ముంబై: దేశంలో బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపుతున్నాయి. ప్రముఖ నగరాల్లోని పాఠశాలలు, ఆసుపత్రులు, జైళ్లు, ప్రముఖులు నివాసాలు,. విమానాశ్రయాలు.. ఇలా ప్రతిచోటా బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి. తాజాగా విమానంలో కూడా బాంబు బెదిరింపులు అందాయి.
ఇండిగో విమానానికి శనివారం ఉదయం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. చెన్నై నుంచి 172 మంది ప్రయాణికులతో ముంబై వెళుతున్న 6E 5314 ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు రావడంతో.. అప్రమత్తమైన అధికారులు ముంబైలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. విమానంలో నుంచి ప్రయాణికులను ఖాళీ చేయించారు. ప్రోటోకాల్ ప్రకారం విమానాన్ని ఐసోలేషన్ బే కు తరలించి విమానాన్ని తనిఖీ చేస్తున్నారు.
‘ప్రయాణికులందరిని సురక్షితంగా విమానం నుంచి ఖాళీ చేయించాం. ప్రస్తుతం విమానం తనిఖీలో ఉంది. అన్ని భద్రతా తనిఖీలు పూర్తయిన తర్వాత, విమానం టెర్మినల్ ప్రాంతంలో తిరిగి ఉంచుతాం’ అని ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో పేర్కొంది.
కాగా వారం రోజుల వ్యవధిలో ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడం ఇదే రెండోసారి. మే 28న ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ విమానం ఉదయం 5 గంటలకు బయలుదేరాల్సి ఉండగా.. టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో బాత్రూమ్‌లో ఓ టిష్యూ పేపర్‌పై ‘బాంబు’ అని రాసి ఉండటాన్ని సిబ్బంది గుర్తించారు. వెంటనే ప్రయాణికులను అత్యవసర ద్వారం ద్వారా దించేసి.. ఎయిర్‌పోర్టు అధికారులను అప్రమత్తం చేశారు. రంగంలోకి దిగిన బాంబు స్వ్కాడ్ సిబ్బంది.. విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. నకిలీ బెదిరింపులని గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment