వాషింగ్టన్: ఆరు నెలలు కలిసి ఉంటే వారు వీరవుతారు అనే మాటను తరచుగా వింటూ ఉంటాం. ఇందులో వాస్తవం లేకపోలేదు. ఆరు నెలల పాటు ఒకరితో కలిసి ఉంటే మన లక్షణాలు కొన్న అవతలి వారికి.. వారి అలవాట్లు మనకు అబ్బుతాయి. అలానే ఏళ్ల తరబడి కలిసి జీవించే వ్యక్తులు ఒకానొక సమయంలో ఒకరినొకరు పోలి ఉండటం ప్రారంభిస్తారా అనే ప్రశ్న తరతరాలుగా శాస్త్రవేత్తలను, మనస్తత్వవేత్తలను వెంటాడుతుంది. 1980ల నాటికే దీనిపై ఎన్నో అధ్యయనాలు నిర్వహించబడ్డాయి. ఇంకా కొనసాగుతున్నాయి.
అయితే ఈ దృగ్విషయానికి సంబంధించి తాజాగా జరిపిన ఓ పరిశోధన కొన్ని ఆసక్తికర అంశాలు వెల్లడించింది. ఆ వివరాలు.. ది గార్డియన్‌లోని ఒక నివేదిక ప్రకారం, అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు ఈ విషయాన్ని విశ్లేషించడానికి సంవత్సరాలుగా కలిసి ఉన్న వేల జంటల ఫోటోలను తీశారు. ముఖాలను విశ్లేషించడానికి ఈ బృందం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించింది. 80 ల ప్రారంభంలో పరిశోధకులు దీన్ని విశ్లేషించడానికి స్వచ్ఛంద సేవకులపై ఆధారపడాల్సి వచ్చేది. (చదవండి: ఈ మూడు ముక్కల్లో ఎక్కడైనా లవ్ ఉందా?!)
ఎలా అధ్యయనం చేశారు
పీహెచ్‌డీ స్టూడెంట్ టీ-మేకార్న్, పరిశోధనా భాగస్వామి మిచల్ కోసిన్స్కితో కలిసి పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉన్న వేలాది జంటల ఛాయాచిత్రాలను జల్లెడ పట్టారు. వివాహం అయిన 25 సంవత్సరాల తరువాతి ఫోటోలు.. వారు వివాహం చేసుకోవడానికి ముందు తీసిన ఫోటోలను తీసుకున్నారు. ఇలా దాదాపు 517 జంటల డాటాను సేకరించారు. ఇందుకు గాను స్టాన్‌ఫోర్డ్ పరిశోధకులు స్వచ్ఛంద సేవకుల సాయం తీసుకున్నారు. వలంటీర్లకు టార్గెట్‌కి సంబంధించిన ఫోటో ఇచ్చి.. దానితో పాటు ఐదు ఇతర ఫోటోలు ఇచ్చారు. ఈ 5 ఫోటోల్లో ఒకటి టార్గెట్ భాగస్వామిది కూడా ఉంటుంది. ఇక ఈ మొత్తం ఫోటోల్లో ముఖ సారూప్యతలను గమనించమని వలంటీర్లను కోరారు పరిశోధకులు. అలానే ఫేసియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీతో కూడా ఇలానే చేశారు. (చదవండి: కోపంగా ఉన్నారా.. ఈ సమస్య ఉన్నట్లే)
ఏం గమనించారు
ఇక ఈ పరిశోధనలు స్టాన్‌ఫోర్డ్ విశ్వ విద్యాలయం పరిశోధకులు ఏళ్ల తరబడి కలిసి ఉన్న జంటలు ఒకానొక సమయంలో ఒకరినొకరు పోలి ఉంటారనే వాదనను కొట్టి పారేశారు. అందుకు ఎలాంటి ఆధారాలు లేవని తేల్చిచెప్పారు. బదులుగా తమ లాంటి ముఖ లక్షణాలు కలిగిన భాగస్వాములను ఎంచుకోవడం పట్ల ప్రజలు ఎక్కువ మొగ్గు చూపుతున్నారని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment