హెచ్‌ఐవీ పరీక్ష భవిష్యత్‌కు రక్ష | Capping the future of HIV testing | Sakshi
Sakshi News home page

హెచ్‌ఐవీ పరీక్ష భవిష్యత్‌కు రక్ష

Published Thu, Dec 1 2016 11:19 PM | Last Updated on Mon, Sep 4 2017 9:38 PM

హెచ్‌ఐవీ పరీక్ష భవిష్యత్‌కు రక్ష

హెచ్‌ఐవీ పరీక్ష భవిష్యత్‌కు రక్ష

కర్నూలు(హాస్పిటల్‌):
పెళ్లికి ముందు హెచ్‌ఐవీ పరీక్ష చేయించుకోవడం భవిష్యత్‌కు రక్షనిస్తుందని రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్‌ చెప్పారు. ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినం సందర్భంగా గురువారం కలెక్టరేట్‌ నుంచి రాజవిహార్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ప్రారంభించిన అనంతరం టీజీ వెంకటేష్‌ మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం సమష్టి కృషితో హెచ్‌ఐవీ నివారణ, నియంత్రణ కోసం అన్ని రకాల చర్యలు చేపట్టి జిల్లాలో ఎయిడ్స్‌ శాతాన్ని తగ్గించడం అభినందనీయమన్నారు. మంచి పని ఎవరు చేసినా అధికారులు, ప్రభుత్వేతర సిబ్బందిని అభినందించాల్సిందేనన్నారు. ఎయిడ్స్‌ నివారణ కోసం నిరంతరం కృషి చేయాలని, అప్పుడే ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవ నినాదం సాధ్యపడుతుందన్నారు. జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ రూపశ్రీ మాట్లాడుతూ జిల్లాలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ నివారణ, నియంత్రణ కోసం అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సమష్టిగా కృషి చేయడంతో ప్రజలకు సేవలు అందుతున్నాయన్నారు. జిల్లా క్షయ నియంత్రణాధికారి డాక్టర్‌ మోక్షేశ్వరుడు మాట్లాడుతూ హెచ్‌ఐవీ ఉన్న వారు టీబీ పరీక్షలు చేయించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. టీబీ, ఏఆర్‌టీ మందులు క్రమం తప్పకుండా వాడాలని, యువత అవగాహన పెంచుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం డాక్టర్‌ అంబేద్కర్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లాలో హెచ్‌ఐవీ నివారణ కోసం ప్రతిభ కనపరిచి, సేవలు అందిస్తున్న, పౌష్టికాహారం, ఇతర సహకారం అందించిన దాతలకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు, హెచ్‌ఐవీ చిన్నారులకు పౌష్టికాహారంతో పాటు పింఛన్, ఏటీఎం కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీపీఎం అలీ హైదర్, జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ అంకిరెడ్డి, డాక్టర్‌ శ్రీకాంత్‌రెడ్డి, పాజిటివ్‌ నెట్వర్క్‌ సుధారాణి, జిల్లా లెప్రసీ, ఎయిడ్స్‌ కార్యాలయ సిబ్బంది, ప్రభుత్వ, ప్రైవేటు నర్సింగ్‌ కళాశాలలు, పాఠశాలల విద్యార్థినిలు, ఇంటర్, డిగ్రీ, ఫార్మసి కళాశాలల ఎన్‌సీసీ విద్యార్థినీ విద్యార్థులు, రెడ్‌రిబ్బన్‌ క్లబ్‌ విద్యార్థినీ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు పాల్గొన్నారు. 
 
ప్రశంసా పత్రాలు అందుకున్న వారు 
డాక్టర్‌ లింగన్న, మెడికల్‌ సూపరింటెండెంట్, ఆదోని ఏరియా ఆసుపత్రి
డాక్టర్‌ హెచ్‌. మాధవీలత, మెడికల్‌ సూపరింటెండెంట్, ఆదోని,ఎంసీహెచ్‌
డాక్టర్‌ ఇందిర, గైనిక్‌ హెచ్‌వోడి, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల
దేవకుమారి, కౌన్సిలర్‌ సీహెచ్‌సీ, కోయిలకుంట్ల
తిమ్మక్క, ల్యాబ్‌టెక్నీషియన్, నంద్యాల జిల్లా ఆసుపత్రి
జ్యోత్స్న, ల్యాబ్‌టెక్నీషియన్, నంద్యాల జిల్లా ఆసుపత్రి
సత్యరాజు, ల్యాబ్‌టెక్నీషియన్, వెల్దుర్తి పీహెచ్‌సీ
 సుధారాణి, నేస్తం నెట్‌వర్క్‌ ప్రెసిడెంట్, కర్నూలు
విద్యామహిళా మండలి, టీఐ ఎన్‌జీవో, ఎమ్మిగనూరు
సుధారాణి, ఓఆర్‌డబ్లు్య, నంద్యాల
శాంతి, పీఆర్‌ ఎడ్యుకేటర్, ఆదోని
రమణమ్మ, లింక్‌ వర్కర్, వెల్దుర్తి
ఎస్‌. రామకృష్ణ, ఆర్‌కె ఇండస్ట్రీస్‌ ఎండి, ఆళ్లగడ్డ
సూర్యనారాయణరెడ్డి, బిల్డర్, జమ్మలమడుగు
ఎస్‌జెటి సొసైటీ, వాలంటరీ ఆర్గనైజేషన్, ఆదోని
చౌరప్ప, సెయింట్‌ థెరీసమ్మ చర్చ్, కర్నూలు
తాజ్‌ యూత్‌ అసోసియేషన్‌(చాంద్‌), వాలంటీర్‌ ఆర్గనైజేషన్, కర్నూలు
మకేతెమ్‌ స్మైల్‌ అసోసియేషన్, వాలంటరీ ఆర్గనైజేషన్, నంద్యాల
మహాలక్ష్మి నర్సింగ్‌ హోమ్, పీపీపీ సైట్, డోన్‌   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement