ఇస్లామాబాద్ : వీవీఐపీ సంస్కృతికి స్వస్తీ పలుకుతూ.. నయా పాకిస్తాన్‌ను నిర్మిస్తామనే హామీతో మాజీ క్రికెటర్ కమ్ పొలిటిషియన్ ఇమ్రాన్‌ఖాన్ అధికారం చేపట్టారు. అయితే ఆయన ప్రభుత్వ యంత్రాంగం మాత్రం ఆ దిశగా అడుగులు వేయకుండా.. వీవీఐపీ టాయిలెట్స్‌కు శ్రీకారం చుట్టింది. పరిశ్రమల మంత్రిత్వశాఖ కార్యాలయంలో ఈ వీవీఐపీ టాయిలెట్స్‌ను ఏర్పాటు చేసింది. టాయిలెట్ ముందు బయోమెట్రిక్ మిషన్ ఏర్పాటు చేసి ఉన్న ఫొటోలు ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
ఈ వీవీఐపీ బాత్‌రూమ్స్‌ను అడిషనల్ సెక్రటరీ లేక ఆ స్థాయి హోదా కలిగిన అధికారులు మాత్రమే ఉపయోగించాలని ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ పేర్కొంది. అదే హోదా కలిగిన ఇతర మంత్రిత్వశాఖల అధికారులు కూడా ఈ టాయిలెట్స్‌ను వాడుకోవచ్చిన తెలిపింది. అయితే ఈ వీవీఐపీ టాయిలెట్స్‌పై సోషల్ మీడియా వేదికగా జోకులు పేలుతున్నాయి. ఇంకా నయం వీవీఐపీ పేరిట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని ఒకరంటే.. ఇమ్రాన్ చెప్పిందేంటి ఆయన ప్రభుత్వం చేస్తుందేంటి? అని మరొకరు మండిపడుతున్నారు.
Using the taxpayers' money, #PTI govt has introduced 'VVIP Toilets' which can only be accessed thru biometric verification by top govt officials at @minmoippak. Wonder if they have installed CCTVs inside them as well for security purpose 😂https://t.co/eRcgSCVK2P
— A B (@AhmadBilalHu) July 20, 2019
Comments
Please login to add a commentAdd a comment