IndiGo Airlines
-
మూడు విమానాలకు బాంబు బెదిరింపులు
న్యూఢిల్లీ: ముంబై నుంచి బయలుదేరిన మూడు అంతర్జాతీయ విమానాలకు సోమవా రం బాంబు బెదిరింపులు రావడంతో భద్ర తా సంస్థలు ఉలిక్కిపడ్డాయి. ముంబై నుంచి న్యూయార్క్ వెళ్తున్న ఎయిరిండియా విమా నంతో పాటు మస్కట్ (ఒమన్), జెడ్డా (సౌదీ అరేబియా)కు వెళ్తున్న రెండు ఇండిగో విమా నాలకు కూడా బాంబు బెదిరింపులు వచ్చా యి. న్యూయార్క్ బయలుదేరని విమానాన్ని ఢిల్లీకి దారి మళ్లించారు. ఇండిగో విమానాలకు టేకాఫ్‌కు ముందే బెదిరింపులు రావడంతో భద్రతా తనిఖీల కోసం ఐసోలేషన్ బేలకు తరలించారు. ఢిల్లీకి దారి మల్లించిన ఎయిర్ ఇండియా విమానంలో 239 మంది ప్రయాణికులు, 19 మంది సిబ్బంది ఉన్నారు. ప్రయాణికులను దింపేసి.. క్షుణ్ణంగా తనిఖీ చేశామని, విమానం లోపల ఎటువంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదని పోలీసులు తెలిపారు. అక్టోబర్ 14న ముంబై నుంచి జేఎఫ్ కెనడీ విమానా శ్రమయానికి వెళ్తున్న ఏఐ 119 విమానానికి నిర్దిష్ట భద్రతా హెచ్చరికలు అందాయని, ప్రభుత్వ భద్రతా నియంత్రణ కమిటీ సూచనల మేరకు ఢిల్లీకి మళ్లించామని ఎయి రిండియా ఒక ప్రకటనలో తెలిపింది. -
ఇండిగో సేవల్లో అంతరాయం.. ప్రయాణికుల పాట్లు!
IndiGo Outage: ప్రముఖ ఎయిర్‌లైన్ సంస్థ ఇండిగో సేవల్లో అంతరాయం ఏర్పడింది. శనివారం మధ్యాహ్నం నుంచి తలెత్తిన సాంకేతిక లోపంతో దేశవ్యాప్తంగా విమానాశ్రయాలలో విమాన కార్యకలాపాలు, గ్రౌండ్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది.చెక్-ఇన్లు నెమ్మదిగా సాగడంతో ప్రయాణికులు చాలా సేపు వేచిఉండాల్సి వచ్చింది. ప్రయాణికుల భారీ క్యూలతో ఎయిర్పోర్ట్ ప్రాంగణాలు కిక్కిరిశాయి. దీంతో కొన్ని చోట్ల సిబ్బంది బోర్డింగ్ పాసులను చేత్తో రాసిస్తున్నారు. ఇండిగో సిస్టమ్‌లో తలెత్తిన లోపం కారణంగా టిక్కెట్లు బుక్ చేసుకోలేకపోతున్నామంటూ కొందరు ప్రయాణికులు వాపోయారు. తమకు ఎదురైన ఇబ్బందులను బాధిత ప్రయాణికులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. ‘ఎక్స్’లో దీనికి సంబంధించిన పోస్టులు వెల్లువెత్తాయి.అంతరాయంపై ఇండిగో స్పందించింది. కొనసాగుతున్న సిస్టమ్ అంతరాయం కారణంగా ప్రభావితమైన కస్టమర్లకు సాధ్యమైనంత మెరుగైన సహాయం, మద్దతును అందించడానికి తమ సిబ్బంది అవిశ్రాంతంగా కృషి చేస్తున్నట్లు ‘ఎక్స్’లో వివరించింది. #6ETravelAdvisory : We want to assure you that our dedicated airport teams are working relentlessly to provide the best possible assistance and support to customers affected by the ongoing system outage. (1/2)— IndiGo (@IndiGo6E) October 5, 2024 -
నేటి నుంచి ముంబై–విజయవాడకు ఇండిగో సర్వీస్
గన్నవరం: వాణిజ్య రాజధాని ముంబై నుంచి గన్నవరం విమానాశ్రయానికి ఇండిగో విమాన సంస్థ శుక్రవారం నుంచి నూతన సర్వీస్‌ను ప్రారంభించనుంది. ఈ సర్వీస్ రోజూ సాయంత్రం 6.30 గంటలకు బయలుదేరి రాత్రి 8.20 గంటలకు ఇక్కడికి చేరుకుంటుంది. తిరిగి ఇక్కడి నుంచి రాత్రి 9 గంటలకు బయలుదేరి 11 గంటలకు ముంబై చేరుకుంటుందని ఎయిర్‌లైన్స్ వర్గాలు తెలిపాయి. ఈ సర్వీస్ వల్ల ముంబైతో పాటు గల్ఫ్, యూరప్, ఆఫ్రికా దేశాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు సులువైన కనెక్టివిటీ సదుపాయం ఉంటుందని చెప్పారు. ఇప్పటికే ముంబై–విజయవాడ మధ్య ఎయిరిండియా సర్వీస్ నడుస్తుండగా, ఇప్పుడు ఇండిగో రాకతో మరో సర్వీస్ అందుబాటులోకొచ్చినట్లయిందని ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 14 నుంచి న్యూఢిల్లీ–విజయవాడ సర్వీస్సెప్టెంబర్ 14వ తేదీ నుంచి దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి విజయవాడకు విమాన సర్వీస్‌లు ప్రారంభిస్తున్నట్లు ఇండిగో సంస్థ ప్రకటించింది. సుమారు 180 మంది ప్రయాణికుల సామర్థ్యం గల ఎయిర్‌బస్ ఎ320 విమానం రోజూ ఉదయం 8.10 గంటలకు న్యూఢిల్లీలో బయలుదేరి 10.40కి విజయవాడ చేరుకుంటుంది. తిరిగి 11.10 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.40కి న్యూఢిల్లీ చేరుకుంటుంది. ఇప్పటికే ఈ మార్గంలో ఎయిరిండియా రెండు విమాన సర్వీస్‌లను నడుపుతోంది. అయితే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఇండిగో సంస్థ ఢిల్లీ–విజయవాడ మధ్య సర్వీస్ నడిపేందుకు ముందుకొచ్చినట్టు ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. -
ఇండిగో, ముంబై ఎయిర్‌పోర్ట్‌లకు జరిమానా
ముంబై: విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు రన్‌వే పక్కనే నేలపై కూర్చుని భోజనంచేసిన ఘటనలో ఇండిగో విమానయాన సంస్థ, ముంబై ఎయిర్‌పోర్ట్‌పై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ), బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(బీసీఏఎస్) ఆగ్రహం వ్యక్తంచేసి జరిమానా విధించాయి. ప్రయాణికుల అసౌకర్యానికి కారణమైన ఇండిగో సంస్థపై రూ.1.5 కోట్ల జరిమానా, ముంబై ఎయిర్‌పోర్ట్‌పై రూ.90 లక్షల జరిమానా విధించాయి. ఒక పౌరవిమానయాన సంస్థపై ఇంతటి భారీ జరిమానా పడటం ఇటీవలికాలంలో ఇదే తొలిసారికావడం గమనార్హం. జనవరి 15వ తేదీన గోవా నుంచి బయల్దేరిన విమానం ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా పొగమంచు కారణంగా ఢిల్లీకి బదులు ముంబైలో దిగింది. చాలాసేపు విమానంలోనే వేచి ఉన్న ప్రయాణికులు విసిగిపోయి కిందకు దిగొచ్చి రన్‌వే పక్కనే కూర్చుని భోజనాలు చేశారు. ఈ ఘటనను పౌరవిమానయాన శాఖ సీరియస్‌గా తీసుకుంది. బీసీఏఎస్ అడిగేదాకా ఈ విషయంలో ఇండిగో వివరణ ఇవ్వకపోవడం గమనార్హం. రన్‌వేపై ప్రయాణికుల కదలికలను నియంత్రించకుండా ముంబై ఎయిర్పోర్ట్ సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం వహించారని డీజీసీఏ ఆక్షేపించింది. -
15 నిమిషాల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య!
కర్ణాటక: అందమైన బీచ్‌లు, దేవస్థానాలతో ప్రశాంతంగా ఉండే ఉడుపి నగరంలో ఘోరం చోటుచేసుకుంది, ఆదివారం ఉదయం ఒకే కుటుంబానికి చెందిన నలుగురు హత్యకు గురయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి, ఇంటి యజమాని నూర్ మహమ్మద్ దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అతని భార్య హసీనా (45), కూతుళ్లు అఫ్నాన్ (23), ఆజ్నాన్ (21), కొడుకు అసీమ్ (14) ఉడుపిలో తృప్తినగరలో నివాసం ఉంటున్నారు. వీరి పెద్ద కొడుకు అసాద్ బెంగళూరులో ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో, అలాగే అఫ్నాన్ బెంగళూరులో ఎయిర్‌హోస్టెస్‌గా ఉద్యోగం చేస్తున్నారు. పండుగ సెలవులు రావడంతో అఫ్నాన్ రెండు రోజుల కిందట ఉడుపిలోని ఇంటికి వచ్చింది. ఆదివారం ఉదయం 8:20 గంటల సమయంలో 45 ఏళ్ల మధ్యవయస్కుడు మూతికి మాస్క్ ధరించి సంతెకట్టెకు వచ్చాడు, అక్కడి నుంచి ఆటో ఎక్కి తనను తృప్తినగరకు తీసుకెళ్లాలని ఆటోడ్రైవర్ శ్యామ్‌కు సూచించాడు. ఆ మేరకు అతన్ని తృప్తినగరలో దించాడు. హత్యకు గురైన తల్లి హసీనా, ఆమె పిల్లలు (ఫైల్) నలుగురిని వెంటాడి పొడిచి దుండగుడు వెంట తెచ్చుకున్న చాకుతో ఇంటిలోకి చొరబడి మారణహోమం సృష్టించాడు. ఎక్కడ ఉన్నవారిని అక్కడే పొడిచి, గొంతుకోసి హతమార్చాడు. వంట గది, బెడ్రూం, బాతురూం, హాల్లో ఒక్కొక్కరి శవాలు ఉండడమే దీనికి నిదర్శనం. హసీనా అత్తను వెంటాడగా ఆమె భయంతో బాతురూంలోకి వెళ్లి లాక్ చేసుకోవడంతో బతికి పోయింది. అసీమ్ సైకిల్ తొక్కుతూ ఇంటిలోకి వచ్చి దుండగున్ని చూసి కేకలు వేశాడు. దుండగుడు బాలున్ని హాల్లో పొడిచి చంపి పరారయ్యాడు. 15 నిమిషాల్లో దారుణం కాగా హంతకుడు 15 నిముషాలలో పని ముగించుకొని మళ్లీ ఎవరో బైకులో వెళ్తుంటే సంతెకట్టకు డ్రాప్ తీసుకున్నాడు. సంతెకట్ట నుంచి ఎక్కడకు వెళ్లాడో జాడ లేదు. ఈ హత్యోదంతం క్షణాల్లోనే ఉడుపి అంతటా పాకిపోయింది. వందలాదిగా అక్కడికి చేరుకున్నారు. పోలీసులు వచ్చి జాగిలాలు, వేలిముద్రల నిపుణులు ఆధారాల కోసం గాలించారు. బెంగళూరు యాసలో మాట్లాడాడు ► ఐదు పోలీసు బృందాలు మంగళూరు, శివమొగ్గ, కారవారకు వెళ్లాయి, రెండు బృందాలు ఉడుపిలో గాలిస్తున్నాయి. ► 45 ఏళ్ల వయసున్న హంతకుని సీసీ కెమెరా ఫొటోలు, వీడియోలను విడుదల చేశారు. నిందితుడు బెంగళూరు యాసలో కన్నడ మాట్లాడినట్లు ఆటో డ్రైవర్ శ్యామ్ చెప్పాడు. ► ఎయిర్ హోస్టెస్‌గా పని చేస్తున్న యువతిపై ద్వేషంతోనే హత్యాకాండకు పాల్పడి ఉండొచ్చని, లేదా పెద్ద కొడుకు పాత్ర ఉండవచ్చని అనుమానాలు ఉన్నాయి. ► పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ, ఎమ్మెల్యే తదితరులు ఘటనాస్థలిని పరిశీలించారు. ► దుబైలో ఉన్న మొహమ్మద్, బెంగళూరులో పెద్దకొడుకు అసాద్ చేరుకోగా సోమవారం సాయంత్రం కోడిబెంగ్రె జామియా మసీదులో అంత్యక్రియలను జరిపారు. -
కొచ్చి–బెంగళూరు విమానానికి బాంబు బెదిరింపు
కొచ్చి: ఇండిగో విమానయాన సంస్థకు చెందిన కొచ్చి–బెంగళూరు విమానంలో బాంబు ఉందంటూ వచ్చిన బెదిరింపు కాల్‌తో అధికారులు హైరానా పడ్డారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు బయలుదేరాల్సిన విమానంలో పూర్తి స్థాయి తనిఖీలు చేపట్టారు. ఎటువంటి బాంబు లేదని తేల్చారు. అనంతరం మధ్యాహ్నం 2.24 గంటలకు బెంగళూరుకు బయలుదేరింది. 6ఈ6482 విమానం మొత్తం 139 మంది ప్రయాణికులతో కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది. అంతలోనే, ఆ విమానంలో బాంబు ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తి ఇంటర్నెట్ ద్వారా అధికారులకు ఫోన్ కాల్ చేశాడు. దీంతో, అధికారులు వెంటనే భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. ప్రయాణికులందరినీ కిందికి దించివేశారు. వారికి చెందిన లగేజీని కూడా క్షుణ్నంగా తనిఖీ చేశారు. అనుమానాస్పద వస్తువేదీ లేదని ధ్రువీకరించుకున్నారు. అనంతరం 2.24 గంటల సమయంలో ఆ విమానం తిరిగి బెంగళూరుకు టేకాఫ్ అయ్యింది. బాంబు బెదిరింపుపై కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
కార్గిల్ యుద్ధ వీరుడికి సలాం
ఇండిగో ఎయిర్‌లైన్స్ పుణె ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్న మేజర్ సంజయ్ కుమార్‌ను ఇండిగో సిబ్బంది సత్కరించారు. కార్గిల్ యుద్ధవీరుడు, పరమవీర చక్ర పురస్కార గ్రహీత సంజయ్ కుమార్‌ను ప్రయాణికులకు పరిచయం చేసి ఆనాటి యుద్ధంలో ఆయన సాహసాలను గురించి చెప్పారు ఎయిర్‌లైన్స్ పైలట్. సంజయ్ కుమార్‌ని ప్రయాణికులు ప్రశంసల్లో ముంచెత్తారు. దీనితాలూకు దృశ్యాలు నెటిజనులను ఆకట్టుకున్నాయి. -
ఆకాశంలో పుట్టినరోజు వేడుకలు.. చిన్నారికి ఇండిగో ఎయిర్‌లైన్స్ సర్ప్రైజ్ గిఫ్ట్..
పుట్టినరోజును ఎవరైన చాలా స్పెషల్‌గా జరుపుకోవాలనుకుంటారు. అందుకు ముందే కొత్తగా ప్లాన్ చేసుకుంటారు. అందులోనూ మొదటి బర్త్‌డే అంటే ఇక ఎప్పటికీ గుర్తుండిపోయేలా కొన్ని రోజుల ముందే ప్లాన్ చేసుకుంటారు. కానీ ఇవేం లేకుండానే ఓ చిన్నారి తన బర్త్‌డేని చాలా స్పెషల్‌గా జరుపుకుంది. ఎందుకంటే చిన్నారి పుట్టినరోజుని ఏకంగా ఇండిగో విమాన సంస్థే జరిపింది. బ్యూలా లాల్ అనే చిన్నారికి ఇండిగో విమాన సంస్థ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. జీవితాంతం గుర్తుండిపోయేలా అరుదైన జ్ఞాపకాన్ని అందించింది. చిన్నారి మొదటి పుట్టిన రోజునే విమానంలో ప్రయాణిస్తుందని తెలుసుకుని ఎయిర్‌లైన్స్ సిబ్బంది ముందస్తుగా బర్త్‌డే ప్లాన్ చేశారు. కరాచీ విమానాశ్రయానికి చిన్నారి రాగానే ఎయిర్‌లైన్స్ కెప్టెన్ మైక్ అందుకుని ఈ విషయాన్ని మైకులో అందరికీ ప్రకటించారు. చిన్నారితో కేక్ కట్ చేయించారు. విమాన ప్రయాణీకులందరూ చిన్నారి పుట్టిన రోజు వేడుకలో పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలిపారు. View this post on Instagram A post shared by JOEL LAL J (@joellalj) ఈ వీడియోను చిన్నారి తండ్రి జోయెల్ లాల్ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. నెటిజన్లు తెగ కామెంట్లు చేశారు. చాలా మంచి అవకాశం అని స్పందించారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బందిపై ప్రశంసలు కురిపించారు. లాంగ్ లైఫ్, హ్యాప్పీగా ఉండాలని చిన్నారి సోషల్ మీడియా వేదికగా దీవించారు. View this post on Instagram A post shared by JOEL LAL J (@joellalj) ఇదీ చదవండి: సినిమా రేంజ్లో.. దంపతుల పక్కా స్కెచ్.. టమాటా లారీ హైజాక్.. -
విమానంలో మందుబాబుల హల్చల్.. ఎయిర్‌హోస్టస్‌తో అసభ్యకరంగా..
పట్నా: భారతీయ విమానాల్లో ప్రయాణికుల అనుచిత ప్రవర్తన ఘటనలు మరువకముందే ఆదివారం మరో ఘటన చోటుచేసుకుంది. ఆదివారం ఢిల్లీ నుంచి పట్నాకు వస్తున్న ఇండిగో విమానంలో తప్పతాగిన ఇద్దరు ప్రయాణికులు ఎయిర్‌హోస్టెస్‌తో అసభ్యంగా ప్రవర్తించారని వార్తలొచ్చాయి. విమాన సిబ్బందితోపాటు తోటి ప్రయాణికులతోనూ గొడవ పడినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే, వీరు విమానంలో పట్నాకు వస్తున్నట్లు ఇండిగో సంస్థ ఫిర్యాదుచేయంతో పట్నాలో దిగగానే పట్నా ఎయిర్పోర్ట్ పోలీస్‌స్టేషన్ అధికారులు అరెస్ట్‌చేశారు. ప్రస్తుతం బిహార్‌లో మద్య నిషేధం అమల్లో ఉన్నందున మద్యసేవనం రాష్ట్రపరిధిలో నేరం. మద్యం తాగి బిహార్‌లో అడుగుపెట్టినందుకే కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. విమానంలో వీరు తోటి ప్రయాణికులతో అనుచితంగా ప్రవర్తించినట్లు అధికారంగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఎవరైనా ఫిర్యాదు చేసే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇండియన్ ఎయిర్‌లైన్స్‌పై డీజీసీఏ సీరియస్ న్యూఢిల్లీ: పారిస్–న్యూఢిల్లీ ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణికుల అనుచిత ప్రవర్తనపై వివరణ ఇవ్వాలని సంస్థను డీజీసీఏ సోమవారం ఆదేశించింది. గత ఏడాది డిసెంబర్ ఆరున జరిగిన రెండు ఘటనలను అందులో ప్రస్తావించింది. సిబ్బంది సూచనలను లెక్కచేయకుండా బాత్రూమ్లో ధూమపానం చేస్తున్న వ్యక్తిపై, తోటి ప్రయాణికురాలి సీటు, దుప్పటిపై మూత్రవిసర్జన చేసిన మరో తాగుబోతు ప్రయాణికుడిపై అప్పుడే వెంటనే ఎందుకు చర్యలు తీసుకోలేదో తెలపాలని డీజీసీఏ సూచించింది. ‘ ఏదైనా విమానంలో అనుకోని ఘటన జరిగితే ల్యాండింగ్ జరిగిన 12 గంటల్లోపు మాకు నివేదించాలి. కానీ డిసెంబర్ ఆరున ఘటన జరిగితే జనవరి ఆరున మేం అడిగేదాకా ఆనాటి ఘటనపై సంస్థ ఎలాంటి రిపోర్ట్చేయలేదు. అనుచితంగా ప్రవర్తించే ప్రయాణికుల విషయంలో మీ వైఖరి నిబంధనలకు అనుగుణంగా లేదు. రెండు వారాల్లోపు నివేదించండి. తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని డీజీసీఏ పేర్కొంది. -
IndiGo Special offer: రూ.2వేలకే విమాన టికెట్!!
గురుగ్రామ్: ఇండిగో ఎయిర్‌లైన్స్.. మూడురోజుల వింటర్ సేల్ పేరుతో ప్రత్యేక ఆఫర్‌ను ప్రయాణికులకు అందించబోతోంది. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై తగ్గింపు ధరకు టికెట్లు అందించనున్నట్లు ప్రకటించింది. దేశీయ ప్రయాణానికి రూ.2,023, అంతర్జాతీయ ప్రయాణాలకు రూ.4,999 నుంచి ప్రారంభ టికెట్ల ధరగా నిర్ణయించింది. 2023 జనవరి 15 నుంచి ఏప్రిల్ 14 మధ్య ప్రయాణానికి సంబంధించిన టికెట్లకు, అదీ టికెట్లు అందుబాటులో ఉన్నంతవరకు మాత్రమే ఈ వింటర్ సేల్ ఆఫర్ వర్తిస్తుందని ఇండిగో స్పష్టం చేసింది. టికెట్లు నాన్ స్టాప్ విమానాల మీదే మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందని తెలిపింది. ఏ ఆఫర్లు, ప్రమోషన్స్, స్కీమ్స్.. వీటికి వర్తించవు. భారతీయులు హెచ్ఎస్బీసీ కస్టమర్లైతే.. అదనంగా క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ఇండిగోకు మొత్తం 290 విమానాలు ఉండగా.. రోజుకు 1600 విమాన సర్వీసులను నడుపుతుండగా.. ఇందులో 76 దేశీయ, 26 అంతర్జాతీయ గమ్యస్థానాలు ఉన్నాయి. విమానయాన రంగం మునుపటి కంటే పుంజుకుందని, దీన్ని సెలబ్రేట్ చేసుకోవడంలో భాగంగా ఈ ఆఫర్‌ను తీసుకొచ్చినట్లు ఇండిగో గ్లోబల్ సేల్స్ హెడ్ వినయ్ మల్హోత్రా తెలిపారు. -
ఇండిగో ఎయిర్ లైన్స్ పై నటుడు దగ్గుబాటి రానా ఆగ్రహం
-
ప్రాంతీయ భాషల వారిని నియమించండి
సాక్షి, హైదరాబాద్: దేశీయ విమాన సర్వీసుల నిర్వహణలో ఇండిగో విమానంలో ప్రాంతీయ భాషలైనా తెలుగు, తమిళ, కన్నడ వచ్చిన ఎయిర్‌హోస్టెస్‌లను నియమించుకోవాలని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సంబంధిత విమాన సంస్థకు ట్విట్టర్ ద్వారా సూచించారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఇండిగో విమానంలో వస్తున్న సమయంలో ఓ ప్రయాణికురాలు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ఉన్న సీట్లో కూర్చున్నారు. ఆ సీట్లలో కూర్చున్న వారికి ప్రత్యేకంగా కొన్ని సూచనలు, సలహాలు ఇస్తారు. ఆ సమయంలో సంబంధిత ప్రయాణికురాలికి ఎయిర్‌హోస్టెస్ సూచించిన అంశాలు ఇంగ్లిష్‌లో ఉండటంతో సీటు మార్చాలని విజ్ఞప్తి చేసింది. ఈ అంశంపై దేవాస్మిత చక్రవర్తి అనే ప్రయాణికురాలు ట్వీట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో రాకపోకలు సాగిస్తున్న విమానాల్లో తెలుగు భాష వచ్చిన ఎయిర్‌హోస్టెస్ నియమించేలా చూడాలని, దీనివల్ల భద్రతా సంబంధిత సూచనలు తేలికగా తెలుగు మాత్రమే వచ్చిన వారికి అర్థమవుతుందని, ఇంగ్లిష్, హిందీ మాత్రమే వచ్చిన వారినే నియమించడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయనిఆ ట్వీట్లో తెలిపింది. ఈ ట్వీట్‌కు స్పందించిన మంత్రి కేటీఆర్ స్థానిక భాషల్లోనూ సూచనలు అందించేలా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా స్థానిక భాషలు వచ్చిన సిబ్బందిని నియమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
దివ్యాంగ బాలుడి కేసులో... ఇండిగోకు రూ.5 లక్షల ఫైన్
న్యూఢ్లిల్లీ: మానసిక వైకల్యమున్న బాలుడిని విమానం ఎక్కకుండా అడ్డుకున్నందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్ మీద డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సీరియస్ అయింది. విమానయాన నిబంధనల్ని ఉల్లంఘించిందంటూ శనివారం రూ.5 లక్షల జరిమానా విధించింది. ఈ నెల 7న రాంచీ విమానాశ్రయంలో తల్లిదండ్రులతో పాటు హైదరాబాద్ విమానం ఎక్కబోతుండగా సదరు బాలున్ని సిబ్బంది అడ్డుకోవడం, అది వివాదానికి దారి తీయడం తెలిసిందే. ఆ సమయంలో బాలుడు ఎవరి మాటా వినకుండా ఉన్మాదంగా ప్రవర్తించాడన్న ఇండిగో వాదనను డీజీసీఏ తోసిపుచ్చింది. -
తోటివారే! తక్కువ చేయకండి!
మనం పెట్టుకున్న నిబంధనలకైనా మానవీయ కోణం తప్పనిసరి. వినియోగదారులను దేవుళ్ళుగా భావించాల్సిన సేవల రంగం సహా అనేక చోట్ల అది మరీ ముఖ్యం. తద్విరుద్ధంగా రాంచీ విమానాశ్రయంలో ప్రైవేట్ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బంది ఒక దివ్యాంగ టీనేజ్ కుర్రాడి విషయంలో ఇటీవల వ్యవహరించిన తీరు నివ్వెరపరిచింది. ‘తోటి ప్రయాణికుల భద్రతకు భంగకరం’ అనే సాకుతో, హైదరాబాద్‌కు రావాల్సిన ఆ వీల్‌ఛెయిర్ కుర్రాడినీ, అతని తల్లి తండ్రులనూ విమానం ఎక్కనివ్వకుండా ఇండిగో సిబ్బంది చూపిన అమానుషత్వం తీవ్ర విమర్శల పాలైంది. మన దేశంలో దివ్యాంగుల పట్ల సరైన రీతిలో సున్నితంగా స్పందిస్తున్నామా? వారినీ సమాజంలో ఓ భాగంగా కలుపుకొని పోతున్నామా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలను లేవనెత్తింది. తోటి ప్రయాణికులు సైతం అభ్యర్థిస్తున్నప్పటికీ, అవసరమైతే తామున్నామని ప్రయాణికుల్లోని డాక్టర్లు చెప్పినప్పటికీ ఆ ప్రైవేట్ విమానయాన సిబ్బంది పెడచెవినపెట్టడం పరాకాష్ఠ. సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అయిన ఆ సంఘటనపై చివరకు పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందించి చర్యలకు ఆదేశించాల్సి వచ్చింది. ‘డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్’ (డీజీసీఏ) సమగ్ర విచారణకు దిగింది. సదరు ప్రైవేట్ విమాన సంస్థ అధిపతులు ‘ఆ క్లిష్ట పరిస్థితుల్లో తమది మంచి నిర్ణయమే’ అని సన్నాయి నొక్కులు నొక్కుతూనే, క్షమాపణ చెప్పారు. ఆ దివ్యాంగుడికి ఎలక్ట్రిక్ వీల్‌ఛైర్ ఇస్తామన్నారు. కొంతకాలంగా ఇలాంటి సంఘటనలు పదే పదే జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతిసారీ మీడియాలో వివాదం రేగడం, పౌర విమానయాన శాఖ రంగంలోకి దిగి నష్టనివారణ చర్యలు చేపట్టడం మామూలైంది. మానవీయత పరిమళించాల్సిన ఆధునిక సమాజంలో ఇవాళ్టికీ ఇలాంటి దుర్విచక్షణ కొనసాగడం విచారకరం. నిజానికి, దివ్యాంగుల పట్ల డీజీసీఏ నియమావళి కూడా ఇక్ష్వాకుల కాలం నాటిది. మారిన కాలంతో పాటు కొత్తగా వచ్చిన సమస్యలు, సవాళ్ళకు తగ్గట్టుగా దాన్ని మార్చుకోవాల్సి ఉంది. ప్రవర్తన అదుపులో లేని ప్రయాణికుల గురించి నివేదించమనీ, ప్రమాదకరమైన అలాంటి వ్యక్తులను విమానంలోకి ఎక్కనివ్వవద్దనీ నియమావళిలో ఉండవచ్చు గాక. దాన్ని అడ్డం పెట్టుకొని, అభం శుభం తెలియని దివ్యాంగుడి ప్రయాణం నిరాకరించడం మానవత్వం అనిపించుకోదు. గడచిన కొన్ని దశాబ్దాలుగా దేశీయ, విదేశీ విమానాశ్రయాలు, అలాగే ప్రైవేట్ విమానయాన సంస్థలు బాగా పెరిగాయి. ఫలితంగా, ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు విమానయానం పలువురికి అనువుగా మారింది. అందుబాటులోకి వచ్చింది. అలాగే, ప్రత్యేక అవసరాలుండే దివ్యాంగుల విభాగంలోని ప్రయాణికుల సంఖ్యా పెరిగింది. కానీ, వారు సౌకర్యవంతంగా ప్రయాణించేలా తగిన వసతులు కల్పించడం, సేవలు అందించడం కరవైంది. విమానయాన టికెట్లు బుక్ చేసుకుంటున్న ప్పుడు దివ్యాంగులకు లభించే సేవలపై స్పష్టత పూజ్యం. విమానాశ్రయాల్లో, చెక్–ఇన్ సందర్భాల్లో, బోర్డింగ్ నియమాల్లో, విమానాల్లో ఆతిథ్యంలో వారి ప్రత్యేక అవసరాలకు తగ్గట్టు వసతులూ అంతంత మాత్రం. రైళ్ళలోనూ, ప్రభుత్వ రవాణా సదుపాయాల్లోనూ ఇదే పరిస్థితి. 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో 2.68 కోట్ల మంది దివ్యాంగులున్నారు. వారిలో 20 శాతం మంది కదలడంలో, ప్రయాణంలో సమస్యలున్నవారే. ప్రయాణ సౌకర్యాలు, బహిరంగ ప్రదేశాలను వారికి కూడా సౌకర్యంగా ఉండేలా మార్చాలని 2015లోనే ప్రభుత్వం ‘యాక్సెసిబుల్ ఇండియా’ పేరిట కార్యక్రమం చేపట్టింది. కానీ, ఆ లక్ష్యాలను ఇప్పటికీ అందుకోలేదన్నది చేదు నిజం. పౌర భవనాలన్నిటినీ దివ్యాంగులకు అనుకూలంగా ఉండేలా చూడాలని 2017లోనే సుప్రీమ్ కోర్ట్ ఆదేశించింది. ఇవాళ్టికీ అది అమలైంది చాలా కొద్దిగానే! అందుకే, మన తోటివారైన దివ్యాంగుల పట్ల కనీసపు అక్కర, వారి సమస్యలను అర్థం చేసుకొనే సహృదయం పని ప్రదేశాల్లో, ప్రయాణ వసతుల్లో లోపిస్తోందనడానికి తాజా ఇండిగో ఘటన ఓ మచ్చుతునక మాత్రమే. విమానాల్లోనే కాదు... రైళ్ళు, బస్సులు, వినోదశాలలు, చివరకు విద్యాల యాలు, కార్యాలయాల్లో కూడా వారి శారీరక, మానసిక ప్రత్యేకతల రీత్యా ఏర్పాట్లు చేయడం కీలకం కాదా? ఆ మాత్రం చేయడం కనీస మానవ ధర్మం, వ్యవస్థపై ఉన్న బాధ్యత కావా? ఆ మధ్య సినీ నటి – దివ్యాంగ నర్తకి సుధా చంద్రన్ కృత్రిమ పాదం పట్ల విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది నుంచి అవమానం ఎదురైంది. నెల రోజుల క్రితమే రెండు బ్యాటరీలతో నడిచేదే తప్ప నాలుగు బ్యాటరీలతో నడిచే వీల్‌ఛైర్‌ను అనుమతించబోమంటూ ఓ దివ్యాంగ ప్రొఫెసర్‌ను ఎయిర్‌పోర్ట్‌లో నిర్దాక్షిణ్యంగా ఆపేశారు. ఇలాంటి ఉదాహరణలెన్నో. ఇలాంటి ఘటనలు పునరా వృతం కాకుండా చర్యలు చేపట్టడం ప్రభుత్వ బాధ్యత. తప్పు చేసిన సంస్థలకు భారీ జరిమానాలు విధించాలి. అయితే, ప్రభుత్వ విధానాలు, ఆదేశాలతో పాటు సామాజిక ఆలోచనలో మార్పు మరీ కీలకం. బౌద్ధిక, గ్రహణ సామర్థ్యాల విషయంలో కొందరిలో ఉండే ఇబ్బందుల పట్ల ప్రభుత్వం, సంస్థలు సహానుభూతితో వ్యవహరించే సంస్కారం కావాలి. దివ్యాంగులూ మన లాంటి మనుషులే నన్న భావంతో, మానవీయంగా వ్యవహరించేలా చైతన్యం తేవాలి. అన్నిటికన్నా ముందుగా... ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది మనమే! విమానాల్లో పక్షులు, జంతువులకు కూడా తగిన చోటిచ్చే మనం, మన వ్యవస్థ మన సోదర దివ్యాంగుల్ని లోకువగా చూడడమేంటి? -
ఇండిగో ఘటనపై కేంద్రమంత్రి ఆగ్రహం.. స్వయంగా దర్యాప్తు చేస్తానని ట్వీట్
సాక్షి, న్యూఢిల్లీ: దివ్యాంగ చిన్నారిని ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం ఎక్కనివ్వని ఘటనపై కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి ప్రవర్తనను ఎన్నటికీ సహించేది లేదని స్పష్టంచేశారు. ఏ వ్యక్తీకి ఇలాంటి అనుభవం కాకూడదని.. ఘటనపై స్వయంగా తానే దర్యాప్తు చేపడతానని ట్విటర్ వేదికగా తెలిపారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈమేరకు ఇండిగోను హెచ్చరిస్తూ ఆయన ట్వీట్ చేశారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే డీజీసీఏ దర్యాప్తు ప్రారంభించిందని, ఇండిగో సంస్థ నుంచి నివేదిక కోరిందని అధికార వర్గాలు వెల్లడించాయి. చదవండి👉 చిరుతతో పోరాటం.. అధికారులపై దాడి.. వైరల్ వీడియో There is zero tolerance towards such behaviour. No human being should have to go through this! Investigating the matter by myself, post which appropriate action will be taken. https://t.co/GJkeQcQ9iW — Jyotiraditya M. Scindia (@JM_Scindia) May 9, 2022 ఏం జరిగింది? హైదరాబాద్ వెళ్లేందుకు గత శనివారం దివ్యాంగ చిన్నారితో కలిసి ఓ కుటుంబం రాంచీ విమానాశ్రయానికి వచ్చింది. అయితే ఆ బాలుడు విమానం ఎక్కేందుకు ఇండిగో సిబ్బంది నిరాకరించారు. చిన్నారి భయాందోళనతో ఉన్నాడని.. దాని వల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందనే కారణంతో ఫ్లైట్ ఎక్కనివ్వలేదు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు కూడా ప్రయాణాన్ని విరమించుకున్నారు. ఈ ఘటన గురించి మనీషా గుప్తా అనే తోటి ప్రయాణికురాలు తన ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేశారు. చిన్నారిని అడ్డుకున్న ఇండిగో సిబ్బంది అతడి తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగారని పేర్కొన్నారు. ఇది సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇండిగో ఏమంటోంది? రాంచి ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఘటనపై ఇండిగో సంస్థ వివరణ ఇచ్చింది. భయంతో ఉన్న ఆ చిన్నారి స్థిమిమితపడితే విమానం ఎక్కించడానికి చివరి నిమిషం వరకూ గ్రౌండ్ సిబ్బంది వేచి చూశారని.. కానీ ఫలితం లేకపోయిందని తెలిపింది. ఆ కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా.. ఓ హోటల్లో వసతి సౌకర్యం కల్పించామని.. ఆదివారం ఉదయం వారు మరో విమానంలో గమ్యస్థానానికి చేరుకున్నారని వివరించింది. చదవండి👉🏻 రాష్ట్రపతి ఎన్నికల్లో తగ్గనున్న.. ఎంపీల ఓటు విలువ -
కడప నుంచి ఇండిగో విమాన సర్వీసులు
సాక్షి, అమరావతి: కడప నుంచి విజయవాడ, చెన్నైలకు ఇండిగో విమాన సర్వీసులు నడిపేందుకు ఆ సంస్థ ఏపీ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీడీసీఎల్)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటివరకు ఈ మార్గాల్లో విమానాలు నడిపిన ట్రూజెట్ సంస్థ తాము సర్వీసులు నడపలేమని ఒప్పదం రద్దుచేసుకోవడంతో ఇండిగోకు అవకాశం కల్పించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థకు వయబిలిటీ గ్యాప్ ఫండ్ (వీజీఎఫ్) కింద రూ.20 కోట్లు చెల్లించనుంది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇండిగో సంస్థ మార్చి 27 నుంచి వారానికి నాలుగు విమానాలను చెన్నై–కడప, విజయవాడ–కడప మధ్య నడపనుంది. -
కస్టమర్ కోరిన చోటుకే లగేజీ డెలివరీ...!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన సంస్థ ఇండిగో.. డోర్ టు డోర్ బ్యాగేజ్ డెలివరీ సేవలను ప్రారంభించింది. ప్రయాణికుల లగేజీని ఇంటి నుంచి విమానాశ్రయానికి, అలాగే విమానాశ్రయం నుంచి కస్టమర్ కోరిన చోటకు చేరుస్తారు. 6ఈబ్యాగ్పోర్ట్ పేరుతో ఈ సేవలను కార్టర్‌పోర్టర్ అనే కంపెనీ సహాయంతో ఢిల్లీ, హైదరాబాద్‌లో ఇండిగో అందుబాటులోకి తెచ్చింది. ముంబై, బెంగళూరుకూ ఈ సేవలను విస్తరించనున్నారు. ఒకవైపుకు చార్జీ రూ.630తో మొదలు. కస్టమర్‌కు చెందిన లగేజీని పూర్తిగా ట్రాక్ చేస్తారు. విమానం బయల్దేరడానికి 24 గంటల ముందు బుక్ చేయాల్సి ఉంటుంది. విమానం దిగిన ప్రయాణికులకు వెంటనే ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. బెంగళూరుకు చెందిన కార్టర్‌పోర్టర్ ఆన్ డిమాండ్ బ్యాగేజ్ డెలివరీ సేవలను విస్తారా, ఎయిర్ ఏషియాకు సైతం అందిస్తోంది. చదవండి: కర్నూలు ‘ఉయ్యాలవాడ’ ఎయిర్‌పోర్టులో ప్రారంభమైన విమానాల రాకపోకలు -
మేకలు అమ్మిన వ్యక్తి ఎట్టకేలకు ఇంటికి!
ముంబై : తమ సొంత ఊరికి వెళ్లేందుకు మేకలు అమ్ముకున్న వలస కార్మికునితోపాటు మరో ఇద్దరు వ్యక్తులను ఉచితంగా సొంతింటికి చేర్చేందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్ అంగీకరించింది. వివరాలు.. లాక్డౌన్ కారణంగా అనేక మంది వలస జీవులు వేరే రాష్ట్రాలలో ఇరుక్కుపోయారు. ఇటీవల లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా కేంద్రం దేశీయ విమానాలు నడుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముంబైలో చిక్కుకున్న కొంతమంది వలస కార్మికులు తమ సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్‌కు వెళ్లేందుకు సిద్ధపడ్డారు. (కేరళను ‘సూపర్ స్ప్రెడర్’ గా మారుస్తారా?) అయితే వీరికి మార్చి నెల నుంచి ఎలాంటి ఆదాయం లేకపోవడంతో విమాన టికెట్ల కోసం నానా తంటాలు పడి రూ.30,600లు సేకరించారు. వీరిలో ఒకరికి డబ్బులు కుదరకపోవడంతో తాను పెంచుకుంటున్న మూడు మేకలను అమ్ముకుని విమానం టికెట్టు కొనుగోలు చేశాడు. కాగా కొన్ని కారణాల వల్ల ఆ విమానం రద్దు అయింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మే 28 వరకు విమానయాన సేవలపై ఆంక్షలు విధించడంతో ఈ విమానాన్ని రద్దు చేసినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ట్విటర్ పోస్టులో తెలిపారు. తాజాగా మేకలు అమ్ముకున్న వ్యక్తిని పశ్చిమ బెంగాల్ పంపించేందుకు ఇండిగో అంగీకరించింది. కోల్‌కతాకు తిరిగి ప్రయాణించలేని ముగ్గురు ప్రయాణీకులకు తాము వసతి కల్పించామని ఇండిగో ట్వీట్ చేసింది. అయితే ఇప్పుడు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా జూన్ 1నుంచి వలస కార్మికుల కోసం టికెట్ల బుకింగ్ తెరిచినట్లు ఇండిగో తెలిపింది. (అందంగా ఉండొద్దు, గుండు చేయించుకో) -
ఇంజిన్‌లో లోపం.. వెనక్కి మళ్లిన విమానం
ముంబై: ముంబై–హైదరాబాద్ విమానం ఇంజిన్‌లో లోపం రావడంతో తిరిగి వెనక్కి రావాల్సి వచ్చింది. ముంబై విమానాశ్రయం నుంచి గురువారం వేకువజామున ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ప్రయాణీకులతో హైదరాబాద్‌కు బయలుదేరింది. కొద్దిసేపటికే ఒక ఇంజిన్ పనిచేయని విషయం పైలెట్ గమనించి, అప్రమత్తమయ్యాడు. అధికారుల ఆదేశాల మేరకు తిరిగి విమానాన్ని అదే విమానాశ్రయంలో సురక్షితంగా దించాడు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపా రు. వారిని వేరే విమానాల్లో గమ్యస్థానాలకు పంపించినట్లు వెల్లడించారు. -
180 మంది ప్రయాణీకులతో సేఫ్ ల్యాండింగ్..
కోల్‌కతా : 180 మంది ప్రయాణీకులతో సిలిగురి నుంచి కోల్‌కతా బయలుదేరిన ఇండిగో విమానం సాంకేతిక సమస్యలతో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సిలిగురిలోని బదోగ్రా ఎయిర్‌పోర్ట్‌కు తిరిగి చేరుకుంది. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు టేకాఫ్ తీసుకున్న విమానం ఇంజన్లో సమస్యలు తలెత్తడంతో కొద్దిసేపటికే వెనుదిరిగి సురక్షితంగా ల్యాండ్ అయింది. ఎయిర్‌బస్ ఏ 320 నియోలో తరచూ ఇంజన్లో సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ సమస్యతో ఇదే ఇంజన్‌ను వాడుతున్న పలు ఇండిగో విమానాలు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవడం పరిపాటిగా మారింది. దీంతో వచ్చే ఏడాది జనవరి 31 నాటికి తన ఎయిర్‌బస్ ఏ 320 నియో విమానాల ఇంజన్లను సవరించాలని పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) ఇండిగోను ఆదేశించింది. -
ఇండిగో విమాన సేవల్లో జాప్యం
సాక్షి, న్యూఢిల్లీ : తమ నెట్‌వర్క్‌లో సిస్టమ్స్ డౌన్ కావడంతో విమానాల రాకపోకల్లో జాప్యం నెలకొంటుందని ఇండిగో ఎయిర్‌లైన్స్ పేర్కొంది. పలు విమానాశ్రయాల్లో సాంకేతిక సమస్యలతో తమ ఆపరేషన్స్‌లో ఆలస్యం జరగవచ్చని త్వరలోనే సమస్యను అధిగమించేందుకు చర్యలు చేపడుతున్నామని ఇండిగో ఓ ప్రకటనలో పేర్కొంది. తమ ప్రయాణీకులకు తలెత్తిన అసౌకర్యం పట్ల చింతిస్తున్నారు. ప్రయాణీకులు సంస్థ సోషల్ మీడియా వేదికలపై తమ కస్టమర్ కేర్ సిబ్బందిని సంప్రదించి అవసరమైన సమాచారం పొందవచ్చని పేర్కొంది. ముంబైలో ఇప్పటికి తొమ్మిది విమానాల ఆపరేషన్స్‌లో జాప్యం నెలకొందని తెలిపింది. ఈ రోజంతా సర్వర్ డౌన్ కారణంగా మరింత జాప్యం చోటుచేసుకోవచ్చని ప్రయాణీకులు గమనించాలని కోరింది. -
ఎయిర్‌హోస్టెస్ చెవి కట్ చేశాడు..
సాక్షి, బెంగళూరు: ప్రేమకు నిరాకరించిందని, తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందన్న పగతో ఓ రౌడీషీటర్, ఎయిర్‌హోస్టెస్‌పై దాడి చేసి చెవిని కత్తిరించిన ఘటన ఐటీ సిటీలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటనపై కొడిగెహళ్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కాగా రౌడీషీటర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుడు జాలహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో రౌడీషీటర్ అజయ్ అలియాస్ జాకీ. ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో పనిచేసే ఓ ఎయిర్‌హోస్టెస్ బాధితురాలు. మే 12 తేదీన హెబ్బాల వద్ద క్యాబ్‌లో ఈ దురాగతానికి uమొదటిపేజీ తరువాయి పాల్పడ్డాడు. ప్రేమించాలని వేధింపులు ఎయిర్హొస్టెస్ను ఫిబ్రవరి నుంచి ప్రేమించాలని రౌడీషీటర్ అజయ్ వెంటబడి వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆమె ఇంట్లో తెలిపింది. కుటుంబసభ్యులు రౌడీషీటర్ అజయ్‌ను హెచ్చరించడంతో కోపోద్రిక్తుడైన జాకీ ఎయిర్‌హొస్టెస్ ఇంటిముందు వీరంగం సృష్టించాడు. వారి కారు అద్దాలు, బైక్‌ను ధ్వంసం చేశాడు. ఈ ఘటనతో రౌడీషీటర్ అజయ్‌పై జాలహళ్లి పోలీస్‌స్టేషన్‌లో ఆమె కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు జాకీని పిలిచి హెచ్చరించారు. అప్పటి నుంచి ఎయిర్‌హోస్టెస్‌పై మరింత కసి పెంచుకున్నాడు. కారులో చొరబడి దాడి ఈ నెల 12 తేదీన ఎయిర్‌హోస్టెస్ కెంపేగౌడ విమానాశ్రయానికి క్యాబ్‌లో వెళుతుండగా, తెలుసుకున్న డీషీటర్ జాకీ హెబ్బాల వద్ద కారును అటకాయించాడు. డ్రైవరును బెదిరించి కారులో ఎక్కి కారును పోనివ్వాలని హెచ్చరించాడు, డ్రైవర్ నిరాకరించడంతో చాకుతో భుజంపై పొడిచాడు. తరువాత తనపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని ఎయిర్‌హోస్టెస్‌ను జాకీ బెదిరించగా, ఆమె తిరస్కరించింది. కోపోద్రిక్తుడైన దుండగుడు ఆమె చెవిని చాకుతో కత్తిరించి ఉడాయించాడు. దాడిలో గాయపడిన బాధితురాలు ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన పై కొడిగేహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న రౌడీషీటర్ కోసం గాలిస్తున్నారు. -
విమానంలో దుశ్చర్య : ప్రయాణికుడి అరెస్ట్
ముంబై : విమాన టాయ్లెట్లో పొగతాగిన ప్రయాణికుడిని అధికారులు పోలీసులకు అప్పగించారు. ఈనెల 25న అహ్మదాబాద్ నుంచి గోవాకు ఇండిగో విమానంలో వెళుతున్న ప్రయాణికుడు విమానంలోని టాయ్లెట్లో సిగరెట్ తాగుతూ సిబ్బందికి పట్టుబట్టారు. నిబంధనలను ఉల్లంఘించి విమానంలో పొగతాగుతున్న ప్రయాణికుడిపై కెప్టెన్‌కు సిబ్బంది ఫిర్యాదు చేశారు. చట్టప్రకారం విమానంలో సిగరెట్ తాగడం నేరం కావడంతో విమానం గోవాలో ల్యాండవగానే స్ధానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రయాణికుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు గత వారం విమానంలో సిగరెట్ తాగేందుకు అనుమతించాలని కోరుతూ ఓ ప్రయాణికుడి వాగ్వాదానికి దిగడంతో విస్తారా ఎయిర్‌లైన్స్ విమానం గమ్యస్ధానం చేరేందుకు మూడు గంటలు జాప్యమైంది. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇండిగో ప్రయాణికుల ఆందోళన
-
వెబ్ చెకిన్ ఛార్జీలపై సమీక్ష
న్యూఢిల్లీ: విమాన ప్రయాణాలకు సంబంధించి వెబ్ చెకిన్ విధానంలో ఏ సీటు ఎంపిక చేసుకున్నా చార్జీలు వర్తిస్తాయంటూ ఇండిగో ఎయిర్‌లైన్స్ చేసిన ప్రకటన వివాదం రేపడంతో కేంద్ర పౌరవిమానయాన శాఖ (ఎంవోసీఏ) రంగంలోకి దిగింది. ఇలాంటి విధానాలు ప్రస్తుత నిబంధనలకు లోబడే ఉన్నాయా లేదా ఉల్లంఘిస్తున్నాయా అన్న అంశాన్ని సమీక్షించనున్నట్లు ట్విట్టర్లో పేర్కొంది. కొన్ని ఎయిర్‌లైన్స్ ప్రస్తుతం అన్ని సీట్లకు వెబ్ చెకిన్ చార్జీలు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ చార్జీలు అన్‌బండిల్డ్ ధర విధానం పరిధిలోకి లోబడే ఉన్నాయా లేదా అన్నది సమీక్షించనున్నామని వివరించింది. అన్‌బండిల్డ్ ధర విధానం కింద.. సీట్ల కేటాయింపు సహా వివిధ సర్వీసులకు ఎయిర్‌లైన్స్ వేర్వేరుగా చార్జీలు వసూలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. వివాదమిదీ.. విమాన ప్రయాణానికి సంబంధించి ఆన్లైన్లోనే సీటును ఎంపిక చేసుకుని, ప్రయాణ ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయడాన్ని వెబ్ చెకిన్గా వ్యవహరిస్తారు. సాధారణంగా సీటు ఎంపిక ప్రాధాన్యతలను బట్టి ఎయిర్‌లైన్స్ నిర్దిష్ట చార్జీలు వసూలు చేస్తుంటాయి. ఈ సీట్లలో కొన్ని ఉచితంగా కూడా ఉంటాయి. అయితే, ఇండిగో ఆదివారం నాడు ఇకపై అన్ని సీట్లకు చార్జీలు వర్తింపచేస్తున్నట్లు ట్విట్టర్లో పేర్కొనడం దుమారం రేపింది. దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో సోమవారం ఇండిగో మరో ప్రకటన విడుదల చేసింది. తమ విధానాల్లో మార్పులేమీ చేయలేదని, వెబ్ చెకిన్‌కి చార్జీలేమీ విధించబోవడం లేదని పేర్కొంది. ముందస్తుగా సీట్లను ఎంపిక చేసుకునే వారికి మాత్రమే ఇవి వర్తిస్తాయని వివరించింది. మార్కెట్ డిమాండ్, ప్రయాణికుల అభీష్టాన్ని బట్టి చార్జీలు ఉంటాయని ఇండిగో తెలిపింది. ప్రిఫర్డ్ సీటింగ్ చార్జీ అత్యంత తక్కువగా రూ. 100 నుంచి ఉంటుందని పేర్కొంది. ఇవి కాకుండా ఎప్పట్లాగే కొన్ని ఉచిత సీట్లు కూడా ఉంటాయని, సీటింగ్ పట్టింపు లేని వారు వీటిని ఎంపిక చేసుకోవచ్చని లేదా ఎయిర్‌పోర్ట్‌లోనైనా ఉచితంగా చెకిన్ ప్రక్రియ పూర్తి చేయొచ్చని వివరించింది. మరోవైపు ఇదే అంశంపై ట్విటర్లో ప్రయాణికుల ప్రశ్నలకు స్పందిస్తూ.. వెబ్ చెకిన్ల ద్వారా సీట్లను ముందస్తుగా కేటాయించేందుకు చార్జీలు వర్తిస్తాయంటూ స్పైస్‌జెట్ వెల్లడించింది.