న్యూఢిల్లీ: ముంబై నుంచి బయలుదేరిన మూడు అంతర్జాతీయ విమానాలకు సోమవా రం బాంబు బెదిరింపులు రావడంతో భద్ర తా సంస్థలు ఉలిక్కిపడ్డాయి. ముంబై నుంచి న్యూయార్క్ వెళ్తున్న ఎయిరిండియా విమా నంతో పాటు మస్కట్ (ఒమన్), జెడ్డా (సౌదీ అరేబియా)కు వెళ్తున్న రెండు ఇండిగో విమా నాలకు కూడా బాంబు బెదిరింపులు వచ్చా యి. న్యూయార్క్ బయలుదేరని విమానాన్ని ఢిల్లీకి దారి మళ్లించారు.
ఇండిగో విమానాలకు టేకాఫ్‌కు ముందే బెదిరింపులు రావడంతో భద్రతా తనిఖీల కోసం ఐసోలేషన్ బేలకు తరలించారు. ఢిల్లీకి దారి మల్లించిన ఎయిర్ ఇండియా విమానంలో 239 మంది ప్రయాణికులు, 19 మంది సిబ్బంది ఉన్నారు. ప్రయాణికులను దింపేసి.. క్షుణ్ణంగా తనిఖీ చేశామని, విమానం లోపల ఎటువంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదని పోలీసులు తెలిపారు. అక్టోబర్ 14న ముంబై నుంచి జేఎఫ్ కెనడీ విమానా శ్రమయానికి వెళ్తున్న ఏఐ 119 విమానానికి నిర్దిష్ట భద్రతా హెచ్చరికలు అందాయని, ప్రభుత్వ భద్రతా నియంత్రణ కమిటీ సూచనల మేరకు ఢిల్లీకి మళ్లించామని ఎయి రిండియా ఒక ప్రకటనలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment