- త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అమలు
- మహిళా హాస్టళ్ల వద్ద ప్రత్యేక నిఘా
- చిత్తూరు ఏఎస్పీ అన్నపూర్ణారెడ్డి
చిత్తూరు (అర్బన్): మహిళల భద్రత కోసం రాష్ట్ర వ్యాప్తంగా ‘రక్ష’ పేరిట కొత్త అప్లికేషన్ (యాప్)ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చిత్తూరు అదనపు ఎస్పీ అన్నపూర్ణారెడ్డి తెలిపారు. ర్యాగిం గ్ అరికట్టడంపై చిత్తూరులోని ప్రభు త్వ, ప్రైవేటు కళాశాలల ప్రిన్సిపాళ్లతో స్థానిక పోలీసు అతిథిగృహంలో గురువారం అవగాహన సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ రక్ష యాప్ ఆండ్రాయిడ్ వర్షన్ ఉన్న ఫోన్లలో పనిచేస్తుందన్నారు.
ఇంట ర్‌నెట్ నుంచి ఈ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకుని, ఇందులో ఐదుగురి సెల్ నెంబర్లను మహిళలు ఫీడ్ చేయాల న్నారు. ఏదైనా ప్రమాదం, ఆపదలో ఉన్నప్పుడు ఈ యాప్‌ను ఉపయోగిస్తే ఫీడింగ్‌లో ఉన్న ఐదుగురి సెల్‌నెంబర్లకు మెసేజ్ వెళ్లడంతో పాటు సంబంధిత మహిళ ఎక్కడుందనే విషయాన్ని శాటిలైట్ మ్యాప్ ద్వారా తెలియజేస్తుందన్నారు. చిత్తూరు నగరంలో ప్రతి మహిళా కళాశాల వద్ద ర్యాగింగ్‌ను నిరోధించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. పగటిపూట గస్తీ పెంచడం,
కళాశాలల్లోనే యాంటీ ర్యాగింగ్ కమిటీలు రూపొందిచడం చేస్తామన్నారు. కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లు సైతం ర్యాగింగ్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. తప్పనిసరిగా ప్రతి కళాశాల వద్ద పోలీసు స్టేషన్, సీఐల నెంబర్లను విద్యార్థులు గుర్తించే లా అందుబాటులో ఉంచాలన్నారు. సీ ఐ రాజశేఖర్ మాట్లాడుతూ బస్సులు నడిపేటప్పుడు డ్రైవర్లు మద్యం సేవిం చడం, సెల్‌ఫోన్లు వాడటం నిరోధించాలన్నారు. సమావేశంలో ఎస్‌ఐలు కృష్ణయ్య, మురళీమోహన్, పలు కళాశాలల అధ్యాపకులు పాల్గొన్నారు.