కార్తీక్ మాధవ్ భట్, ఇండిగో విమానం
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల బాంబు ఉందంటూ ఎయిర్‌లైన్స్‌ను హడలెత్తించిన ఘటనలో షాకింగ్ విషయం వెలుగుచూసింది. పనితీరు బాగా లేదని సీనియర్ ఉద్యోగులు వార్నింగ్ ఇవ్వడంతో ఎయిర్‌లైన్స్‌కు కాల్ చేసి బుద్ధి చెప్పాలనుకున్నాడట. ఈ విషయాలను నిందితుడే స్వయంగా వెల్లడించాడు.ఆ వివరాలిలా.. పుణేకు చెందిన కార్తీక్ మాధవ్ భట్(23) హాస్పిటాలిటీలో డిప్లొమా కోర్స్ పూర్తి చేశాడు. అనంతరం ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో కస్టమర్ సర్వీస్ ఆఫీసర్‌గా ఉద్యోగంలో చేరాడు.
అయితే వర్క్ బాగా చేయడం లేదని, చాలా మెరుగు పడాలని సీనియర్లు కార్తీక్‌కు ఇటీవల వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు బుద్ధిచెప్పాలని భావించినట్లు నిందితుడు తెలిపాడు. మే 2న ముంబైకి వెళ్లే ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ కాల్ చేసి కలకలం రేపాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది దాదాపు రెండు గంటలపాటు ప్రయాణికుల లగేజీతో పాటు ఎయిర్‌లైన్స్ మొత్తం తనిఖీలు చేసి ఫేక్ కాల్ అని తేల్చారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు కార్తీక్‌ను తాజాగా అరెస్ట్ చేసి విచారించగా అసలు విషయం బయటపడింది. తన పనితీరు బాగున్నా సీనియర్ ఉద్యోగులు వంకలు పెట్టారన్న కారణంగా.. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు ఫోన్‌చేసి బాంబు అని బెదిరించినట్లు నిందితుడు అంగీకరించాడు.
Comments
Please login to add a commentAdd a comment