
IndiGo Outage: ప్రముఖ ఎయిర్‌లైన్ సంస్థ ఇండిగో సేవల్లో అంతరాయం ఏర్పడింది. శనివారం మధ్యాహ్నం నుంచి తలెత్తిన సాంకేతిక లోపంతో దేశవ్యాప్తంగా విమానాశ్రయాలలో విమాన కార్యకలాపాలు, గ్రౌండ్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది.
చెక్-ఇన్‌లు నెమ్మదిగా సాగడంతో ప్రయాణికులు చాలా సేపు వేచిఉండాల్సి వచ్చింది. ప్రయాణికుల భారీ క్యూలతో ఎయిర్‌పోర్ట్ ప్రాంగణాలు కిక్కిరిశాయి. దీంతో కొన్ని చోట్ల సిబ్బంది బోర్డింగ్ పాసులను చేత్తో రాసిస్తున్నారు. ఇండిగో సిస్టమ్‌లో తలెత్తిన లోపం కారణంగా టిక్కెట్లు బుక్ చేసుకోలేకపోతున్నామంటూ కొందరు ప్రయాణికులు వాపోయారు. తమకు ఎదురైన ఇబ్బందులను బాధిత ప్రయాణికులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. ‘ఎక్స్’లో దీనికి సంబంధించిన పోస్టులు వెల్లువెత్తాయి.

అంతరాయంపై ఇండిగో స్పందించింది. కొనసాగుతున్న సిస్టమ్ అంతరాయం కారణంగా ప్రభావితమైన కస్టమర్‌లకు సాధ్యమైనంత మెరుగైన సహాయం, మద్దతును అందించడానికి తమ సిబ్బంది అవిశ్రాంతంగా కృషి చేస్తున్నట్లు ‘ఎక్స్’లో వివరించింది.
#6ETravelAdvisory : We want to assure you that our dedicated airport teams are working relentlessly to provide the best possible assistance and support to customers affected by the ongoing system outage. (1/2)
— IndiGo (@IndiGo6E) October 5, 2024