Capping
-
జవహర్‌నగర్ డంపింగ్‌యార్డు.. త్వరలో క్యాపింగ్ తవ్వకాలు
సాక్షి, హైదరాబాద్: జవహర్‌నగర్‌లో క్యాపింగ్ చేసిన చెత్తగుట్టకు బయో మైనింగ్ అండ్ బయో రెమిడియేషన్ చేయాలంటూ ఎన్జీటీ ఆదేశించిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ అందుకు ఆర్ఎఫ్పీ టెండర్లు పిలిచింది. జవహర్‌నగర్ డంపింగ్‌యార్డు వల్ల తలెత్తుతున్న సమస్యలపై స్థానికులు ఎన్జీటీని ఆశ్రయించడం.. ఇతరత్రా అంశాల నేపథ్యంలో డంపింగ్ యార్డుకు చేసిన క్యాపింగ్‌ను తొలగించి బయోమైనింగ్ చేయాలని ఎన్జీటీ ఆదేశించిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఈ టెండరు పిలిచింది. తాము శాస్త్రీయంగా చేసిన క్యాపింగ్‌ను వివరిస్తూ జీహెచ్ఎంసీ రివ్యూ పిటిషన్ వేసినా ఎన్టీటీ జీహెచ్ఎంసీ విజ్ఞప్తిని తిరస్కరించింది. సుప్రీంకోర్టుకు వెళ్లగా ఈ అంశంలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఈ టెండరు ఆహ్వానించింది. ► ఒకసారి క్యాపింగ్ చేసిన చెత్తగుట్ట బయో మైనింగ్ అండ్ బయో రెమిడియేషన్‌కు సంబంధించి కేంద్ర కాలుష్యనివారణ మండలి నుంచి జీహెచ్ఎంసీకి మార్గదర్శకాలు సైతం అందలేదని తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ ప్రక్రియను అమలు చేస్తున్న విధానాలు తెలిసిన లేదా కేంద్ర/రాష్ట్ర కాలుష్య నివారణ మండలి మార్గదర్శకాల కనుగుణంగా, శాస్త్రీయంగా క్యాపింగ్ చేసిన చెత్తగుట్టను బయోమైనింగ్ చేయగల నైపుణ్యం ఉన్న సంస్థల్ని టెండర్లకు అర్హులుగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో క్యాపింగ్ చేసిన చెత్తగుట్టను తవ్వడం వల్ల ఎలాంటి కొత్త సమస్యలు ఉత్పన్నం కానున్నాయో అంతుచిక్కడం లేదు. టెండర్ మేరకు ఈ పనులు దక్కించుకునే సంస్థ మూడు సంవత్సరాల్లో పని పూర్తి చేయాల్సి ఉంది. బయోమైనింగ్‌తో వెలువడే వ్యర్థాలను నిల్వ ఉంచే స్థలం కలిగి ఉండాలి. వ్యర్థాలనుంచి వెలువడే కలుషిత ద్రవాలు(లీచెట్)ట్రీట్మెంట్కు ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవాలి. చెత్తనుంచి గ్యాస్ ఉత్పత్తికోసం ఏర్పాటు చేసిన గ్యాస్ వెంట్స్ నుంచి సమస్యలు తలెత్తకుండా గ్యాస్ మేనేజ్మెంట్ ఇతరత్రా పనులు సైతం కాంట్రాక్టు సంస్థే చేయాల్సి ఉంటుంది. ► దాదాపు 120 లక్షల మెట్రిక్ టన్నులమేర క్యాపింగ్ చేసిన చెత్తగుట్టను తిరిగి తవ్వి పనులు చేయాల్సి ఉంటుంది. మునిసిపల్ ఘనవ్యర్థాల నిబంధనల మేరకు పనిచేయాల్సి ఉంది. ► చెత్తగుట్ట క్యాపింగ్ పనులకు రూ. 140 కోట్లు వెచ్చించారు. ఇందులో 35 శాతం స్వచ్ఛభారత్ మెషిన్ ద్వారా కేంద్రప్రభుత్వం అందజేయగా, మిగతా వ్యయాన్ని జీహెచ్ఎంసీ, డంపింగ్‌యార్డు ట్రీట్మెంట్ కాంట్రాక్టు పొందిన రాంకీ సంస్థలు భరించాయి. క్యాపింగ్‌కు సంబంధించిన పనులు పూర్తయ్యాక, తిరిగి ఇప్పుడు దాన్ని తవ్వి బయోరెమిడియేషన్ చేయడం ఎప్పటికి సాధ్యం కానుందో అంతుపట్టడం లేదు. ఈ లోగా కొత్త సమస్యలకు అవకాశముందని ఈ అంశంలో అవగాహన ఉన్నవారు చెబుతున్నారు. అంతేకాదు.. ఇప్పటికే ఖర్చు చేసిన రూ.140 కోట్లు బూడిదలో పోసిన పన్నీరు చందం కానున్నాయి. బయోమైనింగ్ అంటే క్యాపింగ్ చేసిన చెత్తగుట్టను తవ్వడం. బయో రెమిడియేషన్ అంటే వెలువడే చెత్తను మట్టి, కంపోస్టు, ఇతరత్రా సామాగ్రిగా వేరు చేయడం. వీటిల్లో ప్లాస్టిక్, ఇనుము, గాజు, రాళ్లు, కంకర వంటివి ఉంటాయని చెబుతున్నప్పటికీ మట్టి, ఇతరత్రావన్నీ కలిసి రెండు భాగాలుగా మాత్రమే వెలువడనున్నట్లు సమాచారం. ఈ పనులు చేసేందుకు ఎన్జీటీ నిబంధనల మేరకు దాదాపు రూ. 