వందన డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఇంటా బయట చురుగ్గా ఉండే వందన వారం రోజులుగా ఇంటి గడప దాటి కాలు బయట పెట్టలేకపోతోంది. కారణం, తన వ్యక్తిగత ఫొటోలు, వీడియో క్లిప్పింగ్స్ ఒక సైట్‌లో కనపడటం ఆమెను కలవరపరుస్తోంది. వ్యక్తిగత పరువుకు సంబంధించిన విషయాలు బయటకు రావడం ఆమెను తీవ్ర మనో వేదనకు గురి చేస్తోంది. ఈ విషయాలను ఇంట్లోవారితో పంచుకోలేక, స్నేహితులతో చెప్పలేక ఇబ్బంది పడుతూ ఎటూ తేల్చుకోలేక ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. రకరకాల డిజిటల్ సమస్యలను ఎదుర్కొనే యువతుల సంఖ్య ఇటీవల విపరీతంగా పెరుగుతోంది.
ఇటీవల కాలంలో మహిళల అవకాశాలు ఇంటర్నెట్ ద్వారా విస్తృతమయ్యాయి. ఉపా ధి అవకాశాలను పెంచుకోవడానికి, అదనపు ఆదాయాన్ని సంపా దించడానికి, జ్ఞానాన్ని, ఆర్థికవృద్ధిని, మరింత సమగ్రమైన డిజిటల్ ప్రపంచాన్ని సృష్టించడానికి వీలు కల్పిస్తుంది. అయితే, సైబర్ శాఖ ఆన్‌లైన్‌లో పెరుగుతున్న మహిళా ప్రయోజనాలనే కాదు, వారికి సమస్యగా మారే అంశాలను కూడా పరిశీలిస్తుంది. మహిళలు ఆన్ లైన్ లో తమ సురక్షిత ప్రయాణం సాగించడానికి డిజిటల్ భద్రత తెలుసుకోవడం అత్యవసరం.
డిజిటల్ నేరాలలో ప్రధానమైనవి..
డాక్సింగ్ : ఇది ఒక వ్యక్తి లేదా సంస్థకు సంబంధించిన గతంలోని వ్యక్తిగత సమాచారాన్ని డిజిటల్ మాధ్యమం ద్వారా బహిర్గతం చేసే చర్య. మోసగాళ్లు సాధారణంగా పబ్లిక్‌గా అందుబాటులో ఉన్న డేటాబేస్‌లు, గత సోషల్ మీడియా పోస్టింగ్‌లు, సోషల్ ఇంజనీరింగ్ నుండి సమాచారాన్నిపొంది, ఆన్ లైన్ షేమింగ్ లేదా దోపిడీకి దారితీయవచ్చు.
సైబర్‌స్టాకింగ్: ఇది ఎలక్ట్రానిక్ మార్గాలను ఉపయోగించి ఒక వ్యక్తిని పదేపదే ట్రాక్ చేయడం.
ఉదాహరణకు: అసందర్భంగా ఫోన్ కాల్స్ చేయడం, వాయిస్ సందేశాలు లేదా మెసేజ్‌లు చేయడం, గూఢచర్యం లేదా సోషల్ మీడియా కార్యకలాపా లను పర్యవేక్షించడం లేదా ఇంటర్నెట్‌లో తగని సమాచారాన్ని పోస్ట్ చేస్తామని బెదిరించడం.. వంటి సైబర్‌స్టాకింగ్ శారీరక, మానసిక క్షోభకు దారితీయవచ్చు.
స్వాటింగ్: ఇది పోలీసులను రెచ్చగొట్టడానికి, మనల్ని మోసం చేయడానికి అత్యవసర ఫోన్ కాల్స్ చేయడం వంటి చర్య. ఇది సైబర్ దోపిడీకి ఒక రూపం. దీని ద్వారా వ్యక్తులు లైంగిక ప్రయోజనాలనుపొందాలని చూస్తారు. లైంగిక వేధింపులు వ్యక్తిగత, సన్నిహిత ఫొటోల పంపిణీకి దారితీయవచ్చు.
రివెంజ్ పోర్న్: అసభ్యకరమైన చిత్రాలు లేదా వీడియోలను ఆన్ లైన్ లో అప్‌లోడ్ చేసి వేధిస్తారు. ఏ మాత్రం మన అనుమతి లేకుండా ఆన్‌లైన్‌లో షేర్ అవుతుంటాయి. ఇవి ఎక్కువగా బాధితురాలి మాజీ జీవిత భాగస్వామి లేదా బాయ్‌ఫ్రెండ్ ద్వారా జరిగేవి ఉంటాయి.
లైంగిక వేధింపులు: తెలియకనో లేక ఏదైనా భావోద్వేగ సమయంలోనో లైంగిక అనుకూల రిక్వెస్ట్‌లకు అనుమతి ఇస్తుంటారు. అంటే, ఫొటోలు, కంటెంట్, జోక్స్, మరొక స్త్రీ ద్వేషానికి సంబంధించినవి అయి ఉండవచ్చు. ఇవి ఒకరి ప్రతిష్ఠకు హాని కలిగించే వాస్తవాలు. ఉదాహరణకు.. ‘దొంగ, అబద్ధాలకోరు లేదా అనైతిక ప్రవర్తన’.. వంటివి.
వంచన: మోసగాళ్లు మీలా నటిస్తూ నకిలీ ఖాతాను సృష్టిస్తారు. మీ సోషల్ మీడియా పరిచయాల నుండి డబ్బు అడుగుతారు, ఇది బాధితు లను వేధించడానికి ఇతరులకు ్రపోత్సాహకంగా కూడా ఉపయోగపడుతుంది. ద్వేషపూరిత ప్రసంగాల ద్వారా రెచ్చగొట్టడం, జాతి విద్వేషాన్ని ్రపోత్సహించడం లేదా సమర్థించడం, రాజకీయ, కార్పొరేట్ లేదా పోటీదారుల పోటీలో పా ల్గొనడం వంటివి ఉంటాయి.
సేఫ్టీ చిట్కాలు:
సమస్యలు వస్తాయని ఎవరూ తమ ప్రయోజనాలను వదులుకోరు. అయితే, బయట మన క్షేమం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో, ఆన్‌లైన్ బజార్‌లోనూ అంతే భద్రంగా ఉండటం ముఖ్యం.
► HTTPS:// (ప్యాడ్‌లాక్ సింబల్) ఉన్న వెబ్‌సైట్‌లను మాత్రమే బ్రౌజ్ చేయండి.
► పెద్ద అక్షరాలు, సంఖ్యలు, ప్రత్యేక అక్షరాలను కలిగి ఉన్న సంక్లిష్ట పా స్‌వర్డ్‌ను ఉపయో గించండి.
► అన్ని సామాజిక, ఇ–మెయిల్, బ్యాంకింగ్ లాగిన్ ల (2ఊఅ) కోసం రెండు–దశల ప్రమాణీకరణను పా టించండి.
► ఎస్సెమ్మెస్, వాట్సప్, సోషల్ మీడియా మెసెంజర్‌ల ద్వారా వచ్చిన చిన్న లింక్‌లను ఎప్పుడూ క్లిక్ చేయవద్దు.
► సామాజిక మాధ్యమాలలో ఫొటోలను చూస్తున్నప్పుడు లేదా అప్‌లోడ్ చేస్తున్నప్పుడు మీ లొకేషన్ స్టేటస్‌ను స్టాప్ చేయండి.
► ఎండ్–టు–ఎండ్ ఎన్ క్రిప్షన్ మెసెంజర్‌లను మాత్రమే ఉపయోగించండి.
► అన్ని సోషల్ మీడియా, మెసెంజర్, ఇ– మెయిల్ అప్లికేషన్ ల కోసం ప్రైవసీ సెట్టింగ్స్‌ను సెట్ చేయండి.
► సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో (ఆర్థిక, లాగిన్ ఆధారాలు, సంస్థ, వ్యక్తిగత సమాచారం... వంటి) సెన్సిటివ్ సమాచారాన్ని పంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
► నిజమైన, తెలిసిన వ్యక్తులతో మాత్రమే కనెక్ట్ అవ్వండి. ప్రత్యామ్నాయంగా, గోప్యతా సెట్టింగ్‌లను ఉపయోగించి మీరు మీ ప్రొ ఫైల్‌లను లాక్ చేయడాన్ని ఎంచుకోవచ్చు.
► ఆఫ్‌లైన్, ఆన్ లైన్ పరస్పర చర్యలలో సమ్మతిని ఒకే విధంగా పరిగణించాలి.
► మీ వెబ్‌క్యామ్‌ను ఎప్పుడూ ప్లగ్ ఇన్ చేసి ఉంచవద్దు.
► యాంటీ–వైరస్, యాంటీ–మాల్వేర్ సాఫ్ట్‌వేర్‌లతో మీ స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లను సురక్షితం చేయండి.
► ఇది సురక్షితమైన నెట్‌వర్క్ అని మీరు నిర్ధారించుకునే వరకు పబ్లిక్ వై ఫైని ఎప్పుడూ యాక్సెస్ చేయవద్దు.
► ప్రసిద్ధ మూలాధారాల నుండి మాత్రమే యాప్‌లను డౌన్ లోడ్ చేయండి (ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ వంటివి).
సైబర్ టాక్
ఆన్‌లైన్‌లో మహిళా భద్రతకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చే సైట్స్..
https://securityinabox.org/en/
https://exposingtheinvisible.org/resources/#
filter=.watching-out-yourself
https://ssd.eff.org/
https://hackblossom.org/cybersecurity/
https://www.accessn
మీరు సైబర్ క్రైమ్‌కు గురైతే జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ https://www.cybercrime.gov.in/ కు లాగిన్ చేసి, ఫిర్యాదును ఫైల్ చేయండి. నేషనల్ టోల్ ఫ్రీ నంబర్ 1930 కి ఫోన్ చేసి, సహాయంపొందవచ్చు.
- ఇన్‌పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్‌బీయింగ్ ఎక్స్‌పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్
Comments
Please login to add a commentAdd a comment