మహిళల భద్రతకు టాస్క్‌ఫోర్స్
Published Mon, Dec 16 2013 11:30 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో మహిళల రక్షణపరమైన అంశాలను చూసేందుకు టాస్క్‌ఫోర్స్‌ను త్వరలోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు బీజేపీ నగరశాఖ అధ్యక్షుడు విజయ్‌గోయల్ పేర్కొన్నారు. ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శి శిఖారాయ్ నేతృత్వంలో ఆ కమిటీ వేస్తున్నట్టు తెలిపారు. ‘నిర్భయ ఘటన జరిగి ఏడాది పూర్తయినా క్షేత్రస్థాయిలో మహిళల రక్షణకు చర్యలు ఏమీ తెలుసుకోలేదు’ అని అన్నా రు. నిర్భయ నిధి పేరిట రూ.వెయ్యి కోట్లు కేటాయించినా దాన్ని యూపీఏ ప్రభుత్వం ఖర్చు చేయ డం లేదని ఆరోపించారు. ఢిల్లీ పోలీసుల్లోనూ మహిళల సంఖ్యచాలా తక్కువగా ఉంటోందన్నారు. అన్ని డీటీసీ బస్సుల్లో జీపీఎస్ సదుపాయాన్ని విధిగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
భయంతోనే ఆప్ వెనుకడుగు:
ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రస్తుతానికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా లేదన్నారు. పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం కష్టసాధ్యమని గ్రహించే ఆప్ నాయకులు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు జంకుతున్నారన్నారు. లేదంటే కాంగ్రెస్ ఎలాంటి షరతులు లేకుండానే మద్దతు ఇస్తామన్న ఆప్ నాయకులు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని గోయల్ ప్రశ్నించారు.
Advertisement