సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో తమకు పదోన్నతుల విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని, బంగారు తెలంగాణలోనైనా న్యాయం జరుగుతుందని ఆశ పడ్డ తమకు నిరాశే ఎదురవుతోందని 1989–91 బ్యాచ్ సీఐ (సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు)లు వాపోయారు. శనివారం సచివాలయానికి ఆ బ్యాచ్ సీఐలు మూకుమ్మడిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హైదరాబాద్ ఐదో జోన్‌లో డీఎస్పీలుగా పదోన్నతులు ఇవ్వాలని కోరారు.
పదోన్నతుల ఫైలు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వద్ద ఉండటంతో సాయంత్రం వరకు అక్కడే వేచిచూశారు. అనంతరం సీఐలతో హోంమంత్రి, రాజీవ్ త్రివేది, రాజీవ్ శర్మలు రాత్రి 7 గంటల వరకు చర్చలు జరిపారు. ఈ నెల 31లోపు ప్రమోషన్ల విషయంపై తుది నిర్ణయం తీసుకుంటామని, అప్పటి వరకు ఎలాంటి ఆలోచనలు చేయొద్దని వారు సూచించారు. దీని వల్ల ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు వస్తాయని సీఐలకు హామీ ఇవ్వడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
సచివాలయానికి సీఐ పదోన్నతుల రగడ
Published Sun, Aug 20 2017 3:04 AM | Last Updated on Sat, Oct 20 2018 5:03 PM
Advertisement