28న అభినందన ర్యాలీ
Published Sat, Dec 21 2013 11:16 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ విధానసభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయాన్ని అందించిన ఢిల్లీవాసులకు కృతజ్ఞతలు తెలిపేందుకు ‘అభినందన ర్యాలీ’ని నిర్వహించనున్నట్టు బీజేపీ ఢిల్లీప్రదేశ్ అధ్యక్షుడు విజయ్‌గోయల్ తెలిపారు. ఈనెల 28న తల్కటోరా స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ, ఆప్ మధ్య రహస్య ఒప్పందం కుదరిందని ఆరోపించారు. ఇటీవల కాలంలో ఆమ్‌ఆద్మీపార్టీ, కాంగ్రెస్‌పార్టీ చేస్తున్న రాజకీయ డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ అంశాలన్నింటినీ త్వరలోనే ప్రజల ముందుకు తెస్తామన్నారు. ‘కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఉన్న అవినీతి కేసులు మాఫీ చేస్తామన్న ఒప్పందంతోనే కాంగ్రెస్ పార్టీ,ఆప్‌లు ప్రభుత్వ ఏర్పాటులో సహకరించుకుంటున్నాయి. అందుకు ఆప్ కూడా ఒప్పుకుంది’అన్నారు.
Advertisement
Advertisement