ఇస్లామాబాద్: పాకిస్తాన్ అంతటా ఇంటర్‌నెట్ స్థంబించిపోయింది. ఇంటర్‌నెట్ అంతరాయంతో పలు సోషల్‌మీడియా అకౌంట్స్ ఓపెన్ కాలేదు. దీంతో నెటిజనట్లు తీవ్రమైన నిరాశ వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) రాబోయే ఎన్నికల కోసం నిధుల సేకరణ ప్రచారాన్ని ప్రారంభించిన క్రమంలోనే ఇంటర్‌నెట్ అంతరాయం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
Is #internet down in some areas or all over #Pakistan? Social media sites are either not opening or are very slow. #InternetShutDown pic.twitter.com/bxax9qp8oT
— Ather Kazmi (@2Kazmi) January 7, 2024
‘ఎక్స్’(ట్వీటర్)తో పాటు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, టిక్‌టాక్, పలు వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్, యూట్యూబ్ సైతం ఓపెన్ కాకుండా మొరాయించడంతో దేశవ్యాప్తంగా ప్రజలు, నెటిజన్లు అసహనం వ్యక్తం చేశారు. వందల సంఖ్యలో వెబ్‌సైట్లు కూడా ఓపెన్ కాకపోవటం గమనర్హం.
ఇంటర్‌నెట్ అంతరాయంతో గ్లోబల్ ఇంటర్‌నెట్ అబ్జర్వేటరీ, నెట్ బ్లాక్స్, సోషల్ మీడియా అప్లికేషన్లు కూడా దేశవ్యాప్తంగా ఓపన్ అవ్వలేదని తెలుస్తోంది. దీంతో ప్రజలు, సోషల్ మీడియా నెటిజన్లు ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘ఇది ఖచ్చితంగా సిగ్గుచేటు! అయిన విషయమని ప్రజలకు ఇంటర్‌నెట్ అంతరాయంతో జరిగిన నష్టానికి కేర్‌టేకర్ ఐటీ మంత్రి రాజీనామా చేయాలి’ అని పీటీఐ ట్విటర్ హ్యాండిల్ డిమాండ్ చేసింది.
Absolutely shameful! Caretaker IT Minister should resign for this continuing damage to Pakistanis https://t.co/W9pyXzRr6A
— PTI (@PTIofficial) January 7, 2024
చదవండి: మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. మాల్దీవులు మంత్రులపై వేటు!
Comments
Please login to add a commentAdd a comment