మహిళల భద్రతకు తొలిప్రాధాన్యం: నాయిని
బాధ్యతలు స్వీకరించిన హోంమంత్రి నాయిని
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మహిళల భద్రతకు మొదటి ప్రాధాన్యం ఇస్తామని హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి తెలిపారు. మహిళలపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. గురువారం సచివాలయంలో హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సందర్భంగా పెట్టిన కేసులను ఎత్తి వేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అసెంబ్లీ మొదటి రోజున కేసుల ఎత్తివేతపై ఉత్తర్వులు వెలువడేలా అధికారులకు ఆదేశించినట్టు తెలిపారు. నేరరహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామన్నారు. టైస్టుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు.