ముంబై: మహారాష్ట్రలోని ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. ఎయిర్‌పోర్టును బాంబులో పేల్చివేసేందుకు కుట్ర జరుగుతోందని గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి తెలిపాడు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసిన ఆ వ్యక్తి.. ముంబయి నుంచి అజర్‌బైజాన్‌కు వెళ్తున్న విమానంలో పేలుడు పదార్థాలు ఉన్నాయని చెప్పాడు.
దీంతో సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది వెంటనే సహార్ పోలీసులను అప్రమత్తం చేసింది. ప్రయాణికుల భద్రత కోసం.. ఎయిర్‌పోర్ట్ ఆవరణంలో పోలీసులు, అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఎటువంటి పేలుడు పదార్థాలు లభించకపోవటం గమనార్హం. మరోవైపు.. నాగ్‌పూర్-కోల్‌కతా విమానానికి సైతం బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో రాయ్‌పూర్ విమానాశ్రయంలో పైలట్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి చేశారు. ఇక.. విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment