
రిలయన్స్ జియో నెట్‌వర్క్‌లో అంతరాయం తలెత్తింది. మొబైల్ ఇంటర్నెట్ సమస్యలతోపాటు కాల్ డ్రాప్‌లతో యూజర్లు ఇబ్బంది పడ్డారు. మొబైల్ నెట్‌వర్క్‌తో పాటు జియో ఫైబర్ సేవల్లోనూ అంతరాయం ఏర్పడినట్లు వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
అవుటేజ్ ట్రాకర్ ‘డౌన్‌డెటెక్టర్’కు జియో అంతరాయానికి సంబంధించి గరిష్ట స్థాయిలో 10,000 లకుపైగా రిపోర్ట్‌లు నమోదయ్యాయి. ప్లాట్‌ఫారమ్‌పై నమోదు చేసిన ఫిర్యాదుల ప్రకారం.. ఉదయం 11 గంటలకు అంతరాయం ప్రారంభమైంది. అయితే అవుట్‌టేజ్ ట్రాకర్ ఇప్పుడు రిపోర్ట్‌లలో క్షీణతను చూపుతోంది.
డౌన్‌డెటెక్టర్‌పై నివేదిక ప్రకారం.. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, నాసిక్, కోల్‌కతా, పాట్నా, గౌహతి ప్రాంతాలలోని వినియోగదారులపై అంతరాయం ఎక్కువగా ప్రభావం చూపింది. దీనిపై సోషల్ మీడియాలో ఫిర్యాదులు, మీమ్స్ వెల్లువెత్తాయి. అంతరాయంపై జియో ఇంకా స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment