క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు
క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు
Published Wed, Feb 8 2017 11:02 PM | Last Updated on Tue, Sep 5 2017 3:14 AM
- లెఫ్టినెంట్ కల్నల్, ఎన్‌సీసీ శిక్షణాధికారి గౌస్ బేగ్
– అట్టహాసంగా భాష్యం ఇంట్రాస్పోర్ట్స్ మీట్ ప్రారంభం
కర్నూలు (టౌన్): విద్యార్థులు క్రీ డల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని లెఫ్టినెంట్ కల్నల్, ఎన్.సి.సి. శిక్షణాధికారి గౌస్ బేగ్ అన్నారు. బుధవారం స్థానిక స్పోర్ట్్స అథారిటీ ఔట్‌డోర్ స్టేడియంలో భాష్యం ఇంట్రా స్పోర్ట్్స మీట్ నిర్వహించారు. రాయలసీమ భాష్యం విద్యాసంస్థల విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా క్రీడా జ్యోతి వెలిగించి పోటీలను ప్రారంభించారు. భాష్యం విద్యార్థుల చిత్రరూప విన్యాసాలు, మార్చ్‌ఫాస్టు ఆకట్టుకుంది. తర్వాత ఒలంపిక్ రన్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం లెఫ్టినెంట్ కల్నల్ మాట్లాడుతూ క్రీడలు ఒత్తిడిని తగ్గించి మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయన్నారు. చిన్నప్పటి నుంచే ఆటలపై ఆసక్తి పెంచుకుని జాతీయస్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులకు, పాఠశాలకు గుర్తింపు తీసుకురావాలన్నారు.
రాయలసీమ భాష్యం పాఠశాల జోనల్ బాధ్యులు అనిల్ కుమార్ మాట్లాడుతూ తమ పాఠశాలలో చదువుతో పాటు క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామన్నారు. విద్యార్థుల్లో క్రీడా సూ్ఫర్తిని పెంపొందించేందుకు ప్రతి సంవత్సరం ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఎన్‌ఆర్‌పేట బ్రాంచ్ భాష్యం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రమేష్‌కుమార్ మాట్లాడుతూ క్రీడలలో విద్యార్థుల ప్రతిభను వెలికితీస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ బ్రాంచ్‌లకు చెందిన ప్రధానోపాధ్యాయులు రాంప్రసాద్, రవి వర్మ, సత్యప్రసాద్, రవీంద్ర పాల్గొన్నారు.
Advertisement