660 కోట్లు ఖర్చు కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. (క్లిక్: మది దోచే మల్కంచెరువు.. మన హైదరాబాద్‌లో..) -
ముకేశ్ అంబానీ వేతనం ఎంతంటే..
సాక్షి, ముంబై: బిలయనీర్, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ వార్షికవేతనాన్ని మరోసారి పరిమితం చేసుకున్నారు. వరుసగా 11 సంవత్సరం కూడా వేతనాన్ని రూ.15 కోట్లుగా నిర్ణయించారు. 2008-09 నుంచి ఆయన జీతం, ఇతర అలవెన్సులు కలిపి రూ .15 కోట్లకు మించకుండా జాగ్రత్తపడుతున్నారు. అంటే సంవత్సరానికి దాదాపు రూ. 24 కోట్లను వదులకుంటున్నారు. కాగా 2019 ఆర్థిక సంవత్సారానికి గాను నిఖిల్ ఆర్ మేస్వానీ, హితాల్ మేస్వా సహా కంపెనీలోని పూర్తి కాలం డైరెక్టర్ల జీతం భారీగా పుంజుకుంది. ఆర్‌ఐఎల్‌విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ వివరాలను ప్రకటించింది. అంబానీ బంధువులైన నిఖిల్ ఆర్ మేస్వానీ, హితాల్ మేస్వానీల ఒక్కొక్కరి వేతనం రూ .20.57 కోట్లకు పెరిగింది. ఇది 2017-18లో రూ .19.99 కోట్లు, 2016-17లో రూ .16.58 కోట్లు గా ఉంది. అలాగే, అతని ముఖ్య కార్యనిర్వాహకులలో ఒకరైన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి ఎం ఎస్ ప్రసాద్ అతని వేతనం గత ఏడాదితో పోలిస్తే రూ .8.99 కోట్ల నుంచి రూ .10.01 కోట్లకు పెరిగింది. నీతా అంబానీతో సహా ఆర్ఐఎల్కు చెందిన నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు సిట్టింగ్ ఫీజుతో పాటు ఒక్కొక్కరికి 1.65 కోట్ల రూపాయలు కమిషన్‌గా లభించాయి. ఈ కమిషన్ 2017-18లో రూ .1.5 కోట్లు, అంతకుముందు సంవత్సరంలో రూ .1.3 కోట్లు మాత్రమే. అయితే 2018 అక్టోబర్ 17న ఆర్ఐఎల్ బోర్డులోమాజీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) చైర్మన్ అరుంధతి భట్టాచార్య రూ. 75 లక్షలను మాత్రమే కమిషన్‌గా పొందారు. కంపెనీ బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీకి ఫీజుగా రూ .7 లక్షలు దక్కాయి. అంతకుముందు సంవత్సరంలో ఇది రూ .6 లక్షలు. అంబానీతో పాటు, ఆర్ఐఎల్ బోర్డులో మెస్వానీ సోదరులు, ప్రసాద్, కపిల్‌లు హోల్‌టైమ్ డైరెక్టర్లుగా ఉండగా, నీతా అంబానీతో పాటు, నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లలో మన్సింగ్ ఎల్ భక్తా, యోగేంద్ర పీ త్రివేది, దీపక్ సీ జైన్, రఘునాథ్ ఎ మషెల్కర్, ఆదిల్ జైనుల్భాయ్ రమీందర్ సింగ్ గుజ్రాల్, షుమీత్ బెనర్జీ , అరుంధతి భట్టాచార్య ఉన్నారు. కాగా కార్పొరేట్ సీఈవోల వేతనాలు ఇబ్బడి ముబ్బడిగా ఉంటున్నాయన్న విమర్శల నేపథ్యంలో 2009 అక్టోబర్‌లో స్వచ్ఛందంగా తన వేతనాన్ని రూ. 15 కోట్లకు పరిమితం చేసుకున్న సంగతి తెలిసిందే. -
వ్యర్థాలతో వెలుగులు!
సాక్షి, హైదరాబాద్: వివిధ అంశాల్లో అగ్రభాగాన ఉన్న హైదరాబాద్ చెత్త (మునిసిపల్ ఘనవ్యర్థాల ఎంఎస్‌డబ్లు్య) నిర్వహణలోనూ రికార్డు కెక్కనుంది. దేశంలో ఏ నగరంలో లేని అతి పెద్ద భారీ డంపింగ్ యార్డు జవహర్‌నగర్‌లోని వ్యర్థాల క్యాపింగ్ పనులు త్వరలో పూర్తి చేయనుంది. తద్వారా పరిసర గ్రామాల ప్రజలకు వాతావరణ, భూగర్భజల కాలుష్యం తగ్గనుంది. దాదాపు 135 ఎకరాల్లో పేరుకుపోయిన 12 మిలియన్ టన్నుల వ్యర్థాల నుంచి వెలువడుతున్న దుర్గంధం, కాలుష్యంతో పరిసర ప్రాంతాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. చెత్తకుప్పల నుంచి వెలువడే కలుషితాలు, వర్షం నీరు కలిసి వెలువడుతున్న కాలుష్యకారకద్రవాల (లీచెట్)తో భూగర్భ జలాలన్నీ కలుషితమయ్యాయి. ఈ సమస్య పరిష్కారానికి అమెరికా, జర్మనీ, జపాన్, బ్రిటన్ దేశాల మాదిరిగా అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానంతో చెత్త నిర్వహణ పనుల్ని రాంకీకి చెందిన ‘హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ మునిసిపల్ సాలిడ్ వేస్ట్ లిమిటెడ్’ చేపట్టింది. వచ్చే సంవత్సరం ఏప్రిల్ నెలాఖరులోగా క్యాపింగ్ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది. ఇప్పటికే క్యాపింగ్లోని ఆరు దశల్లో తొలిదశలో భాగంగా 150 మి.మీ. మందం మట్టితో కప్పే ప్రక్రియను 85శాతం పూర్తిచేసింది. వర్షాకాలం ముగిశాక అక్టోబర్‌లో రెండో దశ పనుల్ని చేపట్టనున్నారు. విషవాయువులు బయటికి వెళ్లేలా... క్యాపింగ్ అనంతరం డంప్‌యార్డ్‌పై బోరు బావుల మాదిరిగా పైపులను చొప్పించి విషవాయువులు పైకి వెళ్లే ఏర్పాట్లు చేస్తారు. వెలువడే గ్యాస్‌లోని వాయువుల్ని, వాటి పరిమాణాన్ని లెక్కించి, విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తారు. అందుకు అవకాశముంటే విద్యుత్ ఉత్పత్తికూడా చేస్తారు. విషవాయువులు, లీచెట్‌ను శుభ్రపరుస్తారు. ఇప్పటికే లీచెట్ శుభ్రపరిచే చర్యలు పైలట్‌గా చేపట్టారు. క్యాపింగ్ పనుల్లో టెర్రా సంస్థ సహకారాన్ని తీసుకుంటున్నారు. ఈ పనుల్ని నగర మేయర్ బొంతు రామ్మోహన్ సోమవారం పరిశీలించారు. క్యాపింగ్ ప్రాజెక్ట్ హెడ్ కృష్ణతో కలసి పనుల వివరాలను మీడియాకు వివరించారు. మార్చిలో విద్యుత్ ప్లాంట్ పనులు.. జవహర్‌నగర్ డంపింగ్ యార్డులో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ పనులు వచ్చే మార్చిలో ప్రారంభం కానున్నాయి. 19.8 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ఈ ప్లాంట్‌కు రోజుకు 1,600 మెట్రిక్ టన్నుల చెత్త అవసరం. ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసర్లు ఈ క్యాపింగ్ తదితర పనుల్ని పరిశీలిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10 నగరాల్లోనే ఇంత పెద్ద డంపింగ్ యార్డులకు క్యాపింగ్ పనులు జరిగాయని ప్రాజెక్ట్ హెడ్ కృష్ణ తెలిపారు. చెత్త నిర్వహణలో ఆదర్శం: బొంతు దేశంలో ఆగ్రా, ముంబై వంటి నగరాల్లో డంపింగ్ యార్డులకు క్యాపింగ్ పనులు చేసినా, ఇంత పెద్ద విస్తీర్ణంలో, ఇంత పెద్ద చెత్తగుట్టలకు ఎక్కడా క్యాపింగ్ జరగలేదు. అనుకున్న ప్రకారం పనులన్నీ పూర్తయితే జవహర్‌నగర్ మోడల్ డంపింగ్ కేంద్రంగా, పర్యాటక ప్రాంతంగా మారుతుంది. తొలిదశలో మట్టితో కప్పేందుకు ఇప్పటివరకు 5.5 లక్షల క్యూబిక్ టన్నుల మట్టిని వినియోగించారు. లీచెట్ శుద్ధికి 4ఎంఎల్డీ సామర్ధ్యమున్న యంత్రాలతో పనులు చేస్తున్నారు. ఇప్పటికే 90 శాతం మేర దుర్గంధం తగ్గింది. ప్రాజెక్టు వ్యయం రూ.144 కోట్లు కాగా, సగం కాంట్రాక్టు సంస్థ, మిగతా సగం జీహెచ్ఎంసీ భరిస్తున్నాయి. ఇకపై గ్రేటర్‌లోని చెత్తనంతా జవహర్‌నగర్‌కే తరలించం. నగరం నలువైపులా వివిధ ప్రాంతాల్లో చెత్త డంప్ కేంద్రాలు ఏర్పాటు చేసి, నిర్వహణ చేపడతాం. దాదాపు 50–100 ఎకరాల మేర స్థలాల్ని ఎంపిక చేసి చుట్టూ గార్డెన్‌ను అభివృద్ధి చేసి, మధ్యలో ఘనవ్యర్థాల నిర్వహణ పనులు చేపడతాం. ఆటోనగర్‌లోనూ చెత్త నిర్వహణ కేంద్రాన్ని త్వరలో అందుబాటులోకి తెస్తాం. గ్రేటర్‌లోని 12 చెత్త రవాణా కేంద్రాలనూ ఆధునీకరిస్తాం. వాటి నిర్వహణ బాధ్యతల్ని అంతర్జాతీయ సంస్థలకు అప్పగిస్తాం. ఆరు దశల్లో పనులిలా.. ఆరు దశల్లో ఈ క్యాపింగ్ ప్రక్రియ పూర్తిచేస్తారు. తొలిదశలో డంప్ యార్డును మట్టితో కప్పి వర్షపు నీరు చెత్తలోకి చేరకుం డా చేస్తారు. అనంతరం మట్టిపొరపైన జియోసింథటిక్ క్లే లైనర్ వేస్తారు. తర్వాత జియో కంపోజిట్ లేయర్ ఏర్పాటు చేస్తారు. చివరగా మళ్లీ మట్టిపొరను దాదాపు ఒకటిన్నర అడుగు (45సెం.మీ.) మేర పరుస్తారు. దీనిపై అందంగా కనిపించేందుకు, ఆక్సిజన్ వెలువడేందుకు రంగు రంగుల మొక్కలు పెంచుతారు. -
టార్గెట్... క్లీన్ సిటీ
⇔ చర్యలు వేగవంతం చేసిన జీహెచ్ఎంసీ ⇔జవహర్‌నగర్ డంపింగ్‌యార్డులో ‘క్యాపింగ్’కు చర్యలు ⇔2500 స్వచ్ఛ ఆటోలు, 44 లక్షల చెత్త డబ్బాల పంపిణీ ⇔బహిరంగ ప్రదేశాల్లోని చెత్త తొలగింపునకు ప్రాధాన్యం గ్రేటర్లో అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా... పారిశుధ్యం, స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాలకు కూడా జీహెచ్ఎంసీ అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. విశ్వనగరంగా ఎదగాలంటే వివిధ మౌలిక సదుపాయాలేకాదు...ప్రజల కనీస ఇబ్బందులు తీరాలనే దిశగా కృషి చేస్తోంది. దేశంలోని మరే ఇతర మున్సిపాలిటీ, కార్పొరేషన్లో లేని విధంగా స్వచ్ఛ కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా చెత్త ఉత్పత్తి స్థానం నుంచి సేంద్రియ ఎరువుగా.. విద్యుత్‌గా రూపాంతరం చెందేంత వరకు మధ్యలో అవసరమైన అన్ని సదుపాయాలను అందుబాటులోకి తెస్తోంది. బయటకు వెళ్లిన ప్రజలకు ‘అత్యవసర’ఇబ్బందులు లేకుండా ఉండేందుకు తగినన్ని టాయ్లెట్లను నిర్మిస్తోంది. దేశంలోని ఏడువేలకు పైగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఏ స్థానికసంస్థా చేయని విధంగా తగిన ప్రణాళికలతో ముందుకువెళుతోంది. ఈ అంశాల్లో వచ్చే ఉగాదిలోగా నూరు శాతం ఫలితాలు సాధించేందుకు లక్ష్యం నిర్దేశించింది. – సాక్షి, హైదరాబాద్ 44 లక్షల చెత్తడబ్బాలు.. 2500 స్వచ్ఛ ఆటోలు నగరంలో తడి, పొడి చెత్తలను వేరుగా చేసేందుకు ఇంటింటికీ రెండు డబ్బాల చొప్పున 44 లక్షల చెత్త డబ్బాలను పంపిణీ చేశారు. ఇళ్లనుంచి చెత్తను సమీప ప్రాంతాల్లోకి తరలించే చెత్త ట్రాన్స్‌ఫర్‌స్టేషన్లను 10 నుంచి 20కి పెంచారు. ట్రాన్స్ఫర్ స్టేషన్ల వద్దే కంపోస్టు ఎరువు తయారీకి ప్రైవేటు సంస్థలకు అనుమతులిస్తున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా వచ్చే ఏడాదిలోగా ఎక్కడికక్కడే చెత్తను విడదీసి ఎరువుగా మార్చనున్నారు. ఇంటిం టి నుంచి చెత్తను తరలించేందుకు ప్రస్తుతం 2000 ఉన్న స్వచ్ఛ ఆటోలను 2500 కు పెంచుతున్నారు. గతంలో 3300 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు మాత్రమే డంపింగ్‌యార్డుకు వెళ్లేవి. స్వచ్ఛ ఆటోలొచ్చాక ప్రస్తుతం 4500 మెట్రిక్ టన్నులు తరలిస్తున్నారు. హోటళ్లు, ఫంక్షన్ హాళ్లలోనూ ఎక్కడికక్కడే చెత్తను విడదీసి సేంద్రియ ఎరువుల తయారీ చర్యలు చేపడుతున్నారు. తడిపొడి చెత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. తడిపొడి చెత్తలు కలసి ఉంటే ప్రమాదం ఎంత ప్రమాదమో, భార్యభర్తలు విడిగా ఉంటే అంతే సమస్యలు అనే విషయాన్ని వివరిస్తూ వేరుపడ్డ 150కి పైగా జంటల్ని కలిపారు. డెబ్రిస్ రీసైక్లింగ్.. నగరంలో చాలా చోట్ల చెత్తతోపాటు నిర్మాణ వ్యర్థాలు కలుస్తుండటంతో పారిశుధ్యం పరిస్థితి క్లిష్టంగా మారుతోంది. ఇకపై ఇందుకు తావులేకుండా నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ యూనిట్లు అందుబాటులోకి తెస్తున్నారు. నెలరోజుల్లో ఫతుల్లాగూడ, జీడిమెట్లలో రెండు ప్రాంతాల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. డంపింగ్‌యార్డులో క్యాపింగ్.. జవహర్‌నగర్ డంపింగ్‌యార్డులో పది మిలియన్ టన్నుల మేర వ్యర్థాలు గుట్టలుగా పేరుకుపోయి పరి సరాలు, వాయు, జలకాలుష్యం పెరిగాయి. ఈ సమస్యపరిష్కారానికి ‘స్వచ్ఛ భారత్’లో భాగంగా త్వరలోనే ‘క్యాపింగ్’ప్రాజెక్టు చేపట్టనున్నారు. రూ. 140 కోట్లు ఖర్చుయ్యే ఈ ప్రాజెక్ట్‌కోసం ఇప్పటికే కేంద్రానికి రాశారు. కేంద్రం మూడోవంతు నిధులిస్తుంది. వార్డులకు ర్యాంకులు.. ప్రోత్సాహకాలు.. ఎన్ని కార్యక్రమాలు అమలుచేసినా ప్రజల భాగస్వామ్యం లేనిదే విజయవంతం కావనే అంశాన్ని గుర్తించి పారిశుధ్య కార్యక్రమాల అమలులో వార్డులకు, లొకా లిటీలకు ర్యాంకులివ్వనున్నారు. మెరుగైన ర్యాంకుల్లో ఉండేవాటికి ఎన్జీఓలు, తదితర సంస్థల ద్వారా ప్రోత్సాహకాలు అందించనున్నారు. అవార్డులు.. రివార్డులు.. పారిశుధ్య కార్యక్రమాలు, వ్యర్థాల నిర్వహణను ఇప్పటికే పలు సంస్థలు గుర్తించాయి. ఢిల్లీలోని అసో చాం సంస్థ వ్యర్థాల నిర్వహణలో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు జాతీయ అవార్డును ప్రకటించింది. దీన్ని గురువారం సౌత్‌జోన్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి అందుకుంటున్నారు. ఎన్నో ఏళ్ల క్రితమే ఘనవ్యర్థాలు, పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణలో వినూత్న కార్యక్రమాలు అమలు చేశారు. స్వచ్ఛ భారత్ ప్రారంభానికి ముందే గతంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ నిర్వహించిన టీవీ షో ‘సత్యమేవజయతే’కార్యక్రమంలో జనార్దన్‌రెడ్డి చేపట్టిన కార్యక్రమాలు జాతీయస్థాయిలో గుర్తింపుపొందడంతో ఆయనను అభినందించి, సన్మానించారు. జీహెచ్ఎంసీకి వచ్చాక స్వల్ప సమయంలోనే దాదాపు నాలుగువేల పాఠశాలల్లో స్వచ్ఛ కార్యక్రమాలపై విద్యార్థులకు అవగాహన కలిగించారు. జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికుడు వెంకటయ్య కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నుంచి స్వచ్ఛ అవార్డును అందుకున్నారు. స్వచ్ఛ సైన్యం.. బహిరంగ ప్రదేశాల్లో చెత్తకుప్పలు తొలగించే కార్యక్రమాన్ని చేపట్టి 1,116 ప్రాంతాల్లో తొలగించి, ముగ్గులు, రంగులతో తీర్చిదిద్దారు. తిరిగి రోడ్లపై చెత్త వేయకుండా స్థానికులతో...స్వచ్ఛ వాలంటీర్లతో స్వచ్ఛ సైన్యాన్ని ఏర్పాటు చేశారు. బహిరంగంగా చెత్త వేసే వారిని వీరు అడ్డుకుంటారు. కాలనీల్లోని పారిశుధ్య కార్మికుల వివరాలు ప్రజలకు తెలిసేలా ‘పరిచయం’పేరిట వారి వివరాలు గోడలపై రాశారు. అత్యవసర బాధలనుంచి విముక్తి.. పేరు గొప్ప నగరమే కానీ.. యూరినల్స్‌కు వెళ్దామంటే నరకయాతన. కనుచూపు మేరలో అవి కనిపించకపోవడంతో ఎక్కడపడితే అక్కడే పని కానిచ్చేస్తున్నారు. ఈ పరిస్థితిని నివారించేందుకు అవసరమైనన్ని టాయ్లెట్ల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా మహిళల కోసమే ప్రత్యేకంగా ఆధునికమైన వంద షీ–టాయ్లెట్లను మూడు మాసాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నిధులిచ్చేందుకు పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. నిర్వహణలోపంతో మూతపడ్డ గత అనుభవం దృష్ట్యా వీటిని ఏర్పాటు చేసే సంస్థలే కనీసం రెండు సంవత్సరాలు నిర్వహించేలా టెండరు నిబంధనలు మార్చారు. ఎన్ని అవసరమైతే అన్ని టాయ్లెట్లను వచ్చే ఏడాదిలోగా ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. -
హెచ్ఐవీ పరీక్ష భవిష్యత్‌కు రక్ష
కర్నూలు(హాస్పిటల్): పెళ్లికి ముందు హెచ్ఐవీ పరీక్ష చేయించుకోవడం భవిష్యత్‌కు రక్షనిస్తుందని రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ చెప్పారు. ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినం సందర్భంగా గురువారం కలెక్టరేట్ నుంచి రాజవిహార్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ప్రారంభించిన అనంతరం టీజీ వెంకటేష్ మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం సమష్టి కృషితో హెచ్ఐవీ నివారణ, నియంత్రణ కోసం అన్ని రకాల చర్యలు చేపట్టి జిల్లాలో ఎయిడ్స్ శాతాన్ని తగ్గించడం అభినందనీయమన్నారు. మంచి పని ఎవరు చేసినా అధికారులు, ప్రభుత్వేతర సిబ్బందిని అభినందించాల్సిందేనన్నారు. ఎయిడ్స్ నివారణ కోసం నిరంతరం కృషి చేయాలని, అప్పుడే ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ నినాదం సాధ్యపడుతుందన్నారు. జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ రూపశ్రీ మాట్లాడుతూ జిల్లాలో హెచ్ఐవీ/ఎయిడ్స్ నివారణ, నియంత్రణ కోసం అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సమష్టిగా కృషి చేయడంతో ప్రజలకు సేవలు అందుతున్నాయన్నారు. జిల్లా క్షయ నియంత్రణాధికారి డాక్టర్ మోక్షేశ్వరుడు మాట్లాడుతూ హెచ్ఐవీ ఉన్న వారు టీబీ పరీక్షలు చేయించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. టీబీ, ఏఆర్టీ మందులు క్రమం తప్పకుండా వాడాలని, యువత అవగాహన పెంచుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం డాక్టర్ అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లాలో హెచ్ఐవీ నివారణ కోసం ప్రతిభ కనపరిచి, సేవలు అందిస్తున్న, పౌష్టికాహారం, ఇతర సహకారం అందించిన దాతలకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు, హెచ్ఐవీ చిన్నారులకు పౌష్టికాహారంతో పాటు పింఛన్, ఏటీఎం కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీపీఎం అలీ హైదర్, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ అంకిరెడ్డి, డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డి, పాజిటివ్ నెట్వర్క్ సుధారాణి, జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ కార్యాలయ సిబ్బంది, ప్రభుత్వ, ప్రైవేటు నర్సింగ్ కళాశాలలు, పాఠశాలల విద్యార్థినిలు, ఇంటర్, డిగ్రీ, ఫార్మసి కళాశాలల ఎన్సీసీ విద్యార్థినీ విద్యార్థులు, రెడ్‌రిబ్బన్ క్లబ్ విద్యార్థినీ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రశంసా పత్రాలు అందుకున్న వారు డాక్టర్ లింగన్న, మెడికల్ సూపరింటెండెంట్, ఆదోని ఏరియా ఆసుపత్రి డాక్టర్ హెచ్. మాధవీలత, మెడికల్ సూపరింటెండెంట్, ఆదోని,ఎంసీహెచ్ డాక్టర్ ఇందిర, గైనిక్ హెచ్‌వోడి, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల దేవకుమారి, కౌన్సిలర్ సీహెచ్‌సీ, కోయిలకుంట్ల తిమ్మక్క, ల్యాబ్‌టెక్నీషియన్, నంద్యాల జిల్లా ఆసుపత్రి జ్యోత్స్న, ల్యాబ్‌టెక్నీషియన్, నంద్యాల జిల్లా ఆసుపత్రి సత్యరాజు, ల్యాబ్‌టెక్నీషియన్, వెల్దుర్తి పీహెచ్సీ సుధారాణి, నేస్తం నెట్వర్క్ ప్రెసిడెంట్, కర్నూలు విద్యామహిళా మండలి, టీఐ ఎన్జీవో, ఎమ్మిగనూరు సుధారాణి, ఓఆర్డబ్లు్య, నంద్యాల శాంతి, పీఆర్ ఎడ్యుకేటర్, ఆదోని రమణమ్మ, లింక్ వర్కర్, వెల్దుర్తి ఎస్. రామకృష్ణ, ఆర్కె ఇండస్ట్రీస్ ఎండి, ఆళ్లగడ్డ సూర్యనారాయణరెడ్డి, బిల్డర్, జమ్మలమడుగు ఎస్జెటి సొసైటీ, వాలంటరీ ఆర్గనైజేషన్, ఆదోని చౌరప్ప, సెయింట్ థెరీసమ్మ చర్చ్, కర్నూలు తాజ్ యూత్ అసోసియేషన్(చాంద్), వాలంటీర్ ఆర్గనైజేషన్, కర్నూలు మకేతెమ్ స్మైల్ అసోసియేషన్, వాలంటరీ ఆర్గనైజేషన్, నంద్యాల మహాలక్ష్మి నర్సింగ్ హోమ్, పీపీపీ సైట్, డోన్ -
మహిళల భద్రతకు ‘రక్ష’ యాప్
త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అమలు మహిళా హాస్టళ్ల వద్ద ప్రత్యేక నిఘా చిత్తూరు ఏఎస్పీ అన్నపూర్ణారెడ్డి చిత్తూరు (అర్బన్): మహిళల భద్రత కోసం రాష్ట్ర వ్యాప్తంగా ‘రక్ష’ పేరిట కొత్త అప్లికేషన్ (యాప్)ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చిత్తూరు అదనపు ఎస్పీ అన్నపూర్ణారెడ్డి తెలిపారు. ర్యాగిం గ్ అరికట్టడంపై చిత్తూరులోని ప్రభు త్వ, ప్రైవేటు కళాశాలల ప్రిన్సిపాళ్లతో స్థానిక పోలీసు అతిథిగృహంలో గురువారం అవగాహన సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ రక్ష యాప్ ఆండ్రాయిడ్ వర్షన్ ఉన్న ఫోన్లలో పనిచేస్తుందన్నారు. ఇంట ర్నెట్ నుంచి ఈ యాప్‌ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకుని, ఇందులో ఐదుగురి సెల్ నెంబర్లను మహిళలు ఫీడ్ చేయాల న్నారు. ఏదైనా ప్రమాదం, ఆపదలో ఉన్నప్పుడు ఈ యాప్‌ను ఉపయోగిస్తే ఫీడింగ్‌లో ఉన్న ఐదుగురి సెల్నెంబర్లకు మెసేజ్ వెళ్లడంతో పాటు సంబంధిత మహిళ ఎక్కడుందనే విషయాన్ని శాటిలైట్ మ్యాప్ ద్వారా తెలియజేస్తుందన్నారు. చిత్తూరు నగరంలో ప్రతి మహిళా కళాశాల వద్ద ర్యాగింగ్‌ను నిరోధించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. పగటిపూట గస్తీ పెంచడం, కళాశాలల్లోనే యాంటీ ర్యాగింగ్ కమిటీలు రూపొందిచడం చేస్తామన్నారు. కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లు సైతం ర్యాగింగ్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. తప్పనిసరిగా ప్రతి కళాశాల వద్ద పోలీసు స్టేషన్, సీఐల నెంబర్లను విద్యార్థులు గుర్తించే లా అందుబాటులో ఉంచాలన్నారు. సీ ఐ రాజశేఖర్ మాట్లాడుతూ బస్సులు నడిపేటప్పుడు డ్రైవర్లు మద్యం సేవిం చడం, సెల్ఫోన్లు వాడటం నిరోధించాలన్నారు. సమావేశంలో ఎస్ఐలు కృష్ణయ్య, మురళీమోహన్, పలు కళాశాలల అధ్యాపకులు పాల్గొన్నారు.