resembles
-
'టైటానిక్ ఓడ లాంటి ఇల్లు' .. చూసేందుకు ఎగబడుతున్న జనాలు
ఇంజనీర్ మాదిరిగా ఓ రేంజ్లో ఇల్లు కడుతున్నాడు రైతు. సాధారణ ఇళ్ల మాదిరిగా కాకుండా అత్యంత వినూత్నంగా కడుతున్నాడు. దాన్ని చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. వచ్చిన ప్రతిఒక్కరు ఔరా! అని ఆశ్చర్యపోతున్నారు. ఈ ఘటన డార్జిలింగ్ జిల్లాలోని పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..పశ్చిమ బెంగాల్‌లోని నిచ్బారి గ్రామంలో ఉండే మింటు రాయ్(52) అనే రైతు ప్రసిద్ధ రాయల్ మెయిల్ స్టీమర్(ఆర్ఎంఎస్) అనే టైటానిక్ ఓడను పోలి ఉండే మూడంతస్తుల ఇంటిని నిర్మిస్తున్నాడు. దీన్ని ఆ రైతు 2010 నుంచి నిర్మిస్తున్నాడు. తన తండ్రి మనోరంజన్ రాయ్ కోల్‌కతాలోని బౌబజార్ ప్రాంతంలో తనను హాస్టల్ ఉంచాడని, అక్కడ టైటానిక్‌ను పోలి ఉండే దుర్గాపూజ పండల్‌ని తనను ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు. అప్పటి నుంచి టైటానిక్ పోలి ఉండే సొంత ఇల్లు నిర్మించుకోవాలని అనుకున్నట్లు వివరించాడు. ఐతే ఈ ఇల్లు కోసం ఇంజనీర్లను సంప్రదిస్తే అందుకు వారు ముందుకు రాలేకపోయారని అన్నాడు. దీంతో తాను తన కలల ఇంటిని నిర్మించేందుకు నేపాల్ వెళ్లి తాపీ పని నేర్చుకున్నట్లు తెలిపాడు. ఆ తదనంతరం తన ఇంటిని నిర్మించేందుకు ఉపక్రమించాడు. అతను సామాన్య రైతు అయినప్పటికీ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా తన డ్రీమ్ హౌస్ కోసం ఒక్కో ఇటుకను పేర్చుకుంటూ కట్టడం ప్రారంభించాడు. ఇప్పటి వరకు తాను ఎంత డబ్బు ఖర్చు పెట్టింది లెక్కించలేదని, కానీ రూ.15 లక్షలకు తక్కువ ఉండకూడదని భావిస్తున్నట్లు తెలిపాడు. కాగా, మింటుకి ఇతిరాయ్ అనే ఆమెతో వివాహం అయ్యింది. వారికి కాలేజ్‌కి వెళ్లే కుమార్తె, పదోతరగతి చదువుతున్న కొడుకు ఉన్నాడు. తాము చాలా పేదవాళ్లం అని కూతురు పుట్టిన తర్వాతే తమ జీవితాలు మారాయని చెప్పుకొచ్చాడు. తనకి తన అత్తగారి నుంచి కొంత భూమి వచ్చిందని, తేయాకు పండిస్తామని చెప్పాడు. అంతేగాదు తాను మరోవైపు ఆటో కూడా నడుపుతూ కొంత డబ్బు కూడబెట్టినట్లు తెలిపాడు. తాము అధికారికంగా హెలెంచ గ్రామ నివాసితులమని, 30 ఏళ్ల క్రితం ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఫన్సీదేవాకు తరలి వెళ్లినట్లు చెప్పాడు. మింటూ కుటుంబ సభ్యులంతా కలిసి ఈ ఇంటి నిర్మాణ పనుల్లో పాలుపంచుకుని, తన కలను సాకారం చేసుకునేందుకు సహకరిస్తున్నారని ఆనందంగా చెబుతున్నాడు. వచ్చే రెండేళ్లలో ఈ ఇల్లు పూర్తి అయిపోతుందని, ఆ తర్వాత ఆ ఇంటి డెక్‌పై టీ దుకాణం పెడతానని చెప్పుకొచ్చాడు. ఓడ మాదిరిగానే ఈ ఇంటిలో కూడా మెట్ల నిర్మాణం ఉంటుందని మింటు వెల్లడించాడు. ఐతే ఈ ఇల్లుని చూసేందుకు పరిసరా ప్రాంత ప్రజలే గాక సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఫోటోలను తీసుకుని వెళ్తుంటే తనకెంతో సంతోషంగా అనిపిస్తుందని అంటున్నాడు మింటు. (చదవండి: ఎంతపనైపాయే! వార్నింగ్ లైట్ వచ్చిందని విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తే..) -
వాంటెడ్ క్రిమినల్‌గా ‘మార్క్ జుకర్‌బర్గ్’.. పట్టిస్తే రూ.22కోట్లు
బొగోటా: లోకంలో మనుషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటుంటారు. ఏడుగురి సంగతి ఏమో కానీ అప్పుడప్పుడు మనుషుల్ని పోలిన మనుషులు అక్కడక్కడ ఎదరుపడతారు. వారు మంచి వారైతే పర్లేదు.. కానీ నేరస్తులు, పోలీసులు హిట్ లిస్ట్‌లో ఉన్నవారైతేనే ఇబ్బంది. తాజాగా ఫేస్బుక్ ఫౌండర్, అమెరికన్ మీడియా మాగ్నేట్ అయిన మార్క్ జుకర్‌బర్గ్‌కి ఇదే పరిస్థితి ఎదురయ్యింది. ఆయన పోలికలతో ఉన్న ఓ నేరస్తుడి కోసం కొలంబియా పోలీసులు గాలిస్తున్నారు. అతడిని పట్టిస్తే 3 మిలియన్ డాలర్లు(రూ.22,30,23,000) బహుమతి ఇస్తామని ప్రకటించారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఫేస్‌బుక్‌లోనే ఈ ప్రకటన చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. గతవారం కొలంబియా అధ్యక్షుడు ఇవాన్ డ్యూక్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌పై కొందరు దుండగులు దాడి చేశారు. బుల్లెట్ల వర్షం కురిపించారు. ఆ సమయంలో హెలికాప్టర్లో కొలంబియా అధ్యక్షుడు డ్యూక్‌తో పాటు రక్షణ మంత్రి డియెగో మొలానో, అంతర్గత మంత్రి డేనియల్ పలాసియోస్, నార్టే డి శాంటాండర్ సిల్వానో సెరానోతో సహా కొందరు అధికారులున్నారు. అదృష్టం కొద్ది ఎవరికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. ఈ ఘటన దర్యాప్తులో భాగంగా కొలంబియా పోలీసులు నిందుతుల స్కెచ్ గీయించారు. వీరిలో ఒక వ్యక్తి అచ్చం ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జుకర్బర్గ్లానే ఉన్నాడు. కొలంబియా పోలీసులు నిందుతుల ఊహాచిత్రాలను ఫేస్బుక్లో షేర్ చేస్తూ.. ‘‘ఈ ఫోటోలో ఉన్నవారిని పట్టుకోవడంలో మాకు సాయం చేయండి. మిస్టర్ ప్రెసిడెంట్ ఇవాన్ డ్యూక్, అతని పరివారం ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌పై దాడి చేసిన నేరస్థుల చిత్రాలు ఇవి. వీరిని పట్టించినవారికి 3మిలియన్ డాలర్ల బహుమతి అందిస్తాం. వీరి గురించి సమాచారం తెలిసినవారు ఈ నంబర్లకు 3213945367 లేదా 3143587212 కాల్ చేయండి’’ అని మెసేజ్ చేశారు. ఈ ఫోటోలో ఓ వ్యక్తి అచ్చు మార్క్ జుకర్‌బర్గ్‌లా ఉండటంతో అది అందరిని దృష్టిని ఆకర్షించింది. ఇది చూసిన నెటినులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ‘‘కొంపతీసి జుకర్‌బర్గ్‌ని అరెస్ట్ చేస్తారా ఏంటి’’.. ‘‘ఒకవేళ నిందితుడు దొరికినా నేను జుకర్‌బర్గ్‌ని అంటే ఏంటి పరిస్థితి’’ అంటూ నెటిజనులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: తొలి ట్రిలియనీర్‌గా చరిత్ర సృష్టించబోతోందెవరు..? -
‘మా కళ్లని మేం నమ్మలేకపోయాం’
ఇస్లామాబాద్: మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని విన్నాం. అప్పుడప్పుడు అలాంటి వారిని చూస్తాం కూడా. సామాన్యులకు వారి పోలికతో ఉన్న వ్యక్తి కనిపిస్తే.. పెద్ద విషయం కాదు. అదే ఓ దేశ ప్రధానిని పోలిన వ్యక్తి.. సామాన్యుల మధ్యలో తిరిగితే.. ప్రపంచం అంతా అతడిపై ఆసక్తి చూపుతుంది. ఒకటికి రెండు సార్లు ఆ పోలిన వ్యక్తిని చూసి ఆశ్చర్యపోతుంది. ఇప్పుడు ఇది ఎందుకంటే తాజాగా పాకిస్తాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్‌ను పోలిన ఓ వ్యక్తి తెర మీదకు వచ్చాడు. అతడిని సడెన్‌గా చూస్తూ.. యువకుడగా ఉన్నప్పుడు ఇమ్రాన్ ఖాన్ ఎలా ఉండేవారో.. సదరు వ్యక్తి అలానే ఉన్నాడు. సియాల్ కోటలో ఆటో రిక్షాలో ప్రయాణం చేస్తున్న ఆ వ్యక్తికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (చదవండి: ‘ఆఖరికి ఆమెను కూడా అన్‌ఫాలో చేశారు’) ఇమ్రాన్ ఖాన్ యువకుడిగా ఉండి దేశం కోసం క్రికెట్ ఆడుతున్న సమయంలో ఎలా ఉన్నారో.. ఇప్పుడు వైరలవుతోన్న వీడియోలో ఉన్న ఈ కుర్రాడు కూడా సేమ్ అలానే ఉన్నాడు. యంగ్ ఇమ్రాన్ని మరోసారి చూసినట్లు ఉంది.. మా కళ్లని మేం నమ్మలేకపోయాం అంటూ కామెంట్ చేస్తున్నారు జనాలు. -
సహజీవనం.. ఆసక్తికర అధ్యయనం!
వాషింగ్టన్: ఆరు నెలలు కలిసి ఉంటే వారు వీరవుతారు అనే మాటను తరచుగా వింటూ ఉంటాం. ఇందులో వాస్తవం లేకపోలేదు. ఆరు నెలల పాటు ఒకరితో కలిసి ఉంటే మన లక్షణాలు కొన్న అవతలి వారికి.. వారి అలవాట్లు మనకు అబ్బుతాయి. అలానే ఏళ్ల తరబడి కలిసి జీవించే వ్యక్తులు ఒకానొక సమయంలో ఒకరినొకరు పోలి ఉండటం ప్రారంభిస్తారా అనే ప్రశ్న తరతరాలుగా శాస్త్రవేత్తలను, మనస్తత్వవేత్తలను వెంటాడుతుంది. 1980ల నాటికే దీనిపై ఎన్నో అధ్యయనాలు నిర్వహించబడ్డాయి. ఇంకా కొనసాగుతున్నాయి. అయితే ఈ దృగ్విషయానికి సంబంధించి తాజాగా జరిపిన ఓ పరిశోధన కొన్ని ఆసక్తికర అంశాలు వెల్లడించింది. ఆ వివరాలు.. ది గార్డియన్‌లోని ఒక నివేదిక ప్రకారం, అమెరికాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు ఈ విషయాన్ని విశ్లేషించడానికి సంవత్సరాలుగా కలిసి ఉన్న వేల జంటల ఫోటోలను తీశారు. ముఖాలను విశ్లేషించడానికి ఈ బృందం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించింది. 80 ల ప్రారంభంలో పరిశోధకులు దీన్ని విశ్లేషించడానికి స్వచ్ఛంద సేవకులపై ఆధారపడాల్సి వచ్చేది. (చదవండి: ఈ మూడు ముక్కల్లో ఎక్కడైనా లవ్ ఉందా?!) ఎలా అధ్యయనం చేశారు పీహెచ్డీ స్టూడెంట్ టీ-మేకార్న్, పరిశోధనా భాగస్వామి మిచల్ కోసిన్స్కితో కలిసి పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉన్న వేలాది జంటల ఛాయాచిత్రాలను జల్లెడ పట్టారు. వివాహం అయిన 25 సంవత్సరాల తరువాతి ఫోటోలు.. వారు వివాహం చేసుకోవడానికి ముందు తీసిన ఫోటోలను తీసుకున్నారు. ఇలా దాదాపు 517 జంటల డాటాను సేకరించారు. ఇందుకు గాను స్టాన్ఫోర్డ్ పరిశోధకులు స్వచ్ఛంద సేవకుల సాయం తీసుకున్నారు. వలంటీర్లకు టార్గెట్‌కి సంబంధించిన ఫోటో ఇచ్చి.. దానితో పాటు ఐదు ఇతర ఫోటోలు ఇచ్చారు. ఈ 5 ఫోటోల్లో ఒకటి టార్గెట్ భాగస్వామిది కూడా ఉంటుంది. ఇక ఈ మొత్తం ఫోటోల్లో ముఖ సారూప్యతలను గమనించమని వలంటీర్లను కోరారు పరిశోధకులు. అలానే ఫేసియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీతో కూడా ఇలానే చేశారు. (చదవండి: కోపంగా ఉన్నారా.. ఈ సమస్య ఉన్నట్లే) ఏం గమనించారు ఇక ఈ పరిశోధనలు స్టాన్ఫోర్డ్ విశ్వ విద్యాలయం పరిశోధకులు ఏళ్ల తరబడి కలిసి ఉన్న జంటలు ఒకానొక సమయంలో ఒకరినొకరు పోలి ఉంటారనే వాదనను కొట్టి పారేశారు. అందుకు ఎలాంటి ఆధారాలు లేవని తేల్చిచెప్పారు. బదులుగా తమ లాంటి ముఖ లక్షణాలు కలిగిన భాగస్వాములను ఎంచుకోవడం పట్ల ప్రజలు ఎక్కువ మొగ్గు చూపుతున్నారని వెల్లడించారు. -
హీరో పోలికల్లో లండన్ రాణి!
చైనీస్ కళాకారుడు డాపెంగ్ రూపొందించి.. ప్రదర్శించిన బ్రిటన్ రాణి మట్టిప్రతిమ... ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. లండన్ సామ్రాజ్యాన్ని సుదీర్ఘకాలం పాలించిన రాణిగా ఇటీవల రికార్డు సృష్టించిన రెండో ఎలిజబెత్ శిల్పం... లండన్ వింటర్ ఆర్ట్ అండ్ యాంటిక్ ఫెయిర్‌లో గత నెల్లో ప్రదర్శనకు ఉంచారు. అయితే ఆమె.. ప్రముఖ నటుడు టామ్ హాంక్స్ పోలికలతో ఉండటం విమర్శకులను ఆశ్చర్యపరచింది. ఆమె రూపాన్ని చూసి అంతా భయపడ్డారు. అసలు ఆమె మహారాణిలాగానే కనిపించడం లేదన్నారు... ఆర్ట్ క్రిటిక్ మార్క్ హడ్సన్. తల వెనుక భాగం చాలా పెద్దగా ఉండి, బాక్సర్ గడ్డంతో చూసేందుకు టామ్ హాంక్స్లా కనిపిస్తోందని ఆయన విమర్శించారు. నిజానికి మహారాణి ప్రతిమను తయారుచేసేందుకు కళాకారుడు డాపెంగ్ మూడునెలల సమయంలో 13 సార్లు మార్పులు చేర్పులు చేశాడన్నారు. 20 కేజీల బరువున్నశిల్పం.. ముఖం కూడా చాలా మందంగా కనిపిస్తోందని, జుట్టు మాత్రమే రాణి పోలికల్లో ఉందని విమర్శకులు అంటున్నారు.