ఇండిగో బంపర్ ఆఫర్: ఉచిత విమాన ప్రయాణం | IndiGo airlines offers free airtrip under The 6E Explorer | Sakshi
Sakshi News home page

ఇండిగో బంపర్ ఆఫర్: ఉచిత విమాన ప్రయాణం

Published Mon, Aug 8 2016 12:00 PM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM

ఇండిగో బంపర్ ఆఫర్: ఉచిత విమాన ప్రయాణం

ఇండిగో బంపర్ ఆఫర్: ఉచిత విమాన ప్రయాణం

న్యూఢిల్లీ: దేశీయ విమానయాన చరిత్రలో చెప్పుగోదగిన బంపర్ ఆఫర్ ఇది. మిమ్మల్ని ఉచితంగా విమానంలో ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాలకు తీసుకెళతారు. అక్కడ ఫుడ్డు, బెడ్డూ అన్నీ వాళ్లవే. మనం చెయ్యాల్సిందల్లా విహారాన్ని ఆస్వాదించి, ఆ అనుభవాలను పంచుకోవటమే! వారూవీరనే తేడాలేకుండా ఎవరైనాసరే ఈ ప్రయాణానికి అర్హులే. రిజిస్ట్రేషన్లకు చివరి తేది 2016, అక్టోబర్ 5. వివరాల్లోకి వెళితే..

చౌక విమానయాన సంస్థగా ప్రారంభమై, అనతికాలంలోనే సేవలను విస్తరించి ప్రయాణికుల మన్ననలు పొందిన ఇండిగో ఎయిర్ లైన్స్.. ఈ ఏడాది పదో వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది. ఈ సందర్భంగా ఆ సంస్థ తన ప్రయాణికులకు భారీ ఆఫర్ ను ప్రకటించింది. 'ది 6ఈ ఎక్స్ ప్లోరర్' పేరుతో ఎంపిక చేసిన ప్రయాణికులకు ఇండిగో విమానాల్లో ఉచితంగా విహరించే అవకాశం కల్పిస్తున్నారు. దేశంలోని 4 లేదా 5 ప్రఖ్యాత టూరిస్టు ప్రదేశాలకు తీసుకెళ్లడమే కాక, భోజనం, వసతి సౌకర్యాలు కూడా సంస్థే చూసుకుంటుంది. టూర్ లో మన అనుభవాలు, చూసిన ప్రదేశాల గురించి మనం రాసే వ్యాసాన్నిఇండిగో వెబ్ సైట్ లో ప్రచురిస్తారుకూడా!

ఆగస్టు 5 నుంచి ప్రారంభమైన రిజిస్ట్రేషన్లు అక్టోబర్ 5 వరకు కొనసాగుతాయి. ఆన్ లైన్ లో తమ పేరును రిజిస్టర్ చేసుకున్నవారికి చిన్నపాటి ఇంటర్వ్యూ నిర్వహించి, తుది జాబితా తయారుచేస్తామని ఇండిగో చైర్మన్ ఆదిద్య ఘోష్ తెలిపారు. ఎంపికైన వారిని డిసెంబర్ 31లోగా టూర్లకు తీసుకెళతామన్నారు. ఆగస్టు ప్రారంభం నాటికి ఇండిగో ఎయిర్ లైన్స్ 13.4 కోట్ల మంది ప్రయాణికులను వారివారి గమ్యస్థానాలకు చేర్చిందని, సంస్థలో మొత్తం 14 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని ఆయన వివరించారు. ఇండిగో 10వ వార్షికోత్సవం సందర్భంగా అందిస్తోన్న బంపర్ ఆఫర్ ను మీరూ అందుకోవాలంటే https://www.goindigo.in/6e-explorer కి లాగిన్ అవ్వండి. నియమనిబంధనలు చదివిన పిదప అదృష్టాన్ని పరీక్షించుకోండి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement