
ముంబై: ముంబై–హైదరాబాద్ విమానం ఇంజిన్‌లో లోపం రావడంతో తిరిగి వెనక్కి రావాల్సి వచ్చింది. ముంబై విమానాశ్రయం నుంచి గురువారం వేకువజామున ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ప్రయాణీకులతో హైదరాబాద్‌కు బయలుదేరింది. కొద్దిసేపటికే ఒక ఇంజిన్ పనిచేయని విషయం పైలెట్ గమనించి, అప్రమత్తమయ్యాడు. అధికారుల ఆదేశాల మేరకు తిరిగి విమానాన్ని అదే విమానాశ్రయంలో సురక్షితంగా దించాడు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపా రు. వారిని వేరే విమానాల్లో గమ్యస్థానాలకు పంపించినట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment