బోర్డింగ్ ప్రయాణికులను అనుమతించని వైనం
శంషాబాద్: ఇండిగో ఎయిర్‌లైన్స్ వ్యవహార శైలితో శంషాబాద్ విమానాశ్రయం నుంచి శబరిమలై వెళ్లడానికి బయలుదేరిన 13 మంది ప్రయాణికులు ఆదివారం ఇబ్బందులు పడ్డారు. బోర్డింగ్ పూర్తి చేసుకున్న తర్వాత కూడా వారిని విమానంలోకి అనుమతించకపోవడంతో ఆందోళనకు ది గారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి బెంగళూరు మీదుగా కొచ్చిన్ వెళ్లాల్సిన 6ఈ(413) ఇండిగో ఎయిర్‌లైన్స్ ఆదివా రం ఉదయం 7.12కి టేకాఫ్ తీసుకోవాల్సి ఉంది.
ఉదయం 6.30కి బోర్డింగ్‌ను పూర్తి చేసుకున్న 13మంది ప్రయాణికులు విమానంలోకి వెళ్లే ప్రయత్నం చేయగా సిబ్బంది నిరాకరించారు. అప్పటికే డోర్ వేసినట్లు తెలిపారు. దీంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఆలస్యంగా బోర్డింగ్ ప్రక్రి య పూర్తి చేసుకోవడంతో అనుమతించలేదని ఎయిర్‌లైన్స్ వర్గాలు వెల్లడించాయి. ప్రయాణికులను ప్రత్యామ్నాయంగా వేరే విమానాల్లో పంపినట్లు సమాచారం. ఈ నెల 14న కూడా ఇండిగో విమాన సిబ్బం ది తీరుతో కొచ్చిన్ వెళ్లాల్సిన ప్రయాణికులు ఇలానే ఇబ్బందికి గురయ్యారు.
తీరు మారని ‘ఇండిగో’
Published Mon, Apr 18 2016 3:30 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM
Advertisement