహిళా హెల్ప్ డెస్క్‌ల ఏర్పాటుకు తోడ్పాటు అందించింది. ఈ మేరకు షీ టీం వార్షిక నివేదికను బుధవారం విడుదల చేసింది. -
మహిళల భద్రతకు పెద్దపీట
సాక్షి, అమరావతి: రైల్వేస్టేషన్లు, వాటి పరిసర ప్రాంతాల్లో మహిళలు, బాలికల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు ఏపీ మహిళా కమిషన్‌కు దక్షిణ మధ్య రైల్వే పోలీసు శాఖ నివేదించింది. మంగళగిరిలోని ఏపీ మహిళా కమిషన్ రాష్ట్ర కార్యాలయంలో చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మను దక్షిణ మధ్య రైల్వే డీఐజీ రమేష్ చంద్ర, గుంటూరు రైల్వే డివిజన్ ఏడీఆర్ఎం ఆర్.శ్రీనివాసులు, డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ కె.హరప్రసాద్ సోమవారం కలిశారు. ఇటీవల పల్నాడు, బాపట్ల జిల్లాల్లో గురజాల, రేపల్లె రైల్వేస్టేషన్లలో చోటుచేసుకున్న అత్యాచార ఘటనలపై ఏపీ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించిన సంగతి తెల్సిందే. రైల్వే స్టేషన్లలో మహిళా భద్రతపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో స్వయంగా వచ్చి నివేదించాలంటూ రైల్వే పోలీసులకు ఏపీ మహిళా కమిషన్ ఇటీవల నోటీసులు పంపింది. ఈ నేపథ్యంలోనే కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మకు రైల్వే పోలీసు ఉన్నతాధికారులు నివేదిక అందజేశారు. గురజాల రైల్వే హాల్టు, రేపల్లె ఘటనలపై వారు వివరణ ఇచ్చారు. లోకల్ పోలీసు, జీఆర్పీ, రైల్వే పోలీసులు సమన్వయం చేసుకుంటూ రాత్రి, పగలు గస్తీ మరింత పటిష్టంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని పద్మ వారికి సూచించారు. నేరాలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. ప్రయాణికుల రద్దీని బట్టి ఆయా రైల్వేస్టేషన్లలో అవసరమైన సిబ్బందిని కేటాయించాలని సూచించారు. పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా పెట్టి నేరాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. -
ఇకపై నిర్ణయించేది మేమే!
మహిళల కోసం పోరాడాల్సిన అవసరం ఈ ఆధునిక యుగంలో కూడా ఈ స్థాయిలో ఉందా? అపర్ణ ఏర్పాటు చేసిన రెస్పాన్సిబుల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ గురించి తెలిసినప్పుడు ఎదురయ్యే సహజమైన సందేహం ఇది. అయితే మహిళల కోసం పోరాడాల్సిన అవసరం ఆధునిక యుగంలోనే ఎక్కువగా ఉందంటోంది అపర్ణా అచరేకర్. ఇరవై ఏళ్ల సుదీర్ఘ పాత్రికేయ అనుభవం ఆమెకు నేర్పిన వాస్తవం ఇది. మహిళ పట్ల అణచివేత భౌతికంగా తగ్గినట్లు అనిపిస్తుందేమో కానీ మానసికంగా ఎక్కువైందంటోందామె. తమకంటూ ఒక గుర్తింపు, స్వాతంత్య్రం, తమ అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకోగలిగిన సమాజం కోసం ఆమె సోషల్ ఎంటర్ప్రెన్యూర్ అనే కొత్త పాత్రలోకి ఒదిగిపోయారు. ‘ఈవ్ వరల్డ్’ అనే సోషల్ మీడియా వేదికగా ప్రపంచంలోని మహిళలను కలుపుతున్నారు అపర్ణ అచరేకర్. ముంబయికి చెందిన అపర్ణా అచరేకర్ మహిళల కోసం పని చేయాలనే సంకల్పం కలిగిన వెంటనే గత ఏడాది అక్టోబర్ నెలలో ఆచరణలోకి దిగింది. మహిళలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయగలిగిన వేదిక అది. ఒకరు మరొకరిని ప్రభావితం చేసుకోగలిగిన అవకాశం ఈ వేదిక ద్వారా లభిస్తోంది. ‘‘ఐడెంటిటీ, ఇండిపెండెన్స్, ఇన్‌క్లూజన్’ అనే మూడు అంశాల ఆధారంగా నిర్మితమైన ఈ వేదిక ద్వారా మహిళలు తాము కోరుకుంటున్న గుర్తింపుతో పరిచయమవుతారు, ఆ స్థానంలో నిలబడడం కోసం పరస్పర సహకరించుకుంటారు, తమ జీవితాలకు అవసరమైన నిర్ణయాలను స్వతంత్రంగా తీసుకుంటారు. అలాగే మగవాళ్లు నిర్దేశించిన నియమావళిని రూపుమాపడానికి కృషి చేస్తారు. కొత్త నియమావళిని మహిళలే నిర్ణయిస్తారు. మొత్తానికి మహిళలు తమకంటూ ఒక స్పేస్‌ని ఈ వేదిక ద్వారా క్రియేట్ చేసుకోగలుగుతారు’’ అని చెప్తోంది అపర్ణ. అందం కొలతల్లో ఉండదు! ‘‘మన భారతీయ సమాజం మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం మహిళ విషయంలో ఒకేలా వ్యవహరిస్తుంది. ‘ఆడవాళ్లు ఎలా ఉండాలి...’ అనే నియమాలను మగవాళ్లే రూపొందిస్తుంటారు. ఆడవాళ్లు ఏం చేయాలో కూడా మగవాళ్లే నిర్ణయిస్తుంటారు. స్త్రీ దేహం ఏ కొలతల్లో ఇమిడిపోతే అందమో, ఏ కొలతలు మీరితే అందవిహీనమో కూడా వాళ్లే స్థిరీకరించేస్తారు. నిజానికి అందం అనే మాటకు అర్థం, నిర్వచనం చెప్పగలిగిన వాళ్లున్నారా? కొలతల్లో ఇమిడిపోవడమే అందం అనే భావజాలాన్ని మహిళలకు తలకెక్కించడమే పెద్ద కుట్ర. అలాగే మెంటల్ హెల్త్ నుంచి మెన్స్ట్రువల్ టాబూ వరకు మహిళల స్వేచ్ఛను నిరోధించే శక్తిగా ఉంటోంది మగవాళ్ల భావజాలం. వీటికి భిన్నంగా మహిళలు వ్యవహరిస్తే సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు పాల్పడడానికి ఏ మాత్రం సందేహించరు. ‘ఆడవాళ్ల విషయంలో తీర్పులివ్వడానికి మనం ఎవరు?’ అనే ప్రశ్న తమను తాము వేసుకునే మగవాళ్లు ఎందరు? వీటన్నింటికీ చరమగీతం పాడుతూ మహిళలు కొత్త నియమావళిని రూపొందిస్తారు’’ అని ఆశాభావం వ్యక్తం చేసింది అపర్ణ. సోషల్ మీడియా వేదికగా రకరకాల వేధింపులు, సైబర్ బుల్లీయింగ్‌కు గురవుతున్న మహిళలకు తమ భావవ్యక్తీకరణకు ఇది ఒక సురక్షితమైన వేదిక అవుతుంది. ఆడవాళ్లు ఎలా ఉండాలి... ఏం చేయాలో కూడా మగవాళ్లే నిర్ణయిస్తుంటారు. స్త్రీ దేహం ఏ కొలతల్లో ఇమిడిపోతే అందమో, ఏ కొలతలు మీరితే అందవిహీనమో కూడా వాళ్లే స్థిరీకరించేస్తారు. నిజానికి అందం అనే మాటకు అర్థం, నిర్వచనం చెప్పగలిగిన వాళ్లున్నారా? కొలతల్లో ఇమిడిపోవడమే అందం అనే భావజాలాన్ని మహిళలకు తలకెక్కించడమే పెద్ద కుట్ర. -
‘‘మహిళలు కూడా ఉద్యోగాలు చేయవచ్చు’’.. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్స్ కూడా!
గత కొన్ని దశాబ్దాలపాటు ఆంక్షల నడుమ జీవనం సాగించిన సౌదీ అరేబియా మహిళ లు.. యువరాజు మొహమ్మద్ బీన్ సల్మాన్ నిర్ణయాలతో ఇతర దేశాల్లోని మహిళల వలే స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నారు. వివిధ రంగాల్లో ఉద్యోగాల్లో చేరుతూ తమ సత్తాను నిరూపించుకుంటున్నారు. 2018 వరకు ఆంక్షల్లో ఉన్న... మహిళల డ్రైవింగ్, మగతోడు లేకుండా ఒంటరిగా బయటకు వెళ్లడం, ఒంటరి ప్రయాణాలకు అవకాశం కల్పించడం, ఆర్మీలో చేరడానికి ఒప్పుకోవడం వంటి సంచలనాత్మక నిర్ణయాలతో అక్కడి మహిళలు సంకెళ్ల నుంచి బయటపడ్డట్టుగా భావిస్తున్నారు. మహిళా సాధికారతే లక్ష్యంగా అడుగులు వేస్తోన్న సౌదీలో ఇటీవల మక్కా మసీదులో మహిళా భద్రతా సిబ్బందిని కూడా నియమించడం సంచలనం సృష్టించింది. మొన్నటిదాకా ప్రపంచంలోనే మహిళా ఉద్యోగుల శాతం అతి తక్కువగా ఉన్న సౌదీలో.. ప్రస్తుతం ఉద్యోగాలకోసం మహిళలు వేలల్లో పోటీ పడుతున్నారు. ‘‘మహిళలు కూడా ఉద్యోగాలు చేయవచ్చు’’ అంటూ నిబంధనలు సడలించడంతో వివిధ రంగాల్లో పనిచేసేందుకు అక్కడి మహిళలు అవకాశాల కోసం తీవ్రంగా వెతుకుతున్నారు. తాజాగా బుల్లెట్ ట్రైన్స్ నడపడానికి మహిళా డ్రైవర్ల కోసం నోటిఫికేషన్ ఇవ్వగా.. దాదాపు 30 వేలమంది పోటీపడ్డారు. ఈ ఏడాది జనవరి మొదట్లో సౌదీ రైల్వే పాలిటెక్నిక్ ప్రాజెక్ట్‌లో భాగంగా మహిళలు రైళ్లు నడిపేందుకు ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. సౌదీలో అత్యంత పవిత్ర నగరాలైన మక్కా, మదీనా మధ్య రైలు సేవలు అందించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఇందులో భాగంగా ఈ ప్రాజెక్టును నిర్వహిస్తోన్న స్పానిష్ సంస్థ మహిళా ట్రైన్ డ్రైవర్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ ప్రకటనతో సౌదీ మహిళల నుంచి దరఖాస్తులు వెల్లువలా వచ్చిపడ్డాయి. 30 ఖాళీలకుగానూ 28 వేల దరఖాస్తులు వచ్చాయి. దీనిలో ఎంపికైన అభ్యర్థులకు ఏడాదిపాటు వేతనంతో కూడిన శిక్షణను ఇస్తారు. తరువాత మక్కా నుంచి మదీనా వరకు నడిచే హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ లను నడుపుతారు. కొన్నేళ్లుగా అనేక పరిమితులు, ఆంక్షలతో ఇటువంటి అవకాశం, నోటిఫికేషన్ రావడం ఇదే మొదటిసారి కావడంతో వేలాదిమంది మహిళలు ట్రైన్ డైవర్లు అయ్యేందుకు పోటీ పడ్డారు. యువరాజు మొహమ్మద్ బీన్ సల్మాన్ .. మహిళల అభ్యున్నతి, సాధికారతకు తీసుకుంటున్న నిర్ణయాలతో.. సౌదీలో కూడా ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన ఐదేళ్లల్లో మహిళా ఉద్యోగుల సంఖ్య రెట్టింపు అయ్యిందని పలు నివేదికలు చెబుతున్నాయి. ప్రైవేటు సెక్టార్లలో కూడా మహిళా ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. హోటల్స్, ఫుడ్ ఇండస్ట్రీస్‌లో మహిళా ఉద్యోగుల సంఖ్యలో నలభై శాతం పెరుగుదల ఉండగా, ఉత్పాదక రంగంలో 14 శాతం, నిర్మాణ రంగంలో 9 శాతం వృద్ధి నమోదైంది. సౌదీ మహిళలకు ఇప్పటిదాకా టీచర్లుగా, హెల్త్ వర్కర్లుగా మాత్రమే పనిచేసే అవకాశం ఉంది. మిగతా రంగాల్లో మగవాళ్లకు మాత్రమే అనుమతి ఉండడంతో వారి ఉద్యోగపరిధి అక్కడితోనే ఆగిపోయింది. ఇప్పుడు ఈ ట్రైన్ డ్రైవర్ల నియామక స్ఫూర్తితో సౌదీలో మహిళల సారథ్యంలో రైళ్లు మరింత వేగంగా ముందుకు దూసుకుపోతాయని ఆకాంక్షిద్దాం. -
మహిళా రక్షణ మాతోనే సాధ్యం
సహరన్పూర్: ఉత్తరప్రదేశ్‌లో ఏ ముస్లిం మహిళా అణచివేతకు గురికాకూడదనే ఆదిత్యనాథ్ ప్రభుత్వం కోరుకుంటోందని, కేంద్రం త్రిపుల్ తలాక్ చట్టం చేయడంలో యూపీ సీఎం యోగీ పాత్ర కీలకమని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. యూపీలో మహిళలకు రక్షణ కావాలన్నా, నేరస్థులు జైళ్లలో ఉండాలన్నా... బీజేపీ అధికారంలో ఉండాలని స్పష్టం చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత మొట్టమొదటి సారి యూపీలో ప్రత్యక్ష ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సహరన్‌పూర్‌లో ఏర్పాటు చేసిన బీజేపీ ర్యాలీనుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. 2013లో జరిగిన ముజఫర్‌నగర్ అల్లర్లు ఒక కళంకం అయితే, 2014లో జరిగిన సహరన్పూర్ మత కల్లోహాలు మరింత భయంగొల్పాయని, వాటికి కారణమైన వాళ్లకు 2017లోనే ఇక్కడి ప్రజలు గుణపాఠం చెప్పారని కితాబిచ్చారు. పేద ప్రజలు రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం పొందాలన్నా, చిన్న రైతులకు కిసాన్యోజన నిధులు రావాలన్నా, ఉచిత రేషన్ అందాలన్నా, టీకా ఉచితంగా అందాలన్నా, పక్కా ఇళ్లు ఇవ్వాలన్నా అది కేవలం బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమని, అది యూపీ ప్రజలు గుర్తించారని తెలిపారు. ఇదివరకు ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా బీజేపీ ప్రభుత్వం చెరుకు రైతులకు మద్దతు ధర ఇచ్చిందన్నారు. బిపిన్‌రావత్ కటౌట్ వాడుకుంటున్నారు... ఉత్తరాఖండ్‌లోని శ్రీనగర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలోనూ ప్రధాని పాల్గొని ప్రసంగించారు. దివంగత జనరల్ బిపిన్ రావత్ బతికుండగా నిందించిన కాంగ్రెస్, ఇప్పుడు ఎన్నికల్లో ఓట్లకోసం ఆయన కటౌట్‌ను ఉపయోగించుకుంటోందని ఎద్దేవా చేశారు. పాకిస్తాన్ టెర్రరిస్టు స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు, ఢిల్లీలో ఉండి రుజువులు కావాలని అడిగిన ఘనత కాంగ్రెస్ పార్టీదని విమర్శించారు. సాయుధ దళాలపై విద్వేషం వెల్లగక్కిన నేతలు ఇప్పుడు వారి చిత్రాలను ఉపయోగించుకోవడం హాస్యాస్పదమన్నారు. బిపిన్‌రావత్ జ్ఞాపకాలను కొనియాడిన మోదీ ఉద్వేగానికి లోనయ్యారు. నెహ్రూ వల్లే గోవా విముక్తి ఆలస్యం పండిట్ జనవహర్‌లాల్ నెహ్రూ పట్టుబడితే... 1947లో కొన్ని గంటల్లోనే గోవా, పోర్చుగీసు నుంచి విముక్తమయ్యేదని, కానీ ఆయన నిర్లక్ష్యం వల్లే 15ఏళ్ల కాలం పట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మపుసలో ఏర్పాటు చేసిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్‌పార్టీ గోవాను శత్రువులా చూస్తోందని, భవిష్యత్‌లోనూ అదే తీరు కొనసాగుతుందని జోస్యం చెప్పారు. గోవా యువత ఏం కోరుకుంటోంది? ఇక్కడి రాజకీయ సంస్కృతి ఏమిటన్నది కాంగ్రెస్‌కు ఎప్పటికీ అర్థం కాదన్నారు. -
వుమెన్ సేఫ్టీ.. గొప్పగా ‘చెప్పు’కోవచ్చు!
తాడులా కనిపించేది ఎప్పుడు పామై కాటేస్తుందో తెలియదు. వెలుగులా గోచరించేది ఎప్పుడు చీకటై ముంచేస్తుందో తెలియదు... అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి అంటారు. ఇందుకు ప్రత్యేకంగా వనరులు సమకూర్చుకోకపోయినా నిత్యజీవితంలో మనం ఉపయోగించే వస్తువులతోనే ‘మహిళల భద్రత’ కు అవసరమైన సాంకేతిక దన్ను అందిస్తుంది శాస్త్రీయజ్ఞానం. వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విఐటి, తమిళనాడు)కు చెందిన పరిశోధకులు మహిళలకు రక్షణ ఇచ్చే పాదరక్షలకు రూపకల్పన చేశారు. ‘మహిళా భద్రతకు ఎన్నో చట్టాలు ఉన్నా, ఎక్కడో ఒకచోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మేము రూపొందించే పాదరక్షలు ఎంతో భద్రతను ఇస్తాయి’ అంటున్నారు ప్రాజెక్ట్ మేకర్స్. తమకు తాముగా జాగ్రత్తపడేలా, విపత్కరమైన పరిస్థితులలో రక్షణ పొందేలా చేసే ఈ స్మార్ట్ పాదరక్షలు ఆత్మరక్షణ ఆయుధాలుగా ఉపయోగపడతాయి. ఎటాకర్స్పై ప్రతిదాడి చేసే అవకాశం వీటిలో ఉంది. జీపిఎస్, జీఎస్ఎం మాడ్యూల్‌ను ఉపయోగించి ఈ పాదరక్షలను డిజైన్ చేశారు. ‘షూ’లలో జీపిఎస్, జీఎస్ఎం మాడ్యుల్ మినియేచర్ వెర్షన్ చిప్‌లను అమర్చుతారు. ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఎమర్జెన్సీ–కాంటాక్ట్‌ల కోసం ‘షూ’ను గట్టిగా నొక్కితే సరిపోతుంది. ఎటాకర్‌కు షాక్ ఇవ్వవచ్చు. ‘ఎటాకర్’ను గుర్తించే వీడియో లైవ్ స్ట్రీమింగ్ సాంకేతికత కూడా వీటికి ఉండడం మరో విశేషం. తాజా విషయానికి వస్తే... హిమాచల్‌ప్రదేశ్, సొలాన్ జిల్లాలోని జైపీ యూనివర్శిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (జెయుఐటీ)కి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు సరన్ష్ రోహిల్లా, సాంధిత్య యాదవ్‌లు మహిళలకు రక్షణ ఇచ్చే ‘స్మార్ట్’ షూస్‌ను అభివృద్ధిపరిచారు. ఇవి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ‘కాంటాక్ట్స్’ను అప్రమత్తం చేస్తాయి. లొకేషన్ గురించి తెలియజేస్తాయి. ‘డిజైన్ అండ్ ఎనాలసిస్ ఆఫ్ స్మార్ట్షూ ఫర్ వుమెన్ సేఫ్టీ’ పేరుతో పేపర్ సమర్పించారు. ‘మహిళల భద్రతకు సాంకేతిక జ్ఞానాన్ని విరివిగా వాడుకోవాల్సిన సమయం ఇది. ఇందులో మాది ఒక అడుగు’ అంటున్నారు సరన్ష్,సాంధిత్య. -
బాలికపై అత్యాచారయత్నం
కాణిపాకం (యాదమరి): బాలికపై అత్యాచారయత్నం చేసిన వృద్ధుడిని.. దిశ యాప్ ద్వారా సమచారం అందుకున్న పోలీసులు మూడు నిమిషాల్లో అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన గురువారం రాత్రి చిత్తూరు జిల్లా కాణిపాకం మండలంలో జరిగింది. కాణిపాకం ఎస్ఐ రమేష్‌బాబు కథన మేరకు.. మండలంలోని చిగరపల్లె దళితవాడలో గురువారం రాత్రి 8.30 గంటల సమయంలో ఇంటిముందు వీధిలో ఆడుకుంటున్న బాలిక (9)కు అదే ప్రాంతానికి చెందిన కేశవులు (55) మాయమాటలు చెప్పి పక్కనున్న చీకటి ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేయబోయాడు. బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వెళ్లగా కేశవులు పారిపోయాడు. తర్వాత స్థానిక మహిళలు దిశ యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాణిపాకం పోలీసులు మూడు నిమిషాల్లో గ్రామానికి చేరుకుని వృద్ధుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేశవులుపై కేసు నమోదు చేసినట్టు ఎస్.ఐ. చెప్పారు. -
‘దిశ’తో మహిళల్లో ఆత్మస్థైర్యం
సాక్షి, అమరావతి: దిశ బిల్లు, దిశ యాప్ వల్ల మహిళల్లో చైతన్యం పెరిగిందని.. మహిళల భద్రత, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక చర్యలను చూసి ఓర్వలేక టీడీపీ నేత నారా లోకేశ్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత మండిపడ్డారు. మహిళలను అవమాన పరిచే రీతిలో పార్టీ మహిళా నేతల సమక్షంలో ‘దిశ’ప్రతులను తగలబెట్టడం లోకేశ్ అజ్ఞానానికి నిదర్శనమన్నారు. బుధవారం సచివాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. దిశ బిల్లు చట్ట రూపం దాల్చడంలో జాప్యం జరుగుతున్నా, మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించిందన్నారు. దిశ యాప్ ద్వారా మహిళలు, యువతులపై దాడులను ముందుగానే అడ్డుకుని రక్షణ కల్పిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ ‘దిశ’ను అమలు చేసేందుకు అధ్యయనం చేస్తున్నాయన్నారు. మహిళల రక్షణకు ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన దిశ బిల్లును శాసనసభ, శాసన మండలి ఆమోదంతోనే కేంద్ర ప్రభుత్వానికి పంపామని మంత్రి స్పష్టం చేశారు. శాసన మండలి సభ్యుడిగా బిల్లు గురించి లోకేశ్ అవగాహన లేకుండా మాట్లాడటం సిగ్గు చేటన్నారు. ప్రస్తుతం బిల్లు చట్టంగా మారే క్రమంలో కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉందన్నారు. దీనిపై లోకేష్ కేంద్రానికి లేఖ ఎందుకు రాయలేదని ఆమె ప్రశ్నించారు. పరిహారంపై అవహేళన దారుణం గతంలో ఎన్నడూ లేని విధంగా వైద్యం, ఇతర సహాయాల నిమిత్తం బాధిత మహిళ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తోందని మంత్రి వనిత చెప్పారు. దీనిపై లోకేశ్ హేళనగా మాట్లాడటం దారుణం అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క బాధితురాలికీ న్యాయం జరగలేదన్నారు. ప్రభుత్వ చర్యల వల్లే బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేస్తున్నారని ఆమె స్పష్టం చేశారు. -
మహిళల భద్రత కోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చాం: హోంమంత్రి సుచరిత
సాక్షి, గుంటూరు: మహిళల భద్రత కోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చామని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. దిశా చట్టం రాష్ట్రపతి అనుమతి పొందే సమయానికల్లా చట్టాన్ని అమలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మరోవైపు కొంతమంది దిశ పోలీస్ స్టేషన్ల వద్ద ఆందోళన చేస్తున్నారని, అలా దిశ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాలు చేయడం బాధాకరమని అసహనం వ్యక్తం చేశారు. అనేక మంది మహిళలు ఇప్పటికే దిశ యాప్ ద్వారా రక్షణ పొందుతున్నారని గుర్తు చేశారు. గతం ప్రభుత్వంలో మహిళా తహశీల్దార్ పై ఎమ్మెల్యే దాడి చేసిన పట్టించుకోలేదని, మరి ఇప్పడు అదే టీడీపీ శ్రేణులు దిశ చట్టాన్ని అవహేళన చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ చట్టం ద్వారా ఏడు రోజుల్లోనే ఛార్జ్ షీట్ వేస్తున్నారని, ఇప్పటికీ ఆ విధంగా 1500 కేసుల్లో 7రోజుల్లో ఛార్జిషీటు వేశామన్నారు. మహిళా రక్షణ కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని వ్యాఖ్యానించారు. దిశ చట్టాన్ని రాజకీయ లబ్ది కోసం వాడుకోవద్దని, ఏదైనా ఘటన జరగగానే దాన్ని మానవతా దృక్పథంతో చూడకుండా కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. చదవండి: Child Marriages: ప్రతి 100 మంది ఆడపిల్లల్లో 30 మందికి ఈ వయస్సులోపే పెళ్లిళ్లు -
దిశ యాప్‌పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం: హోంమంత్రి సుచరిత
సాక్షి, తాడేపల్లి: మహిళల భద్రత కోసం మరింత పకడ్బందీగా వ్యవహరించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించినట్లు రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. మహిళల భద్రతపై సీఎం జగన్ అత్యున్నత స్థాయి సమావేశం అనంతరం సుచరిత మీడియాతో మాట్లాడారు. దిశ యాప్ వినియోగంపై స్పెషల్ డ్రైవ్ పెట్టాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. ప్రతి ఇంటిలోని మహిళలకు ఈ యాప్ పై అవగాహన వచ్చేలా చర్యలు చేపట్టాలని కోరారు. దీనిలో వలంటీర్లు, మహిళా పోలీసులను వినియోగించుకోవాలని సూచించారు. కాలేజీలు, స్కూళ్లు తెరిచిన తర్వాత విద్యార్థినులకు దిశా యాప్ పై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు. పెట్రోలింగ్ వాహనాలను, సీసీ కెమెరాలను అవసరమైన చోట పెంచాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. సీతానగరం ఘటనలో అనుమానితులను గుర్తించామని... త్వరలోనే మీడియా ముందు ప్రవేశపెడతామని తెలిపారు. నిర్మానుష్యప్రాంతంలో జరగడంతో అనుమానితులను గుర్తించడం కష్టంగా మారింది. అయినా బాధితురాలి సహకారంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు. చదవండి: మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: సీఎం జగన్ -
మగువా.. బతుకు భద్రత తగదా?
సాక్షి, అమరావతి: ఆకాశంలో సగం, అవకాశాల్లో సమం అంటున్నా బతుకు భద్రతకు సంబంధించిన బీమా పాలసీలు చేయించడంలో మహిళల శాతం నానాటికీ తగ్గుముఖం పట్టినట్టు ఐఆర్డీఏఐ ఇటీవలి వార్షిక నివేదికను బట్టి తేలింది. గత రెండేళ్లలోనే మహిళా పాలసీదారుల శాతం గణనీయంగా తగ్గింది. 2018–19లో 36 శాతంగా ఉన్న మహిళల ఇన్సూరెన్స్ పాలసీలు 2019–20 నాటికి 32 శాతానికి తగ్గడం గమనార్హం. పాలసీలు తీసుకుంటున్నప్పటికీ వాటి కొనసాగింపు పెద్ద సమస్యగా తయారైంది. తొలి ఏడాది ప్రీమియం చెల్లిస్తున్నా ఆ తర్వాత చెల్లింపుల్లో తరుగుదల కనిపిస్తున్నట్టు 2019–20 నివేదికలో ఐఆర్డీఏఐ పేర్కొంది. 2019–20లో మొత్తం 2.88 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను విక్రయించారు. వాటి మొత్తం విలువ రూ.1.02 లక్షల కోట్లు. మొత్తం పాలసీల్లో మహిళల వాటా కేవలం 93 లక్షలుగా ఉంది. ఈ పాలసీల మొత్తం విలువ రూ.34,737 కోట్లు. మహిళా పాలసీలు తగ్గడానికి కారణాలు ఏమిటన్న దానిపై బీమా రంగ నిపుణులు దృష్టి సారించారు. పాలసీలు తీసుకునే వారిలో ఎక్కువ మంది ఉద్యోగాలు చేసేవారే. అయితే ఇటీవలి కాలంలో మహిళా ఉద్యోగులు జీవిత బీమా కన్నా ఆరోగ్య బీమా, ఇతర పథకాలలో పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారన్నది నిపుణుల అంచనా. ఫలితంగా ఈ సంఖ్య తగ్గుతున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో మహిళా శ్రామికులు, ఉద్యోగుల సంఖ్య తగ్గుతోంది. 2019కి ముందు 30 శాతంగా ఉన్న మహిళా శ్రామిక శక్తి ఇప్పుడు 21 శాతానికి తగ్గింది. ఏపీలో పర్వాలేదు : 93 లక్షల మహిళల జీవిత బీమా పాలసీల్లో మూడో వంతు మూడు రాష్ట్రాలు.. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్‌లో ఉండగా.. ఆ తర్వాతి స్థానాలలో కేరళ, ఆంధ్రప్రదేశ్, మిజోరం, పుదుచ్చేరి, తమిళనాడు ఉన్నాయి. చివరి ఐదు స్థానాలలో డామన్డయ్యూ, దాద్రానగర్ హవేలీ, లడక్, హరియాణా, గుజరాత్, జమ్మూ కాశ్మీర్ ఉన్నాయి. మొత్తం పాలసీల్లో ఏపీ వాటా గణనీయంగా ఉంది. -
మహిళల భద్రత మా బాధ్యత
తిరుపతి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: మహిళల భద్రత తమ బాధ్యతని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ‘దిశ’తో మహిళలకు సత్వర న్యాయం జరుగుతోందని చెప్పారు. ఏపీ పోలీస్ డ్యూటీ మీట్లో భాగంగా ‘మహిళల భద్రత’ ప్రధాన అంశంగా బుధవారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ దువ్వూరి జమునతో మహిళా భద్రతకు సంబంధించి అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకున్నారు. డీజీపీ సవాంగ్ మాట్లాడుతూ.. మహిళలపై జరుగుతున్న నేరాలను నిరోధించడంలో ఈ ఒప్పందం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. మహిళల భద్రతకు సీఎం వైఎస్ జగన్ అనేక చర్యలు చేపడుతున్నారని వివరించారు. ముఖ్యమంత్రి చొరవ వల్లే ఆరేళ్లుగా నిర్వహించలేకపోయిన ఏపీ పోలీస్ డ్యూటీ మీట్‌ను ఇప్పుడు విజయవంతంగా జరుపుకుంటున్నామన్నారు. మహిళలకు సత్వర న్యాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం దిశ బిల్లును ఆమోదించిందని గుర్తు చేశారు. గతంలో మహిళలపై జరిగిన నేరాల్లో 200 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేస్తే.. ఇప్పుడు చాలా తక్కువ రోజుల్లోనే చార్జిషీటు కూడా వేయగలుగుతున్నామన్నారు. దిశ పోలీస్స్టేషన్లు తదితర చర్యల ద్వారా మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. కాగా, రామతీర్థం ఘటనపై పలు ఆధారాలు లభించాయని డీజీపీ చెప్పారు. నిందితులను త్వరగా పట్టుకుంటామన్నారు. విగ్రహాలను ధ్వంసం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ తమకు స్పష్టమైన ఆదేశాలిచ్చారని తెలిపారు. ఇప్పటికే పలువురు దుండగులను అరెస్టు చేసినట్టు చెప్పారు. వీటి వెనుక ఏమైనా కుట్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఆర్ అనురాధ, దిశ ప్రత్యేక అధికారి దీపికా పాటిల్, పోలీస్ వెల్ఫేర్ అదనపు డీజీ శ్రీధర్‌రావు, సీఐడీ ఎస్పీ జీఆర్ రాధిక తదితరులు మాట్లాడారు. వెల్డన్ ఫాదర్.. శభాష్ డాటర్ ‘వెల్డన్ ఫాదర్.. శభాష్ డాటర్’ అంటూ డీఎస్పీ జెస్సీ ప్రశాంతి, సీఐ శ్యామ్‌సుందర్‌ను డీజీపీ సవాంగ్ అభినందించారు. వారిద్దరికీ ప్రజలు, ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. తాజాగా తిరుపతిలో జరుగుతున్న పోలీసు డ్యూటీ మీట్లో తండ్రీ, కూతురును డీజీపీ అభినందించారు. యాక్సిస్ బ్యాంక్ ప్రతినిధుల ఆధ్వర్యంలో వారిద్దరికీ డీజీపీ ఆత్మీయ సన్మానం చేశారు. సీఐ శ్యామ్‌సుందర్ మాట్లాడుతూ.. తన కుమార్తెతో కలిసి విధులు నిర్వర్తిస్తానని ఎప్పుడూ ఊహించలేదని చెప్పారు. ప్రజలకు సేవ చేసే పోలీసు శాఖను ఆమె ఎంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. పోలీసు విభాగంలో చేరేలా కుమార్తెలను కూడా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. -
రేప్ కేసుల విచారణ 2నెలల్లో..
న్యూఢిల్లీ: అత్యాచార కేసుల్లో చట్ట ప్రకారం రెండు నెలల్లోపు విచారణ పూర్తి చేసి, చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మహిళలపై నానాటికీ పెరిగిపోతున్న దారుణాలు, హాథ్రస్ ఘటన నేపథ్యంలో మహిళల భద్రతపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ ఈమేరకు కొత్త మార్గదర్శకాలను జారీచేసింది. మేజిస్ట్రేట్ ఎదుట బాధితురాలి మరణ వాంగ్మూలం రికార్డు చేయలేదన్న నెపంతో, మరణవాంగ్మూలాన్ని విస్మరించరాదని కేంద్రం తన మార్గదర్శకాల్లో తేల్చి చెప్పింది. సీఆర్పీసీ ప్రకారం నేరం జరిగిన వెంటనే తప్పకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని స్పష్టం చేసింది. ఈ విషయాల్లో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బాధితులకు న్యాయం జరగదని, కనుక పోలీసులు నేరం జరిగినట్టు ఫిర్యాదు అందిన తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంది. ఒకవేళ నేరం జరిగిన ప్రాంతం సదరు పోలీస్ స్టేషన్ పరిధిలోనికి రాకపోయినప్పటికీ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంది. పోలీసులకు చట్టాలను గురించి అనేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఒకవేళ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, వాటిని విచారించి, సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపించిన మార్గదర్శకాల్లో కేంద్ర హోంశాఖ పేర్కొంది. సీఆర్పీసీ సెక్షన్ 173 అత్యాచారం కేసుల్లో విచారణ రెండు నెలల్లో ముగించాలని చెపుతోందని, సీఆర్పీసీ సెక్షన్ 164–ఎ ప్రకారం అత్యాచారానికి గురైన బాధితురాలిని ఫిర్యాదు అందిన 24 గంటల్లోపు గుర్తింపు కలిగిన వైద్యులచే పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని హోం శాఖ తెలిపింది. సాక్ష్యాల చట్టం–1872 ప్రకారం, చనిపోయిన వ్యక్తి మరణానికి ముందు రాతపూర్వకంగా గానీ, నోటి మాట ద్వారాగానీ ఇచ్చిన వాంగ్మూలాన్ని నిజమని నమ్మితీరాలని, విచారణలో అది తొలిసాక్ష్యమని చెపుతోంది. లైంగిక దాడి సాక్ష్యాల సేకరణ (ఎస్ఏఈసీ) కిట్లను వాడేందుకు పోలీసులకు, ప్రాసిక్యూటర్లకు, వైద్య సిబ్బందికి శిక్షణనిస్తున్నట్టు హోం శాఖ తెలిపింది. విచారణను ఎప్పటికప్పుడు ఇన్వెస్టిగేషన్ ట్రాకింగ్ సిస్టం ఫర్ సెక్సువల్ అఫెన్సెస్ (ఐటీఎస్ఎస్ఓ) ఆన్లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలంది. పదే పదే అత్యాచారాలకు పాల్పడేవారిని గుర్తించడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, జాతీయ స్థాయిలోని డేటాబేస్‌ని వాడుకోవాలని తెలిపింది. అత్యాచార నేరాలను విచారించేందుకు కేంద్రం, కఠినమైన చట్టాలను తీసుకొచ్చినట్లు పేర్కొంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధిత అధికారులకు మార్గదర్శకాలు ఇవ్వాలని, నిర్ణీత కాల వ్యవధిలో చార్జ్‌షీట్ దాఖలయ్యేలా చూడాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. -
ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం
సాక్షి, అమరావతి: తమది మహిళా పక్షపాత ప్రభుత్వమని.. రాష్ట్ర చరిత్రలో మహిళలకు ఇంత ప్రాధాన్యతనిచ్చిన ప్రభుత్వంలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మహిళలపై సైబర్ నేరాల నిరోధానికి చర్యలు తీసుకోవడంతో పాటు వేధింపులను ఎలా ఎదుర్కోవాలనే దానిపై అవగాహన కల్పిచేందుకు రాఖీ పండుగను పురస్కరించుకుని సోమవారం తన క్యాంపు కార్యాలయంలో మహిళల రక్షణ కోసం ఈ–రక్షాబంధన్ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఎమన్నారంటే.. ► రాఖీ పండుగ సందర్భంగా రెండు కార్యక్రమాలు మొదలుపెట్టాం. ► ఉదయం వైఎస్సార్ చేయూత, ఆసరా కార్యక్రమాలకు సంబంధించి హిందుస్థాన్ యునిలీవర్, ప్రోక్టర్ అండ్ గాంబిల్, ఐటీసీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. ► ఇంతకుముందు అమూల్‌తో ఒప్పందం చేసుకున్నాం. ► అర్హత పొందిన మహిళలకు నాలుగేళ్లపాటు తోడ్పాటు అందుతుంది. ► ఈ పెద్ద పెద్ద కంపెనీల భాగస్వామ్యంతో వారికి స్థిరమైన ఆదాయం లభించేలా కార్యక్రమాలు చేపడుతున్నాం. ► ఇందుకు ఏడాదికి దాదాపు రూ.11వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. రాఖీ పండుగ రోజున మరో కార్యక్రమం చేపడుతున్నాం.. ► 4s4u.ap.police.gov.in అనే పోర్టల్‌ను ప్రారంభిస్తున్నాం. ► రాబోయే నెలరోజులపాటు ఈ వెబ్ చానల్లో వివిధ నిపుణులతో మహిళలకు అవగాహన కల్పిస్తారు. ► ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్‌ఫోన్ ఉంది కాబట్టి దానివల్ల మంచి ఏంటి? చెడు ఏంటి? నష్టాలేంటి? వేధింపులను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై అవగాహన కలిగిస్తారు. ► సైబర్, వైట్‌కాలర్ నేరాలు.. తదితర అంశాలనూ వివరిస్తారు. ► ఏయే యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఏ యాప్‌లవల్ల ఇబ్బందులు వస్తాయన్న వాటి గురించి కూడా చెబుతారు. ► నేరం జరిగినప్పుడు ఎక్కడ? ఎలా? ఫిర్యాదు చేయాలో తెలియజేస్తారు. దిశ యాప్, పోలీస్స్టేషన్లు.. ► దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడం, దిశ కాల్ సెంటర్‌కు ఫోన్ చేయడం, సైబర్‌మిత్ర వాట్సాప్ నంబర్ల ద్వారా సహాయం పొందవచ్చు. ► ఇవికాక దిశ పోలీస్స్టేషన్లు కూడా ఉన్నాయి. వీటిలో ఎక్కడైనా ఫిర్యాదు చేయవచ్చు. వెంటనే చర్య తీసుకుంటారు. ► 18 దిశ పోలీస్స్టేషన్లు, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను కూడా పెట్టాం. ► దిశ చట్టం కోసం రాష్ట్ర ప్రభుత్వపరంగా చేయాల్సినవి చేశాం. రాష్ట్రపతి ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాం. ► రాష్ట్ర చరిత్రలో మహిళలకు ఇంత ప్రాధాన్యతనిచ్చిన ప్రభుత్వంలేదు. ► ఇప్పటికే వారికి 50శాతం రిజర్వేషన్లు.. అమ్మ ఒడి, వసతి దీవెన ఇస్తున్నాం. ఈనెల 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజున వారి పేరు మీద ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాం. ► హోంమంత్రి పదవి కూడా మహిళకు ఇచ్చాం. ప్రతి గ్రామంలో మహిళా పోలీసులను పెట్టాం. ► మద్యాన్ని కూడా నియంత్రించాం. ► 4ఎస్4యూ పోర్టల్ ద్వారా కూడా వారికి మంచి జరుగుతుంది. ఇది మరో చరిత్రాత్మక ఘట్టం. హోంమంత్రి సుచరిత, డీజీపీ సవాంగ్, సీఐడీ అడిషనల్ డీజీ సునీల్‌కుమార్, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యే రజని, మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపాటి అమ్మాజీ పాల్గొన్నారు. -
ఎన్నారై భర్తలు వేధిస్తే సమాచారమివ్వండి
సాక్షి, హైదరాబాద్: ఎన్నారై భర్తలు వేధిస్తున్నారని కుమిలిపోవద్దని.. ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా బాధిత మహిళలు ఎన్నారై సెల్‌ను సంప్రదించవచ్చని విమెన్ సేఫ్టీ వింగ్ చీఫ్, ఏడీజీ స్వాతి లక్రా చెప్పారు. బాధిత మహిళలకు తమ వంతుగా చట్టపరమైన సహాయం అందజేస్తామని స్పష్టం చేశారు. మంగళవారం ఎన్నారై భర్తల వేధింపులు–గృహహింసపై పరిష్కారం చూపేందుకు విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం నిర్వహించిన వర్చువల్ వర్క్‌షాప్‌నకు అపూర్వ స్పందన వచ్చింది. ఈ వెబినార్‌లో 80 మందికిపైగా ఫిర్యాదుదారులు/బాధితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏడీజీ స్వాతి లక్రా మాట్లాడుతూ.. గతేడాది సెప్టెంబర్ 17న విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఎన్నారై సెల్‌కు అద్భుతంగా పనిచేస్తుందన్నారు. లాక్‌డౌన్‌లోనూ ఎన్ఆర్ఐ సెల్ వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించారు. ఎన్నారై భర్తల వల్ల వేధింపులు, గృహహింస ఎదుర్కొంటున్న మహిళలకు పలు న్యాయ సాయమందిస్తూ పరిష్కారాలు చూపిస్తున్నామని తెలిపారు. బాధితులు ఏ దేశంలో ఉన్నా నిరాశ చెందకుండా.. ఎన్ఆర్ఐ సెల్‌ను ఆశ్రయించవచ్చన్నారు. డీఐజీ బడుగుల సుమతి మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఎన్నారై సెల్‌కు 101 ఫిర్యాదులు రాగా అందులో ఆరుగురి పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకున్నామన్నారు. 8 కేసుల్లో లుక్ అవుట్ నోటీసులు జారీ చేశామని, ఏడుగురి పాస్‌పోర్టులు కోర్టుకు సమర్పించామని, 44 కేసుల్లో నిందితులను భారత్‌కు రప్పించేలా ఒత్తిడి చేసేందుకు వారు పనిచేసే కంపెనీలకు లేఖలు రాశామని వివరించారు. యూకేలోని వెన్ ఎన్జీవోకు చెందిన గీతా మోర్ల, చికాగో నుంచి చాందిని మాట్లాడుతూ.. ఎన్నారై భర్తల విషయంలో వేధింపులు ఎదు ర్కొంటున్న బాధితులకు చట్టపరంగా సాయం అందజేస్తామని ముందుకొచ్చారు. -
నిర్భయమే సాహసం
రామ్‌సింగ్ బస్ డ్రైవర్. ముఖేశ్‌సింగ్.. రామ్‌సింగ్ తమ్ముడు. వినయ్ శర్మ జిమ్ ఇన్స్ట్రక్టర్. పవన్ గుప్తా పండ్ల వ్యాపారి. ఇవన్నీ 2012 డిసెంబర్ 15 ముందు వరకు. ఆ ఏడాది డిసెంబర్ 16వ తేదీ నుంచి వీళ్లందరి గుర్తింపు ఒక్కటే.. నిర్భయ అత్యాచార నిందితులు. ఆనాటి నిర్భయ ఘటనతో ఉలిక్కి పడింది భారతదేశంలో ఉన్న వాళ్లు మాత్రమే కాదు. అదే రోజు అమెరికాలో ‘డెల్టా ఉమెన్’ అవార్డు అందుకున్న కీర్తి జయకుమార్ కూడా. కీర్తి ఉలికిపాటు అక్కడితో ఆగిపోలేదు. ‘రెడ్ ఎలిఫెంట్ ఫౌండేషన్’ ఆవిర్భావానికి దారి తీసింది. నిర్భయ ఘటన తన జీవితం మరింత బాధ్యతాయుతమైన మలుపు తీసుకోవడానికి కారణమైందని చెప్తారు కీర్తి జయకుమార్. ‘‘యు.ఎస్.లో అవార్డు అందుకున్న ఆ రోజు రాత్రి నాకు నిద్రపట్టలేదు. ఇండియాలో నా వయసే ఉన్న ఒక యువతి అత్యంత పాశవికంగా లైంగిక దాడికి గురైంది! యునైటెడ్ నేషన్స్ సహకారంతో నేను ప్రపంచదేశాల మహిళల హక్కుల కోసం గళం విప్పాను. అంతర్జాతీయంగా మహిళ ఎదుర్కొంటున్న వివక్ష మీద పోరాడడానికి కార్పొరేట్ లాయర్‌గా ఉద్యోగాన్ని వదిలి గొప్పపని చేశానని కూడా అనుకుంటూ ఉన్నాను! నా పాదాల కింద పెరుగుతున్న కలుపు మొక్కలను ఏరిపారేయకుండా, లైంగిక వివక్షకు గురవుతున్న ఆడపిల్లలకు అండగా నిలబడకుండా ఎక్కడో పని చేయడం ఏమిటి అని ఆలోచించాను. అందుకే తను నివసిస్తున్న చెన్నై నగరంలోని స్కూళ్ల నుంచి, జెండర్ సెన్సిటివిటీ, సేఫ్ టచ్– అన్ సేఫ్ టచ్ అనే అంశాలతోపాటు పిల్లలు మంచి పౌరులుగా ఎదగడానికి నా వంతు ప్రయత్నం చేయాలని నిశ్చయించుకున్నాను’’ అన్నారు కీర్తి. నిర్భయ పోరాటం గడాఫీ హయాంలో లిబియా అత్యాచారానికి గురైన మహిళలు, సిరియాలో రసాయనిక దాడులకు గురైన వాళ్లు, ఐసిస్ నుంచి బయటపడిన యాజ్ది తెగ మహిళలు, పారిపోయి వచ్చిన కాశ్మీరీ పండిట్లు, ఆఫ్ఘన్ శరణార్థులు తిరిగి తమ జీవితాలను నిలబెట్టుకోవడానికి పడిన శ్రమను, వారి జీవన పోరాటాన్ని కథలుగా సమాజంలో వివిధ వర్గాల వారికి, మన మహిళల్లో సమస్యలతో పోరాడే ధైర్యాన్ని నింపుతున్నారు కీర్తి. నిర్భయ ఘటన అనంతరం ఆరు నెలల పాటు సాగిన మధనం తర్వాత రెడ్ ఎలిఫెంట్ ఫౌండేషన్ ప్రారంభించారు కీర్తి. తమ జీవితాన్ని తమకు నచ్చినట్లు జీవించే హక్కు మగవాళ్లకు ఎంతగా ఉందో ఆడవాళ్లకు కూడా అంతే హక్కు ఉందని తెలియచేస్తూ స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, ఉద్యోగ ప్రదేశాలు, నివాస ప్రదేశాల్లో సదస్సులు నిర్వహిస్తున్నాను. ఇప్పటికి 120 వర్క్‌షాప్‌ల ద్వారా 3,500 మంది మహిళలు, బాలల్ని చైతన్యవంతం చేశారు కీర్తి. ‘సాహస్’ నెట్ వర్క్ 2016, మే నెల 15వ తేదీ. కీర్తి ఉదయం నిద్రలేచేటప్పటికి మొబైల్ ఫోన్లో 16 మిస్డ్ కాల్స్, 31 వాట్సాప్ మెసేజ్‌లు. అవన్నీ ఒకే నంబర్ నుంచి వచ్చినవే! ఐరోపాలోని ఒక స్నేహితురాలి నుంచి సహాయం కోరుతూ వచ్చిన ఫోన్ కాల్స్, మెసేజ్‌లూ అవన్నీ. ఆమెను ఆమె భర్త రోజూ హింసిస్తున్నాడు. ఉదయం తాను బయటకు వెళ్లేటప్పుడు గదిలో పెట్టి తలుపు వేసి వెళ్లేవాడు. ఓ రోజు అర్జెంటు పని మీద హడావుడిగా వెళ్తూ ఎప్పటిలాగ ఆమె గదికి తాళం వేయడం మర్చిపోయాడు. ఆ రోజు ఆమె భర్త తిరిగి వచ్చే లోపు సహాయం కోసం తెలిసిన వాళ్లందరికీ ఇంట్లో ఉన్న స్పేర్ ఫోన్ నుంచి కాల్స్ చేసింది, మెసేజ్‌లు పెట్టింది. ఆ తర్వాత ఆ సిమ్ కార్డ్‌ని ముక్కలు చేసి పారేసింది. పెళ్లికి ముందు ఆమె ఎప్పుడూ ఇండియా దాటి బయటి దేశానికి వెళ్లనే లేదు. అప్పుడు తానున్న దేశంలో చట్టాల గురించి ఆమెను ఏ మాత్రం అవగాహన లేదు. ఆ స్థితిలో ఆమెకు తన సమీపంలో ఉన్న ఫ్రెండ్ ఆదుకుని, బంధువుల ఇంటికి చేర్చింది. ‘‘తర్వాత మా రెడ్ ఎలిఫెంట్ ఫౌండేషన్ పెద్ద ఎక్సర్‌సైజ్‌నే చేసింది. మహిళల కోసం పని చేసే ఐదు వేల సంస్థలను ‘సాహస్’ అనే వెబ్ యాప్‌తో అనుసంధానం చేశాం. ఆ సంస్థలు 197 దేశాలలో విస్తరించి ఉన్నాయి. ఇప్పుడు నలభైవేల సంస్థలు మా ‘సాహస్’ యాప్ నెట్వర్క్ పరిధిలోకి వచ్చాయి. మొత్తం ఎనిమిది భాషల్లో సమాచారం చేరవేయడం జరుగుతోంది. ఇప్పటి వరకు ఎనిమిది వేల మంది జీవితాలు ఒడ్డుకు చేరాయి. వైద్యసేవలు, న్యాయ సహాయం, కౌన్సెలింగ్ సహకారం, తలదాచుకోవడానికి హోమ్‌లు, విద్య– ఉపాధి అవకాశాల కల్పన వంటి సేవలు అందిస్తున్నాం. చేసింది, చేస్తున్నది చెప్పుకుంటే పూర్తయ్యే ఉద్యమం కాదిది. కొన్ని తరాల పాటు అవిశ్రాంతంగా సాగించాల్సిన మహోద్యమం’’ అని ముగించారు కీర్తి. – మంజీర శక్తినిచ్చిన డైరీ ‘ద డైరీ ఆఫ్ యాన్ ఫ్రాంక్’ పుస్తకం కీర్తి జయకుమార్‌లో నిశ్శబ్దంగా శక్తిని నింపింది. చెన్నైలోని ‘స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ లా’లో న్యాయశాస్త్రం చదివారు కీర్తి. కోస్టారికాలోని ‘యూనివర్సిటీ ఆఫ్ పీస్’ నుంచి శాంతి, సంఘర్షణ, జెండర్ స్టడీస్ చదివారు. విద్యార్థి దశలో ఆమె హ్యూమనేటేరియన్ ‘లా’, మానవ హక్కుల చట్టం, పాలసీల ఉల్లంఘన వంటి అంశాల మీద పేపర్లు సమర్పించారు. అమెరికాకు చెందిన ‘డెల్టా ఉమెన్’ ఎన్జీవోతో పనిచేశారు కీర్తి. ఆ అవార్డు అందుకున్న రోజే నిర్భయ ఘటన జరిగింది. కీర్తి యూఎస్ ప్రెసిడెంట్ సర్వీస్ మెడల్, యూఎన్ ఆన్లైన్ వాలంటీర్ ఆఫ్ ది అవార్డులు కూడా అందుకున్నారు. -
న్యూస్ రక్షా గన్ధన్
వారణాసికి చెందిన శ్యామ్ చౌరాసియా.. మహిళల కోసం గన్లు తయారు చేశారు! బుల్లెట్ సైజులో ఉండే లిప్‌స్టిక్‌లో కూడా ఆ గన్లను అమర్చవచ్చు. అంతేకాదు.. పర్సులో, షూస్‌లో కూడా అవి ఇమిడిపోతాయి. మహిళలు తమకు ప్రమాదం ఎదురవుతోందని గ్రహించిన వెంటనే వీటికి అమర్చిన బటన్‌ను నొక్కాలి. తక్షణం గన్ బయటికొస్తుంది. మొబైల్ ఫోన్ మర్చిపోయి బయటికెళ్లినా సరే... లిప్స్టిక్కున్న బటన్ నొక్కగానే బ్లూ టూత్‌తో అనుసంధానం అయి ఉన్న ఫోన్ నుంచి ఎమర్జెన్సీ కాల్ పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. పోలీసులు వచ్చేలోపు ఆ లిప్‌స్టిక్‌తోనే ఫైర్ చేసి సమస్యను చుట్టుపక్కల వారి దృష్టికి తీసుకెళ్లి సహాయం కోరవచ్చు.శ్యామ్ వారణాసిలోని అశోకా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్లో ఉద్యోగి. అతడు రూపొందించిన ఈ గన్ పర్సు, గన్ లిప్‌స్టిక్, గన్ షూస్ అందరిలోనూ ఆసక్తిని కలగుజేస్తున్నాయి. ‘‘మహిళల మీద లైంగిక దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి రక్షణసాధనాల అవసరం చాలా ఉంది’’ అన్నారు వీటిని పరిశీలించిన ప్రియాంక శర్మ అనే మహిళ. వార్తల్లో తరచు మహిళల మీద జరిగిన అత్యాచారాలే కనిపిస్తుండడంతో మనసు కదిలిపోతుండేదని, మహిళలు తమను తాము రక్షించుకోవడానికి ఏదైనా సాధనం చేతిలో ఉంటే బాగుంటుందన్న ఆలోచనతో వీటిని తయారు చేశానని శ్యామ్ చెబుతున్నారు. ‘‘భారతీయ మహిళలకు మాత్రమే కాదు, వీటి అవసరం అన్ని దేశాల్లోనూ ఉంది’’ అని కూడా ఆయన అన్నారు. ఈ గన్ పర్సులు, గన్ లిప్‌స్టిక్‌లు, గన్ షూస్ మార్కెట్లోకి రావడానికి ఇంకా సమయం పట్టవచ్చు. ప్రస్తుతం శ్యామ్ చౌరాసియా వీటికి పేటెంట్ పొందే పనిలో ఉన్నారు. -
ఏపీలో నేరాల సంఖ్య తగ్గింది
-
నేరాలు 6% తగ్గాయి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆరు శాతం నేరాలు తగ్గాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు రాష్ట్ర పోలీసులకు జాతీయ స్థాయి గుర్తింపును తీసుకొచ్చాయని చెప్పారు. మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆదివారం ‘2019 వార్షిక నేర నివేదిక’ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా డీజీపీ సవాంగ్.. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు, శాంతిభద్రతల ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్‌లతో కలిసి మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా గత ఆరు నెలల్లో రాష్ట్ర పోలీస్ శాఖలో వినూత్న కార్యక్రమాలను చేపట్టడంతో అనేక రాష్ట్రాలు మనరాష్ట్రం వైపు చూస్తున్నాయన్నారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో పోలీసుల సంక్షేమానికి అనేక చర్యలు చేపట్టామని, పోలీసులతోపాటు హోంగార్డులకు కూడా బీమా వర్తింపజేశామని చెప్పారు. మహిళల భద్రత కోసం దిశ చట్టం, పోలీసుల సంక్షేమం కోసం వీక్లీఆఫ్, బాధితులకు న్యాయం చేసేలా ‘స్పందన’, జీరో ఎఫ్ఐఆర్ మొదట మన రాష్ట్రంలోనే అమల్లోకి తెచ్చామన్నారు. రాష్ట్ర పోలీసులకు తొమ్మిది విభాగాల్లో స్కోచ్ అవార్డులు, డీఎస్‌సీఐ, జీఫైల్స్ వంటి జాతీయ అవార్డులు వచ్చాయన్నారు. ప్రధాని మోదీ మొదలుకొని పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రముఖుల నుంచి అభినందనలు అందుకోవడం గర్వకారణమన్నారు. నేరాల సంఖ్య తగ్గింది రాష్ట్రంలో 2018లో 1,19,541 కేసులు నమోదు కాగా, 2019లో 1,12,697 (వీటిలో 5,080 కేసులు ఎన్నికల సమయంలో నమోదు చేసినవే) కేసులు నమోదయ్యాయని డీజీపీ సవాంగ్ చెప్పారు. ఈ ఏడాది హత్యలు, అత్యాచారాలు వంటి ప్రధాన నేరాలు గణనీయంగా తగ్గాయన్నారు. ఎన్నికల వల్ల కేసుల నమోదు ఎక్కువైందని.. లేదంటే నేరాలు పది శాతం వరకు తగ్గేవన్నారు. మావోయిస్టుల కార్యకలాపాలు కేవలం రెండు జిల్లాలు (విశాఖ, తూర్పు)కే పరిమితమయ్యాయని తెలిపారు. మద్యం బెల్ట్ షాపులు, గుట్కా, అక్రమంగా ఇసుక తరలింపు, గంజాయిలపై ఉక్కుపాదం మోపామన్నారు. సామాన్యులపై ప్రభావం చూపుతున్న జూదం, పేకాట క్లబ్‌లను మూసివేశామని వెల్లడించారు. ఆపరేషన్ ముస్కాన్‌తో 5,739 మంది బాలబాలికలను గుర్తించి వారిలో 5,208 మందిని తల్లిదండ్రుల వద్దకు చేర్చామన్నారు. ‘ట్వంటీ ట్వంటీ(2020) ఉమెన్ సేఫ్టీ’ అనే నినాదంతో పనిచేయాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చే ఏడాది మహిళల భద్రతపై మరింత దృష్టి సారిస్తామన్నారు. దిశ యాప్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. దిశ ఘటన నేపథ్యంలో డిసెంబర్లో జీరో ఎఫ్ఐఆర్ కింద 49 కేసులు నమోదు చేశామన్నారు. -
మహిళలను అవమానిస్తారా..?
సాక్షి, అమరావతి: మహిళల జోలికి వచ్చే మానవ మృగాళ్ల భరతం పట్టడానికి తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చట్టం తేవడానికి నడుం కడితే ఉల్లి సాకుతో సభను అడ్డుకుంటారా? అని నగరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. స్త్రీ మూర్తిని గౌరవించాల్సింది పోయి అవమానిస్తారా? అంటూ నిప్పులు చెరిగారు. ఆడపిల్లకు కష్టంవస్తే.. గన్ వచ్చేలోగా జగన్ వచ్చి శిక్షిస్తాడన్న ఒక నమ్మకం కావాలన్నారు. రాష్ట్రంలో మహిళల భద్రతపై సోమవారం అసెంబ్లీలో జరిగిన స్వల్ప వ్యవధి చర్చలో ఆమె మాట్లాడారు. స్పీకర్ పోడియం ఎదుట నిలబడి ఉల్లిపై ముందు చర్చ జరగాలంటూ పట్టుబట్టి గందరగోళం సృష్టించిన టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒక దశలో ఆమె ‘మీరసలు మనుషులేనా? మాతృమూర్తులను గౌరవించకపోగా ఉల్లితో పోటీపెట్టి అవమానిస్తారా? అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా?’.. అంటూ ఘాటుగా విమర్శించారు. అంతేకాక..లోకేష్‌కు పప్పులో ఉల్లిలేదని చంద్రబాబు బాధపడుతున్నారా? అని ఆమె ఎద్దేవా చేశారు. కాల్‌మనీ సెక్స్ రాకెట్, లోకేశ్ ఫొటోలు, బాలకృష్ణ వ్యాఖ్యలపై ఎక్కడ మాట్లాడుతారోనన్న భయమా? అని ఆమె ప్రశ్నించారు. బాబుకు ఆడపిల్లలు లేరు కాబట్టి ఆ బాధ ఏంటో ఆయనకు తెలియదన్నారు. కోడలు మగబిడ్డను కంటే అత్త వద్దంటుందా? అని ఒకసారి.. ఆడవారి పుట్టుకపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన ఈరోజు మహిళల భద్రతపై మాట్లాడేందుకు అవకాశం లేకుండా కూడా అడ్డుపడుతున్నారని ఆమె విమర్శించారు. ఈ దశలో అధికార పార్టీ మహిళా ఎమ్మెల్యేలు సభ మధ్యలోకి వెళ్లి తమకు న్యాయం చేయాలని, తమ భద్రతపై చర్చ జరుగుతుంటే ఇదేం అల్లరని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ అంటే ఆడవాళ్ల ప్రదేశ్‌గా మారాలి అని రోజా అన్నారు. ఇదే సందర్భంలో మానవ హక్కుల సంఘం తీరునూ ఆమె దుయ్యబట్టారు. గుట్టురట్టవుతుందనే ఉల్లి నాటకం? రజని మహిళా భద్రతపై అసెంబ్లీలో చర్చ జరిగితే గత ఐదేళ్లలో మీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు చేసిన అకృత్యాలు బయటపడతాయని ఉల్లి నాటకం ఆడుతున్నారా? అని గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విడదల రజని విపక్ష నేత చంద్రబాబును ప్రశ్నించారు. మహిళల భద్రతపై వారికి చిత్తశుద్ధి లేకపోవడంవల్లే ప్రజలు టీడీపీని 23 సీట్లకు పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. తొలినుంచీ చంద్రబాబు ఇంతే.. : ఉషశ్రీ చర్చలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే కేవీ ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ.. నేరాల తగ్గింపునకు మద్యపాన నిషేధాన్ని దశల వారీగా అమలుచేస్తున్న తమ ముఖ్యమంత్రి మహిళల సంక్షేమానికి అనేక చర్యలు చేపట్టారని తెలిపారు. చంద్రబాబు తీరు తొలి నుంచీ ఇలాగే ఉందని, మహిళలకు రిజర్వేషన్ల బిల్లు పెట్టినప్పుడు ఎలా గందరగోళం సృష్టించారో ఇప్పుడు మహిళా భద్రతపై జరుగుతున్న చర్చలోనూ అదే తీరును ప్రదర్శింస్తున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ రియల్ హీరో : ధనలక్ష్మీ తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి కూడా చర్చలో పాల్గొంటూ.. మహిళలకు భద్రత కల్పిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి నిజమైన హీరో అని అభివర్ణించారు. పవన్‌కళ్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. ఆడపిల్లలకు స్వీయరక్షణపై తర్ఫీదునివ్వాలని ఆమె కోరారు. -
21రోజుల్లో మరణ శిక్ష
నాక్కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ ఇద్దరూ ఆడపిల్లలే. నాకూ చెల్లెలు ఉంది. భార్య ఉంది. వాళ్లకు ఏదైనా జరిగితే నేను ఎలా స్పందించాలి? అఘాయిత్యాలకు పాల్పడిన వారికి ఏరకమైన శిక్షపడితే బాధిత మహిళకు, ఆ కుటుంబానికి ఉపశమనం కలుగుతుందని మనమంతా ఆలోచించాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి : మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే మరణ శిక్ష పడుతుందనే భయం రావాలని, అప్పుడే వ్యవస్థలో మార్పు వస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అసెంబ్లీలో సోమవారం మహిళలు, చిన్నారుల భద్రతపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. రెడ్ హ్యాండెడ్‌గా ఆధారాలు ఉంటే 21 పనిదినాల్లో ఉరి శిక్ష పడేలా మహిళలు, చిన్నారుల భద్రతపై బుధవారం శాసనసభలో విప్లవాత్మక బిల్లు తీసుకొస్తున్నామని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ‘దిశ’ లాంటి ఘటనల్లో ఎలా స్పందించాలి? ‘మహిళలు, చిన్నారులపై జరుగుతున్న ఘటనలు నన్ను తీవ్రంగా కలచివేశాయి. ఈ పరిస్థితులను మార్చాలని తపన పడుతూ.. ప్రస్తుతం ఉన్న చట్టంలో అవసరమైన మార్పులు చేయడానికి సూచనలు, సలహాలు అడుగుతున్నా. హైదరాబాద్‌లో దిశ ఘటన పట్ల సమాజం అంతా సిగ్గుతో తలవంచుకోవాలి. 26 ఏళ్ల మహిళా డాక్టర్‌ను టోల్ గేట్‌కు సమీపంలో రేప్ చేసి, కాల్చేసిన ఘటన మనకళ్ల ముందు కనిపిస్తోంది. ఈ ఘటన జరిగినప్పడు రాజకీయ నాయకులు ఎలా స్పందించాలి? పోలీసులు ఎలా స్పందించాలి? అని ఆలోచించినప్పుడు చాలా బాధ అనిపించింది. మన రాష్ట్రంలోనే ఇలాంటి ఘటన జరిగితే మన పోలీసులు ఎలా స్పందించాలి? మనం ఎలా స్పందించాలన్న దానిపై మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. దిశ ఘటన టీవీల్లో చూసినప్పుడు, విన్నప్పుడు, ఆ తల్లిదండ్రులు పడుతున్న బాధను చూసిన తర్వాత అందుకు బాధ్యులైన వారిని ఎన్కౌంటర్ చేసినా తప్పులేదని అందరం అనుకున్నాం. మన చట్టాల్లో మార్పు రావాల్సిందే ‘దిశ’ ఘటనలో తప్పు జరిగిందని మీడియా విస్తృతంగా చూపించింది. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. హేట్సాఫ్ టు కేసీఆర్, తెలంగాణ పోలీసు ఆఫీసర్స్.. అని ఈ చట్టసభ సాక్షిగా చెబుతున్నాం. సినిమాల్లో హీరో ఏదైనా ఎన్కౌంటర్ చేస్తే.. అందరం చప్పట్లు కొడతాం. సినిమా బాగుందని చెబుతాం. కానీ నిజ జీవితంలో దమ్మున్న వాళ్లు ఎవరైనా చేస్తే.. జాతీయ మానవ హక్కుల సంఘం పేరుతో ఢిల్లీ నుంచి వస్తారు. ఇది తప్పు.. ఇలా జరక్కూడదు.. ఇలా ఎందుకు చేశారు? అని నిలదీసిన పరిస్థితులు ఇప్పుడు చూస్తున్నాం. ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో మన చట్టాలు ఉన్నాయి. నిర్భయ ఘటనలో ఏడేళ్లయినా శిక్ష లేదు ఢిల్లీలో ఒక ఘటన జరిగితే.. ఇలాంటి ఘటన మున్ముందు జరగకూడదని నిర్భయ చట్టాన్ని తీసుకు వచ్చాం. ఇలాంటి ఘటనలు జరిగిన వెంటనే శిక్షలు పడాలని కోరుకున్నాం. 4 నెలల్లో తీర్పు నివ్వాలి, 4 నెలల్లో శిక్ష వేయాలని ఈ చట్టం చెబుతోంది. కానీ ఏడేళ్లయినా నిర్భయ దోషులకు ఇప్పటికీ శిక్ష పడలేదు. ఏదైనా ఘటన జరిగిన వెంటనే ఉపశమనం కలిగేలా చట్టం రావాలని తల్లిదండ్రులు, ప్రతి మహిళ, చెల్లి, ప్రతి ఇంట్లోని ఆడపల్లి ఎదురు చూస్తోంది. ఈ దిశగానే మన రాష్ట్రం కూడా ఆలోచిస్తోంది. ఏదైనా తప్పు జరిగితే స్పందించే ధోరణి మారాలి. దీనికోసం చట్టాలు మరింత గట్టిగా బలపడాలి. ఒక నేరం జరిగినప్పుడు, రెడ్ హ్యాండెడ్‌గా నిర్ధారించే ఆధారాలు ఉన్నప్పుడు.. దిశలాంటి కేసుల్లో నేరాన్ని నిర్ధారించే ఆధారాలు కనిపిస్తున్నప్పుడు, అటువంటి వ్యక్తులను ఏం చేయాలన్నదానిపై మనం చట్ట సభలో ఆలోచించాలి. ఇలాంటి ఘటనలు జరిగితే కొన్ని దేశాల్లో అయితే దోషులు కనిపిస్తే కాల్చేస్తారు. మన దేశంలో చట్టాలను సవరించి, అంగీకార యోగ్యమైన పద్ధతిలో బలమైన చట్టాలను తీసుకురావాలి. వారంలో విచారణ పూర్తి కావాలి మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరిగినప్పుడు అలాంటి కేసులు వారం రోజుల్లోపు విచారణ పూర్తి కావాలి. ఆ తర్వాత డీఎన్ఎ రిపోర్టుల్లాంటివి పూర్తి కావాలి. మూడు వారాలు అంటే 21 పని రోజుల్లో దోషులకు ఉరిశిక్షపడే పరిస్థితి రావాలి. మరణ శిక్ష ఉంటుందనే భయం ఉంటేనే తప్ప వ్యవస్థలో మార్పులు రావు. ఈ దిశగా అడుగులు వేసే క్రమంలో, మహిళలపై నేరాలకు సంబంధించి ప్రతి జిల్లాలోనూ ఒక ప్రత్యేక కోర్టును పెట్టాల్సి ఉంటుంది. సోషల్ మీడియాను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. పక్షపాత ధోరణితో వేరే వ్యక్తుల మీద బురద చల్లడానికి మనస్సాక్షి అనేది లేకుండా దిగజారిపోయారు. సోషల్ మీడియాలో మహిళలను రక్షించే ప్రయత్నం చేయాలి. మహిళల గురించి నెగెటివ్‌గా ఎవరైనా పోస్టింగ్ చేస్తే శిక్ష పడుతుందనే భయం ఉండాలి. అది ఉంటే తప్ప ఇలాంటివి ఆగిపోవు. ఆ దిశగా కూడా చట్టాల్లో మార్పులు తీసుకు రావాలని అడుగులు వేస్తున్నాం. 354 (ఇ)ని తీసుకొచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం ఇప్పటికే జీరో ఎఫ్ఐఆర్ను తీసుకొచ్చింది. ఏదైనా ఘటన చోటుచేసుకున్నప్పుడు ఎక్కడైనా సరే కేసు నమోదు చేస్తున్నాం. అందుకే పర్మిట్ రూమ్‌లను రద్దు చేశాం మనిషి మద్యం తాగినప్పుడు ఇంగితం కోల్పోతాడు. ఇలాంటి వారు మరో నలుగురు కలిస్తే ఆలోచనలు మారతాయి. రాక్షసులు అవుతారు. ఇది జరగకూడదనే ఉద్దేశంతోనే పర్మిట్ రూములు అన్నింటినీ రద్దు చేశాం. 43 వేల బెల్ట్ షాపులను రద్దు చేశామని గర్వంగా చెబుతున్నాం. స్మార్ట్ ఫోన్ల కారణంగా పోర్నోగ్రఫీ కూడా విపరీతంగా ప్రభావం చూపిస్తోంది. ఎన్ని నిషేధాలు ఉన్నా దీన్ని కట్టడి చేయలేని పరిస్థితి. పోర్నోసైట్లను బ్లాక్ చేసినా ఇవి కనిపిస్తున్నాయి. వీటన్నింటిపైనా ఈ బుధవారం ఈ అసెంబ్లీలో విప్లవాత్మక బిల్లును తీసుకొస్తాం. చట్టం రూపకల్పనకు సలహాలు అడిగితే విమర్శలా? మహిళల భద్రత కోసం తీసుకొచ్చే చట్టానికి సంబంధించి సలహాలు, సూచనలు ఇవ్వాలని చంద్రబాబును అడిగితే ఈ ప్రభుత్వం తప్పు చేస్తోంది.. శాంతిభద్రతలు లేకుండా పోయాయని విమర్శలు చేస్తున్నారు. సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిపోయి వేలెత్తి చూపడానికి ప్రయత్నిస్తున్నారు. మా ప్రభుత్వం వచ్చి కేవలం ఆరు నెలలు మాత్రమే అయ్యింది. చంద్రబాబు పాలనలో మహిళలపై జరిగిన నేరాలను ఒకసారి చూద్దాం. ఆయన చేసిన విమర్శలకు ప్రతి విమర్శలే ఈ లెక్కలు. ప్రభుత్వం తీసుకొచ్చే చట్టాన్ని సమర్థిస్తాం : చంద్రబాబు మహళలు, చిన్నారుల భద్రతకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చే చట్టాన్ని సమర్థిస్తామని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు పేర్కొన్నారు. ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి తక్షణం శిక్ష పడితే భయం ఉంటుందన్నారు. చట్టానికి సంబంధించి సలహాలు ఇస్తామని చెప్పారు. ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని ప్రభుత్వం ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. -
మహిళలకు భద్రత కరువు : భట్టి విక్రమార్క
సాక్షి, ఆసిఫాబాద్ : రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. గతనెల 24న కుమురంభీం జిల్లా లింగాపూర్ మండలం ఎల్లాపటార్ శివారులో దళిత మహిళ సమతపై అత్యాచారం, హత్య చేసిన ప్రదేశాన్ని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు తదితరులతోకలసి ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో దుర్మార్గ పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్‌లో పడుకుని పాలన చేస్తున్నారని విమర్శించారు. ప్రతిరోజు సచివాలయానికి వచ్చి ప్రజా పరిపాలనపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. విచ్ఛలవిడిగా మద్యం అమ్మకాల వల్లే మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని తెలిపారు. ఎల్లాపటార్‌లో దళిత మహిళపై అత్యాచార, హత్య ఘటనపై గవర్నర్ దృష్టికి తెచ్చామని పేర్కొన్నారు. మహిళలపై దాడులు అరికట్టి, కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మాట్లాడుతూ మహిళలపై ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. భద్రతపై మహిళలకు ప్రభుత్వం ఆత్మవిశ్వాసం కల్పించాలన్నారు. శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన పోలీసులు కేవలం టీఆర్ఎస్ నాయకులకే పని చేస్తున్నారని విమర్శించారు. వారి వెంట మాజీ ఎంపీలు నిఖిల్, రాథోడ్ రమేశ్ తదితరులు ఉన్నారు. -
తూటాలకు వీరతిలకం!
ఆ ‘దుర్మార్గుల’ శరీరాల్లో మొత్తం 11 బుల్లెట్లు దిగ బడ్డాయి. ‘ఆ బుల్లెట్లను దాచుకోవాలని ఉంది. ఆ తుపా కులను ముద్దాడాలని ఉంది’ అంటున్నారు సెలబ్రిటీలు.తనదైన ఒక అందమైన నవజీవితాన్ని అప్పుడప్పుడే నిర్మించుకోవడం మొదలుపెట్టిన ఆ యువ డాక్టర్‌ను అతిదారుణంగా చిదిమేసిన ‘మానవమృగాలు’ పోలీసులపై కూడా తిరగబడ్డాయట. రాళ్లతో దాడి చేశాయట. వారి పిస్తోళ్లను కూడా లాక్కొని కాల్పులు జరిపాయట. గత్యంతరం లేని స్థితిలో పోలీసులు జరిపిన ఎదురుకాల్పులకు హతమైపోయాయి. ఇటువంటి ఎన్కౌంటర్ కథనాలు మనదేశంలో కొత్తకాదు. కొన్నివేల ఎన్కౌంటర్లు జరిగి వుంటాయి. అవన్నీ వేరు. ఈ ఎన్కౌంటర్ వేరు. ఈ వార్త కీచకవధ వార్తలాగా క్షణాల్లో దేశాన్ని చుట్టేసి జనాన్ని ఉత్తేజితం చేసింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పండితులూ, పామరులూ అందరూ ముక్తకంఠంతో శభాష్ అన్నారు. ఈరోజే కదా నిజమైన దీపావళి అని కూడా వ్యాఖ్యానిం చారు. విద్యార్థినులు, యువతులూ డ్రమ్స్ వాయిస్తూ, డ్యాన్సులు చేస్తూ హర్షామోదాలు వ్యక్తం చేశారు. ‘ఊరికి ఒకడే రౌడీ వుండాల. ఆడు పోలీసోడే అయివుండాల’ వగైరా ట్వీట్లు సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి. ‘సింగం.. సింగం..’ అనే ట్యూన్లు న్యూస్ చానెళ్లలో విని పించాయి. చివరికి, సర్వోన్నత చట్టసభైన పార్లమెంట్లో సైతం ఎన్‌కౌంటర్‌కు సమర్థనగా ప్రసంగాలు సాగాయి. అదేమిటి? పోలీసులే తీర్పు చెప్పేసి శిక్షలు వేస్తూ పోతే ఇక న్యాయవ్యవస్థ దేనికి? కోర్టులు – జడ్జీలు ఎందుకు? అంటూ అక్కడక్కడా కొన్ని స్వరాలు వినిపించాయి. బహుశా రోజులు గడిచేకొద్దీ ఈ స్వరాలు ఇంకొంచెం బలం పుంజుకోవచ్చు. కానీ మెజారిటీ ప్రజలు మాత్రం పోలీసు తీర్పు సమర్థించారు.ఇదొక కఠిన వాస్తవం. ఈ కఠిన వాస్తవానికి వెనుక కచ్చితమైన కారణాలు ఉన్నాయి. సంస్థాగతమైన లోపాలతో మన న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థ కునారిల్లుతున్నాయి. పెరుగుతున్న జనాభా, పెరుగుతున్న వివాదాల నేపథ్యంలో న్యాయస్థానాల సంఖ్య, జడ్జీల సంఖ్య పెరిగి ఉండాల్సింది. పెరగకపోగా జడ్జీ పోస్టుల్లో ఎప్పుడూ చాలా భాగం భర్తీ కాకుండా ఖాళీగానే వుంటున్నాయి. దేశంలోని వివిధ కోర్టుల్లో దాదాపు 3 కోట్ల కేసులు పెండింగ్‌లో వున్నాయి. క్రిమినల్ కేసులే రెండు కోట్లు. ఇందులో పదోవంతు కేసులు పదేళ్లకు పైగా పెండింగ్‌లో వున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డుల బ్యూరో (ఎన్సీ ఆర్బీ) లెక్కల ప్రకారం 2017లో 32,500 అత్యా చారం కేసులు నమోదయ్యాయి. అప్పటికే పెండింగ్‌లో వున్న వాటితో కలిపి ఈ సంఖ్య లక్షా 46 వేలకు చేరింది. వాటిలో ఆ సంవత్సరం వివిధ కోర్టుల్లో పరిష్కారమైన రేప్ కేసుల సంఖ్య 18,300 మాత్రమే. అంటే ఏటా పదిశాతం కేసులు పరిష్కారమవుతుంటే 30 శాతం కేసులు పెండింగ్ జాబితాకు అదనంగా తోడవుతున్నాయి. భారతదేశంలో వున్న పెండింగ్ కేసులన్నింటినీ పరిష్కరించాలంటే 70 వేలమంది అదనపు జడ్జీలు అవసరమవుతారని మూడేళ్ల కింద అప్పటి ప్రధాన న్యాయ మూర్తి వ్యాఖ్యానించారు. పోలీసు వ్యవస్థ పరిస్థితి కూడా అదేవిధంగా వున్నది. సాధారణ స్థాయిలో నేరాలు జరిగే దేశాల్లో ప్రతి లక్ష జనాభాకు 225 మంది పోలీసులుం డాలని ఒక లెక్క వుంది. నేరాలు ఎక్కువగా జరిగే భారతదేశంలో మాత్రం లక్షకు 138 మంది పోలీసులు న్నారు. ఈ సంఖ్యలో 25 శాతం పోస్టులు ఎప్పుడూ ఖాళీగానే వుంటాయట. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఉండాల్సిన పోలీసుల సంఖ్యలో సగానికంటే తక్కువమందితో మన పోలీసు వ్యవస్థ నెట్టుకొస్తున్నది. ఇంత పెద్ద దేశంలో ఫోరెన్సిక్ ల్యాబ్‌లు మూడో నాలుగో వున్నాయి. ఫోరెన్సిక్ రిపోర్టు రావాలంటే నెలలపాటు వేచి వుండాల్సిన దుస్థితి. మన మార్చురీల నిర్వహణ ప్రపంచంలో ఎక్కడా లేనంత దారుణంగా వుంది. ఈ కారణాలు కూడా నేర పరిశోధనకు సవాల్ విసురుతు న్నాయి. అనేక కేసుల్లో నేర నిరూపణలో వైఫల్యాలకు ఇవి కూడా కారణాలే. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై వచ్చిన స్పందనను ఈ నేపథ్యంలో అర్థం చేసుకోవాలి. యావత్తు దేశాన్ని కుదిపేసిన నిర్భయ ఉదంతంలో దోషులకు మరణశిక్ష పడి ఏడేళ్లు దాటినా ఇప్పటికీ అమలు జరగలేదు. తొమ్మిదేళ్ల పసి బాలికపై అత్యాచారం కేసులో కింద కోర్టు విధించిన మరణశిక్షను పైకోర్టు యావజ్జీవ శిక్షగా సవరిం చింది. అత్యాచారాలకు, హత్యలకు బలైన బిడ్డల తల్లి దండ్రులు తీరని కడుపుకోత వేదనను అనుభవిస్తుంటే, నేరస్తులు మాత్రం నిర్భయంగా సంచరిస్తున్న ఘటనలు జనంలో న్యాయస్థానాల తీర్పుపై నమ్మకాన్ని సన్నగిల్లేలా చేశాయి. ఇటువంటి పరిస్థితుల్లో దిశ ఉదంతం దేశం దృష్టిని తనవైపు తిప్పుకున్నది. హైదరాబాద్ నగరం శివారు ప్రాంతంలో, దేశంలోనే అతిపెద్ద జాతీయ రహ దారి పక్కన, నిత్యం వేలాది వాహనాలు తిరిగే ఔటర్ రింగ్‌రోడ్డుకు చేరువలో ఒక యువ డాక్టర్‌పై జరిగిన దారుణ ఘటన మీడియాలో విస్తృతంగా ప్రచార మైంది. ‘నాకు భయమేస్తున్నది పాప’ అన్న దిశ గొంతుక ప్రతి గుండెను తాకింది. ప్రభుత్వంపై, పోలీసులపై ఒత్తిడి పెరిగింది. జాతీయ మీడియాలో పూనకాల స్వాములు వేసిన వీరంగం అంతా ఇంతా కాదు. ఒక ఉద్యమ నాయ కుడు, రెండుసార్లు ప్రజల చేత ముఖ్యమంత్రిగా ఎన్నికైన నాయకునిపట్ల కనీస గౌరవం లేకుండా ఆయన మౌనంపై పూనకాల స్వాములు ప్రశ్నల వర్షం కురిపించారు. మౌనా నికి అర్థం మూగ తనం కాదు. పోలీసు భుజంమీద వేలా డుతున్న తుపాకీ కూడా మౌనంగానే వుంటుంది. ట్రిగ్గర్ నొక్కినప్పుడు వచ్చిన శబ్దానికి ప్రపంచమే ఉలిక్కి పడింది. భుజం మాత్రం పోలీసులదే. ఇప్పుడిక్కడ కలవరం కలిగించే మరో అంశం ముందుకొచ్చింది. దిశపై అత్యాచారం జరగడానికి మూడు రోజుల ముందు అసిఫాబాద్ జిల్లాలో ఒక ముప్పయ్యేళ్ల వివాహిత, దళిత యువతిపై కూడా గ్యాంగ్‌రేప్ జరిగింది. పరమ కిరాతకంగా ఆ యువతి చేతివేళ్లను, గొంతునూ కోసి చంపి, అడవిలో శవాన్ని పారేశారు. పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ ఘటనకు మీడియాలో అరకొర ప్రాధాన్యతే లభించింది. దిశ కేసులో చెప్పినట్టు, బాధిత మహిళ పేరు గోప్యంగా ఉంచాలని మీడియాకు ఈ యువతి కేసులో ఏ అధికారి సలహా ఇవ్వలేదు. మా మాన ప్రాణా లకు విలువ లేదా అని ప్రశ్నిస్తూ దళిత సంఘాలు ఆందోళనబాట పడుతున్నాయి. మరొక వైరుధ్యాన్ని కూడా ప్రజలు సోషల్ మీడియాలో ఎత్తిచూపుతున్నారు. దిశ కేసులో నిందితులు నిరుపేదలు. దిశను బలితీసు కున్న పదో రోజున ఆ నిందితులు పోలీస్ ఎన్కౌంటర్లో హతమయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ అత్యాచార ఘటనలో నిందితులు బడాబాబులు. ఘోరం జరిగి సరిగ్గా ఏడాది నిండగానే ఆ బాధితురాలిని బడాబా బులు నడిరోడ్డుపై నిప్పుపెట్టి చంపేశారు. ఇక్కడ నిందితుల ఎన్కౌంటర్ జరిగిన రోజే అక్కడ బాధితు రాలి హత్య జరగడం కేవలం కాకతాళీయమే కావచ్చు. కానీ పోలీసు తూటాలు చెప్పే తీర్పులో ధనిక – పేద వివక్ష ఉండితీరుతుందని ఈ ఘటనలు స్పష్టం చేశాయి. ఎందుకంటే బాధితురాలిపై దాడులు జరుగుతాయని తెలిసినా పోలీసులు ఆమెకు రక్షణ ఇవ్వలేదు. ఎన్కౌంటర్ జరిగిన మరుసటిరోజు తెలుగు టెలివి జన్ చానళ్లలో ఆసక్తికరమైన చర్చలు జరిగాయి. చర్చల్లో పాల్గొన్న విశ్లేషకులతోపాటు ఫోన్ కాలర్స్ సైతం న్యాయవ్యవస్థ వ్యవహారశైలిలోని వైరుధ్యాలను ఎత్తి చూపారు. ఓటుకు కోట్లు కేసులో ఆడియో వీడియో ఆధారాలతో చంద్రబాబునాయుడు దొరికిపోయినా, ఆ కేసును స్వీకరించడానికి న్యాయస్థానాలు నేటివరకు అంగీకరించకపోవడానికి కారణమేమిటని ఒక విశ్లేష కుడు ప్రశ్నించాడు. చంద్రబాబుపై లక్ష్మీపార్వతి దాఖలు చేసిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విచారణపై ఉన్న స్టేను ఎత్తివేయడానికి 14 సంవత్సరాలు పట్టిం దని, ఇక విచారణ జరిగి తీర్పు రావడానికి ఇంకెన్నేళ్లు పడతాయని ఒక కాలర్ ఆవేదనతో ప్రశ్నించాడు. కాంగ్రెస్ పార్టీ – తెలుగుదేశం కలిసి రాజకీయ కక్షతో వై.ఎస్. జగన్మోహన్రెడ్డిపై ఎటువంటి ఆధారాలు లేకుండా సాదాసీదా పిటిషన్ వేస్తే న్యాయస్థానం సీబీఐ విచారణకు ఆదేశించింది. సదరు న్యాయమూర్తికి పదవీ విరమణ అనంతరం మరో ఉన్నత పదవి లభించింది. చంద్రబాబుపై డాక్యుమెంటరీ ఆధారాలతో సహా వైఎస్ విజయమ్మ దాఖలుచేసిన పిటిషన్‌ను అదే న్యాయస్థానం సీబీఐ దగ్గర సిబ్బంది లేరనే సాకుతో తిరస్కరించింది. ఈ వైరుధ్యాలను మరో కాలర్ గుర్తుచేశాడు. న్యాయ వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లుతున్నదనే ఆందోళనకర మైన అంశం ఈ చర్చల్లో ప్రతిఫలించిన కారణంగానే ఇక్కడ ప్రస్తావించవలసి వచ్చింది. ఇటువంటి పరిస్థితి లోనే ఎన్కౌంటర్ రూపంలో దొరికిన సత్వర పరిష్కా రాన్ని ప్రజలు ఆమోదించినట్టు కనిపిస్తున్నది. ఆడపిల్లల మీద అత్యాచార ఘటనలను సంపూ ర్ణంగా అరికట్టాలంటే చేపట్టవలసిన చర్యలు చాలానే ఉన్నాయి. తొలుత న్యాయ – పోలీస్ వ్యవస్థలు ప్రజల విశ్వాసాన్ని చూరగొనగలిగేలా రూపొందించాలి. మారిన అవసరాలకు అనుగుణంగా వాటిని పటిష్టం చేయాలి. నేరస్తులను కఠినంగా శిక్షించేలా చట్టాలను సవరించుకో వాలి. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు అందరూ చెబుతున్నట్టు విచ్చలవిడి మద్యం విక్రయాలపై నియం త్రణ విధించాలి. మొబైల్ ఫోన్లలో అశ్లీల వరద ప్రవహించకుండా చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ ఒక భాగం మాత్రమే. ప్రధానంగా జరగాల్సింది సాంస్కృతిక ప్రక్షాళన. ‘నస్త్రీ స్వాతంత్య్రమర్హతి’ అని చెప్పిన మను ధర్మశాస్త్ర వారసత్వం మన నడవడిలో, మన ఆలోచ నలో, మన అంతరంగాల్లో అంతర్లీనంగా ప్రవహిస్తూనే వున్నది. అభ్యుదయ వాదులమని చెప్పుకునే వాళ్లు కూడా ‘పురుషులు కొంచెం ఎక్కువ సమానం – స్త్రీలు కొంచెం తక్కువ సమానం’ అనే భ్రష్ట సమానత్వ భావనతో వ్యవహరిస్తుంటారు. చిన్నతనం నుంచే మగ పిల్లవాడెక్కువ, ఆడపిల్ల కొంచెం తక్కువ అనే ఆలోచనా ధోరణికి ప్రయత్నపూర్వకంగా వీడ్కోలు చెప్పాలి. ‘నీవలెనే, నావలెనే... నీ అక్కా, నా చెల్లీ’ అనే భావం చిట్టి మెదళ్లలో ఎక్కాలి. అతడు – ఆమె ఈ ప్రపంచానికి సమాన పట్టాదారులని చెప్పాలి. ఆశలు ఇద్దరివీ, ఆశ యాలు ఇద్దరివీ, అవకాశాలు ఇద్దరివీ, ఆకాశం ఇద్దరిదీ, అంతరిక్షం ఇద్దరిదీ, అనంతకోటి నక్షత్రాలు ఇద్దరివీ అనే సమభావం చిన్నవయసులో నాటగలిగితే స్త్రీని భోగ వస్తువుగా చూసే మనస్తత్వం అలవడదు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ కారణంగానే స్త్రీల మీద విచ్చలవిడి అత్యాచారాలు కనిపించవు. ఆ స్థితికి చేరుకోవడం అనేది అత్యున్నత నాగరిక దశ. అప్పటివరకు కనీసం దోషు లకు కఠిన శిక్షలు పడేలా చూడాలి. అందుకు రాజకీయ నాయకత్వానికి స్థిరచిత్తం ఉండాలి. కానీ, దురదృష్టవ శాత్తు స్త్రీలను కించపరిచే ధోరణి మన నాయకత్వంలోనే ఉన్నది. ‘కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దం టుందా’ అని పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రి బహిరంగంగా సామెతను విసరడం మూర్తీభవించిన ఆయన పురుషా ధిక్య భావజాలానికి బండగుర్తు. ఈ అహంభావం వల్లనే మహిళా అధికారిని అవమానించిన ఒక మాజీ ఎమ్మె ల్యేను ఇప్పటికీ చంద్రబాబు తనకు ఆదర్శం అని చెబుతున్నాడు. ఈ అహంభావం వల్లనే నిస్సహాయ మహిళల పరువును దోచేసే ‘కాల్‌మనీ’ ముఠాను పార్టీలో ప్రోత్సహించాడు. ఇటువంటి రాజకీయ నాయక త్వాన్ని ఎండగట్టాలి. అప్పటివరకూ పోలీసులు వెయ్యి అత్యాచారాలకు ఒక ఎన్కౌంటర్ చేస్తారు. అలా చేసిన ప్పుడల్లా ఆడబిడ్డలతోటి ఆ పోలీసుల తుపాకీ గొట్టాలకు రాఖీలను కట్టిద్దాం. వారు పేల్చే తూటాలను ఏరుకొచ్చి వీరతిలకం దిద్దిద్దాం. పోలీసువారికి విన్నపం... మరో సారి ఇటువంటి సందర్భంలో సీన్ రీ–కన్స్ట్రక్షన్ చేయ డానికి వెళ్లినప్పుడు ఇప్పటి మాదిరిగానే బలహీనులైన పోలీసులను తీసుకొని వెళ్లాలి. ఎందుకంటే నిందితులు తిరగబడి పోలీసుల తుపాకులు లాక్కోవాలి కదా. అప్పుడే కదా ఎన్కౌంటర్ జరిగేది. వర్ధెల్లి మురళి muralivardelli@yahoo.co.in -
క్యాబ్‌ల్లో ఎస్‌వోఎస్ బటన్ తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్ : దిశ హత్యాచార ఘటన నేపథ్యంలో మహిళల భద్రతపై పోలీసు విభాగం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా నగర పోలీసులు గురువారం 15 క్యాబ్ నిర్వాహక సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. బషీర్‌బాగ్‌లోని పోలీసు కమిషనరేట్‌లో కొత్వాల్ అంజనీకుమార్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. ప్రతి క్యాబ్‌కు ట్రాకింగ్ డివైజ్‌లు, అత్యవసర సమ యంలో సాయం కోసం ఉపయోగపడే ఎస్‌వోఎస్ బటన్లు కచ్చితంగా ఉండాలని పోలీసులు స్పష్టం చేశారు. తమ క్యాబ్‌లకు ట్రాకింగ్ డివైజ్‌లు ఉన్నాయని, ఇక ఎస్వోఎస్ను తమ యాప్‌ల్లో ఏర్పాటు చేస్తున్నామంటూ క్యాబ్‌ల నిర్వాహకులు చెప్పగా.. మోటారు వాహనాల చట్టంలోని 125 (హెచ్) సెక్షన్ ప్రకారం వాహనంలోనే ఎస్‌వోఎస్ బటన్ ఉండాలని, దీన్ని అమలు చేయాలని స్పష్టం చేశారు. క్యాబ్ డ్రైవర్ల పూర్వాపరాలను అనునిత్యం పరిశీలించాలని, వారి గత చరిత్రను సైతం పరిగణనలోకి తీసుకున్న తర్వాతే నియమించాలని కొత్వాల్ తెలిపారు. క్యాబ్‌ల్లో ప్రయాణించే వారి నుంచి ప్రతి సందర్భంలోనూ డ్రైవర్ల ప్రవర్తనపై ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలని, దాని ఆధారంగా తదుపరి చర్యలు ఉండాలన్నారు. మహిళల భద్రత అంశానికి సంబంధించి ఫిర్యాదు వస్తే వెంటనే తమ దృష్టికి తేవాలని ఆదేశించారు. ప్రతి క్యాబ్ యాప్‌ను హాక్–ఐతో అనుసంధానించాలని సూచించారు. సమావేశంలో ట్రాఫిక్ చీఫ్ అనిల్‌కుమార్ పాల్గొన్నారు. -
ఇంటి నుంచే ‘మార్పు ’ప్రారంభం కావాలి
సాక్షి, విజయవాడ: ‘దిశ’ హత్యోదంతం నేపథ్యంలో మహిళలు, యువతుల భద్రతకు బెజవాడ పోలీసులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. గురువారం సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో ‘భద్రం బిడ్డ’ పేరుతో అవగాహన కార్యక్రమాలకు సీపీ ద్వారకా తిరుమలరావు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏదైనా సంఘటన జరిగినప్పుడల్లా కొత్త చట్టాల డిమాండ్ వినిపిస్తోందని.. ఆ ఆలోచనా ధోరణి సరైంది కాదన్నారు. ఉన్న చట్టాలని సక్రమంగా అమలు చేస్తే చాలని తెలిపారు. నిర్భయ, పోక్సో చట్టాలు చాలా పటిష్టమైనవన్నారు. ‘100’ ఒక్క నంబర్ గుర్తు పెట్టుకొని ఆపద ఉంటే కాల్ చేయాలని.. ఆరు నిమిషాల్లో పోలీసులు మీ ముందు ఉంటారన్నారు. కొన్ని దేశాల్లో ఇప్పటికీ కఠినమైన శిక్షలు అమలు చేస్తున్నారని.. ఉరి తీయమనేంత ఆక్రోశం కలిగించిన దారుణ ఘటన ‘దిశ’ ఘటన అని పేర్కొన్నారు. ‘ఇంటి నుంచి పిల్లలు బయటకెళ్లే సమయంలో తల్లిదండ్రులు ఆడ పిల్లలకు మాత్రమే జాగ్రత్తలు చెబుతారు. మహిళల పట్ల ఎలా మసులుకోవాలో మగ పిల్లలకు తల్లిదండ్రులు నేర్పించాలని’ సూచించారు. మార్పు అనేది ఇంటి నుంచే ప్రారంభం కావాలన్నారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, వాట్సాప్ వీడియో కాల్స్ కి రెస్పాండ్ కాకూడదన్నారు. లఘు చిత్రాల ప్రదర్శన ద్వారా పోలీసు యాప్‌లపై కళాశాల విద్యార్థినిలకు ఆయన అవగాహన కల్పించారు. 100,1090,1091,121,181 వంటి యాప్‌ల గురించి సీపీ వివరించారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని కళాశాలల్లో కార్యక్రమాలు చేపట్టి అవగాహన కల్పిస్తామని సీపీ తిరుమలరావు వెల్లడించారు. -
మహిళలు పెప్పర్ స్ప్రే తెచ్చుకోవచ్చు
సాక్షి, హైదరాబాద్ : మెట్రోలో ప్రయాణించే మహిళలు ఆత్మరక్షణ కోసం తమ వెంట పెప్పర్ స్ప్రే తెచ్చుకునే వెసులుబాటును హైదరాబాద్ మెట్రో కల్పిస్తోంది. బెంగళూరు మెట్రోలో అమలులో ఉన్న ఈ విధానాన్ని హైదరాబాద్ మెట్రోలో పరిచయం చేస్తున్నట్టు ఆ సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే మెట్రోలో భద్రతా కార్యకలాపాలు పర్యవేక్షించే అధికా రులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. దిశ హత్యాచారం తర్వాత మహిళల భద్రతపై దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమైన నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై మహిళా ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
'దిశ' ఉదంతం.. పోలీసులకు పాఠాలు
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ ఉదంతం దేశవ్యాప్తంగా పోలీసులకు ఎన్నో పాఠాలు నేర్పుతోంది. మహిళలు, యువతుల భద్రత విషయంలో వారు తీసుకుంటున్న చర్యల ‘దిశ’మారుస్తోంది. పంజాబ్ లోని లూధియానా, బెంగళూరు, కోల్‌కతా, హైదరాబాద్ సహా అనేక మెట్రో నగరాల పోలీసులు మహిళల భద్రత విషయంలో వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాచకొండ నుంచే మొదలైన సేవలు.. ‘దిశ’ఉదంతం వెలుగులోకి వచ్చిన వెంటనే తొలుత స్పందించింది రాచకొండ పోలీసులే. సీపీ మహేశ్ భగవత్ గత గురువారమే స్పందించి యువతులు, మహిళలకు అదనపు సేవలు అందించేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. వాహనాల్లో పెట్రోల్ అయిపోయినా, పంక్చర్ అయినా పోలీసులకు ఫోన్ చేయాలని లేదా వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వాలంటూ సూచించారు. ఈ సర్వీసును ఆ మరుసటి రోజు నుంచే అనేక మంది వినియోగించుకున్నారు. లూధియానాలో ఫ్రీ ట్రావెల్ సర్వీస్.. రాత్రి వేళల్లో ప్రయాణించే మహిళలు, యువతుల కోసం పంజాబ్‌లోని లూధియానా పోలీసులు ఆదివారం నుంచి కొత్త సర్వీసు ప్రారంభించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య మహిళలకు సురక్షితమైన ప్రయాణం అందించేందుకు ఉచితంగా సేవలందిస్తున్నారు. ఆ సమయాల్లో ప్రయాణించేందుకు వాహనం దొరక్కపోతే పోలీసులకు ఫోన్ చేయాలంటూ రెండే ప్రత్యేక నంబర్లు కేటాయించారు. వీటికి కాల్ చేస్తే కంట్రోల్‌రూం వాహనం లేదా స్థానిక స్టేషన్ హౌస్ ఆఫీసర్ వాహనం వచ్చి సదరు మహిళను సురక్షితంగా గమ్య స్థానానికి చేరుస్తాయని లూధియానా పోలీస్ కమిషనర్ రాకేశ్ అగర్వాల్ ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. బ్యాన్ చేసిన బెంగళూరు కాప్స్.. ‘దిశ’పై అఘాయిత్యానికి పాల్పడ్డ దుండగులు ఆమెపై పెట్రోల్ పోసి కాల్చేశారు. పెట్రోల్‌ను ఓ బంకు నుంచి బాటిల్లో కొని తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరులోని అన్ని బంకులకు పోలీస్ కమిషనర్ భాస్కర్‌రావు సోమవారం నోటీసులు జారీ చేశారు. బాటిళ్లు, క్యాన్లతో వచ్చే వారికి ఇంధనం విక్రయాన్ని నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు. దీన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ఈ విషయాన్ని బంకుల్లో బోర్డుల ద్వారా అందరికీ తెలిసేలా ఏర్పాటు చేయించారు. కోల్‌కతాలో కెమెరాల ఏర్పాటు.. పశ్చిమబెంగాల్లోని కోల్‌కతా పోలీస్ కమిషనర్ అంజూ శర్మ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఇందులో ‘దిశ’కేసును ప్రస్తావించి.. అలాంటి ఘటనలు కోల్‌కతాలో జరగకుండా కట్టుదిట్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాటిలో భాగంగా కళాశాలలు, పాఠశాలలు ఉన్న ప్రాంతాలతో పాటు నిర్మానుష్య ప్రాంతాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సాధారణంగా మహిళలు, యువతులు కాలకృత్యాల కోసం నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లి దుండగుల బారినపడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. నగరవ్యాప్తంగా మొబైల్ టాయిలెట్స్ అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు -
అవగాహనతోనే వేధింపులకు చెక్
సాక్షి, హైదరాబాద్ : మహిళల భద్రత–రక్షణపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాలని, అప్పుడే వేధింపుల నివారణ సాధ్యమని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. ‘దిశ’ఘటన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బుధవారం హోంమంత్రి కార్యాలయంలో పలువురు మంత్రులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిపారు. మహిళల భద్రతకు అనుసరించాల్సిన వ్యూహాలు, వారిపై జరుగుతున్న అఘాయిత్యాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం చర్చించింది. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి, ఐజీ– షీటీమ్స్ స్వాతి లక్రా, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలివే.. మహిళలు అదృశ్యమైన కేసుల్లో నిర్లక్ష్యం వహించకుండా వెంటనే కేసులు నమోదు చేయాలి. పోలీస్స్టేషన్ల పరిధులతో సంబంధం లేకుండా ముందు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాలి. షీటీమ్స్ మరింత బలోపేతానికి హాక్ ఐ వినియోగాన్ని పెంచేలా ప్రోత్సహించాలి. హెల్ప్లైన్లు, పోలీసు యాప్స్ వినియోగం పెరిగే లా మహిళల్లో అవగాహన కల్పించాలి. డయల్ 100, 181, 1098, 112 హెల్ప్‌లైన్ నెంబర్లను విద్యాసంస్థల్లో ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్లు, రైల్వే, మెట్రో, పార్కులు, ఆటో, క్యాబ్‌ల్లోనూ ఇతర ప్రదేశాల్లోనూ ప్రదర్శించాలి. బాలబాలికలు, ఉద్యోగులకు వేధింపులు లింగసమానత్వంపై అవగాహన తీసుకువచ్చేందుకు ఈ–లెర్నింగ్ కోర్సులు అందుబాటులోకి తేవాలి. సినిమాహాళ్లు, టీవీల్లో లఘుచిత్రాలు, స్లైడ్లు ప్రదర్శించాలి. షీటీమ్స్‌తో కలిసి విద్యాసంస్థల్లో అమ్మాయిలపై వేధింపులపై అవగాహన కల్పించే సాంస్కృతి కార్యక్రమాల నిర్వహణ. గ్రామం నుంచి జిల్లా స్థాయివరకు అంగన్వాడీ, ఆశా, సెర్ఫ్ తదితర సంఘాలను మహిళా భద్రతపై ప్రచారానికి వినియోగించాలి. పిల్లలు నడుచుకుంటున్న విధానంపై తల్లిదండ్రులతో స్కూలు ఉపాధ్యాయులు చర్చించాలి. -
సేఫ్ సిటీ ఏమైంది?
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌లో మహిళా భద్రత కోసం ఉద్దేశించిన ‘సేఫ్ సిటీ’ ప్రాజెక్టు పనులు నత్తనడకన నడుస్తున్నాయి. దిశ ఘటనతో ఈ ప్రాజెక్టు అమలు మరోసారి చర్చనీయాంశంగా మారింది. 2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన అనంతరం కేంద్ర ప్రభుత్వం రూ.1000 కోట్ల బడ్జెట్‌తో సేఫ్‌సిటీ ప్రాజెక్టును ప్రారంభించింది. ఇందుకోసం హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, లక్నో, అహ్మదాబాద్ నగరాలను ఎంపిక చేసింది. అంతర్జాతీయ ప్రాజెక్టులు, ఐటీ, ఫార్మా, తదితర రంగాల్లో నగరం సాధిస్తున్న పురోగతి కారణంగా ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. బహుళ జాతి కంపెనీలకోసం మహిళలు అధిక సంఖ్యలో పనిచేస్తున్నారు. వీరి భద్రత కోసం ఉద్దేశించిందే ఈ ప్రాజెక్టు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా దీన్ని చేపడతాయి. ఇందుకోసం ప్రతి నగరానికి రూ.280 కోట్లు వెచ్చించాలి. ఇందులో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తాయి. ఏమేం చేస్తారు..? ఈ ప్రాజెక్టు అమలులో జీహెచ్ఎంసీ, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు, రవాణాశాఖ కమిషనర్, డీజీపీ, విమెన్‌సేఫ్టీ వింగ్, ఐజీ తదితరులు భాగస్వాములుగా ఉంటారు. ఈ ప్రాజెక్టుకు ఐజీ స్వాతి లక్రా కన్వీనర్‌గా, హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ నోడల్ ఆఫీసర్‌గా ఉన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా నగరంలో మహిళల భద్రతకోసం అదనంగా 3వేల సీసీ కెమెరాలు బిగించాలి. రాత్రిపూట మహిళల రవాణా కోసం ప్రత్యేక బస్సులు, క్యాబ్‌లు నడపాలి. అందులో సీసీ కెమెరాలు అమర్చాలి. మహిళల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు, అదనంగా మహిళా పోలీసుల రిక్రూట్మెంట్, మొబైల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలి. అయితే దీనిపై పలుమార్లు సమావేశమయ్యారే తప్ప.. ఇంతవరకూ ఈ ప్రాజెక్టు కోసం చెప్పుకోదగ్గ కార్యక్రమాలు చేపట్టలేదు. ఇక నిధుల విషయానికి వస్తే.. రూ.282 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో రూ.138 కోట్ల మేర పనులకు అనుమతులు లభించాయి. ఈ పనులు ప్రస్తుతం నగరంలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో నిదానంగా సాగుతున్నాయి. అధికారులు మాత్రం త్వరలోనే పూర్తవుతాయని చెబుతున్నారు. -
'దయచేసి లైంగిక వేధింపులు ఆపండి'
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు లైంగిక వేధింపులకు గురవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. మహిళలపై జరుగుతున్న హింస మానవ హక్కుల ఉల్లంఘనేనని స్పష్టం చేసింది. వారిపై వివక్ష చూపడమేనని తెలిపింది. ‘స్త్రీలను గౌరవించడం, వారిపై హింసను నిరోధించడం’పై డబ్ల్యూహెచ్‌వో ఇటీవల మార్గదర్శకాలు విడుదల చేసింది. మహిళల భద్రతకు మొదటి స్థానం కల్పించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. వారికి ఎలాంటి హాని చేయకూడదని హితవు పలికింది. వారి గోప్యతను కాపాడాలని, భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేసింది. వారిపై ఏ మాత్రం వివక్ష చూపించొద్దని కోరింది. అందుకోసం కార్యక్రమాలను రూపొందించాలని పేర్కొంది. నిర్దేశిత ప్రణాళిక ప్రకారం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని పేర్కొంది. మహిళల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై ఓ విధానం తీసుకురావాలని సూచించింది. స్త్రీలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, అత్యాచారాల వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపింది. దీనివల్ల సమాజ అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందని, కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. లైంగిక హింసతో విలవిల.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. కౌమారదశలో ఉన్న బాలికలు, యువతులు, ఇతర మైనారిటీ మహిళలు, వైకల్యాలున్న స్త్రీలు అనేక రకాల హింసలకు గురవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 38 నుంచి 50 శాతం మహిళల హత్యలు వారి సన్నిహితుల ద్వారానే జరుగుతున్నాయి. ఈ పరిస్థితులు సామాజిక, ఆర్థిక, కుటుంబాలపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. హింస నుంచి బయటపడిన మహిళల్లో దాదాపు 55 శాతం నుంచి 95 శాతం మంది వరకు ఆ సంఘటనను బయటకు చెప్పడానికి ముందుకు రావట్లేదు. పురుషుల అక్రమ సంబంధాలు కూడా అనేకసార్లు మహిళలపై హింసకు కారణంగా నిలుస్తున్నాయి. ఆరోగ్యంపై ప్రభావం.. లైంగిక హింస మహిళలకు తీవ్రమైన శారీరక, మానసిక, లైంగిక, పునరుత్పత్తికి సంబంధిం చిన ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. గర్భం దాల్చడం, ప్రేరేపిత గర్భస్రావం, హెచ్ఐవీ సహా పలు వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. లైంగిక వేధింపులకు గురైన మహిళల్లో ఇలాంటి వ్యాధులు ఒకటిన్నర రెట్లు ఎక్కువ. గర్భస్రావం రెండింతలు ఎక్కువ. ఈ రకమైన హింస కారణంగా నిరాశ, ఒత్తిడి, నిద్రలేమి, ఆత్మహత్యాయత్నాలకు పాల్పడే ప్రమాదం ఉంది. తాగుడుకు బానిసలు అవుతారు. తలనొప్పి, వెన్నునొప్పి, జీర్ణకోశ వ్యాధులు వచ్చే అవకాశముంది. హింస ఉన్న కుటుంబాల్లో పెరిగే పిల్లల్లో నేర ప్రవృత్తి ఉండే అవకాశం ఉంది. కింది జాగ్రత్తలు తీసుకోవాలి.. స్త్రీలకు సురక్షితమైన బహిరంగ ప్రదేశాలుండాలి. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఉండకూడదు. పురుషుల హక్కులను కాపాడుతూ స్త్రీ అణచివేతను సమర్థించే నిబంధనలను తొలగించాలి. మహిళలకు చట్టబద్ధమైన, సామాజిక రక్షణలు మాత్రమే సరిపోవని, రాజకీయ సంకల్పం ఉండాలని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. మహిళలపై హింసను పరిష్కరించడానికి కార్యక్రమాలు, పరిశోధనలు, ఆరోగ్యం, విద్య, చట్టం అమలు, సామాజిక సామర్థ్యాలను బలోపేతం చేయడానికి వనరులు కేటాయించాలి. మహిళా సాధికారత పెరగాలి. పేదరికం తగ్గించాలి. ప్రభుత్వాలు మహిళలపై హింసను అంతం చేయాలి. -
డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. భద్రతకు భరోసా
‘ఎప్పుడైతే అర్ధరాత్రి రోడ్డుపై మహిళలు స్వేచ్ఛగా, భయం లేకుండా తిరగగలుగుతారో అప్పుడే దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్లవుతుంది’ ఇదీ జాతిపిత మహాత్మా గాంధీ అన్న మాటలు.. అయితే ప్రస్తుతం దేశంలో ఆ పరిస్థితి కనిపిస్తుందా అంటే లేదనే చెప్పాలి. ‘నిర్భయ’.. లాంటి అమానవీయ ఘటనలు మహిళా భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ నగర పోలీసులు సగటు మహిళకు జరుగుతున్న ప్రమాదాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక యాప్ ‘బీసేఫ్’ను ప్రవేశపెడుతోంది. దీనిలో మహిళా భద్రతతో పాటు హెల్మెట్, సీట్‌బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల జరిగే అనర్థాలపై ఆడియో, వీడియోలను పొందుపరిచింది. ఇది ఈ నెల మూడో తేదీ నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది. సాక్షి, అమరావతి బ్యూరో : సాంకేతికత ఎంత పెరుగుతుందో.. నేరాలు అదే స్థాయిలో పెరుగుతున్నాయి. మరోవైపు గుమ్మం దాటిన ఆడపడుచు తిరిగి ఇంటికి చేరే వరకు ప్రాణాలు అరచేతిలో ఉంచుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి. ఎక్కువ మంది ప్రమాదాలపై అవగాహన లేక.. విపత్కర పరిస్థితుల్లో ఏమి చేయలో పాలుపోక తమ ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ నగర పోలీసు శాఖ ప్రత్యేక చర్యలను ప్రారంభించింది. ప్రమాదాలు.. జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రణాళిక చేసింది. దీనిలో భాగంగా “బీ సేఫ్’ పేరిట ఓ యాప్‌ను రూపొందించింది. ఆడియో, వీడియోలను యాప్‌లో పొందుపరిచింది. ప్రమాదాలపై అవగాహన.. నగరం రాజధాని ప్రాంతంలో భాగమవడంతో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. మాల్స్ సంస్కృతి పెరిగింది. పాశ్చాత్య పోకడలు పెరిగాయి. నగరంలో నిత్యం ఏదో ఒక పోలీసు స్టేషన్లో మహిళలపై వేధింపులు, లైంగిక దాడులు, అత్యాచారం వంటి ఘటనలపై కేసులు నమోదవుతున్నాయి. వీటిని నివారించేందుకు నగర పోలీసు కమిషనరేట్ ఆధ్వర్యంలో ప్రత్యేక నంబర్లు ఉన్నా అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శక్తి బృందాలు, డయల్ 100, బ్లూ కోల్ట్సŠ, ఇంటర్సెప్టార్, వాట్సాప్ లాంటి సౌకర్యాలు ఉన్నా.. చిక్కులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో మహిళా భద్రతలపై చర్యలు చేపట్టిన నగర పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు “బీసేఫ్’ అనే ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. తద్వారా ప్రజలు.. ముఖ్యంగా మహిళలు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడానికి సిద్ధమయ్యారు. ఈ యాప్ ద్వారా డయల్ 100, గుడ్ టచ్.. బ్యాడ్ టచ్, ఓటీపీ, ఫేస్బుక్ మోసాలతోపాటు సురక్షిత ప్రయాణం, దొంగల బారిన పడకుండా తీసుకోవాల్సిన రక్షణ చర్యలు వంటి అంశాలపై ఆడియో, వీడియో రూపంలో అవగాహన కల్పిస్తారు. డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. బీసేఫ్ యాప్‌ను సెల్ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమాచారం మొత్తం మీ ముందు దృశ్యశ్రవణ రూపంలో కనిపిస్తుంది. ఏదైనా సంఘటన చూసినా.. వారి కళ్లముందు ప్రమాదం జరిగినా, అమ్మాయిలను ఎవరైనా ఈవ్ టీజింగ్ చేస్తున్నా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంపూర్ణ అవగాహన కల్పించే విధంగా యాప్‌కు రూపకల్పన చేశారు. ఈ యాప్ పోస్టర్లను నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లతోపాటు పాఠశాలలు, కళాశాలలు, వీధుల్లో ఏర్పాటు చేయబోతున్నారు. గూగుల్ ప్లేస్టోర్ నుంచి లేదా.. ఆయా పోస్టర్ల మీద ఉండే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసుకుని ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. -
ఢిల్లీలో మహిళల భద్రతకు కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: మహిళల భద్రత పెంపొందించే దిశగా ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. బస్సుల్లో మహిళల భద్రత కోసం మార్షల్స్ సంఖ్యను దాదాపు 10వేలు పెంచుతున్నట్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ఢిల్లీలో ప్రభుత్వ వాహనాల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పథకంలో భాగంగా కేజ్రీవాల్ ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ‘ఈరోజు నేను మీకు ప్రభుత్వ వాహనాల్లో మహిళల భద్రత బాధ్యతను అప్పగిస్తున్నాను. దీని వల్ల వారు బస్సుల్లో తమ ఇంటిలో ఉన్నట్లు భావించి ప్రయాణం చేస్తారు’అని సోమవారం త్యాగరాజ స్టేడియంలో నూతనంగా నియామకమైన మార్షల్స్నుద్దేశించి మాట్లాడారు. మహిళల పట్ల ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే సహించకూడదని స్పష్టంచేశారు. ప్రస్తుతం ఢిల్లీలో 3,400 మంది మార్షల్స్ ఉన్నట్లు కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
అతివకు అండగా ఆమె సేన
ఆదిలాబాద్‌లోని మారుమూల ప్రాంతంలో పోకిరీల వేధింపులపై యువతి ఫోన్ చేయగానే.. 10 నిమిషాల్లో ఘటనాస్థంలో చేరుకుని ఆకతాయిల భరతం పట్టి ఆ యువతిని సురక్షితంగా ఇంటికి చేర్చింది ‘షీ టీమ్’. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉత్తర భారతదేశానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి తాను అర్ధరాత్రి 2 గంటలకు సైతం ఎలాంటి ఇబ్బంది లేకుండా క్షేమంగా ఇంటికి చేరుకోగలుతుంది. ఆ యువతి వెనుక ధైర్యం ‘షీ టీమ్’. సాక్షి, హైదరాబాద్: మహిళ అర్ధరాత్రి సమయంలోనూ స్వేచ్ఛగా రోడ్డుమీద నడిచే పరిస్థితి ఉన్నప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లన్న మహాత్మా గాంధీ మాటల స్ఫూర్తిగా ఆకతాయిల ఆటకట్టి అతివలకు అండగా ఉండేందుకు ఏర్పడిన షీ టీమ్ (ఆమె సేన) ఇప్పుడు ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ ఐదేళ్లలో ఎంతోమంది మహిళల్ని లైంగిక వేధింపుల నుంచి, యువతుల్ని ఈవ్‌టీజింగ్ నుంచి రక్షించింది. షీ టీమ్ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు ఈ ఐదేళ్లలో వచ్చి చేరాయి. వేయి మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతో మొదలుపెడతాం అన్నట్లుగా ఐదేళ్ల క్రితం నగరంలో మహిళల రక్షణకు మొదలుపెట్టిన ఆమె సేన.. నేడు రాష్ట్రవ్యాప్తంగా తన సేవలను విస్తరించింది. 33 జిల్లాల్లో 300 పైగా షీ టీమ్స్ మహిళలకు భద్రత కల్పిస్తున్నాయి. 2015, అక్టోబరు 24న అప్పటి డీజీపీ అనురాగ్‌శర్మ ఆధ్వర్యంలో తెలంగాణ పోలీసులు మహిళల రక్షణ కోసం హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన షీటీమ్స్ నేడు రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్నాయి. నగరంలోని మూడు కమిషనరేట్లలో షీటీమ్స్ ఇచ్చిన ప్రేరణే ఇందుకు కారణం. ఇపుడు వేలాది కేసులు, ఫిర్యాదులతో ప్రజలకు ముఖ్యంగా విద్యార్దినులు, మహిళలకు చేరువైంది. అన్నివర్గాల ప్రశంసలు అందుకుంటోంది. పొరుగు రాష్ట్రాలకు స్ఫూర్తిగా.. మహిళలపై వేధింపులకు వ్యతిరేకంగా పనిచేసే షీటీమ్స్ కేవలం కేసుల నమోదుకే పరిమితమవలేదు. వేధింపులు జరిగినపుడు ఎలా ఎదుర్కోవాలి? ఆపద సమయాల్లో ఎలా వ్యవహరించాలి? అన్న విషయాలపై వివిధ కార్యక్రమాల ద్వారా విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది. రోజూ రాష్ట్రవ్యాప్తంగా కనీసం 70 నుంచి 80 అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుండటం షీటీమ్స్ పనితీరుకు నిదర్శనం. ఈ ఫలితాలు చూసి పొరుగు రాష్ట్రం ఏపీ తరువాత దేశంలోని అన్ని మెట్రోనగరాల్లో షీటీమ్స్ సేవలు ప్రవేశపెట్టేలా స్ఫూర్తిగా నిలిచింది. ఇప్పుడు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో కేసులను నిరంతరం పర్యవేక్షిస్తుండటం గమనార్హం. వేధింపులు ఎక్కువగా జరిగే ప్రదేశాల(హాట్స్పాట్లు)ను గుర్తించి అందుకు అనుగుణంగా పోలీసుల మోహరింపు చేస్తున్నారు. ముఖ్యంగా పోలీసు కళా బృందాలు షీటీమ్స్పైనా ప్రచారం చేస్తుండటంతో ఫిర్యాదులు పెరుగుతున్నాయి. మొత్తం ఫిర్యాదుల్లో సోషల్ మీడియా ద్వారానే అధికంగా వస్తుండటం గమనార్హం. ఆఫీస్‌లు, స్కూళ్లు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్లలో పనిప్రదేశాల్లో చేస్తోన్న అవగాహన కార్యక్రమాలు మహిళలపై వేధింపుల సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. మరోవైపు షీటీమ్స్ పోలీసులు నమోదు చేసే పెట్టీ కేసులను సైతం సీసీటీఎన్ఎస్ (క్రైమ్ అండ్ క్రిమినల్ నెట్వర్కింగ్ సిస్టమ్)తో అనుసంధానిస్తున్నారు. -
వన్ స్టేట్... వన్ షీ–టీమ్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఒకే పోలీసింగ్ విధానం ఉండాలనే లక్ష్యంతో షీ–టీమ్స్ పనితీరులో సమగ్ర మార్పుచేర్పులు చేయడానికి డీజీపీ కార్యాలయం సిద్ధమైంది. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు ఏ జిల్లా కమిషనరేట్‌లోనైనా వీటి పనితీరు, స్పందన ఒకేలా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఉమెన్ సేఫ్టీ వింగ్ ‘యూనిఫామ్ సర్వీస్ డెలివరీ–షీ టీమ్స్’పేరుతో 4 రోజుల శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని అన్ని యూనిట్లలోని షీ–టీమ్స్ సిబ్బందికి విడతల వారీగా శిక్షణ ఇవ్వనున్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఉమెన్ సేఫ్టీ వింగ్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఏడీజీ (శాంతిభద్రతలు) జితేందర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం పోలీసింగ్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలు పూర్తి శాంతిభద్రతల మధ్య జీవించాలనేది దీని ముఖ్య ఉద్దేశమన్నారు. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ షీ–టీమ్స్ అంకురార్పణ జరిగిందన్నారు. షీ–టీమ్స్ బృందాల విజయం ఒక్క రోజులో వచ్చింది కాదని, కొన్ని నెలల కృషి ఫలితమని వ్యాఖ్యానించారు. ఉమెన్ సేఫ్టీ వింగ్ ఐజీ స్వాతి లక్రా మాట్లాడుతూ ‘‘రాష్ట్రంలో విజయవంతమైన షీ–టీమ్స్‌ను ఆదర్శంగా తీసుకొని మరో ఆరు రాష్ట్రాలు అమలులోకి తీసుకొచ్చాయని, ఇది మన బాధ్యతల్ని మరింత పెంచింద’’న్నారు. కార్యక్రమంలో సీఐడీ ఎస్పీ బి.సుమతి తదితర అధికారులు పాల్గొన్నారు. -
ఏ ఇబ్బంది వచ్చినా 100కు ఫోన్ చేయండి..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పోలీసు శాఖను గౌరవ స్థానంలో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని నిజామాబాద్ ఎంపీ కవిత పేర్కొన్నారు. మహిళ దినోత్సవం సందర్భంగా శుక్రవారం హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డిలతో కలిసి లక్డీకాపూల్‌లో ఉమెన్ సేఫ్టీ వింగ్ భవనాన్ని ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులతో పాటు పలువురు మహిళ ఐపీఎస్‌లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ.. దేశంలోనే తెలంగాణ పోలీసులకు మంచి పేరు వచ్చిందని తెలిపారు. మహిళ భద్రతకి షీ టీమ్స్, క్యాబ్స్, పోలీసు స్టేషన్లు, భరోసా సెంటర్లు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. మహిళల భద్రతపై ఎంత అప్రమత్తంగా ఉన్న ఇంకా దాడులు జరుగుతున్నాయని ఎంపీ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని నిర్మూలించాల్సిన అవసరం ఉందని అన్నారు. మహిళలకు ఏ కష్టం వచ్చిన పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. నేరం జరిగినప్పుడు నిందితులకు తగిన శిక్షపడే విధంగా ఉమెన్స్ వింగ్ ఏర్పాటు చేశామని ప్రకటించారు. విద్యార్థినులు మొబైల్స్‌లో హాక్ ఐ ఆప్లికేషన్ ఉంచుకోవాలని.. పోలీసులతో కలిసి ముందుకు నడవాలని కోరారు. ప్రతి జిల్లాలో కూడా మహిళల కోసం భరోసా సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుందని పేర్కొన్నారు. మహిళలకు ఏ కష్టం వచ్చినా 100కి ఫోన్ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆమె.. మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహమూద్ అలీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత పోలీస్ శాఖకి పెద్ద పీట వేసినట్టు గుర్తుచేశారు. శాంతి భద్రతలను కాపాడటం కష్టం అవుతుందని అప్పటి సీఎం అన్నారని.. కానీ తెలంగాణ ఇప్పుడు శాంతి భద్రతలలో దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో ప్రజలకు పోలీసులంటే భయం పోయిందని తెలిపారు. మహిళ భద్రతకు అధిక ప్రాధన్యత ఇస్తున్నట్టు పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉమెన్స్ వింగ్‌ను ఏర్పాటు చేశామన్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలో లేని విధంగా హైదరాబాద్‌లో ఉమెన్స్ సెఫ్టీ వింగ్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ గ్లోబల్ సిటీ కావాలని ప్రభుత్వం షీ టీమ్స్ ఏర్పాటు చేసిందన్నారు. షీ టీమ్స్ సారథి ఉన్న స్వాతి లక్రాను ఆయన అభినందించారు. తెలంగాణలో తొమ్మిది కమిషనరేట్లు ఏర్పాటు చేసి ప్రజల భద్రతకు పెద్ద పీట వేశామన్నారు. -
అతివకు అండ..
సాక్షి, హైదరాబాద్: ఫ్రెండ్లీ పోలీసింగ్, షీటీమ్స్, సీసీకెమెరాలు వంటివాటితో మంచి ఫలితాలతోపాటు ప్రజల అభిమానాన్ని చూరగొన్న పోలీసు శాఖ అతివకు అండగా మరో కార్యక్రమం చేపట్టింది. చిన్నారులు, మహిళలపై లైంగిక దాడులు, మానవ అక్రమరవాణా వంటి కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం కల్పించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఐజీపీ స్వాతి లక్రా నేతృత్వంలో ‘వుమెన్ సేఫ్టీ వింగ్’ను ఏర్పాటు చేసింది. శుక్రవారం మహిళా దినోత్సవం సందర్భంగా లక్డీకాపూల్‌లోని ఈ విభాగం కార్యాలయాన్ని హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కె.కవిత, డీజీపీ మహేందర్‌రెడ్డి పాల్గొంటారు. షీటీమ్స్ పోలీసులు, భరోసా కేంద్రాలు (మహిళలు, చిన్నారులకు న్యాయ, వైద్య సాయం అందించే కేంద్రాలు) ఈ విభాగం కింద ఉంటాయి. ఈ కార్యాలయంలో పనిచేసే వారిలో ఇద్దరు ఎస్పీ స్థాయి అధికారులు, నలుగురు డీఎస్పీ, ఒక ఏఎస్పీ ర్యాంకు అధికారి, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు ఉంటారు. కార్యాలయంలోని అత్యాధునిక సదుపాయాలతో కూడిన సీసీటీఎన్ఎస్ (క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్) సాయంతో ప్రతీ స్టేషన్ డేటాను అనుసంధానిస్తారు. ఫలితంగా వివిధ కేసుల స్థితిగతులను సులభంగా తెలుసుకోవచ్చు. కేసుల పురోగతి, ఇతర వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ కూడా రూపొందించారు. రోజూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విభాగానికి సంబంధించి ఎన్ని కేసులు నమోదయ్యాయన్న విషయాలను డీఎస్ఆర్ (డెయిలీ సిట్యువేషన్ రిపోర్ట్) ద్వారా పర్యవేక్షిస్తారు. దీంతోపాటు ప్రతీనెలా కేసులపై సమీక్ష నిర్వహిస్తారు. తద్వారా కేసులను వీలైనంత త్వరగా విచారణ జరపడం, చార్జిషీట్ దాఖలు చేయడం సాధ్యమవుతాయి. ఫలితంగా బాధితులకు సత్వర సాయం అందే వీలుంటుంది. నేడు మహిళా ఉద్యోగులకు సెలవు సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం (మార్చి 8) రాష్ట్రంలో పని చేస్తున్న మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గురువారం సచివాలయంలో మహిళా ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు. -
రాష్ట్రంలో ఆపరేషన్ ‘అభయ’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజారవాణా వ్యవస్థ ఇక నిఘా నీడలోకి వెళ్లనుంది. ప్రయాణాల్లో యువతులు, మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరించడం, వెకిలిచేష్టలు లాంటి ఘటనలు నిత్యం ఏదో ఒకచోట వెలుగు చూస్తున్నాయి. వీటిని నివారించి మహిళలు, బాలికలకు రక్షణ కల్పించేందుకు రవాణాశాఖ ఆపరేషన్ ‘అభయ’ అనే కార్యక్రమానికి రూపకల్పన చేసింది. దీనిద్వారా ద్వారా క్యాబ్, ఆటో, టూరిస్ట్ బస్, ప్రైవేట్ ట్రావెల్స్, విద్యా సంస్థల బస్సులు ఇలా ఒకటేమిటి.. చివరకు ఆర్టీసీ బస్సు కూడా ఎక్కడెక్కడ తిరుగుతుందో.. ఏ ప్రాంతానికి వెళ్లనుందో.. ట్రాక్ అండ్ ట్రేస్ ద్వారా రవాణా శాఖ ఇట్టే పసిగడుతుంది. ఈమేరకు రవాణా వాహనాలన్నింటికీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) పరికరాలను తప్పనిసరి చేస్తూ అతి త్వరలో అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నాయి. రెండేళ్ల క్రితమే రవాణా శాఖ ‘అభయ’ ప్రాజెక్టు రూపొందించింది. నీతి ఆయోగ్ ఆమోదంతో ఈ ప్రాజెక్టుకు కేంద్రం రూ.138 కోట్లను విడుదల చేసింది. తొలుత ఆటోలు, క్యాబ్‌లకు... ఏపీలో 12.15 లక్షల వరకు రవాణా వాహనాలున్నాయి. వీటికి దశలవారీగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరికరాలు అమర్చేందుకు రవాణాశాఖ ఇప్పటికే ఐటీ కంపెనీల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులు కోరింది. ఈనెల 20న దీనికి సంబంధించిన టెండర్లను ఖరారు చేయనుంది. తొలిదశలో అక్టోబరు నుంచి క్యాబ్‌లు, ఆటోలకు ఐవోటీ పరికరాల్ని బిగించనున్నారు. ఆపరేషన్ ‘అభయ’ అంటే..? మహిళల భద్రత కోసం ‘అభయ’ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు కేంద్ర ఉపరితల రవాణాశాఖకు ఏపీ రెండేళ్ల క్రితమే నివేదిక సమర్పించింది. ప్రయాణంలో అవాంఛనీయ సంఘటనలు ఎదురైతే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) ఆధారంగా పోలీస్, రవాణాశాఖలకు సమాచారం చేరవేసేలా దీన్ని రూపొందించారు. కేంద్రం కేటాయించిన నిధులతో పోలీస్‌శాఖకు అత్యాధునిక టెక్నాలజీతోపాటు రవాణాశాఖలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేస్తారు. ఆర్టీసీ బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు, ట్యాక్సీల్లో మహిళలు స్వేచ్ఛగా ప్రయాణించేలా ఐవోటీ పరికరాలు అమరుస్తారు. జీపీఎస్ పరికరాలు కలిగిన ఈ బాక్సుపై ‘పానిక్’ బటన్ ఉంటుంది. వేధింపులు ఎదుర్కొనే మహిళలు దీన్ని నొక్కిన వెంటనే కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు సమాచారం చేరవేసి అప్రమత్తం చేస్తుంది. వాహనం ఎక్కడ ప్రయాణిస్తుందనే సమాచారాన్ని చేరవేస్తుంది. పానిక్ బటన్ నొక్కకున్నా ప్రతి 20 సెకన్లకు వాహనం కదలికలు కంట్రోల్ రూంకు చేరతాయి. ఐవోటీ బాక్స్ పక్కన క్యూఆర్ కోడ్ షీటు కూడా ఉంటుంది. అభయ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని ఐవోటీ బాక్స్ పక్కన ఉండే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసినా ప్రయాణించే వాహనం ఎటు వైపు వెళుతుందో, ఎక్కడుందో తెలుస్తుంది. విజయవాడ, విశాఖలో ప్రయోగాత్మక పరీక్ష ‘అభయ’ ప్రాజెక్టు ద్వారా మహిళలకు పూర్తి భద్రత కల్పిస్తాం. 22 ఐటీ కంపెనీలు ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లలో పాల్గొన్నాయి. ఈనెల 20న టెండర్లు ఖరారు చేస్తాం. ఎంపికైన సంస్ధ విజయవాడ, విశాఖపట్టణంలలో ఆటోలపై ప్రయోగాత్మకంగా అమలు చేసి చూపాలి. – ఎం.పురేంద్ర (రవాణాశాఖ ఐటీ విభాగం డిప్యూటీ కమిషనర్) -
‘బెంగళూరు’ తీర్పే కీలకం!
బెంగళూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కన్నడ అసెంబ్లీ ఎన్నికల సమరం చివరి అంకానికి చేరుకుంది. అధికారం కోసం నువ్వా–నేనా అనే రీతిలో అధికార విపక్షాల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ అంశాలు, వివిధ వ్యూహాలతో ప్రచారం చేస్తున్న పార్టీలకు రాజధాని బెంగళూరుపై పట్టు చాలా కీలకం. అందుకే ఉద్యాన నగరిపై ప్రత్యేక దృష్టి సారించాయి. ఐటీ హబ్, మెట్రోపాలిటన్ సిటీ కావడంతో ఇక్కడి ఓటర్ల తీర్పుపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఎన్నికల్లో నగర ఓటర్లు ఏ పార్టీకి అండగా నిలవబోతున్నారు? వీరి ఆకాంక్షలు, అవసరాలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఏ మేరకు తీర్చగలిగాయి? ప్రజల అభిప్రాయాల ఆధారంగా ‘సాక్షి’ అందిస్తున్న కథనం. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఒక్క బెంగళూరు సిటీలోనే 28 స్థానాలున్నాయి. వీటితోపాటు 4 బెంగళూరు రూరల్ నియోజకవర్గాలు కూడా సిటీ పరిధిలోకే వస్తాయి. దీంతో ఈ 32 స్థానాల్లో ఓటరు తీర్పుపై చర్చ జరుగుతోంది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో సిటీలో 13, రూరల్‌లో 2 సీట్లు కలిపి 15 స్థానాల్లో కాంగ్రెస్ గెలవగా.. బీజేపీ సిటీలో 12 స్థానాలు కైవసం చేసుకుంది. జేడీఎస్ సిటీలో 3, రూరల్‌లో 2 స్థానాలు దక్కించుకుంది. అయితే తర్వాత జరిగిన బెంగళూరు కార్పొరేషన్ ఎన్నికల్లో (198 వార్డుల్లో) బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. జేడీఎస్, స్వతంత్రుల సాయంతో కాంగ్రెస్ మేయర్ సీటు కైవసం చేసుకుంది. కార్పొరేషన్ ఎన్నికల తర్వాత బెంగళూరును న్యూయార్క్, లండన్ తరహాలో అభివృద్ధి చేసి ప్రపంచఖ్యాతి కల్పిస్తానని సిద్దరామయ్య ప్రకటించారు. కానీ ఈ దిశగా అడుగు ముందుకు పడలేదు. ఇప్పుడుకూడా సిటీ పరిధిలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ నెలకొంది. కనెక్టివిటీ లేని మెట్రో మెట్రోపాలిటన్ సిటీ అయిన బెంగళూరులో ఐటీ ఉద్యోగులు, ఇతర రంగాల్లో పనిచేసే ఉద్యోగులు, వ్యాపారుల సంఖ్య ఎక్కువ. వీరు మౌలిక వసతుల కల్పన, మహిళల భద్రత, శాంతిభద్రతలు, ట్రాఫిక్, పారిశుద్ధ్యం, కాలుష్యం వంటి ప్రధానాంశాలపై ఆలోచిస్తున్నారు. ట్రాఫిక్ సమస్య బెంగళూరును ఇప్పటికీ పట్టిపీడిస్తోంది. మెట్రోరైలు ఏర్పాటు చేసినప్పటికీ సిటీ మొత్తం కనెక్టివిటీ లేకపోవడంతో సిటీ ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరలేదు. అలాగే ఐటీ ఉద్యోగులు అర్ధరాత్రి వరకూ విధుల్లో ఉండటంతో మహిళా భద్రత అంశాన్ని నగర ప్రజలు ప్రధానంగా భావిస్తున్నారు. బెంగళూరు సిటీ పరిధిలో 2013లో 70.4లక్షల ఓటర్లున్నారు. ఐదేళ్లలో 17.5 లక్షల మంది ఓటర్లు పెరిగి ప్రస్తుతం ఆ సంఖ్య 89.9 లక్షలకు చేరింది. పెరిగిన ఓటర్లలో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల నుంచి జీవనోపాధికోసం బెంగళూరుకు వచ్చి స్థిరపడినవారే. వీరిలో ఎక్కువ మంది మధ్యతరగతి వారే. సిద్దరామయ్య ఏర్పాటుచేసిన ఇందిరా క్యాంటీన్లపై వీరు సంతృప్తికరంగా ఉన్నప్పటికీ.. మిగిలిన అంశాలపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆరెస్సెస్ ప్రచారం కలిసొచ్చేనా? 50వేల మంది ఆరెస్సెస్ కార్యకర్తలు బీజేపీ విజయం కోసం క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది సిటీ పరిధిలో ఉన్నారు. సిటీలో బీజేపీ బలంగా ఉండటంతో ఆర్ఎస్ఎస్ కార్యకర్తల ప్రచారం కచ్చితంగా ప్రభావం ఉంటుందని ఆపార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సిటీలో ముఖ్యమైన వర్గాలివే బెంగళూరు సిటీలో బ్రాహ్మణులు, లింగాయత్, మైనార్టీ, దళిత వర్గాలతో పాటు తెలుగు, తమిళ ఓటర్లు కూడా నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. యడ్యూరప్ప లింగాయత్ కావడంతో బ్రాహ్మణులు, లింగాయత్ ఓటర్లు బీజేపీపై సానుకూలంగా ఉన్నారు. మైనార్టీ, దళిత వర్గాలు కాంగ్రెస్‌వైపు ఉన్నారు. 2008 ఎన్నికల్లో క్రిస్టియన్లు బీజేపీ వైపు నిలిచినప్పటికీ.. మంగళూరు చర్చిదాడి ఘటనతో పూర్తిగా దూరమయ్యారు. వీరంతా బృందాలుగా ఏర్పడి బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. 391 మందిపై క్రిమినల్ కేసులు కర్ణాటకలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న 2,560 మంది అభ్యర్థుల్లో 391 మంది క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. హత్య, హత్యాయత్నం, మహిళలపై వేధింపులు, అపహరణ తదితర తీవ్ర అభియోగాలు ఉన్నాయి. కళంకితులను పోటీకి దింపడంలో బీజేపీ ముందువరుసలో ఉంది. ఆ పార్టీ అభ్యర్థుల్లో 83 మంది (37%)పై నేరారోపణలు ఉన్నాయి. అలాగే 93% మంది బీజేపీ అభ్యర్థులు కోటీశ్వరులే. కాంగ్రెస్ అభ్యర్థుల్లో 27% మందిపై క్రిమినల్ కేసులుండగా 15% మంది కోటీశ్వరులు. జేడీఎస్‌లో 21% మందిపై కేసులున్నాయి. -
మహిళా రక్షణ ‘ఏకతాటి’పైకి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మహిళల భద్రత కోసం పోలీసుశాఖ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ప్రస్తుతం వేర్వేరు విభాగాలు పనిచేస్తున్న షీ టీమ్స్, భరోసా కేంద్రాలు, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్‌లను కలిపి ఒక యూనిట్‌గా ఏర్పాటు చేసేందుకు చర్యలు ప్రారంభించింది. ప్రత్యేక యూనిట్ ఏర్పాటుకు ఉండాల్సిన అధికారం, తదితర వ్యవహారాలపై ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. షీ టీమ్స్ నమోదు చేసే కేసులు, భరోసా కేంద్రాల్లో ఇచ్చే కౌన్సెలింగ్, పునరావాస కార్యక్రమాలు, ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు తదితరాలన్నింటినీ పర్యవేక్షించేందుకు ప్రత్యేక భవనం ఉండేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. జిల్లాల్లో నమోదయ్యే అత్యాచార, హత్య కేసులను సైతం దర్యాప్తు చేసేందుకు ఈ యూనిట్‌కే అధికారాలు కల్పించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అదేవిధంగా మైనర్లపై లైంగిక వేధింపులు, ఆన్లైన్లో వేధింపులు, వరకట్న కేసులను పర్యవేక్షిస్తున్న సీఐడీ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ బా«ధ్యతలను కూడా ఈ విభాగమే చూసేలా మార్పులు చేయనున్నారు. ఒక్కో విభాగంలో ఒక్కో యూనిట్ ఉండేకన్నా మొత్తం మహిళల రక్షణ, భద్రతకు సంబంధించి ఒకే యూనిట్ ఉంటే బాగుంటుందని పోలీసుశాఖ భావిస్తోంది. ఐజీ స్వాతి లక్రా నేతృత్వంలోనే... హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన షీ టీమ్స్, భరోసా కేంద్రాలు సత్ఫలితాలివ్వడంతో వాటిని ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయడాన్ని వేగవంతం చేశారు. డీజీపీ మహేందర్‌రెడ్డి హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా పనిచేసిన సమయంలో ఇవన్నీ ప్రారంభించగా నగర అదనపు కమిషనర్‌గా పని చేసిన స్వాతి లక్రా ఇటు షీ టీమ్స్, అటు భరోసా కేంద్రాలను లీడ్ చేస్తూ వచ్చారు. స్వాతి లక్రా ఇటీవలే శాంతిభద్రతల ఐజీగా బదిలీ అయినా ఆమెకే ఉమెన్ సేఫ్టీ, భరోసా కేంద్రాల బాధ్యతను అప్పగించారు. ప్రస్తుతం ఏర్పాటు చేయాలని భావిస్తున్న స్పెషల్ యూనిట్‌కు ఐజీ స్వాతి లక్రానే చీఫ్‌గా ఉంటారని పోలీసు ఉన్నతాధికారుల ద్వారా తెలిసింది. ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలు, త్వరలో చేపట్టబోయే కార్యక్రమాలను సైతం ఆమె విజయ వంతం చేయగలరన్న నమ్మకంతో పోలీసుశాఖ ఉంది. -
24 గంటలూ ప్రజా సేవలోనే..
సాక్షి, హైదరాబాద్: ఏడు రోజులు... 24 గంటలు... ప్రజలకు సేవలందించడంలో ముందుంటామని సైబరాబాద్ నూతన పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ అన్నారు. బుధవారం గచ్చిబౌలి లోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సందీప్ శాండిల్యా నుంచి కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐటీ కారిడార్‌లోని ఐటీ కంపెనీలతో పాటు ఇతర సంస్థల్లో భద్రత కట్టుదిట్టం చేస్తామని, సైబర్ నేరాల నియంత్రణ కు ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. మహి ళల అక్రమ రవాణాను అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కమిషనరేట్ పరిధిలో సీసీటీవీ కెమెరాలను మరింత పెంచుతా మని చెప్పారు. స్నాచింగ్‌లు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తామన్నారు. మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టి.. మహిళలు, పిల్లలపై వేధింపులు ఎక్కువవుతున్నాయని, వీటి పూర్తిస్థాయి నియంత్రణకు సరికొత్త ప్రణాళికతో ముందుకెళతామన్నారు. కమ్యూనిటీ అండ్ సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు అధిక ప్రాధాన్యతనిస్తామని చెప్పారు. ఆర్థిక, వైట్ కాలర్ నేరాలను నియంత్రించడంతో పాటు ఆయా నేరాల తీరుపై ప్రజల్లో అవగాహన కలిగిస్తామన్నారు. సిబ్బంది సంక్షేమంతో పాటు మెరుగైన సేవలు అందించే వారికి ప్రత్యేక రివార్డులతో సత్కరిస్తామని, మరో పది రోజుల్లో కమిషనరేట్ పరిధిలోని అన్ని సమస్యలపై అధ్యయనం చేసి ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సైబరాబాద్ జాయింట్ సీపీ షానవాజ్ ఖాసీమ్, క్రైమ్స్ డీసీపీ జానకీ షర్మిలా, ట్రాఫిక్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్ పాల్గొన్నారు. నేపథ్యమిదీ... 1996(ఆర్ఆర్) ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన విశ్వనాథ్ చెనప్ప సజ్జనార్ మొదటగా వరంగల్ జిల్లాలోని జనగామలో, కడప జిల్లాలోని పులివెందులలో ఏఎస్పీగా పనిచేశారు. ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, నల్లగొండ, కడప, గుంటూరు, సీఐడీ ఆర్థిక నేరాల విభాగం, మంగళగిరి ఆరో బెటాలియన్ కమాండెంట్‌గా, వరంగల్, ఆక్టోపస్‌లో, మెదక్‌లో అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా సేవలందించారు. ఇంటెలిజెన్స్ విభాగ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా పనిచేసి సైబరాబాద్ పోలీసు కమిషనర్‌గా నియమితులయ్యారు. -
మహిళల భద్రత దైవాదీనం!
- రాష్ట్రంలో నాలుగు నెలల్లో 5,673 మంది మహిళలపై అకృత్యాలు - ఆందోళన కలిగిస్తున్న అత్యాచారాలు.. - ఎస్సీ, ఎస్టీ మహిళలపై మితిమీరిన అఘాయిత్యాలు - పలు జిల్లాల్లో పెరిగిపోయిన హత్యలు.. కిడ్నాప్‌లు.. - వీటికి తోడు కలవరపెడుతున్న రోడ్డు ప్రమాదాలు.. ఆస్తి తగాదాలు - ‘నేరా’oధ్రప్రదేశ్‌గా మారిందని జిల్లా కలెక్టర్ల సదస్సు నివేదిక స్పష్టీకరణ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయా? మహిళలపై నేరాలు, అఘాయిత్యాలు పెరిగిపోయాయా? వీటికి తోడు హత్యలు, కిడ్నాప్‌లు, ఆస్తుల గొడవలు, రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా పెరిగిందా? తదితర ప్రశ్నలకు జిల్లా కలెక్టర్ల నివేదిక అవుననే చెబుతోంది. ఈ ఏడాది ఏప్రిల్– జూలై (4 నెలలు) మాసాల మధ్య ఏకంగా 5,673 మంది మహిళలు వివిధ ఘటనల్లో బాధితులయ్యారని, పిల్లలపై అఘాయిత్యాలతో పాటు ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాలు కూడా పెరిగిపోయాయని ఆయా జిల్లాల కలెక్టర్లు నివేదించారు. బుధవారం నుంచి ప్రారంభమైన రెండు రోజుల జిల్లా కలెక్టర్ల సదస్సు నివేదిక ద్వారా ఈ వివరాలు వెలుగు చూశాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలను అరికడుతున్నామని, ఎక్కడ ఏం జరిగినా చిటికెలో పసిగడుతున్నామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం మహిళలపై నేరాలను తగ్గించడంలో, రోడ్డు ప్రమాదాలను నివారించడంలో వైఫల్యం చెందినట్లు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సీసీటీవీలు, కమాండ్ కంట్రోల్ కేంద్రాలు ఉన్నప్పటికీ మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయినట్లు నివేదిక ఎత్తి చూపింది. చిత్తూరులో మినహా మిగతా అన్ని జిల్లాల్లో నాలుగు నెలలుగా వివిధ ఘటనల్లో మహిళా బాధితుల సంఖ్య పెరిగినట్లు స్పష్టం చేసింది. ఏప్రిల్ నుంచి జూలై వరకు అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో మహిళలపై నేరాలు, అఘాయిత్యాలు బాగా పెరిగిపోయాయి. రాజధాని ప్రాంతమైన గుంటూరు, కృష్ణా జిల్లాల్లో సైతం నాలుగు నెలల్లో 400 మంది చొప్పున మహిళలు వివిధ ఘటనల్లో బాధితులుగా నమోదవ్వడం గమనార్హం. ఇందులో చైన్ స్నాచింగ్ ఘటనలు కూడా ఉన్నాయి. వీధి వీధినా సీసీటీవీలున్నా నిందితులను పట్టుకుని, సొమ్ము రికవరీ చేయడంలో ఆశించిన ప్రగతి లేదు. రాజధాని ప్రాంతంలోని కాలనీల్లోనే మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లేందుకు జంకుతున్నారంటే ఇతర ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు నిజంగా పని చేస్తున్నాయా.. లేక మొక్కుబడిగా బిగించి చేతులు దులుపుకున్నారా.. అనే సందేహం కలుగుతోంది. ఇదే నాలుగు నెలల వ్యవధిలో ఇతర రాష్ట్రాల్లో చోటుచేసుకున్న ఘటనలు ఇందులో పాతిక వంతు కూడా లేకపోవడం గమనార్హం. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ మహిళలపై అత్యాచారాలకు అంతే లేకుండా పోయింది. నాలుగు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 771 కేసులు నమోదైతే ఒక్క నెల్లూరులోనే 106 కేసులుండటం ఆందోళన కలిగిస్తోంది. పలు రాష్ట్రాల్లో ఇలాంటిది ఒక్క ఘటన కూడా చోటుచేసుకోలేదు. ఈ లెక్కన రాష్ట్రంలో శాంతిభద్రతలు, నేరాలు అదుపు తప్పాయనడానికి ఇంతకంటే నిదర్శనం అక్కర లేదని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. పెరిగిపోయిన రోడ్డు ప్రమాదాలు రాష్ట్రంలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు జరిగిన 6,211 రోడ్డు ప్రమాదాల్లో 2,661 మంది మృతి చెందినట్లు కలెక్టర్ల నివేదిక స్పష్టం చేసింది. తూర్పుగోదావరి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అత్యధికంగా రోడ్డు ప్రమాద ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ మూడు జిల్లాల్లో నాలుగు నెలల్లో 700 చొప్పున ప్రమాదాలు జరిగాయి. రాష్ట్రంలో ఆస్తి తగాదాల నేరాలు కూడా నాలుగు నెలలుగా బాగా పెరిగిపోయాయి. ఏకంగా 5,688 ఘటనలు నమోదు కావడం అటు ఉన్నతాధికారులు, ఇటు ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. వైఎస్ఆర్, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 400 చొప్పున ఈ తరహా ఘటనలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. -
మహిళల పరిస్థితి (ఆవుల)కంటే దారుణంగా..
ఆవు తలను మాస్క్‌గా పెట్టుకొని సరదాగా ఫొటో దిగిందనుకుంటున్నారా? నిజమే ఈ ఫొటోలను చూస్తే ఎవరైనా ఇలాగే అనుకుంటారు. కానీ ముంబైకి చెందిన ఈ యువతి ఓ ఉన్నత లక్ష్యంతో ఇలా ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టింది. ఇక ఈ ఫొటోల ద్వారా ఆమె చెప్పదల్చుకుందేంటంటే... దేశంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి. మహిళల భద్రత కోసం ఎన్ని చట్టాలు తీసుకొచ్చి అమలు చేస్తున్నా.. అడుగడుగునా దాడులు, దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే వీటిపై ఏ రాజకీయ నాయకులుగానీ, సంఘాలుగానీ పోరాడుతున్న సంఘటనలు చాలా తక్కువ. మరి ఈ విషయాన్ని చెప్పేందుకు ఆవు తల పెట్టుకోవడమెందుకంటరా..? గో సంరక్షణ పేరిట ఇటీవల జరుగుతున్న సంఘటనల గురించి తెలిసిందే. ఆవులను హింసిస్తున్నవారిపై, అక్రమంగా తరలిస్తున్నవారిపై దాడులకు పాల్పడేందుకు కూడా వెనుకాడడంలేదు. మరి మహిళల అక్రమ రవాణా, వారిపై జరుగుతున్న హింసాకాండ గురించి ఎంతమంది ఇంత తీవ్రంగా స్పందిస్తున్నారు? దేశంలో మహిళల పరిస్థితి పశువుల(ఆవుల)కంటే దారుణంగా ఉందని చెప్పేందుకే ఇలా చేసింది. నిజమే కదా... వినూత్నంగా ఆలోంచించినా.. ఆలోచింపజేసేదిగా ఉంది కదూ ఈ ప్రయత్నం! -
కిడ్నాప్ కేసుల కథ కంచికేనా?
- ముందుకు కదలని మహిళల అపహరణ కేసులు - అధికశాతం కేసులు దర్యాప్తులోనే.. - అందుబాటులోకి రాని ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు సాక్షి, హైదరాబాద్: మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్న పోలీస్ శాఖ, వారిపై దాడులు, కిడ్నాపులకు సంబంధించిన కేసుల్లో మాత్రం ప్రత్యేక చర్యలు తీసుకోలేకపోతోంది. మహిళలను కిడ్నాపు చేసిన కేసులు ఏళ్ల పాటు దర్యాప్తు దశలోనే ఉండిపోతున్నాయి. కేసుల దర్యాప్తు పరిస్థితి ఏంటి? ఎంతవరకు వచ్చిందన్న అంశాలపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టకపోవడమే శిక్షల శాతం పెరగకపోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. ఎందుకీ పరిస్థితి? అపహరణకు గురైన మహిళలను రక్షించడంలో 45శాతం సఫలమవుతున్న పోలీసులు ఆ మేరకు నిందితులకు శిక్షపడేలా చేయడంలో అలసత్వం వహిస్తున్నారని అపవాదు ఎదుర్కొంటున్నారు. సరైన ఆధారాలు సేకరించకపోవడం, మిగతా లింకును బయటపెట్టకపోవడంతో నిందితులు సులభంగా తప్పించుకోగులుగుతున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులేవీ?.. ప్రత్యేకంగా మహిళలకు సంబంధించిన కేసుల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని పదే పదే చెబుతున్న ప్రభుత్వం ఆ వైపు దృష్టి సారించకపోవడం కూడా శిక్షల శాతం పెరగకపోవడంలో మరో ప్రధాన కారణంగా నిలుస్తోంది. కోర్టుల్లో విచారణ పెండింగ్‌లో ఉన్న కేసులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా మానిటరింగ్ వ్యవస్థను తీసుకు రావాల్సిన పోలీస్ శాఖ అటువైపు ఆలోచించడం కూడా మానేసింది. 2014 నుంచి 2016 డిసెంబర్ వరకు మహిళల కిడ్నాప్, అక్రమ రవాణా, వ్యభిచార కూపంలోకి దింపిన సంఘటనల్లో కేసులు 2,046 వీటిలో తప్పుడు కేసులనే కారణంతో మూసివేసినవి 472 దర్యాప్తునకు స్వీకరించిన కేసులు 1,574 కేవలం కిడ్నాపునకు సంబంధించి దర్యాప్తు దశలోనే ఉన్న కేసులు 493 కిడ్నాపు కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డ కేసులు 6.5% -
అయ్యో..! అతివ
రాజధాని నగరంలో మహిళల భద్రత ప్రశ్నార్థకమే విజయవాడలో హడలెత్తిస్తున్న మహిళలపై నేరాలు 2016లో అమాంతంగా పెరిగిన కేసుల సంఖ్య ‘శాంతిభద్రతలు... ప్రత్యేకించి మహిళల భద్రత విషయంలో అత్యంత కఠినంగా ఉంటాం. అమరావతి ప్రాంతాన్ని ప్రజా రాజధానిగా తీర్చిదిద్దుతాం’అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనంగా చెప్పుకుంటున్నారు. కానీ విజయవాడలో మహిళల భద్రత గాలిలో దీపంలా మారింది. మహిళలకు ఏమాత్రం రక్షణలేని, దాడులు పెరుగుతున్న నగరంగా విజయవాడ రూపాంతరం చెందుతుండటం ఆందోళన కలిగిస్తున్న వాస్తవం. – సాక్షి, అమరావతిబ్యూరో సాక్షి, అమరావతిబ్యూరో : విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మహిళలకు రక్షణ లేకుండాపోయింది. మహిళా హత్యలు, వరకట్న హత్యలు, వేధింపులు, ఆత్మహత్య చేసుకునేలా వేధింపులు, లైంగికదాడులు... ఇలా అన్ని రకాల కేసులు పెరుగుతున్నాయి. 2015 కంటే 2016లో నగర పరిధిలో మహిళలపై దాడులు, వేధింపుల కేసులు బాగా పెరిగాయి. 2015లో మొత్తం 464 కేసులు నమోదయ్యాయి. 2016లో ఏకంగా 760 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్న వాస్తవం. అంటే నేరాలు 63 శాతం అధికమయ్యాయి. ► 2015లో ఒక్క వరకట్న హత్య కూడా లేదు. 2016లో ఐదు వరకట్న హత్యలు జరిగాయి. ► మహిళలపై వివిధ రకాల వేధింపుల కేసులు 2015లో 175 నమోదయ్యాయి. 2016లో ఏకంగా 411 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ► కమిషరేట్ పరిధిలో మహిళలపై లైంగిక దాడులు అమాంతం పెరుగుతున్నాయి. 2015లో నగరంలో లైంగికదాడులు కేసులు 53 నమోదయ్యాయి. 2016లో 70 నమోదు కావడం ఆందోళనకరంగా మారింది. ► మహిళలను అపహరించిన కేసులు 2015లో 21 నమోదయ్యాయి. 2016లో 26 కేసులు నమోదు కావడం గమనార్హం. ► మహిళలపై దాడులకు పాల్పడి వారి గౌరవానికి భంగం కలిగిస్తున్న కేసులు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. 2015లో ఇలాంటి కేసులు 156 నమోదయ్యాయి. 2016లో 198 కేసులు నమోదు కావడం మహిళలపై పెరుగుతున్న దాడులకు నిదర్శనం. ► 2015లోనూ, 2016లోనూ నగర పరిధిలో వరకట్న వేధింపుల వల్ల ఆత్మహత్యలు 10 చొప్పున నమోదయ్యాయి. ► ఆత్మహత్య చేసుకునేలా వేధింపులకు గురిచేసిన కేసులు కూడా 2015లో 25 ఉండగా, 2016లో 24 నమోదయ్యాయి. లైంగికదాడులను అరికట్టలేరా! మహిళలపై నేరాల్లో లైంగికదాడులు, వేధింపులు పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రాజధానిగా రూపాంతరం చెందిన తరువాత నగరంలో లైంగికదాడు లు అధికం కావడం విస్మయకర వాస్తవం. ► 2012లో 47, 2013లో 40 లైంగిక దాడులు జరిగాయి. 2014 నుంచి పెరుగుతూ వస్తున్నాయి. 2014లో 61, 2015లో 53 కేసులు నమోదయ్యాయి. 2016లో ఏకంగా 70 కేసులు నమోదు కావడం గమనార్హం. ప్రభుత్వం ఏం చేస్తున్నట్టో...! ముఖ్యమంత్రి చంద్రబాబు సహా అధికార యంత్రాంగం అంతా విజయవాడలోనే కేంద్రీకృతమై ఉంది. కానీ రాజధానికి తగ్గట్లుగా రక్షణ వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేయ లేదు. కేవలం వీఐపీల భద్రత, హంగు ఆర్భాటాలకే పోలీసు వ్యవస్థను వాడుకుంటు న్నారు. దాంతో సామాన్యులకు ప్రత్యేకించి మహిళల రక్షణపై దృష్టిసారించలేకపోతు న్నామని పోలీసు వర్గాలే చెబుతుండటం గమనార్హం. సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చిన తరువాత కూడా... మహిళలపై వేధింపులు, దాడులకు సంబంధించిన కేసులను ఏకపక్షంగా నమోదు చేయొద్దని 2014లో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. మొదట ఇరువర్గాలతో మాట్లాడి వాస్తవాలను తెలుసుకోవాలని పోలీసులను ఆదేశించింది. అప్పటి నుంచి వచ్చిన ఫిర్యాదులను యథాతథంగా కేసులుగా నమోదు చేయడం లేదు. ఇరువర్గాలతో సంప్రదించి వీలైనంతవరకు రాజీ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. దాంతో కేసుల సంఖ్య తగ్గుతుందని అంతా భావించారు. కానీ 2014 తరువాత విజయవాడలో మహిళలపై దాడులు, వేధింపుల కేసులు మాత్రం అమాంతంగా పెరుగుతూనే ఉన్నాయి. అంటే నేరాల తీవ్రత ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది. -
మహిళల భద్రతకు పటిష్ట చర్యలు
► ఆదిలాబాద్,ఉట్నూర్‌లలో షీటీంలు ► ఎస్పీ శ్రీనివాస్ ఆదిలాబాద్ క్రైం : జిల్లాలో మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తామని ఎస్పీ ఎం.శ్రీనివాస్ పేర్కొన్నారు.మంగళవారం తన కార్యాలయంలో షీ టీం బృందాలతో సమావేశమయ్యారు. షీటీంల బ్యానర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు వ్యవస్థలో ఆర్థిక నేరాలను అరికట్టడంతో పాటు మహిళల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నూతనంగా ఆదిలాబాద్‌లో రెండు, ఉట్నూర్‌లో ఒక షీటీంలు ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల 8మంది మహిళాపోలీసులతో పాటు నలుగురు కానిస్టేబుళ్లకు హైదరాబాద్‌లోని అంబర్పేట్ శిక్షణ కేంద్రంలో రెండు వారాలు శిక్ష ణ ఇచ్చినట్లు వివరించారు. త్వరలో స్థానికపోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో షీటీం సభ్యులకు కరాటే శిక్షణ ఇస్తామన్నారు. నేరాలకు సంబంధించిన ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తుగా నియంత్రించడానికి పనిచేయాలని సూచించారు. సీసీఎస్ డీఎస్పీ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో రోజువారీ కార్యక్రమాల నిర్వహణ ఉంటుందన్నారు. మహిళలు నిర్భయంగా ఉండాలని, ఎలాంటి సమస్యలున్నా డయల్ 100, ఉమెన్స్ హెల్ప్‌లైన్ 1091కు సమాచారం అందించి రక్షణ పొందాలన్నారు. కాలేజ్, బస్టాం డ్, పార్కులు, సినిమాహాల్స్, రైల్వేస్టేషన్ తదితర ప్రాంతాల్లో నిఘా ఉంచాలని పేర్కొన్నారు. గురువారం షీటీం బృంధాలకు నూతన యాక్టివ వాహనాలు అంది స్తామన్నారు. మహిళల రక్షణ కోసం షీటీంలు నిరంతరం కృషి చేయాలన్నారు. సీసీఎస్ డీఎస్పీ నర్సింహారెడ్డి, షీటీం సభ్యులు సర్దార్‌సింగ్, ఎం.రాధ, రామ్మూర్తి, లక్ష్మి, శంకర్, మౌనిక, సరిత, శ్రీనివాస్, అనిత, సుశీల, సుగుణ, సీసీ పోతరాజు ఉన్నారు. -
అతివల భద్రతకు షీ–సేఫ్ యాప్
సాక్షి, సిటీబ్యూరో: అతివల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్న సైబరాబాద్ వెస్ట్ పోలీసులు ‘షీ–సేఫ్’ పేరిట యాప్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. ఐటీ కారిడార్‌లో పనిచేసే మహిళా ఉద్యోగులతో పాటు మహిళలకుSకనీస రక్షణ కల్పించడమే ధ్యేయంగా సొసైటీఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్(ఎస్సీఎస్సీ) దీనిని రూపొందించింది. పైలట్ పద్ధతిన మరో రెండు వారాల్లో దీనిని అందుబాటులోకి తేనున్నారు. ఈ యాప్ ద్వారా అపదలో ఉన్న మహిళలతో పాటు ప్రయాణంలో దారి తప్పి గమ్యం చేరలేని పరిస్థితితో ఉన్న వారిని తక్షణం రక్షించేందుకు వీలుంటుందని పోలీసులు భావిస్తున్నారు. అమ్మాయిలు తమ సెల్ఫోన్లలో ఈ యాప్‌ను నిక్షిప్తం చేసుకుని.. తమ వివరాలను నమోదు చేసుకుంటే చాలు. సైబరాబాద్ పోలీసులు, ఎస్సీఎస్సీ ప్రతినిధులు ఆ వివరాలన్నింటినీ డయల్ –100తో పాటు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లోని పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేస్తారు. ఈ యాప్‌ను మహిళలు తమ సెల్ఫోన్లో నిక్షిప్తం చేసుకుంటే నమ్మకమైన నేస్తం వారి వెంట ఉన్నట్టేనని పోలీసులంటున్నారు. ఎక్కడున్నా వచ్చేస్తారు... ఇప్పుడు చాలా మంది ఆండ్రాయిడ్ సౌకర్యం ఉన్న ఫోన్లనే వాడుతుండటంతో ఆయా ఫోన్లను జీపీఎస్ వ్యవస్థతో అనుసంధానం చేస్తారు. ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసి వివరాలు పొందుపరిచిన అమ్మాయిలు ఆపద సమయాల్లో యాప్‌లో ఉన్న మీట నొక్కితే కమాండ్ కంట్రోల్ సెంటర్‌కి సందేశం వెళ్లేలా ఫీచర్స్ రెడీ చేశారు. బాధితులు వీడియోలు, ఫొటోలు పంపించవచ్చు. ఒంటరి ప్రయాణంలో దారి తప్పి గమ్యం చేరలేని పరిస్థితి ఉంటే అక్కడి ప్రదేశాన్ని వీడియో తీసి పంపడంతో పాటు వాయిస్ రికార్డు చేసి పోలీసులకు చేరవేసేలా ఫీచర్‌ను సిద్ధం చేశారు. వీటన్నింటితో పోలీసులు అప్రమత్తమై బాధితురాలి సెల్‌ఫోన్ నంబర్‌ను ట్రాక్ చేసి ఎక్కడుందో తెలుసుకొని సమీపంలో ఉన్న పోలీసులను అక్కడికి పంపిస్తారు. ప్రస్తుతం సైబరాబాద్ కమిషనరేట్లలోని పెట్రోలింగ్ వాహనాలన్నింటిలోనూ జీపీఎస్ ఉండటంతో బాధితురాలున్న చోటుకు సమీప గస్తీ వాహనానికి సమాచారమిస్తారు. ఆమె ఫోన్ అందుబాటులో ఉంటే తాము ఎంతసేపట్లో ఘటనాస్థలికి చేరుకుంటామో చెప్తారు. ఎవరైనా మహిళను కిడ్నాప్‌చేసి ఆమె సెల్‌ఫోన్‌ను పడేస్తే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆచూకీ కనుగొంటారు. అలాగే, అక్కడి పరిసరాల్లోని దుండగుల ఫోన్ నంబర్లను ట్రాక్ చేసి కూడా పట్టుకుంటారు. త్వరలోనే అందుబాటులోకి... మహిళల భద్రత కోసం అత్యంత ప్రాధాన్యమిస్తున్న సైబరాబాద్ పోలీసులు సరికొత్తగా షీ సేఫ్ యాప్ రూపొందించేందుకు ఎంతో సహకరించారు. అభయలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండటంతో పాటు మహిళా ఉద్యోగులు క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఉపయోగపడేలా ఈ యాప్ రూపుదిద్దుకుంది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న యాప్‌ల కంటే ఇది భిన్నమైనది. త్వరలోనే దీన్ని అందుబాటులోకి తెస్తాం. షీ సేఫ్ యాప్ సెల్ఫోన్లో ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలపై విస్తృత ప్రచారం చేస్తాం. – భరణి కుమార్ , కార్యదర్శి, ఎస్సీఎస్సీ -
సేఫ్టీ మంత్ర ‘షీ టీమ్స్’!
♦ మహిళల భద్రత చర్యలు అద్భుతమంటున్న నగరవాసులు ♦ 76 శాతం మందికి షీ టీమ్స్‌పై అవగాహన ♦ ఓ ఎన్జీవో సర్వేలో వెల్లడి సాక్షి, సిటీబ్యూరో: వాట్సాప్ ద్వారా వేధింపులపై పీడీ యాక్ట్... సెల్‌ఫోన్ ద్వారా మెసేజ్‌లతో వేధించిన అడ్వకేట్ అరెస్టు... సోషల్ మీడియా, ఫేస్బుక్ ద్వారా వేధించిన వారిపై కేసులు... బహిరంగ ప్రాంతాల్లో అమ్మాయిలను ఈవ్‌టీజింగ్ చేసిన వారిపై చర్యలు... ఇలా అతివలను బహిరంగ ప్రాంతాల్లో, కార్యాలయాల్లో వేధిస్తున్న వారి భరతం పడుతుండటంతో ‘షీ టీమ్స్’పై నగరవాసుల్లో రోజురోజుకు భరోసా పెరుగుతోంది. ఇందుకు తార్కాణమే ఓ స్వచ్ఛంద సేవా సంస్థ(ఎన్జీవో) నిర్వహించిన తాజా సర్వేలో 76 శాతం మంది మహిళలు షీ టీమ్స్ పనితీరు తెలుసని చెప్పడం. అంతే కాదు సేఫ్టీ మంత్ర షీ టీమ్స్ అని ముక్తకంఠంతో వారు నినదించారు. బస్సుస్టాప్‌లు, రైల్వేస్టేషన్లు, దేవాలయాలు, పార్కులు...ఇలా ఏ వీధిలోనైనా వేధింపులకు గురవుతున్నామని అమ్మాయిలు ఫిర్యాదుచేయడంతో సత్వరమే రంగంలోకి దిగి వారి వెకిలిచేష్టలను వీడియోలతో చిత్రీకరించి సాక్ష్యాలతో సహా కోర్టుకు సమర్పించి ఈవ్టీజర్ల ఆటకట్టిస్తున్నాయి షీటీములు. అంతేకాదు..వాట్సాప్, సామాజిక అనుసంధాన వేదికలైన ఫేస్బుక్, సెల్‌ఫోన్ ఎస్ఎంఎస్లు, సెల్‌ఫోన్ కాల్స్ ద్వారా వేధిస్తున్న వారినీ జైల్లో కూర్చోబెడుతున్నాయి. తమ తెలివితేటలతో తప్పించుకునేందుకు యత్నిస్తున్న నేరగాళ్లను ఆధునిక సాంకేతికతతో వారు ఉంటున్న జాడను గుర్తించి పట్టుకుంటున్నాయి. షీ టీమ్స్ మహిళల భద్రత విషయంలో వారి అభిమానం చూరగొనడం మంచి సక్సెస్‌గా భావిస్తున్నామని షీ టీమ్స్ ఇన్చార్జి స్వాతిలక్రా తెలిపారు. ‘నగరంలోని వివిధ హాట్స్పాట్లకు వెళ్లి షీ టీమ్స్ 548 మందిని సాక్ష్యాలతో రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నాయి. డయల్ 100, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఈ-మెయిల్లతో పాటు నేరుగా 1800 ఫిర్యాదులు వచ్చాయి. ఈ కేసులపై విచారణ చేసి ఇప్పటికే చర్యలు తీసుకున్నాం.కొందరిని కటకటాల్లోకి పంపగా, మరికొందరిని కౌన్సెలింగ్ నిర్వహించి మరోమారు వెకిలి చేష్టలు చేయవద్దని హెచ్చరిక చేసి పంపామ’ని ఆమె వివరించారు. వాట్సాప్ ద్వారా వేధించిన వ్యక్తిపై పీడీ యాక్ట్ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అడె రంజిత్ మహిళలకు అశ్లీల వీడియోలు, ఫొటోలు వాట్సాప్ ద్వారా పంపేవాడు. డబ్బులు ఇవ్వాలంటూ బ్లాక్మెయిల్ చేసేవాడు. ఈ వేధింపులు భరించలేని ఓ యువతి షీ టీమ్‌ను ఆశ్రయించడంతో అతడి ఫోన్‌కాల్స్‌ను పరిశీలించారు. ఇతని ఖాతాలో ఎంతో మంది బాధితులు ఉన్నారని గుర్తించారు. బాధితులిచ్చిన ఫిర్యాదుమేరకు ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్లో ఒకటి, మియాపూర్ ఠాణాల్లో రెండు కేసులు నమోదుచేసి అతడిని జైలుకు తరలించారు. అతడి నేరప్రవృత్తి, కేసుల తీవ్రతను పరిగణనలోకి తీసుకొని పీడీ యాక్ట్ నమోదుచేశారు. వృద్ధుడిపై... రిటైర్డ్ ఉద్యోగి అయిన విశ్వనాథమ్ తన మనవరాలిని స్కూల్‌కు తీసుకెళ్లి దింపేవాడు. ఇదే సమయంలో అతడి మనవరాలి స్నేహితురాలిని అసభ్యంగా తాకేవాడు. అతడి ప్రవర్తనతో విసిగిన పదేళ్ల బాలిక తన తల్లికి చెప్పి ఏడ్చింది. బాధితురాలి తల్లి స్కూల్ యజమాన్యానికి ఫిర్యాదు చేయగా తరగతిలోని సీసీ కెమెరాల్లోని ఫుటేజీలను చూడగా విశ్వనాథమ్ కావాలనే ఆ అమ్మాయిని వేధిస్తున్నాడనే విషయం స్పష్టంగా కనిపించింది. బాధితురాలి తల్లి ఫిర్యాదుమేరకు షీ టీమ్స్ ఐపీసీ 354(ఏ). పీవోసీఎస్‌వో యాక్ట్ సెక్షన్ 8 కింద కేసు నమోదు చేశారు. -
ఫ్యామిలీ 2015
365 రోజులు. అంటే ఎన్నో గంటలు. ఇంకెన్నో నిమిషాలు. లెక్కపెట్టలేనన్ని సెకండ్లు. అంతకంటే లెక్కలేనన్ని ఆవిష్కారాలు... జయాలు... అపజయాలు... కలగలిస్తే 2015. ఒక్కసారి చేయి కదిలిస్తే దాని వల్ల కదలిన గాలి... కొన్నేళ్ల తర్వాత తుపానుగా మారుతుందని ఒక మహాశయుడు చెప్పాడు. ఈ ఏడాదిలో జరిగిన ప్రతి చిన్న ఘటన... అలాగే ఎదిగి పెద్ద అలై ఈ ప్రపంచ స్వభావాన్ని మారుస్తుంది. మనమందరం మంచే కోరుకుంటాం. మంచే జరగాలని ప్రార్థిస్తాం. అవసరమైతే పోరాడతాం. 2015లో అలాంటి జయాలు, అపజయాలు కొన్ని మీ కోసం... మరింత రక్షణ షీ క్యాబ్స్ మహిళల భద్రత దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షీ క్యాబ్స్ సేవలు హైదరా బాద్‌లో ప్రారంభం అయ్యాయి. జీపీఎస్ సాంకేతిక పరిజ్ఞానం కలిగిన షీ క్యాబ్స్‌ను పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రంతో అనుసంధానం చేశారు. దాని వల్ల క్యాబ్‌ల కదలికలు ఎప్పటికప్పుడు ఈ కేంద్రంలో నమోదు అవుతాయి. సెప్టెంబర్ 8న ‘షీ క్యాబ్స్’ ప్రారంభం అయ్యాయి. మరింత న్యాయం కట్నం ఎప్పుడు అడిగినా నేరమే! వరకట్నం అనేది ఎప్పుడైనా అడిగే అవకాశముందని, పెళ్లి తర్వాత అడిగినా అది నేరమేనని ఓ కేసులో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. భార్యకు విషమిచ్చి, కాల్చి చంపిన కేసులో ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ వ్యక్తికి కింది కోర్టు గతంలో విధించిన జీవితఖైదును సుప్రీంకోర్టు సమర్థించింది. పెళ్లికి ముందు తాను ఎలాంటి కట్నం అడగలేదని, పెళ్లి తర్వాతే అడిగినందున దానిని పరిగణనలోకి తీసుకోరాదని భీమ్‌సింగ్ అనే వ్యక్తి చేసిన విజ్ఞప్తిని న్యాయమూర్తులు ఎం.వై.ఇక్బాల్, పినాకీ చంద్రఘోష్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. మరింత తెగువ యుద్ధ విమానాల పైలట్లు దేశంలోని సైనిక దళాల్లో నేరుగా యుద్ధక్షేత్రంలో పనిచేసే విభాగాల్లో మహిళా పైలట్లను నియమిస్తామని అక్టోబర్ 24న రక్షణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం వైమానిక దళ అకాడమీలో శిక్షణ పొందుతున్న బ్యాచ్‌లోంచి తొలి మహిళాయుద్ధ విమాన పైలట్లను కేంద్రం ఎంపిక చేస్తుంది. 2017 జూన్ నాటికి వారికి పూర్తిస్థాయిలో పైలట్ బాధ్యతలు అప్పగిస్తారు. ముందడుగు హర్యానాలో 21 మహిళా పోలీస్ స్టేషన్లు మహిళలకు మరింత భద్రత కల్పించే చర్యలో భాగంలో హర్యానా ప్రభుత్వం రాష్ట్రంలోని మొత్తం 21 జిల్లాలో పూర్తిగా మహిళా సిబ్బందితో పనిచేసే పోలీస్స్టేషన్లను ఆగస్టు 28న ప్రారంభించింది. ఈ స్టేషన్లలో స్త్రీలకు సబంధించిన వివిధ నేరాలు, కేసుల దర్యాప్తును మహిళా పోలీసులే నిర్వర్తిస్తారు. మేలిమి సంతకం నీతి ఆయోగ్ సీఈవో గా సింధుశ్రీ ప్రణాళికా సంఘం స్థానంలో కొత్తగా ఏర్పాటు అయిన ‘నీతి ఆయోగ్’ (భారత జాతీయ పరివర్తన సంస్థ)కు సీఈవోగా రిటైర్డ్ ఐఎఎస్ అధికారి సింధుశ్రీ ఖుల్లర్ నియమితులయ్యారు. సింధుశ్రీని నియమించినట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ జనవరి 10న వెల్లడించింది. అప్పటివరకు ఆమె ప్రణాళికా సంఘం కార్యదర్శిగా పని చేశారు. ఐరాస శాంతిస్థాపన ప్యానెల్లో సరస్వతీ మీనన్ ఐక్యరాజ్య సమితి సెక్రెటరీ జనరల్ బాన్‌కీ మూన్.. శాంతి స్థాపన కార్యక్రమాల సమీక్ష ప్యానల్లో భారత సామాజికవేత్త సరస్వతీ మీనన్‌ను నియమించారు. ఈ నియామకం ఐరాస జనరల్ అసెంబ్లీ, భద్రతా మండలి ఆమోదించిన నిబంధనలకు అనుగుణంగా జరిగింది. ప్యానెల్లో మొత్తం ఏడుగురు సభ్యులు ఉంటారు. ఈ సలహా బృందం బురుండీ, దక్షిణ సూడాన్ తదితర దేశాల్లో పర్యటించి, శాంతిస్థాపన చర్యలను సమీక్షిస్తుంది. అమెరికా విద్యామండలి అధిపతిగా భారతీయ మహిళ అమెరికా విద్యామండలి బోర్డ్ ఆఫ్ డెరైక్టర్ల ఛైర్‌పర్సన్‌గా భారతీయ అమెరికన్ మహిళ రేణూ కట్టర్ ఎన్నికయ్యారు. మార్చి16న వాషింగ్టన్లో జరిగిన విద్యామండలి 97వ వార్షిక సమావేశంలో ఆమెను ఎంపిక చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రేణు 2008 నుంచి యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ అధ్యక్షురాలిగా ఉన్నారు. మరెన్నో నవ్వులు బేటీ బచావో.. బేటీ పఢావో బాలికా సంక్షేమం, లింగ వివక్ష నిర్మూలన లక్ష్యాలుగా ‘బేటీ బచావో బేటీ పఢావో’ (ఆడపిల్లల్ని కాపాడండి... ఆడపిల్లల్ని చదవించండి) ప్రచార ఉద్యమాన్ని హరియాణలోని పానిపట్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 22న ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాలికలకు ఆర్థిక స్వావలంబన కల్పించే ‘సుకన్య సమృద్ధి యోజన’నను మోదీ ప్రారంభించారు. దీనిని బాలికలు తక్కువగా ఉన్న 100 జిల్లాల్లో అమలు చేస్తున్నారు. ఇది పదేళ్ల లోపు బాలికలకు ఎక్కువ వడ్డీ (9.1శాతం), ఆదాయపు పన్ను రాయితీ లభించే డిపాజిట్ పథకం. పుట్టినప్పటి నుంచి పదేళ్ల లోపు కనీసం వెయ్యి రూపాయల డిపాజిట్‌తో బ్యాంకుల్లోగానీ, పోస్టాఫీసుల్లోగానీ అకౌంట్ ప్రారంభించవచ్చు. అందులో ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా 1.5 లక్షల రూపాయలను డిపాజిట్ చెయ్యొచ్చు. ప్రారంభించిన నాటి నుంచి 21 ఏళ్లపాటు లేదా ఆ బాలికకు వివాహం అయ్యేంత వరకు ఆ అకౌంట్ క్రియాశీలంగా ఉంటుంది. బాలికకు 18 ఏళ్లు నిండిన తర్వాత ఉన్నత చదువుల కోసం పాక్షికంగా డబ్బును తీసుకోవచ్చు. మనో ధైర్యం మూడు మంచి ఆలోచనలు హిమ్మత్: మహిళల భద్రత కోసం ‘హిమ్మత్’అనే మొబైల్ అప్లికేషన్‌ను కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జనవరి 1న ఢిల్లీలో ఆవిష్కరించారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసులు ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ను రూపొందించారు. మహిళలు అత్యవసర పరిస్థితిలో వీలైనంత త్వరగా పోలీసులను అప్రమత్తం చేయడానికి ఇది పనికొస్తుంది. అభయం: ఆపదలో చిక్కుకున్నవారిని ఆదుకునేందుకు ఏపీ పోలీసులు ‘అభయం’ అనే నూతన వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. దీని కింద టోల్ ఫ్రీ నెంబర్ 040-7101-1800ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఈ వ్యవస్థ ద్వారా మిస్డ్‌కాల్ ఇచ్చిన రెండు నిమిషాల్లోనే బాధితులకు ఆపన్నహస్తం అందుతుంది. ఆరోగ్యలక్ష్మి: అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, పిల్లలకు ఒక పూట పోషకాలతో కూడిన సంపూర్ణ భోజనం అందించే కార్యక్రమాన్ని నూతన సంవత్సర కానుకగా తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ‘ఆరోగ్యలక్ష్మి’గా నామకరణం చేశారు. శిశు వికాసం ప్రతి నెలా టీకాల వారం వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా ప్రతి చిన్నారికీ టీకాలు అందేలా మిషన్ ఇంద్రధనుష్ ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్చి 23న ఢిల్లీలో ప్రారంభించింది. ఈ ఏడాది తొలి విడతలో దేశవ్యాప్తంగా 201 జిల్లాల్లో ఈ సంపూర్ణ టీకా కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇందులో తెలంగాణ నుంచి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలను, ఆంధ్రప్రదేశ్ నుంచి తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణ, కర్నూలు, విశాఖపట్నం జిల్లాలను ఎంపిక చేశారు. బుజ్జి అడుగు శిఖరంపై చిచ్చర పిడుగులు ఇద్దరు భారత చిన్నారుల అరుదైన రికార్డును నెలకొల్పారు. పిన్న వయసులో ఎవరెస్టు శిఖరం బేస్ క్యాంప్‌ను అధిరోహించిన వారిగా రికార్డుల కెక్కారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన కందర్ప్ శర్మ, రిత్విక 5380 మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్టు శిఖరం బేస్‌క్యాంపు వద్దకు ఆగస్టు 10న చేరుకున్నారు. కందర్ప్ వయసు 5 ఏళ్ల 10 నెలలు. రిత్విక వయసు 8 ఏళ్ల 11నెలలు. ఆగస్టు 2న వీరు ప్రయాణం మొదలు పెట్టారు. మహా విజయం ప్రపంచ నెంబర్ వన్ సైనా నెహ్వాల్ హైదరాబాద్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ మహిళల విభాగంలో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్‌ను దక్కించుకున్నారు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా గుర్తింపు పొందారు. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రకాశ్ పదుకొనే 1980లో నెంబర్ వన్ ర్యాంక్ దక్కించుకున్నారు. మరువలేని విషాదం విలవిలలాడిన పసిప్రాణం విజయవాడ కృష్ణలంకలో నివసిస్తున్న చావలి నాగ చిరుద్యోగి. బట్టల షాపులో గుమస్తా. భార్య లక్ష్మి రెండో కాన్పుకు సిద్ధమైంది. ఆగస్టు 17న మగబిడ్డకు జన్మనిచ్చింది. కానీ పుట్టుకతోనే ఆ పసికందులో అసాధారణ శారీరక సమస్య... కన్జెనిటల్ ఎనామలీ కనిపించింది. వైద్యులు చూసి శస్త్ర చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లమన్నారు. అదొక నరకమనీ, యమభటులు అక్కడ ఎలుకల రూపంలో తిరుగుతుంటారనీ తెలియని ఆ అమాయక తల్లితండ్రులు ఎన్నో ఆశలతో బిడ్డను తీసుకు వెళ్లారు. ఆగస్టు 16న ఆపరేషన్ జరిగింది. బిడ్డను ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచారు. బాలింతరాలైన తల్లి కూడా అక్కడే ఉంది. ఐసీయూ అంటే ఇరవై నాలుగు గంటలూ సిబ్బంది పర్యవేక్షణలో ఉండే అత్యవసర చికిత్సా గది. డ్యూటీ డాక్టర్లు, నర్సులు, ఆయాలు తిరుగుతూనే ఉండాలి. కానీ ఆగస్టు 23 న బాబు కాలి వేళ్ల నుంచి, చేతి వేళ్ల నుంచి రక్తం కారుతూ కనిపించింది! ఎలుకలు కొరికాయి. తల్లి గమనించి, ఫిర్యాదు చేస్తే... ఆ రోజుల పసిగుడ్డు ఎలుక కాటు వల్ల ఎంత బాధ పడి ఉంటాడో, ఎంత నొప్పిని అనుభవించి ఉంటాడో అన్న కనీస స్పందన కూడా లేకుండా... డాక్టర్లు నిర్లక్ష్యం చేశారు. ఆశలు వదులుకోండి అన్నారు. వైద్యం చేయకుండా వదిలేశారు. ఆ పసికందు చనిపోయాడు. ఈ అమానుష ఘటన రాష్ర్టవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ నవ్వు గుర్తొస్తూనే ఉంటుంది! ముంబైతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలుగు యువతి ఎస్తేర్ అనూహ్య హత్య కేసులో దోషి చంద్రభాన్ సానప్ అలియాస్ లౌక్యాకు ఉరిశిక్ష పడింది. ఈ కేసుకు సంబంధించి అక్టోబర్ 30న న్యాయమూర్తి వృషాలీ జోషీ శిక్షను ఖరారు చేశారు. 2014 జనవరి 5న లోకమాన్య తిలక్ (కుర్లా) టెర్మినస్ నుంచి అదృశ్యమైన ఎస్తేర్ అనూహ్య 2014 జనవరి 16వ తేదీన కంజూర్ మార్గ్-ఖండూప్ల మధ్య శవమై తేలింది. ఈ కేసులో నిందితుడైన చంద్రభాన్‌ను అక్టోబర్ 27న కోర్టు దోషిగా నిర్ధారించి, 30న శిక్ష ఖరారు చేసింది. ఆ కార్టూన్లు మరి లేవు! తన కార్టూన్లతో నవ్వులు పూయించిన రాగతి పండరి (50) అనారోగ్యంతో విశాఖపట్నంలో ఫిబ్రవరి 19న మరణించారు. పోలియో వల్ల రెండు కాళ్లూ బలహీన పడినా తెలుగునాట ఆమె కార్టూన్ మాత్రం దిటవుగా బలంగా నిలబడగలిగింది. ఉమన్ కార్టూనిస్ట్‌గా ఆమె విజయం స్ఫూర్తిదాయకం. ర్యాగింగ్‌కు బలైన రిషితేశ్వరి జులై 14 గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ హాస్టల్ గదిలో ఎం. రిషితేశ్వరి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సీనియర్స్ వేధింపుల కారణంగా తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తన డైరీలో రాసుకుంది రిషితేశ్వరి. జడలు విప్పిన ర్యాగింగ్ భూతం రిషితేశ్వరిని పొట్టనపెట్టుకున్న తీరు తెలుగురాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసింది. వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన మురళీకృష్ణ, దుర్గాబాయిల ఏకైక కూతురు రిషితేశ్వరి. కాలేజీ ఫ్రెషర్స్ డే వేడుకలలో ఆమె సీనియర్ల వేధింపులకు గురైంది. ఆ తర్వాత వాళ్లు కొన్ని రోజుల పాటు రిషితేశ్వరి వెంటపడి మానసికంగా, శారీరకంగా వేధించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె తల్లిదండ్రులకు కూడా ఈ విషయం చెప్పుకోలేక హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృతి చెందింది. మహానటి మరణం ప్రముఖ తమిళ నటి మనోరమ (78) అక్టోబర్ 10న అనారోగ్యంతో కన్నుమూశారు. తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో సుమారు 1500 చిత్రాల్లో ఆమె నటించారు. అత్యధిక చిత్రాల్లో నటించిన నటిగా గిన్నిస్ రికార్డు సృష్టించారు. అస్తమించిన అరుణ లైంగికదాడికి గురైనప్పుడు తీవ్రంగా గాయపడి 42 ఏళ్లుగా కోమాలో ఉన్న మాజీ నర్సు అరుణా షాన్‌బాగ్ (65) మే 18న తుదిశ్వాస విడిచారు. ఆమెకు కొన్ని రోజులుగా న్యూమోనియా తీవ్రం కావడంతో వెంటిలేటర్‌పై ఉంచి, చికిత్స చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ముంబైలోని కేఈఎం ఆసుపత్రి నర్సుగా పని చేస్తున్న అరుణపై 1973 నవంబర్ 27న వార్డుబాయ్ సోహన్‌లాల్ లైంగిక దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచాడు. ఇనుప గొలుసుతో బంధించాడు. గొలుసును విడిపించుకునే ప్రయత్నంలో తలకు గట్టి దెబ్బ తగలడంతో మెదడుకు రక్తసరఫరా నిలిచిపోయింది. దీంతో అప్పటి నుంచి ఆమె కోమాలో ఉంది. ప్రపంచంలోనే అత్యధిక సంవత్సరాలు కోమాలో ఉన్న అరుణను కేఈఎం ఆసుపత్రి నర్సులు 42 ఏళ్ల పాటు అనుక్షణం కంటికి రెప్పలా చూసుకున్నారు. మృత్యువుతో ఆమె చేసిన పోరాటానికి వాళ్లంతా అండగా నిలిచి అన్ని రకాల సేవలు అందించారు. ప్రాణం తీసిన నిర్లక్ష్యం... ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి పుష్కరాల్లో తొలిరోజు విషాదం చోటు చేసుకుంది. జూలై 14న రాజమండ్రి పుష్కరఘాట్‌లో జరిగిన తొక్కిసలాటలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయినవారిలో 24మంది మహిళలే. ఇంటికి కొడుకు...పర్వతానికి ముద్దుబిడ్డ పర్వతారోహకుడు మల్లె మస్తాన్‌బాబు (40) అర్జెంటీనా, చిలీ మధ్య ఉన్న ఆండిస్ పర్వతాల్లో మరణించినట్లు ఏప్రిల్ 4న గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన మస్తాన్‌బాబు ఇంజినీరింగ్ పట్టభద్రుడు. 7 ఖండాల్లోని 172 దేశాల్లో 7 పర్వతాలను అధిరోహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం పొందారు. -
బస్.. నిబంధనలు తుస్స్...
సిటీబ్యూరో: సిటీ బస్సుల్లో మహిళా భద్రత ఒక వెక్కిరింతగా మారింది. మహిళా ప్రయాణికుల భద్రత కోసం రూ.4 కోట్లతో ఏర్పాటు చేసిన మెటాలిక్ డోర్లు అలంకారప్రాయంగా మిగిలిపోయాయి. ఈ లోహపు తలుపులను ఏర్పాటు చేయడం వరకే పరిమితమైన ఆర్టీసీ అధికారులు పర్యవేక్షణ బాధ్యతను విస్మరించారు. సిబ్బంది మరో అడుగు ముందుకేశారు. ఏకంగా ఆ డోర్లను తాళ్లతో కట్టేశారు. దీంతో పురుషులు యథేచ్ఛగా మహిళల సీట్ల మధ్యలోకి వచ్చేస్తున్నారు. మహిళల కోసమే కేటాయించిన ముందు భాగంలోని ప్రవేశ ద్వారం నుంచి లోపలికి ప్రవేశిస్తున్నారు. మరోవైపు ఇప్పటికీ కొన్ని బస్సుల్లో మెటాలిక్ డోర్లు ఏర్పాటు చేయనేలేదు. ఎక్కడా ఎలాంటి నియంత్రణ లేకుండా పోయింది. ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సుల్లో ఉండే రద్దీని దృష్టిలో ఉంచుకొని మహిళలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా గౌరవప్రదంగా ప్రయాణించేందుకు ఏర్పాటు చేసిన ద్వారం ముణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలింది. నగరంలో మహిళల భద్రత కోసం పూనం మాలకొండయ్య నేతృత్వంలోని మహిళా భద్రతా కమిటీ ప్రభుత్వానికి పలు సిఫార్సులు చేసిన సంగతి తెలిసిందే. షీటీమ్స్, షీక్యాబ్స్, సిటీ బస్సుల్లో ప్రత్యేక ఏర్పాట్లు వంటి అంశాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్‌లోని 2,600 ఆర్డినరీ బస్సులకు రూ.4 కోట్లతో ఈ మెటాలిక్ డోర్లను ఏర్పాటు చేశారు. దశలవారీగా మిగతా బస్సులకు సైతం ఈ సదుపాయాన్ని విస్తరించనున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పుడు 90 శాతం బస్సుల్లో ఆ మెటాలిక్ డోర్లు బార్లా తెరుచుకుంటున్నాయి. మరోవైపు ఈ డోర్లను ఏకంగా తాళ్లతో కట్టేసి ఉంచడం గమనార్హం. ఆర్టీసీ బాధ్యతారాహిత్యం... ‘మహిళలను గౌరవిద్దాం. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం..’ ఆర్టీసీ బస్సుల్లో కనిపించే నినాదం ఇది. కానీ అమలులోనే ఆచరణకు నోచుకోవడం లేదు. బస్సుల నిర్వహణలో అధికారుల నిఘా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ముందు ప్రవేశద్వారం నుంచి పురుషులు ఎక్కినా.. దిగినా.. మహిళల సీట్లలో కూర్చున్నా గతంలో జరిమానా విధించే పద్ధతి ఉండేది. అలాగే ఫుట్‌బోర్డు ప్రయాణం పట్ల కూడా నిఘా ఉంచేవారు. కానీ కొంతకాలంగా ఆర్టీసీ బస్సుల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఎలాంటి నిఘా, పర్యవేక్షణ లేకుండా పోయింది. సీసీ కెమెరాలు కూడా అంతేసంగతులు.. ఆర్డినరీ బస్సులకు ఏర్పాటు చేసిన విధంగానే మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు, మెట్రో డిలక్స్లతో పాటు మొత్తం 3,850 బస్సుల్లోనూ నిఘాను కట్టుదిట్టం చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. ఇందుకోసం జీపీఎస్‌తో అనుసంధానం చేసిన చేసిన బస్సుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కనీసం 48 గంటల పాటు రికార్డయ్యే సామర్థ్యం ఉన్న సీసీ కెమెరాలను బస్సు లోపలి వైపు ఏర్పాటు చేసే ప్రతిపాదన ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. కేవలం 80 సిటీ ఓల్వో బస్సులకే అది పరిమితమైంది. దర్జాగా కూర్చుంటారు ఆడవాళ్ల సీట్లలో కూర్చోవద్దనే కనీస మర్యాద కూడా పాటించడం లేదు. దర్జాగా వచ్చి కూర్చుంటున్నారు. కండక్టర్లు, డ్రైవర్లు వారిని ఏ మాత్రం నియంత్రించడం లేదు. ఇక వెనుక వైపు నుంచి ఎక్కిన వాళ్లు కూడా క్రమంగా ముందుకు చొచ్చుకొని వస్తున్నారు. మెటాలిక్ డోర్లు పూర్తిగా తెరిచే ఉంటాయి. ఇప్పుడు వాటి వల్ల ఎలాంటి భద్రతా లేకుండా పోయింది. -మాలతి, కూకట్పల్లి ఫుట్‌బోర్డు కిక్కిరిసిపోతుంది ఉదయం, సాయంత్రం బాగా రద్దీ ఉండే సమయాల్లో స్టూడెంట్స్ గుంపులు గుంపులుగా వచ్చేస్తున్నారు. అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా ముందు డోర్ నుంచి ఎక్కేసి అక్కడే ఉండిపోతున్నారు. దీంతో మహిళలు బస్సులోకి ఎక్కాలన్నా, దిగాలన్నా కష్టంగా ఉంటుంది. -శిరీష , చందానగర్ డోర్లు ఉండి ఏం లాభం చూడ్డానికి అన్ని బస్సుల్లో ఈ డోర్లు కనిపిస్తున్నాయి. కానీ ఎప్పుడు చూసినా తెరిచే ఉంచుతారు. దీంతో పురుషులు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు యథేచ్ఛగా వస్తారు. నిలబడి ఉండే మహిళా ప్రయాణికులకు ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది. - చంద్రకళ, సికింద్రాబాద్ -
సుమిత్ర ప్రాణం తీసిన చైన్ స్నాచింగ్
సాక్షి, హైదరాబాద్: భర్త శ్రీహరి పెరాలసిస్ వ్యాధితో మంచం పట్టాడు. పెద్ద కుమారుడు వంశీ డిగ్రీ పూర్తి చేసినా జాబ్ రాలేదు. చిన్న కుమారుడు నల్లకుంటలోని సెయింట్ పాట్రిక్స్ కాలేజీలో ఎంబీఏ తొలి సంవత్సరం చదువుతున్నాడు. కూతురు కోమల్ కాచిగూడలోని నృపతుంగ డిగ్రీ కాలేజీ బీకామ్ ఫస్టియర్ చదువుతోంది. వీరందరికీ ఆర్ధికంగా అండదండలు ఇస్తున్న అమ్మ సుమిత్ర ఓ దొంగ చేతిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శుక్రవారం రాత్రి కన్నుమూసింది. సేవలు చేసే భార్య ఇక లేదన్న బాధతో శ్రీహరి... అలానాపాలనా చూసుకుంటున్న అమ్మ లేదన్న ఆవేదనతో పిల్లల రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. ఇప్పటివరకు చైన్ స్నాచింగ్‌ల్లో బాధితులు గాయపడ్డ ఘటనలు ఉన్నా.. ఓ మహిళ మృతి చెందడం ఇదే తొలిసారి అని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. పట్టపగలే సుమిత్ర మెడలో నుంచి బంగారు గొలుసు లాగడమే కాకుండా నెట్టేసి ఆమె మృతికి కారకుడైన దొంగపై ఐపీసీ 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. బర్కత్‌పురలో విషాదం.. హైదరాబాద్ బర్కత్‌పుర డివిజన్ సత్యానగర్ ప్రాంతానికి చెందిన పి.శ్రీహరి, సుమిత్ర భార్యాభర్తలు. శ్రీహరి తార్నాకలోని ఎన్ఐఎన్(నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్)లో అటెండర్‌గా పనిచేస్తుండేవాడు. ఆయనకి పెరాలసిస్ రావడంతో అతని స్థానంలో సుమిత్ర వెళ్లి పనిచేస్తోంది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఈ నెల 17న తార్నాకలోని ఎస్బీహెచ్ బ్యాంకులో తమ ఖాతాకు చెందిన వివరాలు తెలుసుకొని రావడానికి సుమిత్ర(45) చిన్నకుమారుడు సంజయ్‌తో కలసి బైక్‌పై వెళ్లింది. తార్నాక నుంచి తిరిగి ఇంటికి వస్తుండగా ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి పల్సర్‌బైక్‌పై వచ్చి సుమిత్ర మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసును తెంచుకుని.. బైక్‌పైనుంచి పక్కకు నెట్టేసి పారిపోయాడు. బైక్‌పై నుంచి సుమిత్ర కిందపడటంతో తలకు తీవ్ర గాయమైంది. చికిత్స కోసం కాచిగూడలోని సాయికృష్ణ న్యూరో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది. గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని సుమిత్ర కుటుంబ సభ్యులకు అప్పగించారు. అసెంబ్లీలో మహిళల భద్రత అంశాన్ని లెవనెత్తుతాం... నగరంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని, మహిళల భద్రతపై అసెంబ్లీలో కేసీఆర్ సర్కార్‌ను నిలదీస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, బీజేపీ శాసనసభపక్ష నేత డాక్టర్ కె.లక్ష్మణ్‌లు అన్నారు. సుమిత్ర కుటుంబ సభ్యులను శనివారం వారు పరామర్శించారు. చైన్స్నాచర్లను పట్టుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. సుమిత్ర చైన్‌స్నాచింగ్‌కు గురై వారం రోజులు గడుస్తున్నా దొంగను పట్టుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. -
కోర్టు తీర్పులతో మహిళా భద్రత ప్రశ్నార్థకం
మహిళా కమిషన్ చైర్పర్సన్ త్రిపురాన వెంకటరత్నం రాంగోపాల్‌పేట్: న్యాయస్థానాలు ఇస్తున్న కొన్ని తీర్పులు మహిళా భద్రతపై ప్రభావ చూపిస్తున్నాయని మహిళా కమిషన్ చైర్పర్సన్ త్రిపురాన వెంకటరత్నం అన్నారు. గురువారం బుద్దభవన్‌లోని మహిళా కమిషన్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 7ఏళ్లకు లోబడి శిక్ష పడే కేసుల్లో నిందితులకు పోలీస్ స్టేషన్లోనే బెయిల్ ఇవ్వవచ్చని ఇటీవల కోర్టు ఇచ్చిన తీర్పుతో 498(ఏ) కేసుల్లో నిందితులకు కూడా స్టేషన్ బెయిల్ లభించే అవకాశం ఉందన్నారు. ఇలాంటి తీర్పుల కారణంగా మహిళల భద్రత ప్రశ్నార్ధకమవుతుందన్నారు. యామిని, శ్రీలేఖ హత్య కేసులో నిందితుడిని వెంటనే అరెస్టు చేసి అతనికి శిక్ష పడేలా చూడాలన్నారు. మహిళ భద్రత, నిర్భయ చట్టాలపై చర్చ జరుగుతున్న తరుణంలో ఇలాంటి ఘటన జరుగడం ఆలోచించాల్సిన విషయన్నారు. ప్రేమ పేరుతో వేధింపులు ఎదుర్కొంటున్న వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, వారు స్పందించకపోతే మహిళా కమిషన్‌కు ఫోన్ ద్వారా, పోస్టు ద్వారా సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. -
‘స్పై’ కామాంధులు
గుంతకల్లు టౌన్ : పాత గుంతకల్లుకు చెందిన రామకృష్ణారెడ్డి అనే యువకుడు బరితెగించి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. నెలన్నర క్రితం తన సమీప బంధువుల పెళ్లి వేడుకలకై అద్దెకు తీసుకున్న పరిటాల శ్రీరాములు కళ్యాణ మం డపం బాత్రూమ్లో నాలుగైదు స్పై కెమెరాలను ఓ పాతబట్టలో చుట్టి రహస్యంగా అమర్చాడు. ఆ గదిలో మహిళలు స్నానాలు చేసిన దృశ్యాలను క్యాప్చరింగ్ చేసి మెమోరీ కార్డుల్లోకి డౌన్లోడ్ చేసుకున్నాడు. అయితే ఆ దృశ్యాలన్నింటినీ ఒక్కొక్కటి నిశితంగా పరిశీలించి తనకు గుర్తున్న వారి బంధువుల పేర్లు, వారు ఏయే డ్రస్స్‌లు ధరించారని ఓ చిన్న ప్యాకెట్ డైరీలో రాసుకున్నాడు. తరువాత కాయిన్ బాక్స్‌ల నుంచి ఫోన్ చేసి వధువు కుటుంబసభ్యులను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో నరకయాతను అనుభవించిన ఆ కుటుంబసభ్యులు పరువు ప్రతిష్ఠలకు భంగం కలుగుతుందని భావించి పోలీసు ఉన్నతాధికారులకి తమ సమస్యను విన్నవించారు. పోలీసుల స్ట్రింగ్ ఆపరేషన్ సక్సెస్... ఆడవాళ్ల అందచందాలను స్పై కెమెరాల్లో చిత్రీకరించి ఆ వీడియోల ఆధారంగా బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు పక్కా ప్రణాళికతో వలపన్ని పట్టుకున్నట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. తొలుత రామకృష్ణ రెడ్డి తనకు కొంత డబ్బివ్వాలని, ఆ మొత్తాన్ని బళ్లారి రోడ్‌లోని కి.మీను సూచించే ఫలానా మైల్స్టోన్ వద్ద నగదును ఉంచి వెళ్లమని వధువు తండ్రికి ఫోన్లో చెప్పాడు. తమను వేధిస్తున్న ఆ కీచకుడెవరో గుర్తిద్దామని కాపుకాచినా నిందితుడు అక్కడికి వెళ్లకుండా ట్రయల్ వేసినట్లు తెలిసింది. తిరిగి కథ మళ్లీ మొదటికి రావడంతో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. వధువు తండ్రికి వస్తున్న ఫోన్ నెంబర్లు, ఆ ఫోన్ ఏయే టవర్ లొకేషన్ నుంచి వస్తున్నాయో గమనించి నిఘా ఉంచారు. పోలీసుల ప్లాన్ ఫలించింది. నిందితుడిని ఎట్టకేలకు అదుపులోకి తీసుకుని విచారించగా దిమ్మతిరిగే నిజాలన్నీ బయటపడ్డాయి. అతనివద్ద నుంచి నాలుగైదు స్పై కెమెరాలతో పాటు రెండు సిమ్, మెమోరీ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. కాగా నిందితుడిని చూశాక వధువు బంధువులు షాక్ గురైయ్యారు. సమీప బంధువని తెలిసి రగిలిపోయారు. నేడో..రేపో అరెస్ట్ చేసే అవకాశం? అదుపులోకి తీసుకున్న నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు. బాధిత కుటుంబసభ్యుల నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. నిందితుడిపై నిర్భయ, ఐటీ యాక్టు కింద కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ ఎస్ఐ నగేష్‌బాబు తెలిపారు. నేడో, రేపో నిందితుడి అరెస్ట్ చూపే అవకాశం ఉంది. -
పింక్ జర్నీ
నిర్భయ ఉదంతం తర్వాత మహిళా భద్రత చాలా ముఖ్యమైన అంశంగా మారింది. మహిళల సురక్షిత ప్రయాణం పై దాదాపు అన్ని రాష్ట్రాలూ దృష్టిపెడ్తున్నాయి. శ్రద్ధ చూపిస్తున్నాయి. వీటిలో భాగమే పింక్ ఆటో సర్వీస్. స్త్రీల కోసం స్త్రీలే నడిపే ఆటోరిక్షా ప్రయాణసేవలే పింక్ ఆటో సర్వీస్. ఇప్పటికే రాంచీ, పుణె, భువనేశ్వర్ వంటి పట్టణాలు పింక్ ఆటోలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాయి. ఇప్పుడు ఇండోర్ కూడా అక్కడి ఆడవాళ్ల కోసం పింక్ ఆటో సర్వీస్‌ని లాంచ్ చేయబోతోంది. దీనిని మధ్యప్రదేశ్ ప్రభుత్వ సంస్థ అయిన అటల్ ఇండోర సిటీ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ (అఐఇఖీఔ) నడపనున్నది. ముందుగా ఓ 20 ఆటోలను ప్రవేశపెట్టనున్నట్లు ఎఐసిటీఎస్ఎల్ తెలిపింది. ఆడవాళ్ల భద్రత కోసం పింక్ ఆటో సర్వీస్‌ని నడపనున్న విషయం తెలిసీ అందులో భాగస్వాములు అవడానికి కొంతమంది మహిళా ఆటోడ్రైవర్లు ఉత్సాహం చూపిస్తున్నారట. వాళ్ల సహకారంతో ఈ సర్వీస్‌ని మరింత మెరుగ్గా అందిస్తామంటోంది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. అంతేకాదు, ఔత్సాహిక మహిళలకు ఆటో నడపడంలో శిక్షణనిచ్చి ఈ పింక్ ఆటో ద్వారా ఉపాధి కల్పించే యోచనా చేస్తోంది. తమ ప్రయాణం సురక్షితంగా గమ్యం చేరాలనుకునే స్త్రీలు ఈ పింక్ ఆటో సర్వీస్‌ని ఫోన్‌కాల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. లేదంటే మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇలాంటి సేవలు తెలుగు రాష్ట్రాల రహదారులకూ రవాణా అయితే బాగుండు! -
ఆన్లైన్లో ఆటో గుట్టు!
యజమానుల వివరాల నమోదు మహిళల భద్రత కోసం సర్కారు చర్యలు పోలీసు, రవాణాశాఖ ఆధ్వర్యంలో భారీ కసరత్తు పూనం మాలకొండయ్య కమిటీ సిఫారసుతో కదలిక సాక్షి, హైదరాబాద్ : ఒంటరిగా ప్రయాణించే మహిళలపై అఘాయిత్యాల నేపథ్యంలో ప్రభుత్వం మరిన్ని భద్రతా చర్యలకు ఉపక్రమిస్తోంది. గతంలో రాత్రి వేళ ఇళ్లకు చేరుకునే ప్రయత్నంలో ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగినులపై క్యాబ్ డ్రైవర్లు లైంగిక దాడులకు పాల్పడ్డ నేపథ్యంలో క్యాబ్‌ల నియంత్రణకు చర్యలు చేపట్టిన సర్కారు తాజాగా ఆటోలపై దృష్టి సారించింది. రవాణా శాఖ-పోలీసు శాఖల సంయుక్త ఆధ్వర్యంలో అన్ని ఆటోల అసలు యజమానులెవరో తేల్చే భారీ కసరత్తుకు తెరలేపింది. రవాణా శాఖ వద్ద ఉన్న నంబర్ల ఆధారంగా అన్ని ఆటోలను, వాటి యజమానులను ఒకచోట చేర్చి ఒక్కో ఆటో వారీగా పూర్తి వివరాలను నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. యజమాని ఎవరు, ఆటో నడుపుతోంది ఎవరు, ఒక్కొక్కరికి ఎన్ని ఆటోలున్నాయి, వాటి రిజిస్ట్రేషన్, చిరునామా, ఫోన్ నంబర్లు, వారికి నేర చరిత్ర ఉందా, పోలీసు స్టేషన్లలో కేసులున్నాయా... ఇలా అన్ని వివరాలు సేకరించి ఆన్లైన్లో పొందుపరచబోతున్నారు. ఈ వివరాలు ఇటు రవాణాశాఖ వెబ్సైట్లో, అటు పోలీసు శాఖవద్ద నమోదవుతాయి. భవిష్యత్తులో ఆటో చేతులు మారితే కచ్చితంగా ఆ వివరాలు అప్డేట్ అయ్యేలా కొత్త సాఫ్ట్‌వేర్‌ను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జూలైలో ఈ కసరత్తు మొదలవుతుంది. తొలుత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న 1.26 లక్షల ఆటోల వివరాలను సేకరిస్తారు. ఆటో వ్యవస్థ గందరగోళం ఇంతకాలం రవాణా శాఖ, పోలీసు విభాగం పట్టించుకోకపోవటంతో హైదరాబాద్‌లో ఆటోల అసలు యజమానులెవరో తెలిసే దాఖలాలే లేకుండా పోయాయి. రవాణా శాఖ రికార్డులకు, వాస్తవ వివరాలకు పొంతనే లేదు. ఎక్కడైనా ఆటో డ్రైవర్ నేరానికి పాల్పడితే అతడిని పట్టుకునేందుకు పోలీసులు ముప్పతిప్పలు పడాల్సివస్తోంది. రవాణాశాఖ నుంచి తీసుకున్న నంబరు ఆధారంగా ఇంటికి వెళ్తే ఆ పేరు గల వ్యక్తులు లేకపోవటమో, అసలు ఆటోకు ఆ ఇంటికి సంబంధమే లేకపోవటమో జరుగుతోంది. దీంతో నేరగాళ్లను పట్టుకోవటం పోలీసులకు ఇబ్బందిగా మారింది. సైబరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగినులపై గతంలో వరుసగా లైంగిక దాడులు జరిగిన నేపథ్యంలో మహిళల భద్రతపై సీనియర్ ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ సిఫారసుతో ప్రభుత్వం ఆటోలపై నిర్ణయం తీసుకుంది. గతంలో ఇమ్లీబన్ బస్‌స్టేషన్‌లో అర్ధరాత్రి మహిళలపై జరిగిన అకృత్యాలపై కమిటీ దృష్టిసారించగా ఆటో వ్యవస్థలోని అయోమయం బయటపడింది. చాలామంది ఫైనాన్షియర్లు బోగస్ పేర్లతో ఆటోలు పొంది వాటిని వేరే వారికి అమ్మేస్తున్నారు. డబ్బులు చెల్లించలేని పక్షంలో అవి క్రమంగా చేతులు మారుతూనే ఉన్నాయి. దీంతో మొత్తం వ్యవస్థను సరిదిద్దాలని కమిటీ సిఫారసు చేసింది. నగరంలోని గోషామహల్ స్టేడియంలో వివరాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఆటోను తీసుకుని యజమాని అక్కడికి రావాలి. ఇందుకోసం అన్ని ఆటోల యజమానులకు సమాచారం ఇవ్వనున్నారు. -
మహిళల భద్రతకు సేవ్ మై నంబర్
సాక్షి, ముంబై: మహిళల భద్రత కోసం ముంబై పోలీసు శాఖ ‘సేవ్ మై నంబర్’ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెడుతున్నామని, మహిళల నుంచి మంచి స్పందన వస్తే దీన్ని శాశ్వతంగా కొనసాగిస్తామని నగర పోలీసు కమిషనర్ రాకేశ్ మారియా చెప్పారు. దీని ద్వారా మహిళల ఫిర్యాదులు స్వీకరించడంతోపాటు వివిధ సమస్యలపై మార్గదర్శనం చేస్తారు. నగరంలో మహిళల వేధింపులు, ఈవ్‌టిజింగ్ కేసులు పెరిగిపోయాయి. ఉద్యోగం చేసే చోట లైంగిక వేధింపులు, ఇతర ఇబ్బందులపై ఫిర్యాదులు చేసేందుకు మహిళలు ముందుకు రావడం లేదు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, ఈవ్‌టీజింగ్‌లపై ఫిర్యాదు చేయడానికి నగర పోలీసు శాఖ ఇదివరకే 100,103 హెల్ప్ లైన్ నంబర్లు ప్రవేశపెట్టింది. ఈ నంబర్లుపై నిర్భయంగా ఫిర్యాదు చేసే అవకాశమున్నా కూడా ఫిర్యాదు నమోదుచేసిన పోలీసు అధికారి పేరు బాధిత మహిళలకు తెలియదు. దీంతో సేవ్ మై నంబరు పేరుతో కొత్త పథకం ప్రవేశపెట్టాలని పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. దీనిపై రెండు రోజుల కింద డిప్యూటీ పోలీసు కమిషనర్ స్థాయి అధికారులతో సమావేశం జరిగింది. ప్రయోగాత్మకంగా 12 పోలీసు యూనిట్ల పరిధిలో ఈ పథకం ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. అందుకు ప్రత్యేకంగా ఒక నంబరును త్వరలో విడుదల చేయనున్నట్లు ఆయన చెప్పారు. ప్రతీ యూనిట్లో నలుగురు పోలీసు అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. సేవ్ మై నంబర్‌కు ఫిర్యాదుచేస్తే అక్కడున్న అధికారి పేరు, ఆయన ఫొటో కనిపిస్తుంది. దీంతో మనం ఏ అధికారికి ఫిర్యాదు చేశామనేది బాధిత మహిళలకు తెలుస్తుంది. తరువాత ఈ ఫిర్యాదుపై ఫాలోఅప్ చేయడానికి సులభతరం కానుంది. అంతేగాకుండా ఆ నంబరుపై ఫిర్యాదు చేసిన బాధిత మహిళల ఫొన్ నంబరును గోప్యంగా ఉంచుతారు. అవసరమైతే పోలీసులు బాధితుల ఇంటికెళ్లి అసలు విషయాలు తెలుసుకుని వారికి సలహాలు ఇస్తారని రాకేశ్ మారియా పేర్కొన్నారు. -
నేరాలకు అడ్డాగా 18 మెట్రోస్టేషన్లు
♦ గుర్తించిన ఢిల్లీ పోలీసులు ♦ అసాంఘిక కార్యకలాపాలకు అనువుగా మారాయంటున్న పోలీసులు ♦ స్టేషన్లు, ఆ పరిసర ప్రాంతాల్లో లైట్లు లేకపోవడమే కారణం సాక్షి, న్యూఢిల్లీ : నేరాలకు నిలయాలుగా మారిన నగరంలోని 18 మెట్రో స్టేషన్లను ఢిల్లీ పోలీసులు గుర్తించారు. ఆ మెట్రో స్టేషన్ల పరిసరాల్లో వెలుతురు సరిగా లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అనువుగా మారాయని పోలీసులు తెలిపారు. చీకటిగా ఉన్న ఈ ప్రాంతాల్లో నేరాలు జరిగే ప్రమాదం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో మహిళల భద్రతకు ముప్పు అవకాశం ఉందని గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. కొన్ని పార్కింగ్ ఏరియాల్లో అయితే లైట్లు కూడా లేవన్నారు. కొన్ని మెట్రో స్టేషన్లకు వెళ్లే రహదారులపై అసలు వీధి దీపాలే లేవన్న సంగతి పోలీసుల విచారణలో తేలింది. నార్త్ ఢిల్లీలోని పుల్ బంగష్ మెట్రో స్టేషన్లో లైట్లు సరిగ్గా లేకపోవడంతో కొంత మంది దుండగులు తనను వెంబడించి వేధిస్తున్నట్లు ఓ మహిళ ఢిల్లీ పోలీసులకు మహిళా భద్రతా యాప్ హిమ్మత్ ద్వారా తెలపింది. దీంతో స్పందించిన పోలీసులు సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించారు. పోలీసు కంట్రోల్ రూమ్ విభాగం, స్థానిక పోలీసుల సహాయంతో ఈ సర్వే నిర్వహించారు. సర్వే వివరాలు.. ఢిల్లీ మెట్రోలో మొత్తం 138 స్టేషన్లు ఉన్నాయి. వీటిలో పటేల్ చౌక్, జహంగీర్‌పురి, నే తాజీ సుభాష్ ప్లేస్, అక్షర్ధామ్ మందిర్, మయూర్ విహార్-ఫేజ్ 1 ఎక్స్టెన్షన్, షాదీపుర్, పుల్ బంగష్, ఉత్తమ్‌నగర్ ఈస్ట్, ఉత్తమ్‌నగర్ వెస్ట్, పీరా ఘడీ, నాంగ్లోయ్, ద్వారకా మోడ్, ద్వారకా సెక్టర్-9, 10, 11, 12, 13, 14 స్టేషన్ల పరిసరాల్లో దీపాలు పనిచేయడం లేదని విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఉత్తం నగర్ ఈస్ట్, ఉత్తంనగర్, వెస్ట్, పీరా ఘడీ, నాంగ్లోయ్, ద్వారకా సెక్టర్-14, ద్వారకా సెక్టర్-13 స్టేషన్లలోని పార్కింగ్ ప్రదేశాల్లో అసలు దీపాలే లేవు. ద్వారకా మోడ్, ద్వారకా సెక్టర్-14, ద్వారకా సెక్టర్-13, అక్షర్ధామ్ మందిర్, మయూర్ విహార్-ఫేజ్ 1 ఎక్స్టెన్షన్, పుల్ బంగష్, షాదీపుర్ పరిసరాలు చీకటిమయంగా ఉన్నాయని తేలింది. సర్వే నివేదిక పరిశీలించిన ప్రత్యేక కమిషనర్ సుందరి నందా మాట్లాడుతూ, మెట్రోస్టేషన్ల పరిసరాలలో లైటింగ్ సరిగ్గా ఉండేలా చూడాలని చెప్పారు. మెట్రో స్టేషన్లకు వెళ్లే వీధుల్లో నేరాలు జరగకుండా ఉండాలంటే లైటింగ్ తప్పనిసరని చెప్పారు. రాత్రి పూట చీకటిగా ఉండే వీధుల్లో తమ పెట్రోలింగ్ వ్యాన్లు గస్తీ తిరుగుతుంటాయని పేర్కొన్నారు. అవి తిరిగినా కూడా వీధి దీపాలు మాత్రం తప్పకుండా ఏర్పాట్లు చేయాలని ఆమె చెప్పారు. -
లోకల్ రైళ్లలో మహిళలకు భద్రత కరవు
సాక్షి, ముంబై: మహిళల భద్రత విషయంలో ముంబై ఎంతో సురక్షితమైనదని పలు అధ్యయనాలు చెబుతున్నప్పటికీ లోకల్ రైళ్లలో మాత్రం వారికి భద్రత కరువైంది. ముఖ్యంగా రాత్రి వేళ్లల్లో రైళ్లలో ప్రయాణించే మహిళలపై నేరాలు శాతం పెరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. విధులు ముగించుకుని రాత్రి వేళల్లో ఇళ్లకు వెళ్లే మహిళ ప్రయాణికులు లోకల్ రైళ్లలో వేధింపులకు గురవుతున్నారు. మహిళలపై నేరాల సంఖ్య 2012తో పోలిస్తే 2014లో రెట్టింపుగా నమోదయ్యాయి. వీటిలో లైంగిక వేధింపుల కేసులు అత్యధికంగా ఉన్నాయి. లోకల్ రైళ్లలో ఈవ్‌టీజింగ్ సంఘటనలు అనేకమని, వీటిలో చాలా వరకు పోలీసుల దృష్టికి రాకుండా పోతున్నాయని అధికారులు పేర్కొన్నారు. రాత్రి వేళల్లో మహిళా బోగీల్లో రైల్వే పోలీసులను నియమించినప్పటికీ నేరాలు పెరగడంపై రైల్వే పోలీసు కమిషనర్ రవీంద్ర సింఘల్ ఆందోళదన వ్యక్తం చేశారు. నేరాలను అదుపుచేయడం తోపాటు, తాము సురక్షితంగా ప్రయాణం చేస్తున్నామనే నమ్మకం మహిళల్లో కలిగించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు సింఘల్ చెప్పారు. గత రెండు సంవత్సరాల కాలంలో మహిళా బోగీల్లో ప్రయాణం చేసిన 5,330 మంది పురుషులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. వీరిలో కొందరు తెలియక, మరికొందరు కావాలనే మహిలా బోగీల్లో ఎక్కినట్లు రుజువైంది. ఆకతాయిలను అరికట్టడానికి ఎప్పటికప్పుడు అనేక పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ మహిళలపై నేరాల సంఖ్య మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. -
కేజ్రీవాల్ ముందు ‘సప్త’పది!
తక్షణమే దృష్టి పెట్టాల్సిన 7 ప్రధాన సవాళ్లు వీటి పరిష్కారం ఆప్ తక్షణ లక్ష్యం విద్యుత్, తాగునీరు, మహిళల భద్రత కీలకం న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీకి 54% ఓట్లు, 95% సీట్లు ఇచ్చారు. ఈ భారీ అభిమానం వెనుక వారి చిన్నచిన్న ఆశలు, పెద్దపెద్ద సమస్యలు అనేకం ఉన్నాయి. వాటిని తీర్చాల్సిన బాధ్యత ఫిబ్రవరి 14న సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న కేజ్రీవాల్‌పై ఉంది. పరిమిత అధికారాలున్న ఢిల్లీ సీఎంగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం కేజ్రీవాల్‌కు కత్తిమీద సామే. అసెంబ్లీ ఎన్నికల్లో తాను మట్టికరిపించిన కేంద్రంతో సయోధ్య చేసుకుని ఎన్నికల హామీలను నెరవేర్చడం ఈయన ముందున్న ప్రధాన లక్ష్యం. ఈనేపథ్యంలో ఢిల్లీలోని ప్రధాన సమస్యలపై కథనం. ఆ(నా)రోగ్య రంగం దేశ రాజధానిలో నివసిస్తున్న ప్రజల్లో దాదాపు 60% మంది సగటు నెలవారీ సంపాదన కేవలం రూ.13,500. ఇది నిత్యావసర ఖర్చులకే సరిపోదు. అకస్మాత్తుగా వచ్చే ఆరోగ్య సమస్యలకు ఖరీదైన కార్పొరేట్ వైద్యం పొందడం వారికి గగన కుసుమం. ప్రభుత్వ ఆసుపత్రులే వారికి దిక్కు. కానీ అధికారిక గణాంకాల ప్రకారం ఢిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న బెడ్స్ సంఖ్య గత మూడేళ్లలో 8% తగ్గింది. కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏకంగా 47% తగ్గింది. ప్రమాణాల పరంగానూ ఆ ఆసుపత్రుల్లో అందుతున్న సేవలు నాసిరకమే. అందువల్ల, కేజ్రీవాల్ మొట్టమొదట ఢిల్లీలోని ప్రభుత్వ ఆరోగ్యరంగానికి అత్యవసర చికిత్స చేయాల్సిన అవసరం ఉంది. కాలుష్య కాసారం ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యభరిత నగరంగా ఢిల్లీ (అప)ఖ్యాతి మూటగట్టుకుంది. ఓటర్లపై ఇది ప్రత్యక్ష ప్రభావం చూపనప్పటకీ.. కాలక్రమేణా వారి ఆరోగ్యంపై భారీ ప్రభావమే చూపుతుంది. పెరుగుతున్న జనాభా, భారీగా పెరుగుతున్న వాహనాల సంఖ్య, హానికారక కాలుష్యాన్ని పెంచే ఉపకరణాల వినియోగంలో పెరుగుదల.. ఇవన్నీ ఢిల్లీని కాలుష్య కాసారంగా మారుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజా రవాణాను మరింత మెరుగుపర్చడం, కాలుష్య కారకాలను నియంత్రించడం తదితర కార్యక్రమాలతో దేశ రాజధానిలో కాలుష్యాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉంది. అలాగే, ట్రాఫిక్ సమస్యకూ పరిష్కారం వెతకాల్సి ఉంది. (అ)విద్య గత ఐదేళ్లలో ఢిల్లీలో పెరిగిన ప్రభుత్వ పాఠశాలల సంఖ్య కేవలం 8%. అక్కడి బోధన నాణ్యత కూడా అంతంతమాత్రమే. కేజ్రీవాల్‌ను నమ్ముకున్న సామాన్యుల పిల్లల్లో చాలామంది చదువుకునేది ఆ స్కూళ్లలోనే. దేశ రాజధానిలోని పాఠశాలలే అయినా, వేరే రాష్ట్రాల్లోని కుగ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న విద్యానాణ్యతతో అవి పోటీ పడుతుంటాయి. భవిష్యత్ తరాల మెరుగైన భవిత కోసం విద్యా ప్రమాణాలను మెరుగుపర్చాల్సి ఉంది. నిరుద్యోగం నిరుద్యోగం ఢిల్లీని వేధిస్తున్న మరో కీలక సమస్య. గత ఆరేళ్లలో ఇక్కడి మహిళల్లో నిరుద్యోగం రెట్టింపైంది. ఉపాధి నమోదు కేంద్రాల్లో రిజిస్టర్ చేసుకుంటున్నవారి సంఖ్య 2009లో 93 వేలుండగా, అది 2013 నాటికి 71% పెరిగి 1.59 లక్షలకు చేరింది. ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ల్లో రిజిస్టర్ చేసుకోని వారి సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. మరిన్ని ఉపాధి అవకాశాలను అందుబాటులోకి తీసుకురావడం కేజ్రీవాల్ ముందున్న కీలక సవాలు. ప్రజలకు సహనం తక్కువ అన్నది ఈ ఎన్నికలతో తేటతెల్లమైంది. అందువల్ల కీలక సమస్యల పరిష్కారానికి కేజ్రీవాల్ తక్షణమే నడుం బిగించాల్సి ఉంది. అలాగే, కేంద్రంలో గత 8 నెలల బీజేపీ పాలనలో క్షేత్రస్థాయి ప్రయోజనాలేం ప్రజలకు అందకపోవడం బీజేపీని దారుణంగా దెబ్బతీసిన విషయం కేజ్రీవాల్ అనుక్షణం గుర్తుంచుకోవాలి. విద్యుత్ మోత విద్యుత్ వినియోగంలోనూ, కరెంటు చార్జీల్లోనూ ఢిల్లీ ముందు వరుసలో ఉంది. వివిధ వాతావరణ పరిస్థితుల కారణంగా ఢిల్లీలో విద్యుత్ వినియోగం ఎక్కువ. అలాగే, దేశవ్యాప్తంగా చూస్తే కరెంటు చార్జీలు ఢిల్లీలోనే అత్యధికం. మొత్తం వినియోగంలో దాదాపు 86% కరెంటును ఢిల్లీలోని విద్యుత్ సరఫరా సంస్థలు బయటి రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయడం అందుకు ప్రధాన కారణం. విద్యుత్ చార్జీల తగ్గింపును మేనిఫెస్టోలోనే పేర్కొన్న కేజ్రీవాల్ ఆ దిశగా తక్షణమే చర్యలు తీసుకోవాల్సి ఉంది. నీటి కటకట ఇటీవలి ఎన్నికల ప్రచారంలో తాగునీరు ఒక ప్రధానాంశం. గతంలో 49 రోజలు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ కేజ్రీవాల్ ఈ సమస్యపై ప్రధానంగా దృష్టి పెట్టి, ప్రతీ ఇంటికీ ఉచితంగా తాగునీరందించేందుకు ప్రయత్నించారు. ఢిల్లీలో ప్రతీ వ్యక్తికి సగటున అందుతున్న నీరు కేవలం 3.82 లీటర్లు మాత్రమే. దీన్నిబట్టి దేశ రాజధానిలో నీటి కటకటను అర్థం చేసుకోవచ్చు. అలాగే, పైపుల ద్వారా సురక్షిత నీటి సరఫరా సదుపాయం నగరంలోని దాదాపు 32 లక్షల మందికి లేదు. మరోసారి కేజ్రీవాల్ దృష్టి సారించాల్సిన సమస్య ఇది. (అ)భద్రత మహిళలపై అత్యాచారాలకు, అఘాయిత్యాలకు ఢిల్లీ నెలవైంది. మహిళల భద్రత విషయానికి వస్తే ఢిల్లీ అత్యంత ప్రమాదకర నగరమని పలు సర్వేల్లో తేలింది. మహిళలపై నేరాల సంఖ్య ఇక్కడ ప్రతీ లక్ష మందికి 147గా ఉంది. వీధులు, బస్టాండ్లు, గృహాలు, టాక్సీలు, బస్సులు, కార్యాలయాలు.. అన్నీ మహిళలపై అఘాయిత్యాలకు వేదికలుగానే నిలుస్తున్నాయి. ఈ పరిస్థితిని మార్చి, దేశ రాజధానిని మహిళలకు సురక్షిత ప్రదేశంగా తీర్చిదిద్దాల్సిన బృహత్తర బాధ్యత కొత్త సీఎంపై ఉంది. -
పార్టీల ప్రచారమంతా ‘ఆమె’ చుట్టూనే..!
న్యూఢిల్లీ: మహిళా భద్రత...ప్రస్తుత విధానసభ ఎన్నికల్లో ప్రధానాంశంగా మారింది. బరిలోకి దిగిన మహిళా అభ్యర్థులంతా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ హామీలు గుప్పిస్తున్నారు. తమను గెలిపిస్తే బస్సులు, మెట్రో రైళ్ల వంటి ప్రజా రవాణా ప్రదేశాల్లో మార్షల్స్‌ను ఏర్పాటు చేస్తామని, సీసీటీవీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంచుతామని వాగ్దానాలిస్తూ మహిళా ఓటర్లను ఆకట్టుకునే యత్నం చేస్తున్నారు. అంతేకాకుండా మహిళలతో ఎలా ప్రవర్తించాలనే దానిపై మగవాళ్లకు శిక్షణ కూడా ఇప్పిస్తామంటున్నారు. బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ మాజీ ఐపీఎస్ అధికారి కూడా కావడంతో ఆ పార్టీ తమకు అధికారమిస్తే రాజధానిలో మహిళా భద్రతను మెరుగుపరుస్తామని చెప్తోంది. ఈ విధంగా అన్ని పార్టీలు ఇబ్బడి ముబ్బడిగా హామీలిస్తూప్రజలకు అర చేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. రేప్ కేపిటల్‌గా మారిన రాజధాని గత కొన్నేళ్లుగా దేశ రాజధానిలో మహిళలకు భద్రత కొరవడింది. వారికి రక్షణ కల్పించడంలో గత ప్రభుత్వాలు విఫమవడంతో జాతీయ రాజధాని... ‘రేప్ కేపిటల్’ అనే అపఖ్యాతిని మూటగట్టుకుంది. ప్రస్తుత ఎన్నికల్లో పోటీచేస్తున్న 673 మందిలో మహిళలు కేవలం 19 మంది మాత్రమే ఉన్నారు. ప్రధాన పార్టీలైన బీజేపీ, ఆప్, కాంగ్రెస్ కూడా చాలా తక్కువ మంది మహిళలకు పోటీ చేసే అవకాశమిచ్చాయి. మొత్తం 70 స్థానాలు ఉండగా, బీజేపీ తరఫున ఎనిమిదిమంది, ఆప్ తరఫున ఆరుగురు, కాంగ్రెస్ తరఫున ఐదుగురు ఎన్నికల బరిలో నిలిచారు. నగరంలో మొత్తం ఓటర్లు సుమారు కోటి 30 లక్షలు కాగా అందులో మహిళా ఓటర్లు 50 లక్షల తొంభై వేల మంది. కీలకమైన అంశం ‘ మహిళా భద్రత అనేది కీలకమైన అంశం. లింగ నిష్పత్తి తగ్గుముఖం పట్టడం, సాంఘిక దురాచారాలైన వరకట్నం లాంటివి మహిళలపై వేధింపులకు మూల కారణాలు. నేను మంత్రిగా ఉన్న సమయంలో అబ్బాయిలకు కౌన్సిలింగ్ ఇవ్వడానికి ‘సాక్షం’ అనే పథకాన్ని ప్రారంభించా. అదే పథకాన్ని ఢిల్లీలో కూడా అమలు చేయాలని కోరుతున్నా. ఒకసారి దీని గురించి అవగాహన కల్పిస్తే పరిస్థితుల్లో కూడా మార్పులు చోటుచేసుకుంటాయి’ - కృష్ణతీరథ్ (పటేల్‌నగర్ బీజేపీ అభ్యర్థి) చట్టాలను సరిగ్గా అమలు చేయాలి ‘మహిళల కోసం చేసిన చట్టాలను సరిగా అమలు చేయాలి. విచారణను వేగవంతం చేయాలి. నగరం మొత్తం సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. అవకాశమిస్తే మహిళ భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం’ - రజనీ అబ్బీ (తిమర్పూర్ బీజేపీ అభ్యర్థి) భద్రతా సిబ్బంది సంఖ్య పెంచాలి భద్రతా సిబ్బంది సంఖ్య పెంచాలి. బహిరంగ ప్రదేశాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలి, మాకు అవకాశమిస్తే మహిళా భద్రత కోసం హోం గార్డుల సంఖ్యను పెంచుతాం. క్యాబ్‌లలో ప్రయాణించే మహిళల భద్రత కోసం డ్రైవర్లకు ఫోన్ చేస్తూ ఎప్పటికప్పుడు సమీక్షించేలా చూస్తాం.’ - శర్మిష్టా ముఖర్జీ, గ్రేటర్ కైలాశ్ కాంగ్రెస్ అభ్యర్థి అనేక పథకాలు తెచ్చాం ‘ మహిళల భద్రత కోసం గత 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అనేక ముఖ్యమైన పథకాలను తీసుకొచ్చాం. కానీ 49 రోజుల ఆప్ పాలనలో వాటన్నింటినీ గాలికొదిలేశారు’. - కిరణ్ వాలియా, ఆరోగ్య, మహిళా, శిశు సంక్షేమ శాఖ మాజీ మంత్రి మార్షల్స్‌ను నియమిస్తాం ‘మేమే మహిళా భద్రత అంశం నుంచి ఎప్పుడూ పక్కకు వెళ్లలేదు. మాకు అవకాశమిస్తే 10,000 మందితో ప్రత్యేక మహిళా దళం ఏర్పాటు చేస్తాం. మెరుగైన భద్రత కల్పించేందుకు ప్రజా రవాణా ప్రాంతాల్లో మార్షల్స్‌ను నియమిస్తాం.’ - బందనా కుమారి, షాలిమార్ ఆప్ అభ్యర్థి -
ఎస్తేర్ అనూహ్య కేసు విచారణలో జాప్యం
* ఘటన జరిగి ఏడాది పూర్తి * నిందితునికి టీబీ వ్యాధి సాక్షి ముంబై: ముంబైలో హత్యకు గురైన తెలుగు యువతి ఎస్తేర్ అనూహ్య కేసు విచారణ జాప్యమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ సంఘటన జరిగి ఇప్పటికే ఏడాది పూర్తయింది. మరోవైపు కేసుకు సంబంధించి ప్రధాన ఆధారాలుగా భావించిన ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్ ఇంతవరకు లభించలేదు. ఇక ఈ కేసులో నిందితుడైన చంద్రబాన్ సానప్ అలియాస్ లౌక్యాకు టీబీ వ్యాధి సోకిందని వె ళ్లడైంది. ఈ నేపథ్యంలో కేసు విచారణ జాప్యం కానుందని తెలుస్తోంది. ఎస్తేర్ అనూహ్య కేసు ముంబైతోపాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. గత ఏడాది జనవరి అయిదవ తేదీన విజయవాడలో రెలైక్కిన అనూహ్య కుర్లా నుంచి అదృశ్యమై కంజూర్‌మార్గ్-భాండూప్ రోడ్డుపక్కన పొదలలో 16న శవమైతేలిన సంగతి తెలిసిందే. కాలిపోయిన ఆమె మృతదేహాన్ని అక్కడ లభించిన బట్టల ఆధారంగా గుర్తించారు. ఈ సంఘటనతో ముంబైలో మహిళల భద్రతపై తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. తెలుగు సంఘాలతోపాటు అనేక స్వచ్ఛంద, రాజకీయ సంస్థలు నిరసనలను వ్యక్తం చేస్తు ర్యాలీలు నిర్వహించాయి. ఎట్టకేలకు నిందితుడు చంద్రబాన్‌ను మార్చి రెండవ తేదీన పట్టుకున్నారు. ఘటన జరిగిన 85 రోజులకు మే 26వ తేదీన పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ సంఘటన జరిగి సంవత్సరం పూర్తి అయినప్పటికీ కేసు విచారణ మాత్రం కొనసాగుతోంది. నిందితుడు చంద్రబాన్ సానప్కు టీబీ సోకిందని తెలియడంతో, అతడిని విచారణ కోసం కోర్టులో హాజరుపరచవద్దని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో 2014 డిసెంబరు 22వ తేదీ నుంచి నిందితున్ని కోర్టులో హాజరుపరచడంలేదు. -
ఢిల్లీ మహిళల భద్రత కోసం ‘హిమ్మత్’ యాప్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మహిళల భద్రత కోసం ఆండ్రాయిడ్ మొబైల్ అప్లికేషన్ ‘హిమ్మత్’ను కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం ఆవిష్కరించారు. ఈ మొబైల్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకున్నవారు ఆపద సమయంలో ఫోన్‌ను ఊపటం లేదా పవర్ బటన్ని రెండుసార్లు నొక్కటం ద్వారా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయవచ్చని నగర పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ తెలిపారు. మహిళల భద్రత కోసం దేశంలో ప్రవేశపెట్టిన మొదటి అధికారిక ఏకీకృత అప్లికేషన్ ఇదని చెప్పారు. ఆడియో, వీడియోలను రికార్డు చేయడంతో పాటు ఐదుగురు సన్నిహితులకు సమాచారం అందించేందుకూ ఈ యాప్‌తో వీలవుతుందన్నారు. కార్యక్రమంలో ఢిల్లీ లె ఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌తో పాటు తదితరులు హాజరయ్యారు. -
అతగాడి అహానికి అతివ బలి
సాంకేతిక యుగంలో మహిళలు.. పురుషుడితో పోటీపడి ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. అన్ని రంగాల్లోను విజయ కేతనం ఎగరేస్తున్నారు. కానీ పశు బలం ముందు ఓడిపోతున్నారు. ఎన్ని కఠిన శిక్షలు వేస్తున్నా మృగాళ్ల దాడులు ఆగడం లేదు. అనేక చోట్ల మహిళలు, బాలికలపై ఏదో ఒక రూపంలో హింస కొనసాగుతునే ఉంది. మూడు నెలల క్రితం నగర శివారులో 30 ఏళ్లలోపు వయసున్న ముగ్గురు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యోదంతాలపై పోలీసుల దర్యాప్తు సాగుతూనే ఉంది. కానీ ఇప్పటికీ హతులు, హంతకుల వివరాలు లభ్యం కాలేదు. నగరంలో చోటుచేసుకుటున్న దారుణాలకు ఇవి ఉదాహరణ మాత్రమే. నెల రోజుల క్రితం బండ్లగూడ ప్రాంతంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థిని తనను ప్రేమించలేదని గొంతుకోసిన సంగతి తెలిసిందే. ఒకవైపు రాష్ర్ట రాజధాని హైదరాబాద్ ప్రతిష్టను పెంచేందుకు, మహిళలకు పూర్తి భద్రత, రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం బలమైన చట్టాలను రూపొందిస్తోంది. మరోపక్క మహిళలపై హింస కొనసాగుతూనే ఉంది. చిన్నారుల నుంచి వయోధికుల వరకు ఏదో ఒక రూపంలో హింసకు గురవుతూనే ఉన్నారు. లోకం పోకడ తెలియన అమాయక పాపలను సైతం కాంతో కళ్లు మూసుకుపోయిన కాలనాగులు కాటేస్తున్నాయి. వారికి రక్షణ కల్పిచాల్సినవాడే భక్షణకు దిగుతున్నాడు. నేడు ‘మహిళలపై హింసా వ్యతిరేక అంతర్జాతీయ దినం’ సందర్భంగా ప్రత్యేక కథనం. - సాక్షి,సిటీబ్యూరో ⇒ ఉక్కు చట్టాలు ఉన్నా కొనసాగుతున్న హింస ⇒ వేధింపులు, అత్యాచారాలు, హత్యలు నిత్యకృత్యం ⇒ పోలీసులను ఆశ్రయించేందుకు వెనుకంజ ⇒ ‘మహిళలపై హింసా వ్యతిరేక దినం’ ప్రత్యేక కథనం న్యాయమూర్తుల కొరత.. మరోపక్క దాఖలవుతున్న కేసులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ పాత కేసులను పూర్తిచేయాలంటే, న్యాయమూర్తుల సంఖ్య పెరగాలి. ఏ నిష్పత్తిలో జడ్జీల సంఖ్య ఉండాలన్నదానిపై శాస్త్రీయత లేదు. ప్రస్తుతం జనాభా ప్రాతిపాధికనే న్యాయమూర్తుల సంఖ్యను లెక్కిస్తున్నారు. పది లక్షల జనాభాకు 10 నుంచి 15 మంది మాత్రమే న్యాయమూర్తులు ఉన్నారు. అదే అమెరికాలో 150 మంది దాకా ఉన్నారు. 2002 నాటి ఆలిండియా జడ్జీల కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు, లా కమిషన్ సూచనల ప్రకారం పది లక్షల సంఖ్యకు 50 మంది న్యాయమూర్తులు ఉండాలి. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు వేసి తద్వారా మహిళల కేసులను సత్వర పరిష్కారం చేసేందుకు వీలుంది. అయితే అందుకు తగిన సంఖ్యలో న్యాయమూర్తులు లేరు. కొలిక్కిరాని వేల కేసులు జంట పోలీసు కమిషనరేట్లలో 2011 నుంచి ఈ ఏడాది జూలై వరకు వివిధ రూపాల్లో మహిళలు ఎదుర్కొంటున్న హింసపై 14,050 కేసులు నమోదయ్యాయి. ఇందులో హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 6,732, సైబరాబాద్ కమిషనరేట్‌లో 7,318 కేసులు నమోదయ్యాయి. అయితే, ఇంకా వేల సంఖ్యలో మహిళలు మౌనంగా హింసను భరిస్తున్నారు. వారిలో మృగాళ్ల హింసను ఎదిరించేందుకు ముందుకు రావడం లేదు. ఏమవుతుందోనని భయపడి కేసులు పెట్టలేకపోతున్నారు. మరోవైపు నిందితుల అరెస్టు, కోర్టు విచారణ, చార్జిషీట్ దాఖలు, శిక్షల అమలు నత్తనడకన సాగుతోంది. అడుగడుగునా కఠిన పరీక్ష.. హైదరాబాద్ మహా నగరం అన్ని రంగాలకు అంతర్జాతీయ వేదిక. మహిళలు అన్నింటిలోను అద్భుతాలు సృష్టిస్తున్నారు. సాఫ్ట్వేర్ రంగంలో గొప్ప నిపుణులుగా రాణిస్తున్నారు. కానీ పురుషాధిపత్య భావజాల ం, విలువల్లో ఆశించిన మార్పులు రాకపోవడం వల్ల ఇప్పటికీ మగాడి చేతుల్లో హింసకు గురవుతున్నారు. బలమైన చట్టాలు ఉన్నప్పటికీ అడుగడుగునా లింగ నిర్ధారణ పరీక్షలు, భ్రూణ హ త్యలు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు సమాజంలో అమ్మాయిలకు భద్రత ఉండదనే ఒకే ఒక్క కారణంతో చాలామంది తల్లిదండ్రులు తమ కూతుళ్లను ఉన్నత చదువులు చదివించేందుకు వెనుకాడుతున్నారు. అంటే ఇంటా, బయటా హింస ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వరకట్న వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. గృహహింస వ్యతిరేక చట్టం ఉన్నా అత్తింటి ఆరళ్లను ఎదిరించే సాహసం చేయలేకపోతున్నారు. ఒకవైపు మహిళా భద్రతా కమిటీ అనేక చర్యలు చేపట్టింది. సిటీ బస్సుల్లో భద్రత కోసం స్లైడ్ డోర్స్‌ను ప్రవేశపెట్టారు. పోలీసుల ‘షి’ బృందాలు రంగంలో ఉన్నాయి. ఐటీ కారిడార్‌లో సీసీ కెమెరాల నిఘా ఉంది. అయినా మహిళా ఉద్యోగులు నిర్భయంగా తిరగలేకపోతున్నారు. ఒంటరి ప్రయాణం అంటేనే భయపడుతున్నారు. సోషల్ మీడియా సైతం మహిళల భద్రతకు అనేక సవాళ్లు విసురుతోంది. మహిళా భద్రతకు ప్రత్యేక చర్యలు నగరంలో మహిళల భద్రతపై పూర్తిగా దృష్టి సారించాము. కళాశాలలు, బస్టాప్‌లు, రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్ వద్ద ఈవ్‌టీజింగ్‌ను అరికట్టేందుకు ‘షీ టీమ్స్’ను రంగంలోకి దించాం. గృహహింస, వరకట్న కేసుల విషయంలో కూడా చొరవ తీసుకుంటున్నాం. వరకట్న కేసులలో ఫిర్యాదు రాగానే భార్యాభర్తలు ఇద్దరిని పిలిచి ప్రత్యేక అధికారులతో కౌన్సిలింగ్ ఇస్తున్నాం. ఆ తరువాతే కేసు నమోదు చేస్తున్నాం. ఎక్కువ కేసులు కౌన్సిలింగ్ ద్వారానే పరిష్కారం అవుతున్నాయి. ఇక వరకట్నం కేసులలో తప్పించుకు తిరుగుతున్న నిందితులకు రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేస్తున్నాం. మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలి. - స్వాతిలక్రా, అదనపు పోలీసు కమిషనర్ ప్రతి ఠాణాలోను మహిళా రిసెప్షనిస్టు మహిళలు తమ సమస్యలను ధైర్యంగా చెప్పుకోవాలనే ఉద్దేశంతో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ప్రతి ఠాణాలోను మహిళా రిసెప్షనిస్టును ఏర్పాటు చేశాము. ముఖ్యంగా హైటెక్ సిటీ, చందానగర్, మాదాపూర్, రాయదుర్గం ప్రాంతాలలో మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగులకు పూర్తి రక్షణ చర్యలు తీసుకున్నాం. వారికి 24 గంటల ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేశాం. అన్ని ప్రాంతాలలో సీసీ కెమెరాలను ఉన్నాయి. ‘అభయ’ ఘటనలో నిందితులకు కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే శిక్ష పడే విధంగా చర్యలు తీసుకున్నాం. స్కూళ్లలో బాలికలపై వేధింపులను అరికట్టేందుకు ‘చైల్డ్ అబ్యూజ్ మేనేజింగ్ కమిటీ’ (సీఏఎంసీ)లను ఏర్పాటు చేస్తున్నాం. ఇలా చేయడం వల్ల వేధింపులకు పాల్పడే వారు వెనకంజ వేయక తప్పదు. - రమారాజేశ్వరి, మల్కాజ్గిరి డీసీపీ -
మహిళల భద్ర తా చర్యలు అమలుచేయాలి
అధికారులకు మహిళల రక్షణ కమిటీ చైర్మన్ పూనం మాలకొండయ్య ఆదేశం సాక్షి, హైదరాబాద్: మహిళల భద్రతకు తీసుకునే చర్యలు అమలయ్యేలా చూడాలని రాష్ట్ర మహిళా భద్రత, రక్షణ కమిటీ చైర్మన్ పూనం మాలకొండయ్య సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన తొలి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యేలు కొండా సురేఖ, గొంగిడి సునీత, శోభ, కమిటీ కన్వీనర్ సునీల్ శర్మ, సభ్యులు శైలజా రామయ్యర్, చారుసిన్హా, సౌమ్యా మిశ్రా, స్వాతి లక్రా, ఆమ్రపాలి పాల్గొన్నారు. మహిళల భద్రత విషయంలో కచ్చితమైన చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించాలని మహిళా ఎమ్మెల్యేలు కోరారు. మహిళల కేసుల కోసం జిల్లాల్లో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు, మొబైల్ కోర్టులు ఏర్పాటు చేయాలని,ప్రతి జిల్లాలో మహిళా పోలీ స్ స్టేషన్ల సంఖ్య పెంచాలని, పాఠశాలల విద్యార్థినులకు డ్రెస్‌కోడ్ పెట్టాలని సూచనలు చేశారు. డ్వాక్రా, స్వయంసహాయక బృందాలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని, భార్యాభర్తలు ఉద్యోగస్తులైతే ఇద్దరూ ఒకే ప్రాంతంలో పనిచేసేలా అవకాశం కల్పించాలని అన్నారు. భ్రూణహత్యలు నివారించాలి భ్రూణహత్యల నివారణకు చర్యలు తీసుకోవాలని మహిళా ఎమ్మెల్యేలు సూచించారు. పుట్టబోయే శిశువు ఎవరనేది నిర్థారిస్తున్న స్కానింగ్‌సెంటర్ల అనుమతిని రద్దు చేయాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీత కోరారు. టీనేజ్ అమ్మాయిలకు విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని, స్వయంరక్షణ (సెల్ ్ఫడిఫెన్స్)లో శిక్షణ ఇవ్వాలని అన్నారు. గృహహింసపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినపుడు అక్కడ వారిని సహృదయంగా ఆదరించాలని, ప్రతి పోలీస్ స్టేషన్లో మహిళా పోలీసుల్ని ఉంచాలని, ఈవ్‌టీజింగ్, గృహహింస విషయంలో 2, 3 రోజుల్లోనే చర్య తీసుకునేలా చూడాలని ఆమె సూచించారు. మహిళల భద్రతకు ప్రాధాన్యం: మంత్రి మహేందర్‌రెడ్డి తమ ప్రభుత్వం మహిళల భద్రతకు ప్రాధాన్యతను ఇస్తున్నదని, ప్రధానంగాా ఆర్టీసి బస్సులలో మహిళల భద్రతకు ప్రత్యేకచర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పి. మహేందర్‌రెడ్డి తె లిపారు. ఆర్టీసి బస్సుల్లో మహిళల రక్షణకు సంబంధించి జరిగిన చర్చలో మంత్రి పి. మహేందర్‌రెడ్డితో పాటు ఆర్టీసి ఎండీ పూర్ణచందర్రావు, జేఎండీ రమణారావు, ఓఎస్డి సుధాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జంటనగరాల్లోని 2,600 బస్సు సర్వీసులకు 20 రోజుల్లో ప్రత్యేక కంపార్ట్మెంట్లు ఏర్పాటుచేయాలని మంత్రి అధికారులకు సూచించారు. ఈ విధంగా చేయడం వల్ల సంస్థపై రూ.3.92 కోట్ల భారం పడుతుందని, ఇటు, అటు రెండు సీట్ల మేర స్థలం పోతుందని ఎండీ పూర్ణచందర్రావు పేర్కొనగా, ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఇచ్చిన మాట మేరకు ప్రత్యేక కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేయాల్సిందేనని మంత్రి స్పష్టం చేశారు. బస్సులు, బస్టాండులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెంచుతున్నట్లు చెప్పారు. -
‘భద్రత’ బాధ్యత వారిదే..!
సాక్షి, ముంబై: మహిళా భద్రతను దృష్టిలో ఉంచుకొని ఇక మీదట ప్రతి రైల్వే స్టేషన్లో ఒక పోలీసు అధికారి ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. నగర రైల్వే స్టేషన్లలో మహిళల భద్రత విషయంలో జీఆర్పీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ముంబై హైకోర్టు ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళా ప్రయాణికులకు భద్రత కల్పించడంలో విఫలమవుతోందని దుయ్యబట్టింది. దీనిపై జీఆర్పీ సమాధానమిస్తూ తగినంత సిబ్బంది లేకపోవడం వల్లే కొన్నిసార్లు తాము నిందితులను గుర్తించడంలో విఫలమవుతున్నామని సమాధానమిచ్చింది. అలాగే రైల్వే అధికారుల మధ్య సమన్వయం సాధించేందుకు అవసరమైన వాకీటాకీలు కూడా అందుబాటులో లేవని, అందువల్ల వివిధ స్టేషన్ల అధికారుల మధ్య సమన్వయం సాధ్యం కావడంలేదని వివరించింది. నగరంలోని 136 రైల్వేస్టేషన్లు ఉండగా, కేవలం 120 వాకీటాకీలో ఇక్కడ అందుబాటులో ఉన్నాయని సమాధానమిచ్చింది. ఇదిలా ఉండగా, తమకు ఎదురవుతున్న విమర్శలను దృష్టిలో పెట్టుకుని స్టేషన్లలో భద్రత చర్యలను మరింత పటిష్టం చేసేందుకు రైల్వే అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ప్రతి రైల్వే స్టేషన్లో తప్పనిసరిగా ఒక అధికారిని నియమించేలా కొత్త నిబంధనను రూపొందించారు. ప్రతి జీఆర్పీ స్టేషన్ పరిధిలో దాదాపు ఐదు రైల్వే స్టేషన్లు ఉంటాయి. దీంతో ఒక్కో పోలీస్ స్టేషన్లో కనీసం ఐదుగురు ఇన్స్పెక్టర్ల అవసరం ఉంటుంది. వీరు తమ పరిధిలోని రైల్వే స్టేషన్లలో జరిగే నేరాలకు సంబంధించిన కేసులను దర్యాప్తు చేస్తారు. కొత్త ప్రణాళిక ప్రకారం.. ఈ ఇన్స్పెక్టర్లు తమకు కేటాయించిన రైల్వే స్టేషన్లలో జరిగే నేరాలకు జవాబుదారీగా వ్యవహరిస్తారు. తమ పరిధిలోని రైల్వే స్టేషన్లలో నేరాల సంఖ్య పెరిగినా వీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వీటిని నివారణకు తగిన చర్యలు తీసుకోవడం కూడా వీరి బాధ్యతే.వీటి ద్వారా రోజురోజుకు అధికారుల బాధ్యతల నిర్వహణలో పారదర్శకత పెరుగుతుందని జీఆర్పీ కమిషనర్ రవీందర్ సింగాల్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, జీఆర్పీలో సిబ్బంది తక్కువగా ఉండడంతో ఆ శాఖ లోకల్ ఆర్మ్స్ (ఎల్ ఏ) సహాయం కూడా తీసుకోనుంది. వీరి సహకారంతో రోజూ అన్ని ముఖ్య రైల్వే స్టేషన్లలో కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహించనున్నారు. బాంద్రా, లోకమాన్య తిలక్ టెర్మినస్ (కుర్లా), దాదర్, ముంబై సెంట్రల్, ఇతర రైల్వే స్టేషన్లలో రోజువారీ భద్రతను పర్యవేక్షించనున్నారు. ఎల్‌ఏకు చెందిన దాదాపు 40 మంది సిబ్బంది ఈ టర్మినస్లకు చేరుకుంటారు. తర్వాత జీఆర్పీ సిబ్బందితో అన్ని స్టేషన్ల ఆవరణలో నిర్వహించే కూంబింగ్‌లో పాల్గొంటారని వెస్టర్న్ రైల్వే జీఆర్పీ అసిస్టెంట్ పోలీసు కమిషనర్ ప్రదీప్ బిజ్వే పేర్కొన్నారు. -
‘షీ’కి చిక్కారు
వారంలో 40 మంది ఈవ్‌టీజర్లపై కేసు నిందితులు 16-68 ఏళ్ల వయస్సు వారు సాక్షి, సిటీబ్యూరో: మహిళల భద్రత కోసం నగర పోలీసులు రంగంలోకి దింపిన షీ టీమ్‌లకు వారంలో 40 మంది ఈవ్‌టీజర్లు పట్టుబడినట్లు అదనపు పోలీసు కమిషనర్ (క్రైమ్స్) స్వాతిలక్రా తెలిపారు. తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షీ టీమ్స్ పనితీరు, ఈవ్టీజర్ల వివరాలను వెల్లడించారు. గత నెల 24న నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి వంద మంది పోలీసులతో‘ షీ టీమ్’లను రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. ఈ టీమ్‌లు ఉదయం, సాయంత్రం వేళల్లో కళాశాలలు, షాపింగ్ సెంట ర్లు, రైల్వే, బస్సు స్టేషన్ల వద్ద కాపు కాశాయి. 40 మంది ఈవ్‌టీజర్లను అదుపులోకి తీసుకుని పిటీ కేసు నమోదు చేశారు. అంతేకాకుండా వారి కుటుంబ సభ్యుల సమక్షంలో సీసీఎస్ పోలీసులు కౌన్సెలింగ్ చేసి పంపించారు. పట్టుబడిన వారిలో 16 నుంచి 68 ఏళ్ల వయస్సు కలిగిన వారు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది యువకులు, ఇంటర్ విద్యార్థులు, ప్రయివేటు ఉద్యోగులు, ఒక సర్పంచ్ ఉన్నారు. ఈ సమావేశంలో సీసీఎస్ డీసీపీ పాలరాజు, అదనపు డీసీపీ రంజిత్త్రన్కుమార్, ఏసీపీ కవిత పాల్గొన్నారు. ఈ మేరకు ‘షీ టీమ్స్ మీ వెంటే ఉన్నాయి, ఆపదలో ఉంటే వెంటనే 100 నంబర్‌కు ఫోన్ చేయండి’ అనే వాల్ పోస్టర్‌ను విడుదల చేశారు. షీ టీమ్‌లు ఈవ్టీజర్ల ఆట కట్టించడమే కాకుండా ఫిర్యాదులు చేసే విధంగా మహిళలలో ధైర్యం కల్పిస్తున్నాయి. ఈవ్‌టీజింగ్ బారిన పడితే ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చని, బాధితుల పేర్లు, వివరాలు గోప్యంగా ఉంచుతామని నగర పోలీసులు ఎంఎంటీఎస్ రైలు ఎక్కి మహిళలు, విద్యార్థినిలను స్వయంగా కలుసుకుని భరోసా ఇస్తున్నారు. ఈవ్‌టీజర్లతో అవగాహన తరగతులు.. ఈవ్‌టీజింగ్‌ను మరింత కట్టడి చేసేందకు పట్టుబడిన వారితో ఆయా కళాశాలల్లో అవగాహన తరగతులు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. తాము ఈవ్ టీజింగ్ చేయడం వల్ల ఎలాంటి దుష్ఫలితాలు వచ్చాయి, దాని వల్ల పోయిన పరువు, ఎంత నష్టం కలుగుతుందో స్వయంగా వివరించేందుకు పట్టుబడిన నిందితులు అంగీకరించారు. వీరితో పాటు పోలీసులు కూడా కళాశాలలకు వెళ్లి ఈవ్‌టీజింగ్ చేయరాదని వారిలో చైతన్యం తీసుకువచ్చే కార్యక్రమాన్ని త్వరలో శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా పట్టుబడ్డారు.. 20 ఏళ్ల ఓ యువకుడు మెహిదిపట్నం బస్టాప్‌లో నిల్చున్నాడు. అక్కడికి వ చ్చే ఏ బస్సు ఎక్కలేదు.ప్రయాణిలకు చూస్తూ ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతూ షీ టీమ్‌కు చిక్కాడు. సికింద్రాబాద్‌లో 30 ఏళ్ల యువకుడు బస్సులోకి మహిళలు ఎక్కే ముందు డోర్ నుంచి ఎక్కడం, వారికి తగలడం చేస్తూ షీ టీమ్స్‌కు పట్టుబడ్డాడు. అమీర్‌పేటలో ఓ ప్రయివేటు ఉద్యోగి (36) బస్టాప్‌లో నిల్చున్న మహిళలపై పట్ల అసభ్యకరంగా చూడటంతో పాటు మాట్లాడుతూ ఈవ్‌టీజింగ్‌కు పాల్పడి దొరికిపోయాడు. సుల్తాన్బాజర్లో ఈవ్‌టీజింగ్‌కు పాల్పడిన ఓ వ్యక్తి ఏకంగా మహిళను లాడ్జికి రమ్మని కోరాడు. ఆమె నిరాకరించడం, ఈ దృశ్యం షీ టీమ్స్ కంట్లో పడడంతో అతగాడి ఆటలకు అడ్డుకట్ట వేశారు. ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే చర్యలు: స్వాతిలక్రా ‘నగరంలో ఏ మూలన కూడా ఈవ్‌టీజింగ్ జరగడానికి వీలులేదు. ఈవ్‌టీజింగ్‌కు యత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. షీ టీమ్స్ నిరంతరం పర్యవేక్షిస్తాయి. మొదటిసారి పట్టుబడితే పిటీ కేసుతో పాటు కౌన్సెలింగ్ చేస్తాం. మరోసారి దొరికితే నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేస్తాం.’ -
‘షీ’కి చిక్కారు
* వారంలో 40 మంది ఈవ్‌టీజర్లపై కేసు * ఈవ్‌టీజర్లపై కఠిన చర్యలు: స్వాతిలక్రా సాక్షి, హైదరాబాద్: మహిళల భద్రత కోసం నగర పోలీసులు రంగంలోకి దింపిన ‘షీ’ టీమ్‌లకు వారంలో 40 మంది ఈవ్‌టీజర్లు పట్టుబడినట్లు అదనపు పోలీసు కమిషనర్ (క్రైమ్స్) స్వాతిలక్రా తెలిపారు. తన కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ‘షీ’ టీమ్స్ పనితీరు, ఈవ్టీజర్ల వివరాలను వెల్లడించారు. గత నెల 24న పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి వంద మంది పోలీసులతో‘ షీ టీమ్’లను రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. ఈ టీమ్‌లు ఉద యం, సాయంత్రం వేళ్లల్లో కళాశాలలు, షాపింగ్ సెంటర్లు, రైల్వే, బస్సు స్టేషన్ల వద్ద కాపు కాశాయి. 40 మంది ఈవ్‌టీజర్లను అదుపులోకి తీసుకుని పిటి కేసు నమోదు చేసి వారి కుటుంబీకుల సమక్షంలో సీసీఎస్ పోలీసులు కౌన్సెలింగ్ చేశారు. నిందితుల్లో ఎక్కువ మంది యువకులు, ఇంటర్ విద్యార్థులు, ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నారు. ఈ సమావేశంలో సీసీఎస్ డీసీపీ పాలరాజు, అదనపు డీసీపీ రంజిత్త్రన్కుమార్, ఏసీపీ కవిత ఉన్నారు. ఈ మేరకు ‘షీ టీమ్స్ మీ వెంటే ఉన్నాయి, ఆపదలో ఉంటే వెంటనే 100 నెంబర్‌కు ఫోన్ చేయండి’ అనే వాల్ పోస్టర్‌ను విడుదల చేశారు. షీ టీమ్‌లు ఈవ్టీజర్ల ఆట కట్టించడమే కాకుండా ఫిర్యాదులు చేసే విధంగా మహిళలలో ధైర్యం కల్పిస్తున్నారు. ఈవ్‌టీజింగ్ బారిన పడితే ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చని, బాధితుల పేర్లు, వివరాలు గోప్యంగా ఉంచుతామని నగర పోలీసులు ఎంఎంటీఎస్ రైలు ఎక్కి మహిళలు, విద్యార్థినులను కలిసి భరోసా ఇస్తున్నారు. ఈవ్‌టీజర్లతో అవగాహన తరగతులు.. ఈవ్‌టీజింగ్‌ను మరింత కట్టడి చేసేందుకు పట్టుబడిన వారితో ఆయా కళాశాలలో అవగాహన తరగతులు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. తాము ఈవ్ టీజింగ్ చేయడం వల్ల ఎలాంటి దుష్ఫలితాలు వచ్చాయి, దాని వల్ల పోయిన పరువు, ఎంత నష్టం కలుగుతుందో స్వయంగా వివరించేందుకు నిందితులు అంగీకరించారు. ఇలా పట్టుబడ్డారు... 20 ఏళ్ల ఓ యువకుడు మెహిదిపట్నం బస్టాప్‌లో నిల్చున్నాడు. అక్కడికి వచ్చే ఏ బస్సు ఎక్కలేదు.ప్రయాణిలకు చూస్తూ ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతూ షీ టీమ్‌కు చిక్కాడు. సికింద్రాబాద్‌లో ఓ యువకుడు బస్సులోకి మహిళలు ఎక్కే ముందు డోర్ నుంచి ఎక్కడం, వారికి తగలడం చేస్తూ షీ టీమ్స్‌కు పట్టుబడ్డాడు. అమీర్‌పేటలో ఓ ప్రైవేట్ ఉద్యోగి(36) బస్టాప్‌లో నిల్చున్న మహిళలపై పట్ల అసభ్యకరంగా చూడడంతో పాటు మాట్లాడుతూ ఈవ్‌టీజింగ్‌కు పాల్పడి చిక్కాడు.సుల్తాన్బాజర్లో ఈవ్‌టీజింగ్‌కు పాల్పడిన ఓ వ్యక్తి ఏకంగా మహిళను లాడ్జికి రమ్మని కోరాడు. ఆమె నిరాకరించడం, ఈ దృశ్యం షీ టీమ్స్ కంట్లో పడడంతో అతగాడి ఆటలకు అడ్డుకట్ట వేశారు. ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే చర్యలు: స్వాతిలక్రా ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. ‘షీ’ టీమ్స్ నిరంతరం పర్యవేక్షిస్తాయి. మొదటిసారైతే పిటీ కేసుతో పాటు కౌన్సెలింగ్ చేస్తాం. మరోసారి పట్టుబడితే నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేస్తాం. -
ఈవ్‌టీజింగ్‌కు ‘షీ’చెక్
నగరంలో 100 ‘షీ’ బృందాల ఏర్పాటు కళాశాలలు, బస్సు, రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్ వద్ద నిఘా పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి వెల్లడి హైదరాబాద్: హైదరాబాద్‌లో ఈవ్‌టీజింగ్‌ను అరికట్టేందుకు ‘షీ’ బృందాలను ఏర్పాటు చేసినట్లు నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి తెలిపారు. మహిళల భద్రతకు ఈ ప్రత్యేక బృందాలు పనిచేస్తాయని చెప్పారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఐదుగురు పోలీసులు (పురుషులు, మహిళలు) ఉండే విధంగా 100 షీ బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. విద్యాసంస్థలు, బస్సు, రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్, విహార యాత్ర స్థలాల వద్ద ఈవ్‌టీజింగ్‌కు పాల్పడేవారిని అదుపులోకి తీసుకోడానికి, మహిళల భద్రతకు ఇవి పనిచేస్తాయన్నారు. షీ బృందాలలోని పోలీసులు సాధారణ దుస్తుల్లో ఉంటారని, వారి వద్ద వీడియో రికార్డింగ్ కెమెరాలు కూడా ఉంటాయని తెలిపారు. ఈవ్‌టీజింగ్‌కు పాల్పడేవారిని ఈ బృందాలు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని నగర సీసీఎస్‌కు తరలిస్తాయని చెప్పారు. ఆకతాయిలకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు కేసులు నమోదు చేసి జైలుకు పంపుతాయన్నారు. ధైర్యంగా ఫిర్యాదు చేయండి: స్వాతి లక్రా ఈవ్‌టీజింగ్‌కు పాల్పడేవారిపై మహిళలు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని క్రైమ్ అదనపు పోలీసు కమిషనర్ స్వాతిలక్రా సూచించారు. 100 నంబర్‌కు ఫోన్ చేస్తే పది నిమిషాల్లో పోలీసులు సంఘటన స్థలానికి వస్తారన్నారు. ఫిర్యాదు చేసే బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. షీ బృందాలకు ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇచ్చామన్నారు. నిందితులకు శిక్షలు పడే విధంగా కోర్టుకు చార్జిషీట్ దాఖలు చేస్తామన్నారు. -
యాంటీ క్రైమ్ కోబ్రాస్
నగరంలో నిత్యం ఎన్నో నేరాలు, ఘోరాలు.. మహిళలపై పెరుగుతున్న అకృత్యాలు.. మహిళలపై నేరాలను అరికట్టడానికి తవువంతుగా ఏదైనా చేయూలనుకున్నారు ఇద్దరు మిత్రులు. పూర్తిస్థారుులో వుహిళల భద్రత కోసం సేవలందించేందుకు చేస్తున్న ఉద్యోగాలనూ వదులుకున్నారు. ‘కోబ్రా న్యూస్ డాట్ కామ్’ పేరిట వెబ్సైట్ ప్రారంభించి, నేరాల బారిన పడకుండా నగరవాసులను ఎప్పటికప్పుడు అప్రవుత్తం చేస్తుండటమే కాకుండా, వుహిళల భద్రత కోసం ప్రత్యేకమైన యూప్స్, షాకింగ్ గన్స్, షాకింగ్ టార్చ్‌లైట్స్ వంటివి అందిస్తున్నారు. నిత్యం జరిగే నేరాలపై వెబ్సైట్ ద్వారా ఎప్పటికప్పుడు సవూచారం అందించడంతోనే సరిపుచ్చుకోలేదు వారు. అలాంటి నేరాలు జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సలహా సూచనలనూ తవు వెబ్సైట్లో పోస్ట్ చేస్తారు. సవుస్యల్లో చిక్కుకుని, పోలీస్‌స్టేషన్‌కు వెళ్లలేని వుహిళల కోసం ప్రత్యేకంగా 9052116413, 9849606691 నంబర్లను కేటారుుంచారు. ఫోన్ ద్వారా వారి సవుస్యలను తెలుసుకున్నాక, వాటి పరిష్కారానికి దగ్గర ఉండి వురీ సహాయుం చేస్తారు. షాకింగ్ ఐటమ్స్ ఇంటి నుంచి బయుటకు వెళ్లే వుహిళల రక్షణ కోసం వారి హ్యాండ్‌బ్యాగ్‌లో ఇమిడిపోయే పరికరాలను ‘కోబ్రాన్యూస్’ అందిస్తోంది. చూడటానికి ఇవి ఆటబొవ్ముల్లా కనిపించినా, వీటి పనితీరు అమోఘంగా ఉంటుంది. ‘కోబ్రాన్యూస్’ అందించే వాటిలో షాకింగ్ గన్.. చిన్నసైజు గన్లా కనిపిస్తుంది. ఎవరైనా దాడికి తెగబడితే, వారికి గురిచూసి గన్ని ఆన్ చేస్తే చాలు.. దుండగుడికి స్పృహ తప్పడం ఖాయుం. షాకింగ్ టార్చ్‌లైట్ కూడా షాకింగ్ గన్ వూదిరిగానే పనిచేస్తుంది. ఎదుటి వ్యక్తిపై దానిని ఫోకస్ చేస్తే, వెంటనే స్పృహ కోల్పోయేలా చేస్తుంది. ఇవే కాదు, వుహిళల రక్షణ కోసం ప్రత్యేకమైన యూప్స్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు సైతం కృషి చేస్తున్నారు ఈ ఇద్దరు మిత్రులూ. సమాచారమిస్తే చాలు ప్రస్తుతం వూ వెబ్‌సైట్‌కు స్వచ్ఛందంగా సవూచారం అందించడానికి చాలావుంది యుువత వుుందుకొస్తున్నారు. వుహిళలకు అనుకోని ఆపద ఎదురైనప్పుడు వూకు చిన్న సవూచారం చేరవేసినా, నిమిషాల్లో వారిని రక్షించే దిశగా ప్రయుత్నాలు చేస్తున్నాం. -గౌస్ (వెబ్సైట్ నిర్వాహకుడు) అలర్ట్ చేయుడమే ఉద్దేశం హైదరాబాద్ నగరం నేరాల్లో బాంబేతో పోటీ పడుతోందని చెప్పొచ్చు. వుహిళల పరిస్థితి నానాటికీ దారుణంగా ఉంది. వుహిళలు అలర్ట్‌గా ఉంటే, నేర తీవ్రత చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. వూ వెబ్సైట్ ద్వారా ప్రజలను అలర్ట్ చేయుడమే వూ ఉద్దేశం - ఇన్నారెడ్డి (వెబ్సైట్ నిర్వాహకుడు) - విజయారెడ్డి -
మహిళల కోసం పోలీసు కంట్రోల్ రూం
రాజధానిలోని అన్ని జోన్లు, ప్రతి జిల్లాలో పోలీస్ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ప్రభుత్వానికి ప్రతిపాదించనున్న రాష్ట్ర మహిళా భద్రతా కమిటీ గుజరాత్, ముంబైలలో పర్యటించి వచ్చిన కమిటీ నేడు డీజీపీతో సమావేశం హైదరాబాద్: ఆపదలో ఉన్న మహిళలకు వెంటనే రక్షణ కల్పించేందుకు ప్రత్యేకంగా మహిళా పోలీస్ కంట్రోల్‌రూంను ఏర్పాటు చేయాలని మహిళా భద్రతా కమిటీ రాష్ర్ట ప్రభుత్వానికి ప్రతిపాదించనుంది.అలాగే రాజధానిలోని అన్ని జోన్లతోపాటు, ప్రతి జిల్లాలో ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేయాలని కూడా సూచించనుంది. రాష్ర్టంలో మహిళలు, యువతులు, బాలికల భద్రత కోసం ప్రభుత్వం తీసుకువచ్చే చట్టాల కోసం తగిన సిఫారసులు చేయడానికి ఏర్పాటైన మహిళా భద్రతా కమిటీ సభ్యులు రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ సౌమ్యామిశ్రా, సీఐడీ ఐజీ చారుసిన్హా, హైదరాబాద్ నగర అదనపు పోలీసు కమిషనర్ (క్రైమ్) స్వాతి లక్రా రెండురోజుల పాటు గుజరాత్, ముంబైలలో పర్యటించారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్‌లోని వన్‌స్టాప్ క్రైం సిస్టంతోపాటు, మహిళలు ఆన్లైన్లో కంప్లయింట్ చేసే విధానాన్ని బృందం పరిశీలించింది. పోలీసు డయల్ 100 మాదిరిగా ఆపదలో ఉన్న మహిళల కోసం డయల్ 181 విధానాన్ని పరిశీలించారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూం, అందులో మహిళలే పనిచేయడం, వచ్చిన కాల్లపై స్పందిస్తున్న తీరును పరిశీలించిన వారు ఆ విధానాన్ని రాష్ర్టంలోనూ అమలు చేయాలని ప్రతిపాదించనున్నారు. అలాగే, ముంబైలో ప్రతిజోన్‌లో ఒక ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు ద్వారా మహిళలకు అందుతున్న తక్షణ రక్షణను పరిశీలించారు. వీటిని మహారాష్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని అక్కడి అధికారులు కమిటీ సభ్యులకు వివరించారు. గుజరాత్, ముంబైలలో మహిళల భద్రతకు పనిచేస్తున్న వ్యవస్థలు, విధివిధానాలకు సంబంధించిన పుస్తకాలను పరిశీలించిన కమిటీ ముఖ్యమైన అంశాలతో ప్రభుత్వానికి సిఫారసులు చేయనుంది. అందులో భాగంగానే పోలీస్ కంట్రోల్ రూం, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ల ఏర్పాటు, మహిళా సిబ్బంది నియామకంపై సూచనలు చేస్తుంది. వీటికి తుదిరూపు ఇవ్వడానికి ఆదివారం డీజీపీ అనురాగ్‌శర్మ, మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సునీల్ శర్మలతో మహిళా భద్రతా కమిటీ సభ్యులు సమావేశం కానున్నారు. -
సిటీ బస్సుల్లో గ్రిల్స్
మహిళా ప్రయాణికుల భద్రతపై ఆర్టీసీ దృష్టి సికింద్రాబాద్-కోఠి మార్గంలో లేడీస్ స్పెషల్ మహిళా భద్రతా కమిటీ సూచనల అమలు సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీసీ బస్సుల్లో ఆకతాయిల ఆగడాలకు అడ్డు పెట్టే దిశగా సంబంధిత అధికారులు చర్యలకు ఉపక్రమిస్తున్నారు. మహిళా ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమిస్తున్నారు. ఇందులో భాగంగా సిటీ బస్సుల్లో పురుషులు, మహిళలకు మధ్య గ్రిల్స్ ఏర్పాటు చేయనుంది. మహిళల భద్రత కోసం ఏర్పాటైన పూనం మాలకొండయ్య కమిటీ సిఫార్సుల మేరకు గ్రేటర్ ఆర్టీసీ చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలో సికింద్రాబాద్-అఫ్జల్‌గంజ్ మధ్య నడిచే 8ఎ రూట్లోని 11 బస్సుల్లో ప్రత్యేకంగా గ్రిల్స్ ఏర్పాటు చే యనున్నారు. సాధారణంగా పురుషులు, యువకులు వెనుక నుంచి బస్సులోకి ఎక్కినప్పటికీ... బాగా ముందుకు చొచ్చుకు వెళ్లడం, కొంతమంది ఆకతాయిలు ఉద్దేశపూర్వకంగామహిళా ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించడం వంటివి జరుగుతున్నాయి. ఇలాంటివి నిరోధించేందుకు గ్రిల్స్ ఉపకరిస్తాయి. అక్టోబర్ 1వ తేదీ నుంచి 8ఎ రూట్లోని బస్సులలో వీటిని ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలని ఆర్టీసీ భావిస్తోంది. ఈ బస్సుల్లోని అనుభవాలను పరిగణనలోకి తీసుకొని నగరంలోని మిగతా రూట్లకు విస్తరిస్తారు. దశల వారీగా గ్రేటర్‌లోని 1,050 రూట్లలో, 3,850 బస్సులలో గ్రిల్స్ అందుబాటులోకి తీసుకు రానున్నట్టు ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. లేడీస్ స్పెషల్ బస్సుల పెంపు సికింద్రాబాద్ నుంచి కోఠి మధ్య రాకపోకలు సాగించే 86 నెంబర్ రూట్లో 8 లేడీస్ స్పెషల్ బస్సులను కూడా అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే ఉదయం, సాయంత్ర వేళల్లో ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. సికింద్రాబాద్ నుంచి రాంనగర్, వీఎస్టీ, నారాయణగూడ మార్గంలో ఈ బస్సులు రాకపోకలు సాగిస్తాయి. ప్రస్తుతం గ్రేటర్‌లోని వివిధ రూట్లలో సుమారు 65 లేడీస్ స్పెషల్ బస్సులు నడుస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు వెళ్లే మహిళా ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఉదయం, సాయంత్రం ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉన్నాయి. వనస్థలిపురం ఎన్జీవోస్ కాలనీ నుంచి సెక్రెటేరియట్‌కు, దిల్సుఖ్నగర్ నుంచి నాంపల్లికి, కుషాయిగూడ, ఈసీఐఎల్ నుంచి లకిడీకాఫూల్, సెక్రెటేరియట్ మార్గాల్లో, సికింద్రాబాద్ నుంచి అమీర్‌పేట్ మీదుగా ఖైరతాబాద్ వరకు, సికింద్రాబాద్-మెహదీపట్నం, సికింద్రాబాద్, కోఠి వంటి ప్రధాన రూట్ల నుంచి హైటెక్ సిటీ వరకు లేడీస్ స్పెషల్ బస్సులు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ బస్సులకు మహిళా ప్రయాణికుల స్పందన కూడా అనూహ్యంగా ఉంది. ప్రస్తుతం ప్రవేశపెట్టనున్న 86 రూట్‌తో పాటు, మరిన్ని రూట్లకు కూడా లేడీస్ స్పెషల్ బస్సులను విస్తరించే అవకాశం ఉంది. -
ఆమెకు రక్షణ
ఖమ్మం క్రైం : మహిళా భద్రతకు భరోసా ఇచ్చేలా నూతన ప్రభుత్వం ముందుకు కదిలింది. ఇటీవల జరుగుతున్న సంఘటనలు మహిళలను ఆందోళనకు గురిచేస్తుండడంతో ప్రభుత్వం వారి భద్రతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మహిళా రక్షణపై సీనియర్ ఐఏఎస్, ఏపీఎస్ అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదిక అందజేశారు. ఈ నివేదికలో సూచనల ఆధారంగా ప్రభుత్వం జిల్లా స్థాయిలో మహిళల భద్రతపై తీసుకునే చర్యలకు సంబంధించి కసరత్తు చేస్తోంది. ప్రతి సబ్ డివిజన్లో మహిళాపోలీస్ స్టేషన్.. ప్రస్తుతం ఒక్క జిల్లా కేంద్రంలో మాత్రమే మహిళా పోలీస్‌స్టేషన్ ఉంది. దీంతో దూర ప్రాంతాల మహిళలు ఇంతదూరం వచ్చి ఫిర్యాదు చేయలేకపోతున్నారు. అయితే ప్రతి సబ్‌డివిజన్‌లో ఒక మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని మహిళ రక్షణ కమిటీ సూచించటంతో జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించారు. జిల్లాలో ఏడు సబ్ డివిజన్లు ఉండగా ఖమ్మం సబ్ డివిజన్లో భాగంగా జిల్లా కేంద్రంలో మాత్రమే మహిళా పోలీస్ స్టేషన్ ఉంది. ఇప్పుడు మిగతా ఆరు డివిజన్లతో పాటు ఖమ్మం సబ్ డివిజన్లో మరో స్టేషన్ ఏర్పాటుకు ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో మహిళారక్షక్ ఏర్పాటుకు ప్రతిపాదనలు.. మహిళలపై జరుగుతున్న దాడులతోపాటు అఘూయిత్యాలను యుద్ధ ప్రాతిపదికన ఆరికట్టడానికి ఢిల్లీ పోలీసుల తరహాలో మహిళారక్షక్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి అనుమతి లభించిన తర్వాత మహిళా రక్షక్ విధివిధానాలు తెలిసే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు. మహిళలు, యువతుల అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి.. మహిళలు, యువతుల అక్రమ రవాణాపై జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇల్లెందు, ఖమ్మం, కొత్తగూడెం సబ్ డివిజన్లలోని పలు తండాల్లో కొంతకాలంగా మహిళలు, యువతులను అక్రమ రవాణా చేస్తున్నట్లు తెలిసింది. మహిళా రక్షణ కమిటీ సూచనలతో దీన్ని అరికట్టేందుకు జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. మహిళల వేధించిన ఎన్ఆర్ఐలనూ వదిలేది లేదు.. వరకట్న వేధింపులతోపాటు, మహిళల పట్ల ఇతర నేరాలకు పాల్పడి విదేశాలలో ఉన్న ఎన్ఆర్ఐలను స్వదేశానికి రప్పించాలనే కమిటీ సూచనలపై కూడా పోలీసులు దృష్టి సారించారు. అలాంటి ఎన్ఆర్ఐల జాబితా సిద్ధం చేయాటానికి సమాయత్తమవుతున్నారు. విద్యా సంస్థల్లో ప్రత్యేక శిబిరాలు.. మహిళల భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలనే కమిటీ సూచన మేరకు జిల్లా పోలీసులు విద్యాసంస్థలలో ప్రత్యేక క్యాంపులు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించగానే దీనిని ఆచరణలో పెట్టాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. మహిళలపై దాడులు, అఘాయిత్యాలకు పాల్పడితే అత్యంత కఠినంగా, నేరగాళ్లకు భయం పుట్టేలా చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పటంతో పాటు పోలీస్‌శాఖకు సైతం ఆదేశాలు అందాయి. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారెవరైనా ఉపేక్షించేది లేదని అధికారులు సైతం హెచ్చరిస్తున్నారు. కేసు నమోదైన ఒక్క రోజులోనే వారిపై చర్యలు తీసుకోవటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తమ భద్రతకు ప్రభుత్వం సంరక్షణ చర్యలు తీసుకుంటుండడంతో పలువురు మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు భద్రత అవసరం .. - బత్తిన సాయిశ్రీ, వైరా డీఎస్పీ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేక రక్షణ ఏర్పాటు చేయడం హర్షనీయం. మహిళలు నిర్భయంగా జరిగిన అన్యాయాన్ని తెలియజేసినప్పుడే చట్టాలు వారికి రక్షణగా నిలుస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మహిళా భద్రతపై కమిటీ, మహిళలకు వారి వారి స్థానాల్లో కల్పిస్తున్న సౌకర్యాలు ఎంతో ఉపయోగపడుతాయి. చిన్నతనం నుంచే తల్లిదండ్రులు పిల్లలకు ప్రోత్సాహం ఇచ్చి ఇంటి నుంచే మంచి నడువడిక అలవడేలా చూడాలి. సమాజం కూడా మహిళలకు రక్షణగా ఉంటే చట్టాలకు మరింత మద్దతు లభించినట్లు అవుతుంది. -
మహిళల భద్రతకే తొలిప్రాధాన్యం: సీఎం
ప్రాథమిక నివేదిక సమర్పించిన ఉన్నతాధికారుల కమిటీ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రతకే తొలి ప్రాధాన్యమిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు చెప్పారు. మహిళలపై అఘాయిత్యాలు జరిగితే ఎట్టి పరిస్థితుల్లో నూ క్షమించవద్దని, అత్యంత కఠినంగా వ్యవహరించాలన్నారు. మహిళల, ఆడపిల్లల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై శనివారం క్యాంప్ కా ర్యాలయంలో సీఎం కేసీఆర్‌కు మహిళల రక్షణ, భద్రత కమిటీ చైర్మన్ పూనం మాలకొండయ్య ప్రాథమిక నివేదిక అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే గొంగడిసునీతతోపాటు, కమిటీ సభ్యు లు శైలజా రామయ్యర్, స్మితా సభర్వాల్, సౌమ్యమిశ్రా, చారుసిన్హా, స్వాతి లక్రాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, తెలంగాణలో మహిళలపై అఘాయిత్యాలు జరిగితే ప్రభుత్వం కఠినంగా ఉంటుందని భయం పుట్టేలా వ్య వహరించాలని ఆధికారులకు చెప్పారు. మహిళా ఉద్యోగులపై ఏదైనా తప్పు జరిగితే సంబంధిత శాఖాధిపతులే బాధ్యత వహించేలా ఉత్తర్వులు జారీచేయాలని ఆదేశించారు. ప్రతి శాఖలో గ్రీవెన్స్‌సెల్ ఏర్పాటుచేయాలని సూచించారు. విమెన్ ప్రొటెక్షన్సెల్కు ప్రత్యేక భవనం... రాష్ట్రస్థాయిలో విమెన్ ప్రొటెక్షన్సెల్ను ఏర్పాటుచేసి దానికి ప్రత్యేకంగా ఒక భవనం నిర్మిస్తామని, దాని నిర్వహణకు అవసరమైన నిధులు సమకూరుస్తామని సీఎం హామీఇచ్చారు. రాష్ట్రం లో మహిళల భద్రత, రక్షణ కోసం ‘మిషన్ విమె న్ ప్రొటెక్షన్’ అనే పేరుతో కార్యక్రమాలు రూ పొందించాలని చెప్పారు. సింగపూర్‌లో ఎలాగైతే మహిళలు అర్థరాత్రి దాటినా స్వేచ్ఛగా బయట తిరగగలరో తెలంగాణలో కూడా అలాంటి రోజు లు రావాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో గృహహింస ఏయే కారణాలతో ఎక్కువగా జరుగుతున్నదనే విషయాలను విశ్లేషించి, పరిష్కారమార్గాలు అన్వేషించాలన్నారు. ఈవ్‌టీజింగ్, యాసి డ్ దాడుల వంటి బహిరంగ హింసాత్మక సంఘటనలకు కారణాలను అన్వేషించి, నిరోధక చర్యలను చేపట్టాలని సూచించారు. మహిళలు ఎక్కువగా వీక్షించే టీవీచానళ్లలో మహిళల భద్రత కోసం చేసేచట్టాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు రూపొందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. సినిమాలు, టీవీల్లో మహిళలను అవమానించే, అసభ్యంగా చూపించే దృశ్యాలను నియంత్రించేందుకుచర్యలు తీసుకోవాలనిచెప్పారు. మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంచేలా ని ర్మించే సినిమాలకు, టీవీ సీరియళ్లకు ప్రభుత్వం అవార్డులు, ప్రోత్సహకాలు అందిస్తుందన్నారు. పాఠశాలస్థాయి నుంచే శిక్షణ... దాడులను తిప్పికొట్టేలా పాఠశాల స్థాయినుంచే అమ్మాయిలకు శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటుచేయాలని సీఎం చెప్పారు. బస్సుల్లో అమ్మాయిలు ఒకవైపు ఉండే విధంగా మధ్యలో గ్రిల్ ఏర్పాటుచేయాలన్నారు. అమ్మాయిల తల్లితండ్రులకు కూడా అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలను రూపొందించాలన్నారు. మహిళల భద్రత కు సంబంధించి ఏ దేశంలో అయితే ఉత్తమమైన కార్యక్రమాలు,పద్ధతులు అమలవుతున్నాయో తెలుసుకోవడానికి ఆయాదేశాల్లో పర్యటించాలని కమిటీ సభ్యులకు సీఎం సూచించారు. మహిళ రక్షణ, భద్రత కమిటీ సిఫార్సులు మహిళల రక్షణ, భద్రత కమిటీ మొత్తం 82 సూచనలు, ప్రతిపాదనలతో సీఎం కేసీఆర్‌కు ప్రాథమిక నివేదికను సమర్పించింది. మరిన్ని వివరాలు, సూచనలతో నవంబర్ ఆఖరుకల్లా మధ్యంతర, దీర్ఘకాలిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. ప్రాథమిక నివేదికలోని ముఖ్య సిఫారసులివీ... ►రాష్ట్రంలోని మహిళల భద్రతకు మూడంకెల హెల్ప్‌లైన్ సెంటర్లు (జీపీఎస్ ట్రాకింగ్‌తో) బాధితులకు స్వాంతన చేకూర్చేందుకు కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ► మహిళా కమిషన్‌ను ఏర్పాటుచేస్తే సమస్యల ను చెప్పుకునే అవకాశం ఉంటుంది. ►పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు గురికాకుండా చర్యలు చేపట్టాలి. ప్రత్యేకంగా వారికి మరుగు ఉండేలా చర్యలు. బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుచేసి వారి భద్రతను సమీక్షించాలి. ► మహిళలు స్వేచ్ఛగా ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా పోలీసుస్టేషన్లకు వచ్చి ఫిర్యాదు చేసేలా చూడాలి. వాటిలో కౌన్సెలిం గ్లో నిష్ణాతులైన బయటి వ్యక్తులను కౌన్సెలర్‌గా నియమిస్తే ఎఫ్ఐఆర్ నమోదులోఎలాంటి లోపాలకు అవకాశం ఉండదు. ► పోలీసుశాఖలో మహిళల సంఖ్యను పెంచాలి. విధిగా 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి, ద్విచక్రవాహనాలు నడిపేలా శిక్షణనివ్వాలి. ►మద్యాన్ని నియంత్రిస్తే మహిళలపై జరుగుతున్న నేరాల సంఖ్యను తగ్గించే అవకాశం ఉంది. ఇళ్ల మధ్యలో మద్యం దుకాణాలు, బెల్ట్‌షాపులను నియంత్రించాలి. ► జీహేచ్ఎంసీ పరిధిలో రోజంతా పనిచేసే (24 గంటలూ) మూడు వన్‌స్టాప్ కేంద్రాల ఏర్పాటు. ఈ కేంద్రాల్లో శిక్షణ పొందిన కౌన్సెలర్, పదేళ్ల వృత్తి అనుభవమున్న మహిళాన్యాయవాది, వైద్యులు, డిప్యూటీ సూపరిం టెండెంట్ స్థాయిలో పోలీసు అధికారి, మహి ళా శిశుసంక్షేమ అధికారుల నియామకం. వీ టిని సమీపంలోని పోలీస్స్టేషన్లతో అనుసంధానించాలి. జిల్లాకు ఒకటి చొప్పున ఈ వన్‌స్టాప్ సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. ►మహిళల భద్రతకు ప్రత్యేక ట్యాక్సీలు. షీటాక్సీ విధానాన్ని ప్రవేశపెట్టాలి. కొన్నిరూట్లలో ప్రత్యేక మహిళా బస్సులను నడపాలి. ► గృహహింస నుంచి మహిళల రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలి ► విద్యాసంస్థల్లో ఆడపిల్లలు, మహిళల రక్షణకు మెరుగైన మౌలికసదుపాయాల కల్పన, వారి భద్రతకు ఆయా నియమాలు, నిబంధనలను కచ్చితంగా అమలు. ► సమగ్ర పిల్లల రక్షణ పథకాన్ని చేపట్టి జిల్లా, మండల,గ్రామస్థాయిల్లో పిల్లల రక్షణ కమిటీలను ఏర్పాటుచేయాలి. ► జిల్లాస్థాయిలోని మహిళా భద్రత కమిటీలను రాష్ట్రస్థాయి జెండర్ రిసోర్స్ కమిటీకి అనుసంధానం చేయాలి. ► ప్రతి స్కూల్, కాలేజీలలో కన్యశక్తి, నారీశక్తి కమిటీలను ఏర్పాటుచేయాలి. ►మీడియాసంస్థల్లో మహిళల భద్రత, రక్షణకు చర్యలు. రాత్రి 8 దాటితే మహిళలను ఇళ్ల వద్ద దించిరావాలి. ► స్కూళ్లలో సెల్ఫోన్లను నిషేధించాలి. విద్యాసంస్థల్లో ఇంటెర్నెట్ వినియోగానికి సంబంధించి కచ్చితమైన నియంత్రణ ఉండాలి. ► ఆడపిల్లల రెసిడెన్సియల్ స్కూళ్లు, హాస్టళ్లలో మగవార్డెన్లు, అటెండర్లను నియమించరాదు. -
మహిళల భద్రతపై 20న నివేదిక
పోలీసు శాఖలోని అన్ని విభాగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్ అవసరం 60 రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక చైర్పర్సన్ పూనం మాలకొండయ్య హైదరాబాద్: మహిళల భద్రతపై తాము రూపొందించిన ప్రాథమిక నివేదికను ఈ నెల 20న ప్రభుత్వానికి అందిస్తున్నట్లు దీనిపై ఏర్పాటు చేసిన కమిటీ వివరించింది. జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సోమవారం ఈ బృందం హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని పలు పోలీస్స్టేషన్లకు చెందిన ఏసీపీ, ఇన్స్పెక్టర్, ఎస్సైలతో కమిటీ సభ్యులు సమావేశమయ్యారు.అనంతరం సమావేశంలో చర్చించిన పలు వివరాలను కమిటీ చైర్పర్సన్ పూనం మాలకొండయ్య విలేకరులకు వివరించారు. నగరంలోని చాలా పోలీస్స్టేషన్లలో చీటింగ్కేసులతోపాటు ప్రేమ, పెళ్లికి సంబంధించి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయన్నారు. ఐపీసీ సెక్షన్ 470, 498కి సంబంధించిన కేసులు ఉంటున్నాయన్నారు. వీటికి అడ్డుకట్ట వేసేందుకు వివాహాల రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేయాలని పలువురు సూచించారన్నారు. ప్రతీ పోలీస్‌స్టేషన్‌లో మహిళా పోలీస్‌స్టేషన్‌తోపాటు, చైల్డ్ హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటుచేయాలన్నారు. పోలీసు శాఖలోని అన్ని విభాగాలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సూచించారు. ఎన్ఆర్ఐ చీటింగ్ కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంటున్నాయని వీటిలో నిందితులు విదేశాలకు వెళ్లి తప్పించుకోకుండా ప్రత్యేక కమిటీని వేయాలన్నారు. అత్యాచార కేసులలో కేసుల విచారణ వేగిరపరచాలని, వీటికి సంబంధించి ఆసుపత్రులందించే రిపోర్టులు ఆలస్యమవుతున్నాయన్నారు. ఈ నెల 20 వరకు నిర్వహించే సమీక్షల ఆధారంగా రూపొందించిన నివేదికను ప్రభుత్వానికి అందిస్తామన్నారు. ఇందులో తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై వివరిస్తామన్నారు. మిగిలిన రిపోర్టును 60 రోజుల్లో అందిస్తామని పూనం మాలకొండయ్య వివరించారు. -
మహిళల భద్రతకు ‘రక్ష’ యాప్
త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అమలు మహిళా హాస్టళ్ల వద్ద ప్రత్యేక నిఘా చిత్తూరు ఏఎస్పీ అన్నపూర్ణారెడ్డి చిత్తూరు (అర్బన్): మహిళల భద్రత కోసం రాష్ట్ర వ్యాప్తంగా ‘రక్ష’ పేరిట కొత్త అప్లికేషన్ (యాప్)ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చిత్తూరు అదనపు ఎస్పీ అన్నపూర్ణారెడ్డి తెలిపారు. ర్యాగిం గ్ అరికట్టడంపై చిత్తూరులోని ప్రభు త్వ, ప్రైవేటు కళాశాలల ప్రిన్సిపాళ్లతో స్థానిక పోలీసు అతిథిగృహంలో గురువారం అవగాహన సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ రక్ష యాప్ ఆండ్రాయిడ్ వర్షన్ ఉన్న ఫోన్లలో పనిచేస్తుందన్నారు. ఇంట ర్నెట్ నుంచి ఈ యాప్‌ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకుని, ఇందులో ఐదుగురి సెల్ నెంబర్లను మహిళలు ఫీడ్ చేయాల న్నారు. ఏదైనా ప్రమాదం, ఆపదలో ఉన్నప్పుడు ఈ యాప్‌ను ఉపయోగిస్తే ఫీడింగ్‌లో ఉన్న ఐదుగురి సెల్నెంబర్లకు మెసేజ్ వెళ్లడంతో పాటు సంబంధిత మహిళ ఎక్కడుందనే విషయాన్ని శాటిలైట్ మ్యాప్ ద్వారా తెలియజేస్తుందన్నారు. చిత్తూరు నగరంలో ప్రతి మహిళా కళాశాల వద్ద ర్యాగింగ్‌ను నిరోధించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. పగటిపూట గస్తీ పెంచడం, కళాశాలల్లోనే యాంటీ ర్యాగింగ్ కమిటీలు రూపొందిచడం చేస్తామన్నారు. కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లు సైతం ర్యాగింగ్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. తప్పనిసరిగా ప్రతి కళాశాల వద్ద పోలీసు స్టేషన్, సీఐల నెంబర్లను విద్యార్థులు గుర్తించే లా అందుబాటులో ఉంచాలన్నారు. సీ ఐ రాజశేఖర్ మాట్లాడుతూ బస్సులు నడిపేటప్పుడు డ్రైవర్లు మద్యం సేవిం చడం, సెల్ఫోన్లు వాడటం నిరోధించాలన్నారు. సమావేశంలో ఎస్ఐలు కృష్ణయ్య, మురళీమోహన్, పలు కళాశాలల అధ్యాపకులు పాల్గొన్నారు. -
మహిళల భద్రతపై 28న నివేదిక
► త్వరలో స్వల్పకాలిక చర్యలు ► {పత్యేక హెల్ప్‌లైన్ నంబర్ ► మహిళా సంఘాల నుంచి సలహాల స్వీకరణ ► అధ్యయన కమిటీ చైర్పర్సన్ పూనం మాలకొండయ్య హైదరాబాద్: మహిళల భద్రత విషయంలో స్వల్పకాలిక చర్యలను సిఫారసు చేస్తూ ఈ నెల 28న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందజేస్తామని మహిళల రక్షణ చట్టాలపై ఏర్పాటైన అధ్యయన కమిటీ చైర్పర్సన్, సీనియర్ ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్య తెలిపారు. సమగ్ర నివేదిక కోసం మరింత సమయం అవసరమన్నారు. కమిటీ కన్వీనర్ సునీల్ శర్మ, సభ్యులు సౌమ్యామిశ్రా, స్వాతి లక్రా, చారుసిన్హా, శైలజా రామయ్యర్, ఆమ్రపాలి, స్మితా సబర్వాల్లతో కలసి ఆమె గురువారం సచివాలయంలో పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాల మహిళా ప్రతినిధులతో సమావేశమై సూచనలు స్వీకరించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. శుక్రవారం బేగంపేటలోని ప్రభుత్వ పాఠశాల, కళాశాలలను సందర్శించి విద్యార్థినుల సమస్యలు అడిగి తెలుసుకుంటామని చెప్పారు.మురికివాడల్లోని నిరుపేద మహిళలు, కాలనీల్లోని మధ్యతరగతి మహిళలను సైతం కలుసుకుని సూచనలు స్వీకరిస్తామన్నారు. పీఓడబ్ల్యూ తెలంగాణ అధ్యక్షురాలు సంధ్య, భూమిక హెల్ప్‌లైన్ నిర్వాహకులు కొండవీటి సత్యవతి, అనూరాధ, సునీతా కృష్ణన్, తదితరులు పాల్గొన్నారు. మహిళా సంఘాల సూచనలు... ► కేసుల సత్వర పరిష్కారం కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. ► పోలీసుస్టేషన్లలో మహిళా హెల్ప్ డెస్కులు.. మూడు అంకెల నంబర్‌తో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలి. ► పునరావాస కేంద్రాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేయాలి. ప్రభుత్వ ఆధ్వర్యంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ► అత్యాచార బాధితులకు సత్వర సహాయం అందడం లేదు. చట్టంలో సూచించిన విధంగా సంబంధిత శాఖలు వేగంగా స్పందించి బాధితులకు వైద్య, న్యాయ సహాయం అందించేలా చూడాలి. ► మహిళలు పనిచేసే స్థలాలు, పాఠశాలలు, కళాశాలల్లో లైంగిక హింస నిర్మూలనపై కమిటీలు ఏర్పాటు చేయాలి ► భర్తలు వలస వెళ్లడంతో ఒంటరిగా ఉండే మహిళలకు రక్షణ కల్పించాలి ► వీధి బాలికలు, నిరాశ్రయులైన మహిళల కోసం నైట్ షెల్టర్లను నెలకొల్పాలి. ► బాలలపై లైంగిక హింసపై అవగాహనను పాఠ్యాంశంగా చేర్చాలి. ► అనాథ బాలబాలికలకు జనన ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డులు అందజేయాలి. -
మహిళల భద్రతపై గుజరాత్, కేరళలో అధ్యయనం
హైదరాబాద్: రాష్ట్రంలో మహిళల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదిక అందించేందుకు ఏర్పాటైన కమిటీ శనివారం సచివాలయంలో సమావేశమైంది. మహిళల సమస్యల పరిష్కారంలో కృషిచేస్తున్న ఉమెన్ స్టాఫ్ క్రైసిస్ సంస్థ కార్యకలాపాలు అధ్యయనం చేయడానికి కమిటీ సభ్యుడు సునీల్‌శర్మను గుజరాత్‌కు, స్త్రీ ఆర్ట్స్ సంస్థ కార్యకలాపాలను అధ్యయనం చేసేందుకు హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి సౌమ్యా మిశ్రాను కేరళకు పంపాలని కమిటీ నిర్ణయించింది. అలాగే, ఈ నెల 11న మహిళా ఐటీ ఉద్యోగులతో, 12న స్వచ్చంధ సంస్థలతో సమావేశమై వారి సూచనలు, సలహాలు తీసుకోవాలని.. 15న ప్రభుత్వానికి నివేదికను అందచే యాలని నిర్ణయించింది. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి, సీఐడీ ఐజీ చారుసిన్హా, పోలీసు ట్రైనింగ్ విభాగం ఐజీ స్వాతి లక్రా, ఐఏఎస్ అధికారి సునీల్‌శర్మ తదితరులు పాల్గొన్నారు. -
మహిళలపై మోడీ వివక్ష
మహబూబాబాద్ : సర్దార్ వల్లబాయ్ పటేల్ విగ్రహానికి, ఇతరత్ర నిర్మాణాలకు రూ.200కోట్లు కేటాయించిన ప్రధాని నరేంద్రమోడీ మహిళల భద్రత కోసం కేవలం రూ.100 కోట్లు మాత్రమే కేటాయించారు.. మహిళలపై ఆయనకున్న అభిమానం ఏపాటిదో బడ్జెట్‌తోనే బయటపడిందని పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు వి.సంధ్య విమర్శించారు. 498ఎ చట్టం అమలుపై సోమవారం పీఓడబ్ల్యూ మానుకో ట శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో చర్చాగోష్టి నిర్వహించారు. జిల్లా కార్యదర్శి బొమ్మెరబోయిన అనసూయ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమం లో సంధ్య మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా మహిళల సమస్యలను పట్టించుకునే వారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్భయ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయకపోవడం వల్లే లైంగిక దాడులు జరుగుతున్నాయని, దాడులను అన్యాయాలను ఎదుర్కోవడానికి సామూహికం గా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పురుషులతో సమానంగా మహిళలకు హక్కు కల్పించాలన్నదే హిందు కోడ్ ఉద్దేశమని చెప్పారు. ఇందిరాగాంధీ సమయంలోనూ ఏనాడూ మహిళా చట్టాలపై, వారి సమస్యలపై స్పందిం చి న దాఖలాలు లేవన్నారు. వరకట్న నిషేధ చట్టం, ఇతరత్రా వాటిని పోరాటాల ద్వారానే సాధించుకోగలిగామని పేర్కొన్నారు. పాలకులు 498ఎ చట్టానికి తూట్లు పొడుతున్నారని, కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ చట్టం వచ్చిందని చెప్పారు. ఆ చట్టం పటిష్టంగా అమలు కావడానికి మహిళలు ఉద్యమించాలని కోరారు. కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు నర్సక్క, రాష్ట్ర నాయకురాలు నిర్మల, నాయకులు మండల వెంకన్న, బోగ రవిచంద్ర, సామ పాపన్న, తాజ్‌పాషా, పాఠశాల హెచ్ఎం మరియమ్మ, తదితరులు పాల్గొన్నారు. -
ముంబై మెట్రో రైళ్లలో భద్రత డొల్ల
సాక్షి, ముంబై : మెట్రో రైళ్లలో మహిళలకు భద్రత కరువైంది. కొందరు ఆకతాయిలు ఒక బోగీ నుండి మరో బోగిల్లోకి తిరుగుతూ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఈ నెల 4వ తేదీన మెట్రో రైల్లో ఓ యువతితో ఓ యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ వివషయమై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు స్పందించిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఇలా ఫిర్యాదులకు నోచని సంఘటనలెన్నో ఉన్నాయి. ఈనేపథ్యంలో మెట్రో రైళ్లలో మహిళల కోసం ప్రత్యేక బోగీని కేటాయించాలన్న డిమాండ్ మరింత ఊపందుకొంది. ప్రత్యేక బోగీలు లేవు ఘాట్కోపర్-డీఎన్నగర్ల మధ్య నడిచే మెట్రో రైళ్లలో ప్రయాణికుల రద్దీ తీవ్రమైంది. ముఖ్యంగా మహిళ ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అందుకు అనుగుణంగా ప్రత్యేక బోగీలు లేకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మెట్రో రైళ్లలో నాలుగు బోగీలుంటాయి. ఒక బోగీ నుండి మరో బోగీలోకి వెళ్లేందుకు ఆస్కారం ఉంది. ఈక్రమంలో ఆకతాయిలు ఒకబోగీ నుంచి మరోబోగీలోకి వెళ్తూ మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మెట్రో రైలుకు ఉండే నాలుగు బోగీలల్లో ఒక బోగీని మహిళల కోసం కేటాయించాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై రైల్వే అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదు. ‘అన్ని ప్రాంతాల్లో సీసీటీవి కెమెరాలున్నాయని, మహిళల భద్రతకు ఎలాంటి ఢోకాలేదని ముంబే మెట్రోవన్ ప్రెవైట్లిమిటెడ్ (ఎంఎంఓపీఎల్) ప్రకటించింది’. కానీ, జూలై 4వ తేదీ జరిగిన సంఘటన అనంతరం మహిళ ప్రయాణికుల భద్రతపై తక్షణమే స్పందించాలని మహిళలు పట్టుబడుతున్నారు. రైళ్లలో మహిళల భద్రతపై ఘాట్కోపర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహిళలకు ప్రత్యేక బోగీ కేటాయించాలి : ఎన్సీడబ్ల్యూ మెట్రో రైళ్లో మహిళలకు ప్రత్యేక బోగీ కేటాయించాలని ‘నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఇన్ ఇండియా’ (ఎన్సీడబ్ల్యూ) మహారాష్ట్ర శాఖ డిమాండ్ చే స్తోంది. ఈ విషయంపై ఎన్సీడబ్ల్యూ మహారాష్ట్ర శాఖ అధ్యక్షురాలు శుశిబేన్ షా మీడియాతో మాట్లాడుతూ... ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. కనీసం ఉదయం, సాయంత్రం రద్దీ సమయంలోనైనా మహిళల కోసం ప్రత్యేకంగా ఒక బోగీ కేటాయించాలని అన్నారు. మెట్రో రైళ్లలో మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. -
మహిళలను దేవుడే రక్షించాలి
పోలీసులు అందరినీ రంగంలోకి దింపినా అత్యాచారాలను అడ్డుకోలేరు యూపీ గవర్నర్ ఖురేషీ వివాదాస్పద వ్యాఖ్యలు లక్నో: అత్యాచారాల విషయంలో ఉత్తరప్రదేశ్ తాత్కాలిక గవర్నర్ అజీజ్ ఖురేషీ వివాదాస్పదంగా వ్యాఖ్యానించారు. మహిళల భద్రత కోసం ప్రపంచంలో ఉన్న పోలీసులు అందరినీ రంగంలోకి దింపినా అత్యాచారాలను ఆపలేరని చెప్పారు. దైవీ శక్తి మాత్రమే వాటికి చెక్ పెట్టగలదని అభిప్రాయపడ్డారు. 22 కోట్ల మంది జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న అత్యాచారాలు చాలా తక్కువేనంటూ ఎస్పీ అధినేత ములాయం వివాదాస్పదంగా వ్యాఖ్యానించిన మర్నాడే ఆ రాష్ట్ర గవర్నర్ కూడా అదే విధంగా మాట్లాడడం విమర్శలకు దారితీసింది. అజీజ్ ఖురేషీ సోమవారం ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ... దేవుడు అవతరిస్తే తప్ప నేరాలు నియంత్రణలోకి రావన్నారు. నేరాలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన, నేరస్థుల్లో భయం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో గవర్నర్ ఖురేషీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మహిళలపై నేరాలకు తెరపడాలంటే సమాజ దృక్పథంలో మార్పు రావాలని, నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉందని.అన్నానని వివరించారు. ఈ వ్యాఖ్యలు దురదృష్టకరం: బీజేపీ గవర్నర్ ఖురేషీ వ్యాఖ్యలపై వివిధ పార్టీల నుంచి తీవ్ర ప్రతిస్పందన వ్యక్తమైంది. గవర్నర్ ఇలాంటి ప్రకటనలు చేయడం దురదృష్టకరమని, ఆయన తన కార్యాలయ గౌరవాన్ని తగ్గించారని యూపీ బీజేపీ అధ్యక్షుడు మనోహర్ సింగ్ అన్నారు. యూపీ గవర్నర్‌గా మంగళవారం బాధ్యతలు చేపట్టబోతున్న రామ్‌నాయక్ స్పందిస్తూ.. నేరాలను రాజకీయం చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పారదర్శకమైన దర్యాప్తుతో దోషులను తక్షణమే శిక్షించాలన్నారు. -
మహిళల భద్రత కన్నా పటేల్ విగ్రహమే మిన్న!
న్యూఢిల్లీ: మహిళల భద్రత, వారి సంక్షేమం కన్నా గుజరాత్లో సర్దార్ పటేల్ విగ్రహ నిర్మాణమే ముఖ్యమైనదిగా మోడీ సర్కారు భావించింది. తాజా బడ్జెట్లో మహిళల భద్రత కోసం రూ. 150 కోట్లు, వారి సంక్షేమం కోసం రూ. 100 కోట్లు ప్రకటించిన ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ.. ప్రధానమంత్రి సొంతరాష్ట్రంలో నిర్మించ తలబెట్టిన ప్రతిష్టాత్మక సర్దార్ వల్లభాయి పటేల్ భారీ విగ్రహ ఏర్పాటుకు మాత్రం రూ.200 కోట్లను కేటాయించారు. 182 మీటర్ల ఎత్తుతో, రూ. 2,500 కోట్ల ఖర్చుతో అహ్మదాబాద్‌లో ప్రపంచంలోనే ఎత్తై సర్దార్ వల్లభాయి పటేల్ విగ్రహాన్ని ‘ఐక్యతా ప్రతిమ’ పేరుతో నిర్మించాలని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగానే మోడీ తలపెట్టిన సంగతి తెలిసిందే. దీనికి రూ. 200 కోట్లను కేటాయించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జైట్లీ ప్రతిపాదనల్లో ఇదే అత్యంత నచ్చని ప్రతిపాదనగా నెటిజన్లు అభిప్రాయపడ్డారు. -
మహిళలకు ఢిల్లీ సురక్షితమే
సాక్షి, న్యూఢిల్లీ: దేశరాజధాని నగరం మహిళలకు సురక్షితం కాదని బలంగా పాతుకుపోయిన అభిప్రాయాన్ని మార్చేందుకు ఢిల్లీ పోలీసులు సమాయత్తమవుతున్నారు. ఢిల్లీ నగరం మహిళలకు సురక్షితమైనదేనన్న విషయాన్ని చాటిచెప్పడం కోసం వారు వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టనున్నారు. నిర్భయ గ్యాంగ్‌రేప్ కేసు అనంతరం ఢిల్లీలో పర్యాటక రంగం ప్రభావితమైంది. ప్రతి నిత్యం నగరంలోని ఏదో ఒక మూల రేప్ కేసులు నమోదవుతుండడంతో ఢిల్లీ సురక్షిత నగరం కాదన్న అభిప్రాయం మహిళా పర్యాటకులలో బలపడింది. గూండాలు వీధుల్లో తిరుగుతుంటారని, చీకటిపడిన తరువాత మహిళలు బయటకు వెళ్లడం శ్రేయస్కరం కాదన్న వదంతులు వ్యాపించడంతో రాజధాని నగరంపై దురభిప్రాయం ఏర్పడింది. అయితే ఇది నిజం కాదని, ఢిల్లీ రోడ్లు మహిళలకు సురక్షితమైనవే అన్న విషయాన్ని ప్రజలకు తెలియజెప్పాలని నగర పోలీసులు భావిస్తున్నారు. ఢిల్లీలో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్న మాట వాస్తవమే. అయితే ఈ అత్యాచారాలకు పాల్పడుతున్న వారు ఎక్కువగా మహిళలకు పరిచయస్తులేనని పోలీసులు అంటున్నారు. అపరి చితుల చేతిలో అత్యాచారాలకు గురైన మహిళల కన్నా పరిచయస్తుల చేతిలో అత్యాచారాలకు గురైన వారి సంఖ్యే ఎక్కువగా ఉందని పోలీసులు గణాం కాలతో సహా వివరిస్తున్నారు. అందువల్ల నగర రోడ్లపై మహిళలు సురక్షితంగా సంచరించవచ్చని తెలియచెప్పాలని పోలీసులు యోచిస్తున్నారు. రోడ్లపై జరిగే కిడ్నాప్‌లు, వేధింపులను చాలా వరకు అరికట్టగలిగామని వారంటున్నారు. ఢిల్లీ పోలీసు వెబ్సైట్లో నేర వివరాల గణాం కాలను ఉంచడంతో పాటు, సోషల్ మీడియా, పోస్టర్లు, హోర్డింగ్‌ల ద్వారా మహిళలపై జరిగిన నేరాల వివరాల గణాంకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని ఢిల్లీ పోలీసులు యోచిస్తున్నారు. పరిచితులు, అపరిచితుల చేతిలో అత్యాచారానికి గురైన బాధితుల సంఖ్యను వేర్వేరుగా చూపడం ద్వారా నగరాన్ని సందర్శించే మహిళలకు ముప్పేమీ లేదన్న విషయాన్ని తెలియజెప్పాలని ఢిల్లీ పోలీ సులు అనుకుంటున్నారు. గడిచిన రెండు సంవత్సరాల నేరాల వివరాలను పరిశీలిస్తే 2012, 2013 లలో నమోదైన అత్యాచార కేసులలో 97 శాతం పరిచయస్తులపైన నమోదైనవేనని వారు అంటున్నారు. 2012లో 680 రేప్ కేసులు, 2013లో 1,159 రేప్ కేసులు నమోదయ్యాయని వాటిలో 3 శాతం కేసుల్లోనే నిందితులు బాధితులకు అపరిచితులని పోలీసు గణాంకాలు చెబుతున్నాయి. 2014లో మే 31 వరకు ఢిల్లీలోని విభిన్న పోలీస్ స్టేషన్లలో 797 రేప్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 93 శాతం కేసుల్లో నిందితులు బాధితులకు పరిచయస్తులేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. -
మహిళల భద్రతకు తొలిప్రాధాన్యం: నాయిని
బాధ్యతలు స్వీకరించిన హోంమంత్రి నాయిని సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మహిళల భద్రతకు మొదటి ప్రాధాన్యం ఇస్తామని హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి తెలిపారు. మహిళలపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. గురువారం సచివాలయంలో హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సందర్భంగా పెట్టిన కేసులను ఎత్తి వేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అసెంబ్లీ మొదటి రోజున కేసుల ఎత్తివేతపై ఉత్తర్వులు వెలువడేలా అధికారులకు ఆదేశించినట్టు తెలిపారు. నేరరహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామన్నారు. టైస్టుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. -
మెట్రోకు మరింత భద్రత
సాక్షి, ముంబై: నగరంలో మొదటిసారిగా ప్రవేశపెడుతున్న వర్సోవా-అంధేరి-ఘాట్కోపర్ మెట్రో రైలు భద్రతపై అధికారులు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతోపాటు భద్రతకు పెద్ద పీటవేస్తున్నారు. ప్రతి రైల్వే స్టేషన్లో ఒక పురుష, ఒక మహిళా భద్రతా సిబ్బందిని ప్రత్యేకంగా నియమించాలని నిర్ణయించారు. వీరు ప్రయాణికుల్లాగా సాధారణ దుస్తుల్లో అటూ ఇటూ తిరుగుతుంటారు. వచ్చి, పోయే వారితోపాటు అనుమానాస్పద వ్యక్తులపై నిఘా వేస్తారు. ఈ సిబ్బంది మారువేషాల్లో ఉండడంవల్ల ఎవరికీ అనుమానం రాదు. దీంతో అనుమానితులను వెంటనే పట్టుకునే అవకాశముంటుంది. ఉగ్రవాద సంస్థల హిట్ లిస్టులో ముంబై ఉండడంవల్ల ఎప్పుడు, ఏ రూపంలో ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి ఉంది. దీంతో ఈ ప్రాజెక్ట్ భద్రత కోసం స్థానిక పోలీసులకు తోడుగా వివిధ దళాల భద్రత సిబ్బందిని ఇదివరకే మోహరించిన విషయం తెలిసిందే. వీరి దగ్గర డోరు, హ్యాండ్ మెటల్ డిటెక్టర్లు ఉంటాయి. అయినా ముంబైలో మొదటిసారిగా ప్రవేశపెడుతున్న మెట్రోకు మరింత భద్రతను రిలయన్స్ ఇన్ఫ్రా కల్పిస్తోంది. ఎప్పుడు ప్రారంభమయ్యేనో...? రాష్ట్రంలో తొలిసారిగా ప్రవేశపెడుతున్న మెట్రో రైలు ఇదివరకు 11 సార్లు ఇచ్చిన డెడ్లైన్లు వాయిదాపడ్డాయి. దీంతో ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో ఆ ప్రాజె క్ట్ చేపడుతున్న రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థకు కూడా తెలియని పరిస్ధితి నెలకొంది. అయితే భద్రతకు మాత్రం పెద్దపీట వేస్తోంది. వర్సోవా-అంధేరి- ఘాట్కోపర్ 11.40 కి.మీ. ఈ ప్రాజెక్ట్‌కు ఇటీవల రైల్వే భద్రత కమిషనర్ ద్వారాసేఫ్టీ సర్టిఫికెట్ జారీ అయిన విషయం తెలిసిందే. ఇక రైల్వే బోర్డు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడమే మిగిలిఉంది. మొత్తం 12 మెట్రో స్టేషన్లు, ఆవరణలు, బోగీలలో ఇలా మొత్తం 700 సీసీటీవీ కెమెరాలు అమర్చారు. ఇవి 24 గంటల పనిచేయనున్నాయి. ప్రతి స్టేషన్లో డాగ్ స్క్వాడ్ కూడా అందుబాటులో ఉంటుంది. దీంతో ఆయుధాలు, పేలుడు పదార్థాలు తీసుకెళ్లేందుకు వీలుండదు. ఈ పేలుడు పదార్థాలను పోలీసుల కళ్లుగప్పి లోపలికి తీసుకెళ్లడం సాధ్యం కాదు. -
మహిళల భద్రత కోసం పంచసూత్ర ప్రణాళిక
సైబరాబాద్ సీపీ ఆనంద్ వెల్లడి ‘మై వెహికిల్ ఈజ్ సేఫ్’ స్టిక్కర్ ఆవిష్కరణ సైబరాబాద్, న్యూస్‌లైన్: మహిళల భద్రత కోసం పంచసూత్ర ప్రణాళికను అమలు చేస్తున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. కమిషనరేట్ ఆవరణలో శుక్రవారం ఆయన ‘మై వెహికిల్ ఈజ్ సేఫ్‘ స్టిక్కర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆనంద్ మాట్లాడుతూ...అభయ ఘటన అనంతరం అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సైబరాబాద్ పరిధిలో తిరిగే క్యాబ్‌ల యజమానులు, డ్రైవర్లు తమ పూర్తి వివరాలను పోలీసుల వద్ద నమోదు చేసుకోవాలని మార్చి 1న నోటిఫికేషన్‌ను జారీ చేశామన్నారు. దీనికి స్పందించి 2 వేల మంది తమ వివరాలను పొందుపర్చుకున్నారని, వీరందరికీ ‘మై వెహికిల్ ఈస్ సేఫ్’ స్టిక్కర్ అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జాయింట్ సీపీ గంగాధర్, ట్రాఫిక్ డీసీపీ అవినాష్ మహంతి, సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధి పీఎస్‌కె వర్మ పాల్గొన్నారు. నమోదు చేసుకోని వారికి జరిమానా... కమిషనరేట్ పరిధిలో 10 వేల క్యాబ్‌ల వరకు తిరుగుతున్నట్టు గుర్తించామని, వీటిలో 2 వేల మంది మాత్రమే తమ వివరాలు పోలీసుల వద్ద నమోదు చేసుకున్నారని కమిషనర్ ఆనంద్ తెలిపారు. రిజిస్ట్రేషన్ గడువు మే 1తో ముగిసిందని, వివరాలు నమోదు చేసుకొని క్యాబ్‌లకు రూ. 500 జరిమానా విధిస్తామన్నారు. సోమవారం నుంచి శనివారం వరకు.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య కూకట్పల్లి ట్రాఫిక్ ఠాణాలో క్యాబ్ డ్రైవర్లు తమ వివరాలు నమోదు చేసుకోవచ్చన్నారు. స్టిక్కర్లో పూర్తి వివరాలు.... సైబరాబాద్ పోలీసులు జారీ చేస్తున్న ‘మై వెహికిల్ ఈజ్ సేఫ్’ స్టిక్కర్లో క్యూ ఆర్ కోడ్ (క్విక్ రె స్పాన్స్ కోడ్). అందులో క్యాబ్ యజమాని, డ్రైవర్ వివరాలు, క్యాబ్‌కు సంబంధించిన పత్రాల పూర్తి వివరాలు ఉంటాయి. స్టిక్కర్‌పై వాహనం, దానికి కేటాయించిన ఐడీ నెంబర్లను పెద్ద అక్షరాల్లో ప్రింట్ చేశారు. ఈ స్టిక్కర్ల గడువు ఏడాది ఉంటుంది. ఆపై రెన్యూవెల్ చేసుకోవాలి. స్టికర్ ఉన్న వాహనాల్లోనే ప్రయాణించాలి... సైబరాబాద్ పరిధిలో క్యాబ్‌ల్లో ప్రయాణించే మహిళలు, యువతులు, ఐటీ ఉద్యోగినిలు ‘మై వెహికిల్ ఈజ్ సేఫ్’ స్టిక్కర్ ఉన్న వాటిలోనే వెళ్లాలని కమిషనర్ కోరారు. క్యాబ్ ఎక్కే ముందు స్టిక్కర్‌పై ఉన్న వివరాలు తప్పనిసరిగా రాసి పెట్టుకోవాలన్నారు. కాగా, ఓ క్యాబ్ డ్రైవర్- ‘సార్....మేం తప్పు చేస్తే యాక్షన్ తీసుకుంటున్నారు సరే....మమ్మల్ని క్యాబ్‌లో ఎక్కిన ప్రయాణికులు వేధిస్తే ఏం చేయాలని అని ప్రశ్నించాడు. దీంతో ఒక్కసారిగా అందరూ నవ్వారు. ఫిర్యాదు చేస్తే ఆ ప్రయాణికుడిపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ బదులిచ్చారు. -
మహిళల భద్రతకు టాస్క్‌ఫోర్స్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో మహిళల రక్షణపరమైన అంశాలను చూసేందుకు టాస్క్‌ఫోర్స్‌ను త్వరలోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు బీజేపీ నగరశాఖ అధ్యక్షుడు విజయ్‌గోయల్ పేర్కొన్నారు. ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శి శిఖారాయ్ నేతృత్వంలో ఆ కమిటీ వేస్తున్నట్టు తెలిపారు. ‘నిర్భయ ఘటన జరిగి ఏడాది పూర్తయినా క్షేత్రస్థాయిలో మహిళల రక్షణకు చర్యలు ఏమీ తెలుసుకోలేదు’ అని అన్నా రు. నిర్భయ నిధి పేరిట రూ.వెయ్యి కోట్లు కేటాయించినా దాన్ని యూపీఏ ప్రభుత్వం ఖర్చు చేయ డం లేదని ఆరోపించారు. ఢిల్లీ పోలీసుల్లోనూ మహిళల సంఖ్యచాలా తక్కువగా ఉంటోందన్నారు. అన్ని డీటీసీ బస్సుల్లో జీపీఎస్ సదుపాయాన్ని విధిగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. భయంతోనే ఆప్ వెనుకడుగు: ఆమ్ఆద్మీ పార్టీ ప్రస్తుతానికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా లేదన్నారు. పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం కష్టసాధ్యమని గ్రహించే ఆప్ నాయకులు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు జంకుతున్నారన్నారు. లేదంటే కాంగ్రెస్ ఎలాంటి షరతులు లేకుండానే మద్దతు ఇస్తామన్న ఆప్ నాయకులు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని గోయల్ ప్రశ్నించారు. -
మహిళా సమస్యలపై స్పందించాలి
కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించడం ప్రతి ఒక్కరూ తమ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి మాలతి అన్నారు. మహిళా భద్రతా పక్షోత్సవాల సందర్భంగా బుధవారం టీటీడీసీలో డీఆర్డీఏ జెండర్ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. దేశంలో మహిళల భద్రత కోసం అనేక చట్టాలు ఉన్నప్పటికీ అవి సక్రమంగా అమలుకావడం లేదని పేర్కొన్నారు. బాల్య వివాహాలు, అత్యాచారాలు, గృహ హింస తదితర సమస్యలను చొరవ తీసుకొని నిరోధించాల్సిన అవసరముందన్నారు. మహిళా సమస్యలను వెలికితీయడంలో మీడియా పాత్ర ఎంతో కీలకమని ఆమె అభిప్రాయపడ్డారు. సమావేశానికి అధ్యక్షత వహించిన డీఆర్డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ మహిళలు సమష్టిగా తమ సమస్యలను ఎదుర్కోవాలని చెప్పారు. భ్రూణహత్యలపై తమకు సమాచారం అందించాలన్నారు. మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ సుధాకర్ మాట్లాడుతూ మహిళలపై హింస శోచనీయమన్నారు. విలువలతో కూడిన భావితరాలను అందించడం ద్వారానే నేరాలు తగ్గుముఖం పట్టగలవన్నారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్ లీలావతి మాట్లాడుతూ గర్భస్థ దశ నుంచి వృద్ధాప్యం వరకు మహిళలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆమె వివరించారు. కలసపాడు మండలంలో భ్రూణ హత్యలు అధికంగా ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి అపూర్వ సుందరి, స్టెప్ సీఈఓ మమత, డీఆర్డీఏ ఏపీడీలు సుందర్రాజు, నాగరాజు, జిల్లా శిశు రక్షణ అధికారి శివప్రసాద్‌రెడ్డి, జెండర్ డీపీఎం వసుంధర పాల్గొన్నారు. -
చట్టం రావాలి!
నేను, మా కొలీగ్ గడచిన ఐదేళ్లుగా లివింగ్ ఇన్ రిలేషన్‌షిప్‌తో జీవిస్తున్నాం. మాకు మూడేళ్ల పాప ఉంది. పాపను స్కూల్లో చేర్చడానికి, భవిష్యత్తులో ఏదైనా అవసరం వచ్చినా భార్యగా నాకు ఏ హక్కులూ సంక్రమించవని మా స్నేహితురాలు చెప్తోంది. ఇది నిజమేనా? - ఎస్. కావ్య, హైదరాబాద్ లివింగ్ ఇన్ రిలేషన్షిప్ విషయంలో మనదేశంలో ఇంకా నిర్దిష్టమైన చట్టాలు రూపొందలేదు. ఇటీవల ఇలాంటి సమస్యలు చాలామందికి ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల సుప్రీంకోర్టు ‘ఇలాంటి మహిళలకు భద్రత కల్పించే చట్టం రూపొందాల్సిన ఆవశ్యకత ఉందని’ స్పష్టం చేసింది. అయితే ఈ విషయంలో చట్టాలు చేయడానికి ఇంకా అనేక అడ్డంకులు ఉన్నాయి. ఇప్పటికైతే కేసులు ఫైల్ చేయడానికి కచ్చితమైన నంబరు కూడా లేదు. చాలా సందర్భాలలో ఈ సమస్యకు దగ్గర సంబంధం ఉన్న చట్టం నంబరుతో కేసు ఫైల్ అయినప్పటికీ విచారణకు స్వీకరించే దశలో తిరస్కరణకు గురవుతున్నాయి. ఐరోపాదేశాలలో ఇందుకు పూర్తి భిన్నమైన వాతావరణం ఉంది. అక్కడ లివింగ్ ఇన్ రిలేషన్‌షిప్‌కి స్పష్టమైన చట్టాలున్నాయి. మనదేశం విషయానికి వస్తే ఇలాంటి సమస్యల విషయంలో అనేక రుజువులను కోర్టుకు సమర్పించాలి. పిల్లల మెయింటెనెన్స్ బాధ్యత వహించాల్సిందిగా తండ్రికి తీర్పు వచ్చిన సందర్భాలున్నాయి. కానీ సహజీవనం చేసిన మహిళ పోషణ బాధ్యత విషయంలో స్పష్టత రాలేదు. ఈ బిల్లు విషయంలో న్యాయశాస్త్రంలో నిపుణులు, మేధావులు ఇంకా సమగ్రంగా చర్చించాల్సిన అవసరం ఉంది.