ఇస్లామాబాద్: టీ20 వరల్డ్ కప్‌లో దాయాది దేశాల మధ్య జరిగిన రసవత్తరపోరులో టీమీండియా ఘోర పరాభవాన్ని చవి చూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మినిస్టర్ ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రీడను క్రీడలా చూడకుండా భారత్‌పై ఉన్న తమ అక్కసును వెళ్లగక్కారు. భారతదేశంపై పాక్ సాధించిన విజయాన్ని ఇస్లాం విజయం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు..
(చదవండి: Ind Vs Pak: ‘ఆకలి మీదున్న అండర్‌డాగ్స్‌లా వాళ్లు.. బ్లాంక్ చెక్ రెడీ.. వీళ్లేమో’)
పాకిస్తాన్‌కు చెందిన మినిస్టర్ షెయ్ రషీద్ అహ్మద్ టీమిండియాపై పాక్ విజయం అనంతరం స్పందించారు. ‘‘ఇండియా-పాక్ మధ్య మ్యాచ్ జరుగుతున్నంతసేపు భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక వర్గం ప్రజలు పాకిస్తాన్‌కే మద్దతు తెలిపారు. మేమే గెలవాలని కోరుకున్నారు. పాకిస్తాన్ వరకు నిన్న జరిగిన మ్యాచ్ ఫైనల్‌తో సమానం. ఇది పాక్ విజయం కాదు.. ఇస్లాం విజయం’’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
(చదవండి: Brad Hogg: పాక్‌తో మ్యాచ్‌లో టీమిండియా చేసిన పెద్ద తప్పు అదే..)
پاکستان انڈیا میچ ٹکرا:
— Sheikh Rashid Ahmed (@ShkhRasheed) October 24, 2021
پاکستانی کرکٹ ٹیم اور عوام کو مبارکباد پیش کرتا ہوں.https://t.co/Tc0IG0n2DJ@GovtofPakistan @ImranKhanPTI #PakvsIndia pic.twitter.com/e9RkffrK2O
టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి.. 151 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్ ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజం ఇద్దరే వారి జట్టుకు విజయం సాధించిపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొన్న మ్యాచ్‌లో టీమిండియా ఓటమి అభిమానులకు భారీ నిరాశ మిగిల్చింది.
చదవండి: Babar Azam: అతి విశ్వాసం కొంప ముంచుతుంది.. కప్ గెలవడమే లక్ష్యం!
Comments
Please login to add a commentAdd a comment