Outage
-
ఇండిగో సేవల్లో అంతరాయం.. ప్రయాణికుల పాట్లు!
IndiGo Outage: ప్రముఖ ఎయిర్‌లైన్ సంస్థ ఇండిగో సేవల్లో అంతరాయం ఏర్పడింది. శనివారం మధ్యాహ్నం నుంచి తలెత్తిన సాంకేతిక లోపంతో దేశవ్యాప్తంగా విమానాశ్రయాలలో విమాన కార్యకలాపాలు, గ్రౌండ్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది.చెక్-ఇన్లు నెమ్మదిగా సాగడంతో ప్రయాణికులు చాలా సేపు వేచిఉండాల్సి వచ్చింది. ప్రయాణికుల భారీ క్యూలతో ఎయిర్పోర్ట్ ప్రాంగణాలు కిక్కిరిశాయి. దీంతో కొన్ని చోట్ల సిబ్బంది బోర్డింగ్ పాసులను చేత్తో రాసిస్తున్నారు. ఇండిగో సిస్టమ్‌లో తలెత్తిన లోపం కారణంగా టిక్కెట్లు బుక్ చేసుకోలేకపోతున్నామంటూ కొందరు ప్రయాణికులు వాపోయారు. తమకు ఎదురైన ఇబ్బందులను బాధిత ప్రయాణికులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. ‘ఎక్స్’లో దీనికి సంబంధించిన పోస్టులు వెల్లువెత్తాయి.అంతరాయంపై ఇండిగో స్పందించింది. కొనసాగుతున్న సిస్టమ్ అంతరాయం కారణంగా ప్రభావితమైన కస్టమర్లకు సాధ్యమైనంత మెరుగైన సహాయం, మద్దతును అందించడానికి తమ సిబ్బంది అవిశ్రాంతంగా కృషి చేస్తున్నట్లు ‘ఎక్స్’లో వివరించింది. #6ETravelAdvisory : We want to assure you that our dedicated airport teams are working relentlessly to provide the best possible assistance and support to customers affected by the ongoing system outage. (1/2)— IndiGo (@IndiGo6E) October 5, 2024 -
అకౌంట్లో జీరో బ్యాలెన్స్.. ఖాతాదారుల గగ్గోలు
బ్యాంకులో తలెత్తిన సాంకేతిక లోపం ఖాతాదారుల గుండె ఆగిపోయినంత పనిచేసింది. ఉన్నట్టుండి అకౌంట్లలో జీరో బ్యాలెన్స్ చూపించడంతో కస్టమర్లు ఆందోళనకు గురయ్యారు. వేలాది మంది బ్యాంక్ ఆఫ్ అమెరికా ఖాతాదారులకు ఈ పరిస్థితి ఎదురైంది.బ్యాంక్ ఆఫ్ అమెరికా సేవల్లో బుధవారం మధ్యాహ్నం పెద్దఎత్తున అంతరాయం ఏర్పడింది. కస్టమర్లు తమ ఆన్లైన్ ఖాతాలను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమ ఖాతాలో బ్యాలెన్స్ కనిపించడం లేదంటూ గగ్గోలు పెట్టారు. కొందరి అకౌంట్లలో జీరో బ్యాలెన్స్ కనిపించడం తీవ్ర ఆందోళనకు దారితీసింది.సాంకేతిక అంతరాయాలను ట్రాక్ చేసే ప్లాట్‌ఫామ్ డౌన్‌డెటెక్టర్‌లో దీనికి సంబంధించిన ఫిర్యాదులు వెల్లువెత్తాయి. న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, సీటెల్, డల్లాస్, ఫీనిక్స్, హ్యూస్టన్, చికాగో వంటి ప్రధాన నగరాల నుండి సమస్య గురించి ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. "ఖాతాలు తాత్కాలికంగా అందుబాటులో లేవు" అని కొంతమందికి, బ్యాంకింగ్ యాప్‌లోకి లాగిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ''కనెక్షన్ ఎర్రర్'' అని చాలా మందికి పాప్ అప్ మెసేజ్ చూపించింది.బ్యాంక్ ఆఫ్ అమెరికా అంతరాయంతో ప్రభావితమైన కస్టమర్లు తమకు తలెత్తిన ఇబ్బందులను ‘ఎక్స్’ (ట్విటర్), రెడ్డిట్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేశారు. బ్యాంకు యాజమాన్యంపై ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమంది కస్టమర్లు సమస్య ఎదురైనట్లు సీఎన్ఎన్ వార్త సంస్థకు ఇచ్చిన వివరణలో బ్యాంక్ ఆఫ్ అమెరికా అంగీకరించింది. సమస్యను పరిష్కరిస్తున్నామని, ఖాతాదారులకు క్షమాపణలు చెబుతున్నామని బ్యాంక్ పేర్కొంది. -
జియోకి ఏమైంది? యూజర్ల గగ్గోలు!
రిలయన్స్ జియో నెట్‌వర్క్‌లో అంతరాయం తలెత్తింది. మొబైల్ ఇంటర్నెట్ సమస్యలతోపాటు కాల్ డ్రాప్‌లతో యూజర్లు ఇబ్బంది పడ్డారు. మొబైల్ నెట్‌వర్క్‌తో పాటు జియో ఫైబర్ సేవల్లోనూ అంతరాయం ఏర్పడినట్లు వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.అవుటేజ్ ట్రాకర్ ‘డౌన్‌డెటెక్టర్’కు జియో అంతరాయానికి సంబంధించి గరిష్ట స్థాయిలో 10,000 లకుపైగా రిపోర్ట్లు నమోదయ్యాయి. ప్లాట్‌ఫారమ్‌పై నమోదు చేసిన ఫిర్యాదుల ప్రకారం.. ఉదయం 11 గంటలకు అంతరాయం ప్రారంభమైంది. అయితే అవుట్‌టేజ్ ట్రాకర్ ఇప్పుడు రిపోర్ట్లలో క్షీణతను చూపుతోంది.డౌన్‌డెటెక్టర్‌పై నివేదిక ప్రకారం.. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, నాసిక్, కోల్‌కతా, పాట్నా, గౌహతి ప్రాంతాలలోని వినియోగదారులపై అంతరాయం ఎక్కువగా ప్రభావం చూపింది. దీనిపై సోషల్ మీడియాలో ఫిర్యాదులు, మీమ్స్ వెల్లువెత్తాయి. అంతరాయంపై జియో ఇంకా స్పందించలేదు. -
ఆ నష్టాలు మీరే కట్టండి.. మైక్రోసాఫ్ట్‌కు షాక్!
ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు మలేషియా ప్రభుత్వం షాకిచ్చింది. ఇటీవల తలెత్తిన మైక్రోసాఫ్ట్ విండోస్ అంతరాయం కారణంగా వివిధ కంపెనీలకు కలిగిన నష్టాన్ని చెల్లించడాన్ని పరిగణించాలని మైక్రోసాఫ్ట్, క్రౌడ్ స్ట్రైక్ సంస్థలను కోరినట్లు మలేషియా డిజిటల్ మంత్రి తెలిపారు.క్రౌడ్ స్ట్రైక్ భద్రతా సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన తప్పు అప్డేట్ గతవారం మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా ఆధారితమైన కంప్యూటర్లను క్రాష్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగించింది. విస్తృత శ్రేణి పరిశ్రమలను ప్రభావితం చేసింది.మలేషియాలో ప్రభావితమైన వాటిలో ఐదు ప్రభుత్వ సంస్థలు, విమానయానం, బ్యాంకింగ్, హెల్త్‌కేర్‌లో పనిచేస్తున్న తొమ్మిది కంపెనీలు ఉన్నాయని మలేసియా మంత్రి గోవింద్ సింగ్ డియో విలేకరులతో అన్నారు. ఈ సంఘటనపై పూర్తి నివేదికను కోరేందుకు మైక్రోసాఫ్ట్, క్రౌడ్‌స్ట్రైక్ ప్రతినిధులతో తాను సమావేశమయ్యానని, పునరావృత అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని సంస్థలను కోరినట్లు గోవింద్ చెప్పారు."తమ నష్టాలను భర్తీ చేయాలని బాధిత కంపెనీలు కోరుతున్నాయి. వాటి అభ్యర్థనలు పరిగణలోకి తీసుకోవాలని, సమస్యను పరిష్కరించడానికి వారు ఎంతవరకు సహాయం చేయగలరో చూడాలని నేను వారిని కోరాను" అని గోవింద్ చెప్పారు. సాధ్యమైన చోట క్లెయిమ్‌లపై ప్రభుత్వం కూడా సహాయం చేస్తుందన్నారు. మొత్తంగా ఎంత నష్టం వాటిల్లిందనేది ఇంకా నిర్ధారించలేదని ఆయన చెప్పారు. -
ఇది మేల్కొలుపు: మైక్రోసాఫ్ట్ అంతరాయంపై సెబీ చీఫ్
మైక్రోసాఫ్ట్ విండోస్‌లో తలెత్తిన బగ్‌తో ప్రపంచం మొత్తం అల్లకల్లోలమైంది. చాలా దేశాల్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో పనిచేసే కంప్యూటర్లలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు విమానయాన, బ్యాంకింగ్, మీడియా సంస్థలు సహా సింగపూర్ ఎక్స్ఛేంజ్ (SGX) వంటి కొన్ని స్టాక్ ఎక్సేంజ్‌లపైనా దీని ప్రభావం పడింది.దీనిపై సెబీ చైర్పర్సన్ మధబి పూరిబుచ్ స్పందించారు. గ్లోబల్ మైక్రోసాఫ్ట్ అంతరాయాన్ని మేల్కొలుపుగా ఆమె అభివర్ణించారు. సైబర్ సెక్యూరిటీని టూ డైమెన్షనల్‌గా చూడాలని మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలకు సూచించారు. మైక్రోసాఫ్ట్ విండోస్‌కు సెక్యూరిటీ సేవలు అందించే ‘క్రౌడ్‌స్ట్రయిక్’ సైబర్ సెక్యూరిటీ సంస్థ చేసిన ఫాల్కన్ సెన్సార్ సాఫ్ట్వేర్ అప్డేట్లో లోపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక వ్యాపారాలు దెబ్బతిన్నాయి. -
మైక్రోసాఫ్ట్ అల్లకల్లోలం ... రూ.1.34 లక్షల కోట్ల నష్టం!
ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ అంతరాయం వెనుక ఉన్న సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘క్రౌడ్‌స్ట్రయిక్’ భారీ నష్టాన్నే మూటకట్టుకుంది. అనేక కంపెనీలు, విమానాశ్రయాలను తాకిన భారీ ఐటీ అంతరాయం కారణంగా క్రౌడ్‌స్ట్రయిక్ షేర్లు భారీగా పతనమయ్యాయి.యూఎస్‌లో ఈ కంపెనీ షేర్లు ట్రేడింగ్‌లో దాని విలువలో ఐదవ వంతును కోల్పోయాయి. అనధికారిక ట్రేడింగ్‌లో 21% తగ్గాయి. ఫలితంగా క్రౌడ్‌స్ట్రయిక్ వాల్యుయేషన్‌లో దాదాపు 16 బిలియన్ డాలర్ల (రూ.1.34 లక్షల కోట్లు) నష్టానికి దారి తీస్తుంది.మైక్రోసాఫ్ట్ విండోస్‌కు సెక్యూరిటీ సేవలు అందించే ‘క్రౌడ్‌స్ట్రయిక్’ సైబర్ సెక్యూరిటీ సంస్థ చేసిన ఫాల్కన్ సెన్సార్ సాఫ్ట్వేర్ అప్డేట్లో లోపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో పనిచేసే కంప్యూటర్లలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పలు విమానయాన, బ్యాంకింగ్, మీడియా సంస్థలుసహా రైల్వే, టీవీ, రేడియో, ఆస్పత్రి సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి.దీంతో కోట్లాది మంది జనం, యూజర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మైక్రోసాఫ్ట్ 365 యాప్స్, సర్వీసెస్ స్తంభించడంతో ఈ సమస్య తలెత్తింది. అయితే అవిశ్రాంతంగా శ్రమించి సమస్యను దాదాపు పరిష్కరించామని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ‘‘ఇది భద్రతాలోపం, సైబర్ దాడి కాదు. మైక్రోసాఫ్ట్ విండోస్‌లో తప్పుడు అప్డేట్ను రన్ చేయడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందని గుర్తించాం. సమస్యను ‘ఫిక్స్’ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం’’అని క్రౌడ్‌స్ట్రయిక్ సీఈఓ జార్జ్ కుర్జ్ ‘ఎక్స్’లో పోస్ట్‌చేశారు. -
పవర్ ప్లాంట్లపై రష్యా దాడి.. ఉక్రెయిన్‌లో విద్యుత్ సంక్షోభం
ఉక్రెయిన్‌పై రష్యా నిరంతర దాడులను కొనసాగిస్తూనే ఉంది. తాజాగా ఇంధన మౌలిక సదుపాయాలపై దాడికి దిగింది. తూర్పు డొనెట్స్క్ ప్రావిన్స్‌లోని పలు పవర్ ప్లాంట్లను ధ్వంసం చేసింది. దీంతో ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రష్యా తాజాగా ఉక్రెయిన్‌లోని పవర్ ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుని డ్రోన్, క్షిపణి దాడులను చేపట్టంది. దీంతో ఉక్రెయిన్‌లోని మూడు ప్రాంతాలు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో విద్యుత్తు నిలిచిపోయింది. ఈ దాడుల్లో 19 మందికిపైగా జనం మంది గాయపడ్డారు. ఉక్రెయిన్ ప్రభుత్వ విద్యుత్ గ్రిడ్ ఆపరేటర్ ఉక్రెనెర్గో మాట్లాడుతూ రష్యా చేపడుతున్న దాడులతో విద్యుత్ అంతరాయాలు ఏర్పడ్డాయని, ఇవి పారిశ్రామిక, గృహ వినియోగదారులను తీవ్రంగా ప్రభావితం చేశాయన్నారు. ఇటీవలి కాలంలో ఉక్రెయిన్ పవర్ గ్రిడ్‌పై రష్యా చేస్తున్న దాడులు దేశవ్యాప్తంగా బ్లాక్అవుట్ను విధించేలా చేశాయన్నారు.గత ఏప్రిల్‌లో కీవ్‌లోని భారీ థర్మల్ పవర్ ప్లాంట్‌పై రష్యా దాడి చేసింది. మే 8న మరో పవర్ ప్లాంట్‌పై దాడి జరిగింది. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి. మరోవైపు డొనెట్స్క్ ప్రాంతంలోని ఉమాన్స్కే గ్రామాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు రష్యా ప్రకటించింది. రష్యా ఇప్పుడు ఉత్తర సుమీ, చెర్నిహివ్ ప్రాంతాలలోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని ఉక్రెయిన్ అధికారిక వర్గాలు చెబుతున్నాయి.ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ సింగపూర్‌లో జరిగిన ఆసియా ప్రధాన భద్రతా శిఖరాగ్ర సమావేశంలో మాట్లాడుతూ ఉక్రెయిన్ యుద్ధంపై త్వరలో జరగబోయే శాంతి సమావేశానికి అడ్డుపడేందుకు రష్యాకు చైనా సహకారం అందిస్తున్నదని ఆరోపించారు. -
పాక్‌లో స్థంభించిన ఇంటర్నెట్.. మండిపడ్డ నెటిజన్లు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ అంతటా ఇంటర్నెట్ స్థంబించిపోయింది. ఇంటర్నెట్ అంతరాయంతో పలు సోషల్‌మీడియా అకౌంట్స్ ఓపెన్ కాలేదు. దీంతో నెటిజనట్లు తీవ్రమైన నిరాశ వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) రాబోయే ఎన్నికల కోసం నిధుల సేకరణ ప్రచారాన్ని ప్రారంభించిన క్రమంలోనే ఇంటర్నెట్ అంతరాయం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. Is #internet down in some areas or all over #Pakistan? Social media sites are either not opening or are very slow. #InternetShutDown pic.twitter.com/bxax9qp8oT — Ather Kazmi (@2Kazmi) January 7, 2024 ‘ఎక్స్’(ట్వీటర్)తో పాటు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టిక్‌టాక్, పలు వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్, యూట్యూబ్ సైతం ఓపెన్ కాకుండా మొరాయించడంతో దేశవ్యాప్తంగా ప్రజలు, నెటిజన్లు అసహనం వ్యక్తం చేశారు. వందల సంఖ్యలో వెబ్సైట్లు కూడా ఓపెన్ కాకపోవటం గమనర్హం. ఇంటర్నెట్ అంతరాయంతో గ్లోబల్ ఇంటర్నెట్ అబ్జర్వేటరీ, నెట్ బ్లాక్స్, సోషల్ మీడియా అప్లికేషన్లు కూడా దేశవ్యాప్తంగా ఓపన్ అవ్వలేదని తెలుస్తోంది. దీంతో ప్రజలు, సోషల్ మీడియా నెటిజన్లు ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘ఇది ఖచ్చితంగా సిగ్గుచేటు! అయిన విషయమని ప్రజలకు ఇంటర్నెట్ అంతరాయంతో జరిగిన నష్టానికి కేర్‌టేకర్ ఐటీ మంత్రి రాజీనామా చేయాలి’ అని పీటీఐ ట్విటర్ హ్యాండిల్ డిమాండ్ చేసింది. Absolutely shameful! Caretaker IT Minister should resign for this continuing damage to Pakistanis https://t.co/W9pyXzRr6A — PTI (@PTIofficial) January 7, 2024 చదవండి: మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. మాల్దీవులు మంత్రులపై వేటు! -
ఆగిపోయిన ట్విటర్ సేవలు! కారణం ఏంటంటే..
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల సేవల్లో అంతరాయం ఈరోజుల్లో సాధారణమైపోయింది. అయితే ఈ విషయంలో మిగతా వాటితో పోలిస్తే ట్విటర్ కొంచెం మెరుగు అనే అభిప్రాయం ఉంది యూజర్లలో. అందుకే వేరే ఏదైనా ప్లాట్‌ఫామ్ సేవలకు ఇబ్బంది అయినప్పుడు.. ట్విటర్లో చెడుగుడు ఆడేసుకుంటారు. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. చాలా కాలం తర్వాత ట్విట్టర్ పిట్ట కూత ఆగిపోయింది. గంటల వ్యవధిపాటు సేవలు నిలిచిపోయాయి. దీంతో యూజర్లు నానా అవస్థలు పడ్డారు. గత రాత్రి(శుక్రవారం) 11 గంటల నుంచి గంటపాటు ట్వీట్ చేయడంలో యూజర్లు ఇబ్బంది పడ్డారు. భారత్‌లోనూ ట్విట్టర్ సేవలు నిలిచిపోయాయి. సమస్య ఏంటంటే.. ఈ అంతరాయంపై స్పందించిన ట్విట్టర్ వెంటనే సేవలను పునరుద్ధరించింది. సాంకేతిక సమస్యల(టెక్నికల్ బగ్) కారణంగానే సేవలకు అంతరాయం కలిగినట్టు తెలిపింది. యూజర్లకు కలిగిన అసౌకర్యానికి క్షమించాలని వేడుకుంది. ట్విటర్ తిరిగి సేవలు ప్రారంభించగానే.. ట్విటర్‌నే ట్రోల్ చేస్తూ పలువురు ట్వీట్లు చేయడం కొసమెరుపు. We’ve fixed a technical bug that was preventing timelines from loading and Tweets from posting. Things should be back to normal now. Sorry for the interruption! — Twitter Support (@TwitterSupport) February 11, 2022 మొబైల్ మాత్రమే కాదు వెబ్సైట్లోనూ ఈ మైక్రోబ్లాగింగ్ సైట్ మొరాయించింది. లోడింగ్ సమస్యతోపాటు పోస్టింగ్‌లు చేయలేకపోయామని, లాగిన్ కూడా కాలేకపోయామని పలువురు ఫిర్యాదులు చేశారు. ట్విట్టర్‌ను ఉపయోగిస్తుండగానే మధ్యలోనే అది లాగౌట్ అయిందని మరికొందరు తెలిపారు. డౌన్‌డిటెక్టర్ అనే ట్రాక్ ప్రకారం.. సుమారు 48 వేలకు పైనే ఫిర్యాదులు అందాయి. -
ఎయిర్ టెల్ వినియోగదారులకు భారీ షాకింగ్ న్యూస్!
-
జియో డౌన్.. గగ్గోలు పెడుతున్న యూజర్లు
Reliance Jio Outage: రిలయన్స్ జియో నెట్వర్క్ ఒక్కసారిగా డౌన్ అయ్యింది. ముఖ్యంగా ముంబై టెలికాం సర్కిల్ పరిధిలో నెట్‌వర్క్‌కు పూర్తి స్థాయిలో అంతరాయం ఏర్పడింది. దీంతో కాల్స్ ఇన్కమ్, అవుట్‌గోయింగ్‌కు ఇబ్బంది పడుతున్నారు యూజర్లు. ఇదిలా ఉంటే ముంబైతో పాటు దేశంలోని మరికొన్ని సర్కిల్స్‌లోనూ ఇదే తరహా సమస్యలు యూజర్లు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. మరికొన్ని చోట్ల నాలుగైదు రోజుల నుంచి నెట్వర్క్ సరిగా పని చేయడం లేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. జియో నుంచి మాత్రమే కాదు.. ఇతర నెట్‌వర్క్‌ల నుంచి జియో నెంబర్లకు కాల్స్ కనెక్ట్ కావడం లేదనే ఫిర్యాదు అందుతున్నాయి. అంతరాయానికి కారణం ఏంటన్నది స్పష్టం చేయని జియో నెట్వర్క్.. యూజర్లకు వీలైనంత త్వరగా సేవలు పునరుద్ధరిస్తామని పేర్కొంది. అంతవరకు ప్రత్యామ్నాయ సిమ్ లేదంటే ఇంటర్నెట్ బేస్డ్ సేవల్ని వినియోగించుకోవాలని యూజర్లకు విజ్క్షప్తి చేస్తోంది. మరోపక్క నెట్వర్క్ పని చేయకపోవడంపై ఇతర నెట్వర్క్ యూజర్లు మీమ్స్‌తో ఎంజాయ్ చేస్తున్నారు. Meanwhile #jio network pic.twitter.com/6dceYAo4Pc — hemaantt (@hemaantt) February 5, 2022 Jio Network down in full mumbai ( no calls, internet or mails) living life in ancient times #jio pic.twitter.com/ZDbY6riXVN — SavageNewsFurkan (@furkanaibani) February 5, 2022 #Jio network down Don't worry Mukesh Ambani is on duty: pic.twitter.com/EvA0c0bSDI — Hemant (@Sportscasmm) February 5, 2022 -
అమెజాన్ సేవలకు అంతరాయం! కారణం ఏంటంటే..
Amazon Web Services Outage Details: అమెజాన్ వెబ్ సర్వీస్ పరిధిలోని వెబ్ సైట్లన్నింటికి కాసేపు విఘాతం ఏర్పడింది. అమెజాన్ షాపింగ్ సైట్‌తో పాటు ప్రైమ్ వీడియో, వెబ్ సర్వీసెస్‌కి అనుబంధంగా ఉన్న సైట్లు సైతం నిలిచిపోయాయి. క్రిస్మస్, ఇయర్ ఎండ్ సీజన్ కావడంతో షాపింగ్ ఊపులో ఉన్న యూజర్లు.. ఈ విఘాతంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. భారత కాలమానం ప్రకారం.. మంగళవారం రాత్రి సమయం నుంచి అమెజాన్ వెబ్ సర్వీసులకు విఘాతం కలిగింది. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ (API) సంబంధిత సమస్యలతో ఈ విఘాతం ఏర్పడినట్లు అమెజాన్ వెల్లడించింది. అయితే ఈ విఘాతం అమెరికా కాలమానం ప్రకారం.. ఉదయం 10.40ని. కి ఏర్పడిందని, అమెరికా ఈస్ట్-1 రీజియన్ వరకే పరిమితమైందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. అమెజాన్ వెబ్ సర్వీసుల అంతరాయంతో ఫేస్బుక్, నెట్‌ఫ్లిక్స్, డిస్నీఫ్లస్, రాబిన్‌హుడ్ లాంటి యాప్స్ సేవలకు సైతం విఘాతం ఏర్పడింది. సుమారు 24 వేలమంది అంతరాయంపై ఫిర్యాదులు చేశారని అమెజాన్ కంపెనీ తన స్టేటస్ డాష్‌బోర్డులో పేర్కొంది. ఇదిలా ఉంటే అమెరికాలో ఇలా వెబ్ సంబంధిత సర్వీసులకు విఘాతం ఏర్పడడం ఇది రెండోసారి. ఈ ఏడాది జూన్‌లో ఫాస్ట్లీ కంపెనీ (అమెజాన్ వెబ్ సర్వీసెస్‌కు పోటీ కంపెనీ) సేవలకు సైతం అంతరాయం ఏర్పడి.. రెడ్డిట్, అమెజాన్, సీఎన్ఎన్, పేపాల్, స్పోటీఫై, అల్ జజీరా మీడియా నెట్వర్క్, ది న్యూయార్క్ టైమ్స్‌లు కొద్దిగంటల పాటు నిలిచిపోయాయి. చదవండి: అమెజాన్ బాస్ పెద్ద మనసు.. భారీగా సొమ్ము దానం! -
మళ్లీ బ్రేక్‌డౌన్! ఫేస్బుక్ సేవలకు అంతరాయం
Instadown Trend Amid Instagram Down Again: ఫేస్బుక్ సర్వీసులకు మరోసారి విఘాతం కలిగింది. భారత కాలమానం ప్రకారం.. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో సుమారు రెండు గంటలసేపు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మెసేంజర్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. దీంతో యూజర్లు మరోసారి అసహనానికి గురయ్యారు. ఇన్స్టాగ్రామ్ యాప్ రిఫ్రెష్ కాకపోవడం, ఫీడ్స్ ఆగిపోవడం, ఫేస్బుక్ మెసేంజర్ పని చేయకపోవడంతో పాటు ఫేస్బుక్ కార్యాలయంలోనూ పలు సేవలు ఆగిపోయినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ అంతరాయంపై యూజర్లకు ఫేస్బుక్ క్షమాపణలు చెప్పింది. ఇంకోవైపు Instagram Down, #Instadown హ్యాష్‌ట్యాగులు విపరీతంగా షేర్ కావడంతో ట్రెండింగ్‌లో నడుస్తున్నాయి. ఫేస్బుక్ సంబంధిత సేవలకు అంతరాయం ఏర్పడడం ఈ వారంలో ఇది రెండోసారి. సోమవారం రాత్రి ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సేవలు సుమారు ఆరేడు గంటలు ఆగిపోవడంతో కోట్ల మంది యూజర్లు అసహనం వ్యక్తం చేశారు. ట్విటర్, టెలిగ్రామ్ సర్వీసుల వైపు మళ్లారు. ఈ అంతరాయం ఫలితంగా ఫేస్‌బుక్‌తో పాటు చిరువ్యాపారస్తులు కూడా భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఇక శుక్రవారం రాత్రి ఏర్పడిన అంతరాయానికి, సోమవారం ఏర్పడిన అంతరాయానికి ఒకే కారణం కాదని ప్రకటించిన ఫేస్బుక్.. అంతరాయానికి కారణం ఏంటన్నది మాత్రం చెప్పట్లేదు. అయితే సమస్యను పరిష్కరించినట్లు, ఇప్పుడంతా సర్దుకుందని మాత్రం ప్రకటించింది. మరోవైపు ఇన్స్టాగ్రామ్ కూడా ఓపికగా ఎదురుచూసినందుకు యూజర్లకు కృతజ్ఞతలు తెలియజేసింది. We know some of you may be having some issues using Instagram right now (🥲). We’re so sorry and are working as quickly as possible to fix. — Instagram Comms (@InstagramComms) October 8, 2021 things have been fixed, and everything should be back to normal now. thank you for bearing with us (and for all the memes this week 🙃) — Instagram Comms (@InstagramComms) October 8, 2021 మరోవైపు ఒకేవారంలో రెండుసార్లు షట్‌డౌన్ కావడంపై యూజర్లు అసహనంతో పాటు సెటైర్లు పేల్చారు. శుక్రవారం రాత్రి ఆ రెండుగంటలపాటు ట్విటర్లో మీమ్స్‌తో ఫేస్బుక్ మీద విరుచుకుపడ్డారు. అందులో కొన్ని మీకోసం.. I call the master#instadown pic.twitter.com/Udi4ftuRvG — ΔΝΔSIK (@ilnasik) October 8, 2021 Situation right now when #instadown Instagram Twitter pic.twitter.com/qTT52Ojaar — Sakuta🌸 (@Sakutax2) October 8, 2021 People coming to Twitter again to check whether insta is down again #instagram #instadown pic.twitter.com/yhVgyLDpSP — Garry Gill (@garrygill1112) October 8, 2021 #instadown insta down go to Twitter pic.twitter.com/9GoCbTzRVz — Sakuta🌸 (@Sakutax2) October 8, 2021 Mark zuckerberg after taking insta down 2 times in a week #DeleteInstagram #instadown #instagramdown pic.twitter.com/sjW0PHgpW2 — Khizer (@khiz_7) October 8, 2021 #instadown I'm waiting when it will ok pic.twitter.com/1YNjkWFiiE — Ashutosh Srivastava (@ashutosh_sri8) October 8, 2021 చదవండి: ఆరు గంటల్లో 50 వేల కోట్ల నష్టం.. జుకర్‌బర్గ్‌ను ముంచిన ఆ ఒక్కడు -
Facebook Outage: ప్రపంచానికి కోలుకోలేని దెబ్బ !
ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సేవలు కొన్ని గంటలపాటు నిలిచిపోవడం.. కొందరికి చికాకు తెప్పించి ఉండొచ్చు. మరికొందరికి ఇదంతా సరదా వ్యవహారంగా అనిపించి ఉండొచ్చు. కానీ, నాణేనికి మరోవైపులా.. ఇందులోనూ సీరియస్ కోణం కనిపించింది. అమెరికా, ఫేస్బుక్ ఓనర్ సంగతేమోగానీ.. మిగతా ప్రపంచానికి మాత్రం ఈ విఘాతం ఊహించని స్థాయిలో డ్యామేజ్‌నే చేసింది. ముఖ్యంగా వ్యాపార, వైద్య రంగాలతో పాటు ప్రభుత్వ విభాగాలపైనా యాప్స్ సేవల విఘాతం తీవ్ర ప్రభావం చూపెట్టింది. ఇన్స్టంట్ కాల్స్ అండ్ మెసేజింగ్ సర్వీసుల యాప్ ‘వాట్సాప్’ను.. 180 దేశాల్లో 200 కోట్ల మంది దాకా ఉపయోగిస్తున్నారు. ఇక ఫేస్బుక్-ఫేస్బుక్ మెసేంజర్ సర్వీస్‌ల్ని 300 కోట్లమందికిపైగా ఉపయోగించుకుంటున్నారు. కెన్యా, అర్జెంటీనా, మలేషియా, కొలంబియా, బ్రెజిల్ లాంటి దేశాల్లో 16 నుంచి 54 ఏళ్లలోపు 90 శాతం మంది వాట్సాప్ సేవల్ని ఉపయోగిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఇక భారత్‌లో సుమారు 50 కోట్ల మంది వాట్సాప్ సేవల్ని ఉపయోగించుకుంటుండగా.. సోమవారం రాత్రి వాటిల్లిన బ్రేక్ డౌన్ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఎన్నో రంగాలు.. సోషల్ మీడియా అనేది కేవలం కమ్యూనికేషన్ కోసం మాత్రమే కాదు.. వివిధ రంగాల్లోనూ జోరుగా వీటిని వినియోగిస్తున్నారు. డెలివరీ దగ్గరి నుంచి విద్యా, వైద్య, ఇతరత్ర సేవలను అందించడంలో ఇప్పుడు ఇవే కీలక భూమిక పోషిస్తున్నాయి. ముఖ్యంగా చిరువ్యాపారుల బిజినెస్‌కు ఈ ఆరేడు గంటల విఘాతం కోలుకోలేని నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఇక కరోనా టైం నుంచి భారత్‌లో వాట్సాప్ ద్వారా పేషెంట్ల కన్సల్టింగ్ ప్రక్రియ, మందుల డోర్ డెలివరీ వ్యవస్థ ఎక్కువగా నడుస్తోంది. సోమవారం నాటి అంతరాయంతో వైద్య రంగానికి నష్టంతో పాటు పేషెంట్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక మలేషియాలో బిజినెస్ కమ్యూనికేషన్ దాదాపుగా ఫేస్బుక్, వాట్సాప్‌లతోనే నడుస్తోంది. అలాంటిది అక్కడ భారీగానే నష్టం వాటిల్లినట్లు సమాచారం. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే.. ఫేస్బుక్ అండ్ కో వల్ల ఎక్కువ డ్యామేజ్ జరిగింది మాత్రం ఫుడ్(ఇండోనేషియా,జర్మనీ లాంటి దేశాల్లో), రిటైల్(34కి పైగా దేశాల్లో) రంగాలకే కావడం చెప్పుకోదగ్గ విషయం. ప్రభుత్వ సేవలకూ.. మనీలాకు చెందిన ఫొటోగ్రాఫర్ రిచర్డ్ జేమ్స్ మెండోజా ఫేస్బుక్ సర్వీసుల విఘాతం వల్ల ఉపాధి దెబ్బతిందని వాపోతున్నాడు. ఫిలిప్పీన్స్ అధ్యక్ష ఎన్నికల క్యాంపెయిన్ కోసం, కరోనా సమాచారం అప్డేట్స్ కోసం మెండోజా పని చేస్తున్నాడు. భారత కాలమానం ప్రకారం.. సోమవారం రాత్రి ఏర్పడ్డ విఘాతంతో మెండోజా తన పని సక్రమంగా నిర్వహించలేకపోయాడు. దీంతో ఇతగాడి ఫీజులో భారీ కోత పడింది. ఇలా క్యాంపెయిన్స్ కోసమే కాదు.. ప్రభుత్వాలు సోషల్ మీడియాను ‘ఇన్ఫర్మేషన్ షేరింగ్’ ప్లాట్‌ఫామ్‌గా వాడుకుంటున్నాయి కూడా. నిఘా, పౌర సేవల్ని అందించడం, అవసరమైన డాక్యుమెంట్ల చేరివేత, వెరిఫికేషన్.. ఇలా ఎన్నో ప్రక్రియలు వాట్సాప్ ద్వారా నడుస్తున్నాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సర్వీసింగ్ సెంటర్లకు క్యూ ప్రజలకు సోషల్ మీడియా కేవలం టైం పాస్ యవ్వారం అని మాత్రమే కాదు.. సాధారణ ఫోన్‌కాల్స్ కంటే యాప్కాల్స్ యమచీప్ అనే ముద్రపడిపోయింది. అందుకే ఆ ఆరేడు గంటలు కమ్యూనికేషన్ పరమైన ఇబ్బందితో తలలు పట్టుకున్నారు. అయినవాళ్లతో బంధం కాసేపు ఆగిపోవడం.. అపార్థాలతో అలజడులు రేగాయి. కొందరు ఫోన్లు రీస్టార్ట్లుచేయగా.. మరికొందరు డేటా ప్యాక్ వాలిడిటీ పూర్తైందేమోనని కంగారు పడ్డారు. ఇంకొందరు ఆందోళనతో సర్వీస్ సెంటర్లకు, రిపేర్ షాపులకు క్యూ కట్టిన దృశ్యాలు సైతం కనిపించాయి. మార్క్ జకర్బర్గ్కు కలిగిన నష్టంతో పోలిస్తే.. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఫేస్బుక్ అండ్ కో విఘాతం వల్ల జరిగిన నష్టమే ఎక్కువ. అఫ్కోర్స్.. ఈ విషయాన్ని లెక్కలతో తేల్చకున్నాఫేస్బుక్కే స్వయంగా ప్రకటించిందనుకోండి. ఇప్పుడు తెర మీదకు వచ్చిన మరో చర్చ ఏంటంటే.. ముందు ముందు ఇలాంటి అంతరాయాలు ఎదురైతే ఎలా? అని.. - సాక్షి, వెబ్‌స్పెషల్ -
‘ఈ ఫేస్బుక్ పాడుగాను’.. వాళ్ల నెత్తిన పాలుపోసింది
పొద్దున లేచి ఫేస్ కడగకుండానే ఫేస్బుక్, వాటర్ తాగకుండానే వాట్సాప్ ఉపయోగించడం మనకు బాగా అలవాటైంది. అంతెందుకు సోషల్ మీడియాకు కొద్దిసేపు దూరంగా ఉన్నా.. విలవిలలాడిపోతుంటారు కొందరు. అలాంటిది ఒక్కరాత్రిలో ఫేస్బుక్ అండ్ కో సర్వీసులకు విఘాతం కలగడంతో అల్లలాడిపోయారు. డొమైన్ నేమ్ సిస్టమ్(డీఎన్ఎస్) సమస్య వల్ల బఫరింగ్ స్లో అయిపోవడం, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు రిఫ్రెష్ కాకపోవడం లాంటి సమస్యలు ఎదురయ్యాయి. వీటికితోడు వాట్సాప్ పూర్తిగా పనిచేయకుండా నిలిచిపోయింది. చివరికి ఫేస్బుక్ వర్చువల్ రియాలిటీ డివిజన్ ‘ఒక్యూలస్’ కూడా ఆగిపోవడం(డౌన్ డిటెక్టర్ సైతం ధృవీకరించింది) ఫేస్‌బుక్‌ను ఘోరంగా దెబ్బతీసింది. ఇక నిన్న(అక్టోబర్ 4, సోమవారం) రాత్రి నుంచి సోషల్ మీడియా టాప్‌లో మొదలైన #instagramdown, #facebookdown, #whatsappdown హ్యాష్‌ట్యాగ్‌లు.. సమస్య తీరాక కూడా ఈ ఉదయం నుంచి ట్రెండ్ అవుతుండడం చర్చనీయాంశంగా మారింది. ముందెన్నడూ యూజర్లు ఇలాంటి సమస్య ఇంతసేపు ఎదుర్కొనలేదు. దీంతో వాళ్లలో ఫ్రస్టేషన్ పీక్స్‌కు చేరింది. వాట్సాప్‌లో అయినవాళ్లతో ఛాటింగ్, వీడియో కాల్స్‌కు అవకాశం లేకపోవడంతో ఫేస్బుక్ అండ్ కోను విపరీతంగా తిట్టిపోసుసుకున్నారు. ఆ కోపంలో #deletefacbook హ్యాష్‌ట్యాగ్‌ను సైతం ట్విటర్ తెర మీదకు తెచ్చారు. అయితే ఈ పరిణామాల వల్ల ఫేస్బుక్ ఎంతగా నష్టపోయిందో.. కొన్ని ఫ్లాట్‌ఫామ్స్ విపరీతంగా లాభపడ్డాయి. టెలిగ్రామ్ టాప్ టక్కర్ వాట్సాప్ చతికిల పడ్డ టైంలో.. యూజర్లు ఇతర మార్గాలను అన్వేషించారు. యూట్యూబ్, ఇతరత్ర సైటల్లో ఎక్కువసేపు గడిపారు. అదే టైంలో ఇన్స్టంట్ మెసేజింగ్ సర్వీసుల కోసం టెలిగ్రామ్, సిగ్నల్ లాంటి యాప్‌లను ఉపయోగించారు కోట్ల మంది. ముఖ్యంగా టెలిగ్రామ్ మెసేంజర్ యాప్ ఈ ఫేస్బుక్ సర్వీసుల విఘాతం వల్ల బాగా లాభపడింది. కొత్తగా కోట్ల మంది కొత్త యూజర్లు టెలిగ్రామ్‌కు సైన్ అప్ అయ్యారు. చాలామంది సైన్ ఇన్ ద్వారా ఉపయోగించుకున్నారు. whatsapp, Facebook, Instagram VS. Twitter, telegram. @universoANHQV #ANHQV pic.twitter.com/bMFFklaTCP — Alexis Romero🏳️🌈🎃 (@alexisromloz) October 4, 2021 ఈ క్రమంలో టెలిగ్రామ్‌కు యూజర్లు వెల్లువెత్తడంతో.. సర్వీసులు నెమ్మదించి రిపోర్టులు(ఫిర్యాదులు) కుప్పలుగా వచ్చాయి. అయితే ‘ఫేస్బుక్ దెబ్బ’ ప్రభావం వల్ల టెలిగ్రామ్ ఎంతగా లాభపడిందనే గణాంకాలు వెల్లడి కావాల్సి ఉంది. మరోవైపు ట్విటర్కీ కోట్ల మంది క్యూ కట్టారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో యూజర్లు ఎంగేజ్ కావడంతో ఫేస్బుక్ ఎంత నష్టపోయిందో.. అవీ అంతే లాభపడి ఉంటాయని భావిస్తున్నారు. Twitter right now pic.twitter.com/GxU31jTRMa — Netflix India South (@Netflix_INSouth) October 4, 2021 ట్విటర్కొచ్చిన వాట్సాప్ ఫేస్బుక్ దాని అనుబంధ సర్వీసులు పని చేయకపోవడంతో నిన్న రాత్రంతా విచిత్రమైన పరిణామాలెన్నో చోటు చేసుకున్నాయి. జుకర్‌బర్గ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ హెడ్లు జనాలకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. వాట్సాప్.. మరోదారిలేక ట్విటర్‌కి వచ్చి యూజర్లకు క్షమాపణలు చెప్పింది. నెట్‌ఫ్లిక్స్ ఇండియా సైతం ఈ సమస్యను హిలేరియస్ మీమ్‌గా వాడేసుకుంది. ఫేస్బుక్ సర్వీసులకు విఘాతం కలగడంతో ట్విటర్లో నవ్వులు పూయించారు చాలామంది. We’re aware that some people are experiencing issues with WhatsApp at the moment. We’re working to get things back to normal and will send an update here as soon as possible. Thanks for your patience! — WhatsApp (@WhatsApp) October 4, 2021 చదవండి: ఫేస్బుక్ నష్టం.. ఆరు గంటల్లో 50 వేల కోట్లా! -
మొరాయించిన గూగుల్: యూజర్లు పరేషాన్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ సెర్చ్ ఇంజీన్ సంస్థ గూగుల్, దాని సంబంధిత సేవలు పనిచేయకపోవడంతో యూజర్లు గందరగోళంలో పడిపోయారు. ఆల్ఫాబెట్ సొంతమైన సెర్చ్ ఇంజన్ గూగుల్‌తో పాటు దాని స్ట్రీమింగ్, ఈమెయిల్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందంటూ చాలా మంది వినియోగదారులు ఫిర్యాదు చేశారు. మానిటరింగ్ వెబ్సైట్ డౌన్డెక్టెక్టర్ ఈ విషయాన్ని నివేదించింది. ఈ సమస్యకు గల కారణాలపై ఇంతవరకు ఎలాంటి స్పష్టత లేదు. దీనిపై గూగుల్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. డౌన్డెక్టెక్టర్ అందించిన సమాచారం ప్రకారం గూగుల్, యూట్యూబ్, జీమెయిల్‌తో కొన్ని గూగుల్ ప్లాట్‌ఫారమ్‌లు సోమవారం సాయంత్రంనుంచి మొరాయించాయి. ఉత్తర అమెరికాలోని కొన్నిప్రాంతాల్లోకి లాగిన్ అయ్యేందుకు, వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయడంలో సమస్యలు తలెత్తాయంటూ ఫిర్యాదు చేసినట్లు డౌన్‌డెక్టర్ తెలిపింది. ఒక దశలో వెయ్యి మందికి పైగా వినియోగదారులు గూగుల్ సేవల అంతరాయంతో గగ్గోలు పెట్టారని తెలిపింది. దీంతో పాటు యూట్యూబ్ టీవీ , గూగుల్ డ్రైవ్‌తో కూడా వినియోగదారులు సమస్యలను ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. చదవండి : ఫేస్బుక్, గూగుల్‌కు సమన్లు ఫ్లిప్‌కార్ట్ ధమాకా సేల్: ఇన్వర్టర్ ఏసీలపై భారీ తగ్గింపు -
వాట్సాప్ డౌన్ : యూజర్లు విలవిల
న్యూఢిల్లీ : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఆదివారం సాయంత్రం 4.15 గంటల ప్రాంతంలో మొరాయించడంతో ప్రపంచ వ్యాప్తంగా యూజర్లు తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. వాట్సాప్ ఔటేజ్‌తో తాము ఫోటోలు, వీడియోలు, స్టిక్కర్లు షేర్ చేసుకోలేకపోయామని వాట్సాప్ యూజర్లు ఆందోళన వ్యక్తం చేశారు. వాట్సాప్ స్టేటస్‌లోనూ తాము వీడియోలు, ఫోటోలను వీక్షించలేకపోయామని యూజర్లు ఫిర్యాదు చేశారు. వాట్సాప్ పనిచేయకపోవడంతో యూజర్లు మెసేజ్‌లు పంపడం, రిసీవ్ చేసుకోవడంలో సాంకేతిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ట్రాకింగ్ వెబ్సైట్ డౌన్‌డిటెక్టర్ వెల్లడించింది. వాట్సాప్ డౌన్ కావడంతో ఇండియా, యూరప్, మలేషియా, ఇండోనేషియా, బ్రెజిల్ సహా పలు దేశాల యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఔటేజ్ మ్యాప్‌లో కనిపించింది. వాట్సాప్ డౌన్ కావడంతో యూజర్లు ట్విటర్ సేవలను ఉపయోగించుకున్నారు. ఆ సమయంలో ట్విటర్ ఇండియాలో వాట్సాప్‌డౌన్ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయింది. వాట్సాప్ సేవలు కొద్దిసేపటికి పునరుద్ధరించడంతో యూజర్లు ఊపిరి పీల్చుకున్నారు. -
మొరాయించిన ఫేస్బుక్.. సమస్యేంటో తెలీదన్న సిబ్బంది
ముంబై : ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ఫేస్బుక్ మొరాయించింది. దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ కూడా యూజర్లను ఇబ్బంది పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది యూజర్లు బుధవారం ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లతో ఇబ్బందులు పడ్డారు. ఈ రెండు ప్లాట్‌ఫామ్‌లలో కొత్త పోస్టులు పెట్టడం, మెసేజ్‌లు పంపడం సాధ్యపడలేదు. మెసేంజర్ మొబైల్ యాప్ బాగానే పనిచేసింది కానీ... డెస్క్ టాప్‌లో లోడ్ కాలేదు. ఫేస్‌బుక్‌కి చెందిన యాప్‌లలో వాట్సప్ మాత్రమే సజావుగా పని చేసింది. అయితే దీని గురించి ఇంత వరకూ ఎటువంటి బహిరంగ ప్రకటన వెలువడలేదు. కానీ త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు. ఈ సమస్య బుధవారం రాత్రి ప్రారంభమయినట్లు సమాచారం. డైరెక్ట్ మెసేజీలు, కంటెంట్ పోస్ట్ చేసే బటన్ కనిపించక యూజర్లు కాసేపు తికమకపడ్డారు. ఇంటర్నల్ ఎర్రర్ కారణంగానే ఇలా జరిగినట్టు తెలుస్తోంది. డెస్క్‌టాప్ వర్షన్ లోడ్ అవ్వలేదు.. కాగా మొబైల్ యాప్ మాత్రం కొంత సేపు పని చేసినట్లు యూజర్లు పేర్కొన్నారు. ఈ విషయం గురించి ఓ వ్యాపారవేత్త మాట్లాడుతూ.. ‘ఫేస్‌బుక్‌ను వ్యక్తిగత అవసరాలకు మాత్రమే వినియోగిస్తే బాగుంటుంది. కానీ వ్యాపార అవసరాలకు కూడా ఫేస్బుక్ మీద ఆధారపడుతున్నాం. మా విషయమే తీసుకొండి.. నేను న్యూయార్క్‌లో ఉన్న మా సిబ్బందితో మాట్లాడటానికి ఉన్న ఏకైక మార్గం.. ఫేస్బుక్. ఈ మెయిల్ పంపించడం ఎప్పుడో మానేశాం’ అంటూ చెప్పుకొచ్చారు. ఫేస్బుక్ పనిచేయకపోవడంతో యూజర్లు #FacebookDown, #InstagramDown అనే హ్యాష్ ట్యాగ్లు క్రియేట్ చేసి ట్విటర్లో జోకులు పేల్చారు. అయితే ఈ ఇష్యూను సాధ్యమైనంత త్వరగా ఫిక్స్ చేస్తామని ఫేస్ బుక్ తెలిపింది. దీని గురించి ‘ఫేస్బుక్ ఫ్యామిలీ యాప్‌లను యాక్సెస్ చేయడంలో కొంత మంది సమస్య ఎదుర్కొంటున్న విషయం మాకు తెలిసింది. ఈ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామంటూ ఫేస్బుక్ ట్వీట్ చేసింది. భారత్‌తోపాటు ఇంగ్లాండ్, లాటిన్ అమెరికా, ఫిలిప్ఫిన్స్, టెక్సాస్, వాషింగ్టన్ తదితర ప్రాంతాల్లో ఫేస్ బుక్ సరిగా పని చేయలేదని సమాచారం. We’re aware that some people are currently having trouble accessing the Facebook family of apps. We’re working to resolve the issue as soon as possible. — Facebook (@facebook) March 13, 2019 -
బ్రేకింగ్.. ఆగిపోయిన యూట్యూబ్
సాక్షి, హైదరాబాద్ : వీడియో స్ట్రీమింగ్ వెబ్సైట్ యూట్యూబ్ ఆకస్మత్తుగా నిలిచిపోయింది. సాంకేతిక కారణాలతో ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్ పనిచేయడం ఆగిపోయింది. అనేక మంది నెటిజన్లు యూట్యూబ్, యూట్యూబ్ టీవీ, యూట్యూబ్ మ్యూజిక్‌లో తలెత్తిన సమస్యలను సంస్థ దృష్టికి తెలియజేస్తూ రిపోర్ట్ చేశారు. దీంతో ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని, త్వరలో ఈ సమస్యను పరిష్కరించి, అప్డేట్ చేస్తామని యూట్యూబ్ సంస్థ ట్విటర్లో పేర్కొంది. యూట్యూబ్ కంటెంట్ చూడాలని వెబ్సైట్లోకి వెళ్తే 500 ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్, 503 నెట్వర్క్ ఎర్రర్ అని వస్తుందని నెటిజన్లు వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను షేర్ చేస్తున్నారు. అలాగే యూజర్స్‌కు వెబ్సైట్ లాగిన్ కావడం లేదని పేర్కొన్నారు. గత నెలలో ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని ప్రదేశాల్లో ఇలాగే క్రాష్ అయిన విషయం తెలిసిందే. Thanks for your reports about YouTube, YouTube TV and YouTube Music access issues. We're working on resolving this and will let you know once fixed. We apologize for any inconvenience this may cause and will keep you updated. — Team YouTube (@TeamYouTube) October 17, 2018 Wow, I'm loving Youtube's new update! Minimalistic and Chic #YouTube pic.twitter.com/a0lHbpbQCN — ros (@Amuchanist) October 17, 2018 Mayday mayday SOS SOS#youtube what happened? pic.twitter.com/vIYTmyndP1 — HatiHunter (@ailinafuad) October 17, 2018 -
15 నిమిషాలు ఫేస్ బుక్ ఆగిపోయింది!
వాషింగ్టన్: సోషల్ మీడియా వెబ్ సైట్ ఫేస్ బుక్ సేవలు బుధవారం ఉదయం మరోసారి స్థంభించాయి. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 15 నిమిషాలపాటు ఫేస్ బుక్ పనిచేయడం ఆగిపోయింది. సాంకేతికపరమైన మార్పులు చేసే క్రమంలో తమ వెబ్ సైట్ పనిచేయడం ఆగిపోయిందని ఫేస్ బుక్ ఓ ప్రకటనలో తెలిపింది. తాము సమస్యను వెంటనే గమనించి తగిన చర్యలు తీసుకున్నాం.. ఆతర్వాత ఫేస్ బుక్ పనిచేయడం ప్రారంభించిందని ఆ కంపెనీ ప్రతినిధి ఓ ప్రకటలో వెల్లడించారు. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి ఒంటి గంటకు చోటు చేసుకుంది. గతంలో కూడా ఫేస్ బుక్ సేవలు అర్ధాంతరంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే.