‘మా కళ్లని మేం నమ్మలేకపోయాం’ | Pakistan Prime Minister Imran Khan Lookalike Spotted Riding A Rickshaw | Sakshi
Sakshi News home page

‘మా కళ్లని మేం నమ్మలేకపోయాం’

Published Tue, Jan 19 2021 12:44 PM | Last Updated on Tue, Jan 19 2021 8:51 PM

Pakistan Prime Minister Imran Khan Lookalike Spotted Riding A Rickshaw - Sakshi

ఇస్లామాబాద్‌: మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని విన్నాం. అప్పుడప్పుడు అలాంటి వారిని చూస్తాం కూడా. సామాన్యులకు వారి పోలికతో ఉన్న వ్యక్తి కనిపిస్తే.. పెద్ద విషయం కాదు. అదే ఓ దేశ ప్రధానిని పోలిన వ్యక్తి.. సామాన్యుల మధ్యలో తిరిగితే.. ప్రపంచం అంతా అతడిపై ఆసక్తి చూపుతుంది. ఒకటికి రెండు సార్లు ఆ పోలిన వ్యక్తిని చూసి ఆశ్చర్యపోతుంది. ఇప్పుడు ఇది ఎందుకంటే తాజాగా పాకిస్తాన్‌ అధ్యక్షుడు ఇమ్రాన్‌ ఖాన్‌ను పోలిన ఓ వ్యక్తి తెర మీదకు వచ్చాడు. అతడిని సడెన్‌గా చూస్తూ.. యువకుడగా ఉన్నప్పుడు ఇమ్రాన్‌ ఖాన్‌ ఎలా ఉండేవారో.. సదరు వ్యక్తి అలానే ఉన్నాడు. సియాల్‌ కోటలో ఆటో రిక్షాలో ప్రయాణం చేస్తున్న ఆ వ్యక్తికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. (చదవండి: ‘ఆఖరికి ఆమెను కూడా అన్‌ఫాలో చేశారు)

ఇమ్రాన్‌ ఖాన్ యువకుడిగా ఉండి దేశం కోసం క్రికెట్‌ ఆడుతున్న సమయంలో ఎలా ఉన్నారో.. ఇప్పుడు వైరలవుతోన్న వీడియోలో ఉన్న ఈ కుర్రాడు కూడా సేమ్‌ అలానే ఉన్నాడు. యంగ్‌ ఇమ్రాన్‌ని మరోసారి చూసినట్లు ఉంది.. మా కళ్లని మేం నమ్మలేకపోయాం అంటూ కామెంట్‌ చేస్తున్నారు జనాలు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement