Hoax bomb
-
ఇండిగోను వణికించిన బాంబు వార్త
సాక్షి, జైపూర్: ఇండిగో విమానానికి బాంబు బెదింరిపు కాల్ రావడం కలకలం రేపింది. జైపూర్ నుంచి ముంబైకి బయలుదేరిన ఇందిగో విమానంలో బాంబ్ ఉన్నట్టుగా గుర్తు తెలియని వ్యక్తి ద్వారా ఇండిగో కేంద్రానికి సమాచారం అందింది. అయితే భద్రతా అధికారుల పూర్తి తనిఖీ అనంతరం ఇది ఆకతాయి చర్యగా తేలడంతో ఊరట చెందారు. ఇండిగో ట్రాఫిక్ 6ఇ218 మంగళవారం ఉదయం సుమారు 5.30 నిమిషాల సమయంలో ఈ బెదిరింపు కాల్ వచ్చింది. సరిగ్గా ఆ సమయానికి విమానం మార్గం మధ్యలో ఉండటంతో ఒక్కసారిగా అధికారుల్లో ఆందోళన మొదలైంది. తక్షణమే బాంబ్ థ్రెట్ అసెస్మెంట్ కమిటీకి (బీటీసీ) కి నివేదించారు. భద్రతా అధికారులు ధృవీకరణ అంనతరం కార్యకలాపాలు సాధారణంగా తిరిగి కొనసాగిస్తున్నట్టు ఇండిగో ఒక ప్రకటనలో పేర్కొంది. -
సోషల్ మీడియా కథనాలపై నటి రాధిక
సాక్షి, చెన్నై: సోషల్ మీడియా పుణ్యామాని మంచితోపాటు.. అదే స్థాయిలో అడ్డగోలుగా ఫేక్ వార్తలు వ్యాప్తి చెందుతున్నాయి. సెలబ్రిటీలకు ఆ కథనాలు పెద్ద తలనొప్పిగా మారాయి. తాజాగా సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఆమె బ్లడ్ కాన్సర్‌తో బాధపడుతున్నారంటూ కొన్ని వెబ్ సంస్థలు ప్రచురించాయి. దీంతో ఆ వార్త వైరల్ అయ్యింది. దీనిపై ఓ అభిమాని ట్విటర్ వేదికగా రాధికను ప్రశ్నించారు. దానికి సింపుల్‌గా ఆమె ‘అది నిజం కాదు.. కల్పితం’ అంటూ సమాధానమిచ్చారు. గతేడాది రవితేజ రాజా ది గ్రేట్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఆమె.. ప్రస్తుతం తమిళం, మళయాళంలో ఒక్కో చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. Not true, some imagination. https://t.co/DN1n3cCvaB — Radikaa Sarathkumar (@realradikaa) 21 May 2018 -
హైజాక్ అన్నాడు.. ఇంక విమానం ఎక్కలేడు!
ముంబై : విమానం హైజాక్ అయిందంటూ.. తోటి ప్రయాణికులను భయబ్రాంతులకు గురి చేసిన వ్యక్తిపై జెట్ ఎయిర్వేస్ ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. గతేడాది అక్టోబర్ 30న ముంబై-ఢిల్లీ జెట్ ఎయిర్వేస్లో ముంబైకి చెందిన అభరణాల వ్యాపారి బిర్జూ కిశోర్ సల్లా ప్రయాణించాడు. ఈ సందర్భంగా అతడు భద్రత నిబంధనలు ఉల్లఘించి.. విమానం హైజాక్ అయిందంటూ తోటి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేశాడు. దీంతో జెట్ అధికారులు అతనిపై చర్యలకు ఉపక్రమించారు. విమానాల్లో దురుసుగా ప్రవర్తించే వారిపై నిషేధం విధించాలనే ఉద్దేశంతో గత ఏడాది సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం నో ఫ్లై లిస్ట్(ఎన్ఎఫ్ఎల్) నిబంధనను తీసుకొచ్చింది. ఎన్ఎఫ్ఎల్ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ జాబితాలో చేరిన తొలి వ్యక్తి సల్లానే. సల్లా విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో టాయిలెట్‌కు వెళ్లి అక్కడ ఓ కాగితాన్ని వదిలేసి వచ్చాడు. అందులో ‘విమానాన్ని హైజాక్ చేశాం. దీనిని పాక్ అక్రమిత కశ్మీర్‌కు తరలించాలి. విమానంలో 12 మంది హైజాకర్లు ఉన్నారు. మీరు ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తే ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలుస్తాయి. దీనిని తేలికగా తీసుకోవద్దు.. కార్గోలో బాంబులు కూడా ఉన్నాయి. మీరు ఢిల్లీలో ల్యాండ్ చేయాలని చూస్తే విమానాన్ని పేల్చేస్తాం’ అని రాసి ఉంది. దీంతో విమాన సిబ్బంది, ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సిబ్బంది విమానాన్ని అహ్మాదాబాద్‌కు మళ్లించారు. విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహించిన బాంబ్ స్క్వాడ్ బృందం ఆ కాగితంలో ఉన్నది తప్పుడు సమాచారంగా తేల్చింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన జెట్ ఎయిర్వేస్ అధికారులు సల్లా చేసిన పనిని మూడో లెవల్ తప్పుగా(అతి పెద్దదిగా) నిర్ధారించారు. భద్రత నిబంధనలు ఉల్లఘించిన కారణంగా.. సల్లాపై ఐదేళ్ల పాటు విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించి.. అతన్ని నో ఫ్లై లిస్ట్‌లో చేర్చారు. గతేడాది నవంబర్ నుంచి ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. -
ఇండిగోకు బెదిరింపు కాల్: షాకింగ్ ట్విస్ట్!
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల బాంబు ఉందంటూ ఎయిర్‌లైన్స్‌ను హడలెత్తించిన ఘటనలో షాకింగ్ విషయం వెలుగుచూసింది. పనితీరు బాగా లేదని సీనియర్ ఉద్యోగులు వార్నింగ్ ఇవ్వడంతో ఎయిర్‌లైన్స్‌కు కాల్ చేసి బుద్ధి చెప్పాలనుకున్నాడట. ఈ విషయాలను నిందితుడే స్వయంగా వెల్లడించాడు.ఆ వివరాలిలా.. పుణేకు చెందిన కార్తీక్ మాధవ్ భట్(23) హాస్పిటాలిటీలో డిప్లొమా కోర్స్ పూర్తి చేశాడు. అనంతరం ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో కస్టమర్ సర్వీస్ ఆఫీసర్‌గా ఉద్యోగంలో చేరాడు. అయితే వర్క్ బాగా చేయడం లేదని, చాలా మెరుగు పడాలని సీనియర్లు కార్తీక్‌కు ఇటీవల వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు బుద్ధిచెప్పాలని భావించినట్లు నిందితుడు తెలిపాడు. మే 2న ముంబైకి వెళ్లే ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ కాల్ చేసి కలకలం రేపాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది దాదాపు రెండు గంటలపాటు ప్రయాణికుల లగేజీతో పాటు ఎయిర్‌లైన్స్ మొత్తం తనిఖీలు చేసి ఫేక్ కాల్ అని తేల్చారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు కార్తీక్‌ను తాజాగా అరెస్ట్ చేసి విచారించగా అసలు విషయం బయటపడింది. తన పనితీరు బాగున్నా సీనియర్ ఉద్యోగులు వంకలు పెట్టారన్న కారణంగా.. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు ఫోన్‌చేసి బాంబు అని బెదిరించినట్లు నిందితుడు అంగీకరించాడు. -
ఢిల్లీలో అడుగుపెట్టగానే సీఎంను లేపేస్తా!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అడుగుపెట్టగానే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కాల్చిచంపేస్తానని ఓ గుర్తు తెలియని వ్యక్తి పోలీసు ఎమర్జెన్సీ నంబర్ 100కు ఫోన్ చేయడం తీవ్ర కలకలం రేపింది. కేజ్రీవాల్ రోడ్డుమార్గంలో చండీగఢ్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన సమయంలో ఈ బెదిరింపు ఫోన్‌కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తు చేయగా... ఇది ఉత్తుత్తి బెదిరింపు కాల్ని తేలింది. మద్యం తాగి.. మతిస్థిమితం సరిగ్గాలేని ఓ వ్యక్తి పోలీసులను భయపెట్టించేందుకు ఈ కాల్ చేసినట్టు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. ‘బుధవారం సాయంత్రం 6.16 గంటల సమయంలో పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఓ బెదిరింపు కాల్ వచ్చింది. తర్వాత ఇది ఉత్తిదేనని తేలింది. ఈశాన్య ఢిల్లీ ఖజురీ ఖాస్ ప్రాంతానికి చెందిన రవీంద్రకుమార్ తివారీ అనే వ్యక్తి ఈ కాల్ చేసినట్టు గుర్తించాం. దీంతో అతని ఇంటికి వెళ్లి పోలీసులు విచారణ జరిపారు. అతను మద్యం తాగి.. మతి స్థిమితం లేని స్థితిలో ఉన్నాడని స్థానికులు చెప్పారు. అతను ఇంకా పరారీలో ఉన్నాడు’ అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. సీఎం కేజ్రీవాల్‌ను కాల్చిచంపుతానని కాల్ చేసి బెదిరించిన తివారీని.. నీ వివరాలు తెలుపమని పోలీసులు అడగగా.. ‘నన్ను చంపేస్తేనే నా వివరాలు తెలుపుతా’ అని పేర్కొన్నట్టు ఆ అధికారి తెలిపారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా సీఎం కార్యాలయానికి ఈ బెదిరింపు కాల్ వివరాలను తెలిపినట్టు ఆయన వివరించారు. -
ట్విన్ టవర్స్ కూల్చివేత ఉగ్రదాడి కాదట!
సామాజిక మీడియా దిగ్గజం ఫేస్ బుక్ మరోసారి తప్పులో కాలేసింది. తన ట్రెండింగ్ టాపిక్స్ లో బూటక కథనాన్ని ప్రకటించడం సంచనలం రేపింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ విధ్వంసం ఉగ్రదాడి కాదంటూ డైలీ స్టార్ లింక్ ఫేస్ బుక్ లో హల్ చల్ చేసింది. దీనిపై స్పందించిన టెక్ మీడియా అది తప్పుడు కథనమని తెలిపింది. తక్షణ పరిష్కారంగా ఈ కథనాన్ని తొలగించినట్టుగా ఫేస్ బుక్ ప్రతినిధి శుక్రవారం ప్రకటించారని టెక్ వెబ్ సైట్ సీఎన్ఈటీ ప్రకటించింది. 9/11 ఉగ్రదాడికి 15 ఏళ్లు పూర్తికావస్తున్న సందర్భంగా సాధారణంగా ఇలాంటి ట్రెండింగ్ టాపిక్స్ పై ప్రజలకు ఆసక్తి ఉంటుందని మీడియా నివేదించింది. ఈ కారణంగానే ఇది టాప్ లిస్ట్ లో నిలిచిందని తెలిపింది. అయితే గత రెండు వారాల్లో ఇలాంటి తప్పుడు కథనాలు దర్శనమివ్వడం ఇది రెండవసారి కావడం గమనార్హం. ట్విన్ టవర్స్ ఉగ్రదాడి ఘటన టెర్రరిస్టుల పనికాదనీ, భవనంలో అమర్చిన బాంబుల వల్లే టవర్స్ కూలిపోయాయంటూ ఫేస్ బుక్ ట్రెండింగ్ టాపిక్స్ లో ఓ కథనం టాప్ లో నిలిచింది. దీంతో వివాదం చెలరేగింది. అయితే అల్గారిథమ్స్ తప్పుడు లింక్ లను సంస్థ క్వాలిటీ కంట్రోల్ టీం కనిపెట్టకపోవడంపై వ్యాఖ్యానించడానికి ఫేస్ బుక్ నిరాకరించింది. కాగా ఫేస్ బుక్ ప్రస్తుతం సుమారు 1.7 బిలియన్ల నెలవారీ యాక్టివ్ యూజర్లను కలిగి ఉంది. ట్రెండింగ్స్ టాపిక్స్ లోని కథనాలు వాస్తవమా కాదా అనే దానికి సంబంధం లేకుండా పాపులర్ మారి, ఎక్కువ వ్యూస్ ను సాధించడం తెలిసిందే. -
నకిలీ పోలీసులపై కేసు నమోదు
నెల్లూరు(క్రైమ్): పోలీసుల ముసుగులో వే బిల్లులు లేకుండా అక్రమంగా వస్తువులను తరలిస్తున్న వాహనాలపై బాలాజీనగర్ పోలీసులు ఆదివారం రాత్రి దాడులు చేశారు. వివరాలు.. జెండావీధికి చెందిన కరంతుల్లా, వెంకటేశ్వరరావు, కోవూరు వేగూరుకు చెందిన రవి, పెంచలయ్య కొంతకాలంగా చెన్నై నుంచి వే బిల్లులు లేకుండా అక్రమంగా వస్తువులను తరలిస్తున్న వాహనాలకు పోలీస్ నేమ్ బోర్డుతో పైలెట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆదివారం రాత్రి వారు చెన్నై నుంచి చేపల ట్రేల లారీకి పైలట్‌గా కావలికి బయల్దేరారు. ఎన్టీఆర్నగర్ జాతీయ రహదారిపై బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ రామారావు వాహన తనిఖీలను నిర్వíß స్తుండగా, పోలీస్ బోర్డుతో ఉన్న వాహనం తారసపడింది. తనిఖీచేయగా అందులో ఉన్న వ్యక్తులు నకిలీ పోలీసులని తెలిసింది. వెనుకనే వస్తున్న వాహనాన్ని పరిశీలించగా అందులో పెద్ద ఎత్తున చేపల ట్రేలు వే బిల్లులు లేకుండా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. -
బాంబు బూచి చూపి స్కూలు ఎగ్గొట్టారు...
ఘజియాబాద్: క్లాసులు ఎగ్గొట్టేందుకు నలుగురు విద్యార్థులు చేసిన తుంటరి పనికి పోలీసులు, ఉన్నతాధికారులు కంగుతిన్నారు. స్కూల్లో బాంబులు ఉన్నాయంటూ పోలీసులకు కాల్ చేసి హల్ చల్ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... ఛబ్బీల్ దాస్ పబ్లిక్ స్కూల్లో ఇంటర్ ఫస్టియర్ చదివే విద్యార్థులు బుధవారం క్లాసులు ఎగ్గొట్టాలని ప్లాన్ వేశారు. అందులో భాగంగానే ఓ విద్యార్థి వద్ద ఉన్న చైనా వాచ్ లో సిమ్ కార్డ్ వేసి, బాంబు ఉందంటూ పోలీసులను అలర్ట్ చేశారు. దీంతో వారు హుటాహుటిన స్కూలుకు చేరుకున్నారు. స్కూలు నుంచి అందర్నీ పంపించేసి ఇన్వెస్టిగేషన్ చాలా వేగంగా చేయగా అసలు విషయం బయటపడింది. అందరితో పాటు ఈ విద్యార్థులు కూడా ఇంటికి వెళ్లిపోయారు. అయితే, ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ల్యాండ్ లైన్ ఫోన్ నుంచి తమకు కాల్ వచ్చినట్లు గుర్తించారు. పోలీసులు ఎలాగోలా ప్రయత్నించి కాల్ చేసిన నలుగురు విద్యార్థులను గుర్తించారు. ఇంటికి వెళ్లిపోవడానికి ఈ పని చేసినట్లు విద్యార్థులు అంగీకరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రాధేయపడటంతో విద్యార్థులకు కౌన్సెలింగ్ తో కూడిన వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. మరోసారి ఇలాంటి పనులు చేయవద్దంటూ గట్టిగా మందలించి వారి తల్లిదండ్రులకు కొన్ని సూచనలు చేశారు. -
జెట్ ఎయిర్వేస్ విమానానికి బాంబు బెదిరింపు
అహ్మదాబాద్: బాంబు బెదిరింపు కారణంగా ముంబై బయల్దేరాల్సిన జెట్ ఎయిర్ వేస్ విమానాన్ని నిలిపివేశారు. అహ్మదాబాద్ నుంచి జెట్ ఎయిర్వేస్ విమానం బుధవారం ముంబై బయలుదేరాల్సి ఉంది. అయితే బాంబు బెదిరింపు కారణంగా విమానాన్ని నిలిపి వేసి తనిఖీలు చేస్తున్నారు. బాంబు బెదిరింపు సమాచారంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. -
జెట్ ఎయిర్వేస్ విమానానికి బాంబు బెదిరింపు
ఢిల్లీ: ఓ బాంబు బెదిరింపు కాల్ కారణంగా గోరక్ పూర్ బయల్దేరాల్సిన జెట్ ఎయిర్ వేస్ విమానం సుమారు రెండు గంటలు ఆలస్యంగా బయల్దేరింది. 55 మంది ప్రయాణీకులు, నలుగురు సిబ్బందితో సహా ప్రయాణానికి సిద్ధంగా ఉన్న విమానాన్ని వైమానిక సంస్థ కార్యాలయానికి బాంబు బెదిరిపు కాల్ రావడంతో భద్రతా కారణాల దృష్ట్యా నిలిపివేశారు. విమానం బయల్దేరేందుకు సిద్ధంగా ఉండగా బాంబు బెదిరింపు కాల్ రావడం ఆలస్యానికి కారణమైందని, తర్వాత అది బూటకపు కాల్ అని తెలుసుకున్నట్లు ఎయిర్ లైన్స్ తెలిపింది. ఏటీ ఆర్ నిర్వహిస్తున్న జెట్ ఎయిర్ వేస్ కు చెందిన 9W-2467 విమానం ఢిల్లీనుంచి గోరక్ పూర్ కు మధ్యాహ్నం 1.30 కి బయల్దేరాల్సి ఉంది. సుమారు 12.30 సమయంలో వైమానిక సంస్థ కార్యాలయానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో సిబ్బంది అలర్ట్ అయ్యారు. బాంబు భయం ఉన్నమాట నిజమేనని తాము అధికారికంగా నిర్వహిస్తున్న ట్విట్టర్ ద్వారా తమకు తెలిసినట్లు ఢిల్లీ పోలీసులు కూడ ధృవీకరించారు. దీంతో విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టిన సిబ్బంది అటువంటిదేమీ లేదని నిర్థారించి విమానం బయల్దేరేందుకు ఏర్పాట్లు చేశారు. భద్రతా హెచ్చరికల మేరకు తనిఖీ ప్రక్రియ చేపట్టామని, ప్రయాణీకులకు ఎటువంటి ప్రమాదం లేదని, అంతా సురక్షితమేనని ఢిల్లీ పోలీసులు ఓ ట్వీట్లో తెలిపారు. సెక్యూరిటీ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత విమానం మధ్యాహ్నం 3.15 నిమిషాలకు బయల్దేరినట్లు ఎయిర్ లైన్స్ ప్రకటించింది. -
అజ్మీర్ దర్గాకు బాంబు బెదిరింపు
దేశంలోనే కాక విదేశాల్లోనూ ఎంతో ప్రాచుర్యం పొందిన అజ్మీర్ దర్గాకు బాంబు బెదిరింపు వచ్చింది. 12వ శతాబ్దం నాటి ఖ్వాజా గరీబ్ నవాజ్ దర్గాలో బాంబు పెట్టినట్లు సోమవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేయడంతో వెంటనే దర్గాను ఖాళీ చేయించారు. ఆ సమయానికి దర్గాలో దాదాపు లక్ష మంది వరకు భక్తులు ఉన్నారు. దర్గాలోకి బాంబు డిటెక్టర్లతో పోలీసు కమాండోలు ప్రవేశించడంతో వాళ్లంతా ఒక్కసారిగా భయంతో వణికిపోయారు. మొత్తం అన్ని గేట్ల నుంచి భక్తులను బయటకు పంపి, మొత్తం ప్రాంగణం అంతటినీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దాదాపు అరగంట పాటు తనిఖీ చేసిన తర్వాత అక్కడ ఎలాంటి బాంబు లేదని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. ఆ ప్రాంతంలో హై ఎలర్ట్ ప్రకటించి, క్విక్ రెస్పాన్స్ బృందాలు ఆ మార్గాన్ని తమ అదుపులోకి తీసుకున్నాయి. తెల్లవారుజామున 6.40 గంటల సమయంలో ఈ ఫోన్ కాల్ వచ్చింది. దర్గాను పేల్చేస్తామని బెదిరింపు రావడంతో ఉదయం 7.45 నుంచి 9.15 వరకు దర్గాను మూసేసినట్లు పోలీసులు తెలిపారు. -
భార్యను చంపి.. ప్రియురాలి భర్తను ఇరికించి!
-
భార్యను చంపి.. ప్రియురాలి భర్తను ఇరికించి!
అతడో సాఫ్ట్వేర్ ఇంజనీర్. తన భార్యను చంపేశాడు.. ప్రియురాలి భర్తను వేరే కేసులో ఇరికించి తామిద్దరం హాయిగా ఉందామనుకున్నాడు. తీరా చూస్తే.. చివరకు పోలీసుల చేతికి చిక్కాడు. సినిమా ట్విస్టులను తలపించే ఈ ఘటన బెంగళూరులో జరిగింది. ఎంజీ గోకుల్ (33) అనే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్.. ఓ మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. ఆమెకు అప్పటికే పెళ్లయింది కూడా. దాంతో ఆమె భర్త అడ్డు తొలగించుకోడానికి బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి నకిలీ బాంబు బెదిరింపు కాల్స్ చేశాడు. అందుకోసం.. చాలా పెద్ద పథకమే వేశాడు. ముందుగా ఆమె భర్త పాస్‌పోర్టు దొంగిలించి, దాన్ని ఆధారంగా చూపించి అతడి పేరు మీద సిమ్ కార్డు కొనుగోలు చేశాడు. అలాగే, ఫేస్బుక్లో అతడి పేరుమీద ఓ పేజీ క్రియేట్ చేశాడు. అందులో అతడిని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ సానుభూతిపరుడిగా చూపించాడు. సైబర్ క్రైం పోలీసులకు దాని ఆచూకీ చిక్కాలని చూశాడు. కానీ అలా జరగలేదు. దాంతో, బెంగళూరు విమానాశ్రయానికి ఫోన్ చేశాడు. కానీ అక్కడ ఎవరూ ఫోన్ ఆన్సర్ చేయకపోవడంతో.. ఢిల్లీ విమానాశ్రయానికి కాల్ చేసి, మూడు విమానాల్లో బాంబులు ఉన్నాయని బెదిరించాడు. తర్వాత బెంగళూరు విమానాశ్రయానికి కూడా అలాంటి బెదిరింపులే వాట్సప్ మెసేజి ద్వారా పంపాడు. పోలీసులు కూడా మొదట సిమ్ కార్డు వివరాల ఆధారంగా అతడి ప్రియురాలి భర్తనే అనుమానించారు. కానీ, తర్వాత విషయం తెలిసి గోకుల్‌ను అరెస్టు చేశారు. ఇందులో ఉగ్రవాద కోణం ఏమీ లేదని, అయితే.. నిందితుడి భార్య అనూరాధ కొన్ని నెలల క్రితం అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడంతో ఆ కేసును ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నామని బెంగళూరు పోలీసు కమిషనర్ తెలిపారు. తన భార్యపై దాడి చేయడంతో ఆమె చనిపోయినట్లు గోకుల్ అంగీకరించాడని అంటున్నారు. -
బాబోయ్.. నేను చచ్చిపోలేదు!
చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దాళ్ల వరకు ప్రతి ఒక్కరికీ అతడు ఫేవరెట్ నటుడు. ఫైటింగులకు ఫైటింగులు.. నవ్వులకు నవ్వులు. అతడెవరో ఈపాటికే అర్థమై ఉంటుంది కదూ.. అతడే అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ స్టార్ జాకీ చాన్. అలాంటి జాకీ చాన్ చచ్చిపోయాడంటూ ఇంటర్నెట్ ప్రపంచంలో ఒక్కసారిగా గగ్గోలు పుట్టింది. దాంతో.. తాను బ్రహ్మాండంగా బతికే ఉన్నానని, తాను విమాన ప్రమాదంలో చనిపోయినట్లు వచ్చిన కథనాలు చూసి షాకయ్యానని జాకీచాన్ చెప్పుకోవాల్సి వచ్చింది. చైనా సోషల్ మీడియా వైబోలో తన పేరుతో 'రెడ్ పాకెట్స్' గురించి జరుగుతున్న స్కాంను కూడా నమ్మొద్దని ఇదే ప్రకటనలో ఇటు ట్విట్టర్లోను, అటు ఫేస్బుక్లో కూడా పెద్ద పోస్టింగ్ పెట్టాడు. తనకు ఒకే ఒక్క అఫీషియల్ వైబో పేజి ఉందని, అందువల్ల వేరే ఫేక్ పేజీలు చూసి మోసపోవద్దని కోరాడు. అమీర్‌ఖాన్ నటించిన 'పీకే' సినిమాను చైనాలో గతవారం చూసిన జాకీచాన్.. తన అభిమానుల కోసం పెద్ద లేఖనే రాశాడు. ప్రస్తుతం ఆయన కేన్స్‌లో జరుగుతున్న 68వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో బిజీగా ఉన్నాడు. I was shocked by two news reports when I got off the plane. First of all, don't worry! I'm still alive. Second,... http://t.co/EnvVR7OMqu — Jackie Chan (@EyeOfJackieChan) May 16, 2015 -
5వేల రూపాయల నోట్లు వస్తున్నాయా.. లేవా?
ఇంకేముంది.. నేడో, రేపో 5వేల రూపాయల నోట్లు వచ్చేస్తున్నాయని ఆమధ్య తెగ ప్రచారం జరిగింది. ఇంతకీ అసలు ఆ నోట్లు వస్తున్నాయో లేవో మాత్రం ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోయారు. ఇప్పుడు రిజర్వు బ్యాంకు ఆ విషయం మీద స్పందించింది. 5వేల నోట్లు వస్తున్నాయనడం అంతా శుద్ధ అబద్ధమని ఆర్బీఐ స్పష్టం చేసింది. సోమవారం నాడు ట్విట్టర్లో ఈ విషయం మీద గగ్గోలు పుట్టింది. మంగళవారం నాడు 5వేల రూపాయల నోటు విడుదల అవుతోందంటూ.. ఓనోటు ఫొటోను కూడా పెట్టేశారు. అయితే, వెయ్యిరూపాయల నోటు మీద 1 అంకె తీసి.. 5 పెట్టేశారని ఇట్టే కనిపెట్టగలిగారు. అయితే, అసలు తమకు అలాంటి ప్రతిపాదనే లేదని, అసలీ వదంతులు ఎలా మొదలయ్యాయో తమకు తెలియదని ఆర్బీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. ముందు వాట్సప్‌లో ఎవరో ఈ విషయం గురించి చెప్పారని, అక్కడినుంచి అది అలా అలా వెళ్లిపోయిందని అంటున్నారు. అయితే.. ఒకప్పుడు మన దేశంలో 5వేల రూపాయల నోట్లు కూడా చలామణిలో ఉండేవి. ఈ విషయం రిజర్వు బ్యాంకు వెబ్సైట్ చూస్తే తెలుస్తుంది. 1950 ప్రాంతాల్లో వెయ్యి, 5వేలు, 10 వేల రూపాయల నోట్లు కూడా ముద్రించారు. కానీ, 1967 సంవత్సరంలో వాటిని వెనక్కి తీసేసుకున్నారు. -
హోమ్ వర్క్ చేయడానికి...
చెన్నై: హోమ్ వర్క్ చేయడానికి సెలవు అవసరం కావడంతో పాఠశాలలో బాంబు ఉందని ఫోన్ చేశానని ప్లస్ వన్ విద్యార్థి మంగళవారం పోలీసులకు తెలిపాడు. అతన్ని బాలల జువైనల్ హోమ్‌కు తరలించారు. చెన్నై, పోలీసు కంట్రోల్ రూమ్‌కు సోమవారం ఉదయం ఫోన్ చేసిన ఒక బాలుడు, వలసరవాక్కం ఆల్వార్తినగర్లో ఉన్న వెంకటేశ్వర పాఠశాలలోను, విరుగంబాక్కం న్యూకాలనీలో ఉన్న జాన్స్ పాఠశాలలోను బాంబులు పెట్టినట్టు తెలిపాడు. కొద్దిసేపట్లో అవి పేలిపోతాయని అని బెదిరించి ఫోన్ కట్ చేశాడు. దీంతో డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ నిపుణులు వలసరవాక్కం, విరుగంబాక్కం పోలీసులు ఆయా పాఠశాలలకు వెళ్లి విద్యార్థులను బయటకు పంపించివేసి పాఠశాలలకు సెలవు ప్రకటించారు. పోలీసుల తనిఖీల్లో అది బాంబు బూచీ అని తేలింది. ఈ విషయమై విరుగంబాక్కం పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో ఫోన్ కాల్ ఏంజీఆర్ నగర్ నుంచి వచ్చినట్టుగాను, సెయింట్ జాన్స్ పాఠశాలలో ప్లస్ వన్ విద్యార్థి ఫోన్ చేసినట్టు తెలిసింది. దీంతో పోలీసులు ఆ విద్యార్థిని మంగళవారం సాయంత్రం అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. విచారణలో శని, ఆదివారాల్లో పాఠశాలకు సెలవు కావడంతో ఉపాధ్యాయులు ఎక్కువ హోమ్ వర్క్ ఇచ్చారు. వినాయక నిమజ్జనానికి స్నేహితులతో వెళ్లాను. దీంతో హోమ్‌వర్క్ చేయలేదు. సోమవారం ఉపాధ్యాయులు హోమ్ వర్క్ గురించి అడుగుతారని భయపడి, సెలవు కోసం బాంబు బెదిరింపు కాల్ చేశాను అని విద్యార్థి వెల్లడించాడు. నేను చేసిన తప్పును తెలుసుకున్నానని బోరున విలపించాడు. తనను క్షమించి విడిపించాలని విజ్ఞప్తి చేశాడు. అయినప్పటికీ అతనిపై కేసు నమోదు చేసి కెల్లిస్లో ఉన్న బాలల జువైనల్ హోమ్‌కు తరలించారు. -
గొల్లం భూతం ఉన్నట్టా లేనట్టా?
గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అడుగు భాగాల, కొండలు, గుట్టల మధ్య, వింత చర్మం రంగుతో, అంతకన్నా వింతైన చెవులతో ఓ వింత జీవి దర్శనమిచ్చింది. దాన్ని చూసిన వారికి పై ప్రాణాలు పైకే పోయాయి. ఎవరో ఒకరు మాత్రం ధైర్యం చేసి తన కెమెరాలో వింత జీవిని బంధించాడు. రాళ్ల మధ్య కూర్చుని ఉన్న ఆ విత జీవిని చైనీయులు గొల్లం అని పేరు పెట్టుకున్నారు. ఇక ఇంటర్నెట్ అంతా గొల్లం సందడే. 32000 మంది గొల్లం బొమ్మను రీపోస్ట్ చేశారు. లక్షలాది మంది కామెంట్ చేశారు. చైనా అంతా గొల్లం కబుర్లే. చైనా ప్రభుత్వం కూడా రంగంలోకి దిగి, ఈ వింత జీవి గురించి విచారణ మొదలుపెట్టింది. అప్పుడు ఉన్నట్టుండి ఒకవ్యక్తి ముందుకొచ్చి గొల్లం వింత జంతువు కాదు. అది నేనే. ఆ వేషం వేసింది నేనే. ఓ టీవీ యాడ్ కోసం నేను ఆవేషం వేశాను అని తన చిత్రాలను, తన మేకప్ దృశ్యాలను విలేఖరులకు చూపించాడు. అయినా ప్రజలు నమ్మలేదు. చివరికి ప్రజల ముందే మేకప్ వేసుకున్నాడు. అప్పటికి గానీ ప్రజలు గొల్లం అనే భూతం లేదని ఒప్పుకోలేదు. 'మరి ఆ రాయి దగ్గర ఎందుకు కూర్చున్నావు' అని విలేఖరులు ఆ నటుడిని అడిగారట. 'ఏం చెప్పమంటారండీ... చెప్పుకోలేని దేహబాధలు తీర్చుకుంటున్నాను,' అని జవాబు చెప్పాడట!! -
ఎన్టీటీపీఎస్లో బాంబు కలకలం
ఇబ్రహీంపట్నం: కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలోని ఎన్టీటీపీఎస్లో బాంబు ఉన్నట్లు మంగళవారం మధ్యాహ్నం ఓ అపరిచిత వ్యక్తి 100కి ఫోన్ చేయడంతో పోలీసులు తనిఖీలు చేశారు. బాంబు స్వ్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో థర్మల్ కేంద్రంలో అణువణువూ గాలించారు. చివరికి ఏమీలేదని తేలడంతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఫోన్లో తప్పుడు సమాచారం అందించిన వ్యక్తిని రాత్రి స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జి.కొండూరు మండలం కవులూరు గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలుడిగా పోలీసులు గుర్తించారు. కేవలం ఆకతాయితనంగా ఫోన్ చేసినట్లు అతడు పోలీసులకు చెప్పాడు. -
చెన్నైలో ఉత్తుత్తి బాంబు బెదిరింపులు
సెంట్రల్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారం మీద ఉన్న రైల్లో బాంబు పేలి ఒక యువతి మరణించి 24 గంటలు గడిచిందో, లేదో.. చెన్నై పోలీసులకు ఉత్తుత్తి బాంబు బెదిరింపులు ఎక్కువైపోయి తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. వదంతులు వ్యాపింపజేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఎంతగా హెచ్చరించినా ఈ ఫోన్లు మాత్రం ఆగడంలేదు. నగరంలోని ఓ పెద్ద షాపింగ్ మాల్, ఓ విద్యాసంస్థ, ఓ శివారు రైల్వేస్టేషన్లకు బాంబు బెదిరింపు ఫోన్లు వచ్చాయి. దీంతో వెంటనే భద్రతా విభాగం అధికారులు హుటాహుటిన వెళ్లి అక్కడ పూర్తిస్థాయిలో తనిఖీ చేసినా, బాంబులు మాత్రం దొరకలేదని నగర పోలీసు కమిషనర్ జేకే త్రిపాఠీ తెలిపారు. -
చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు
చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పెట్టినట్లు బెదిరింపులు రావడంతో రైల్వే అధికారులు అప్రమత్తమైయ్యారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో ఆ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను నిలిపివేశారు. అనంతరం ప్రయాణికులను ట్రైన్ నుంచి దింపివేశారు. పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. దాదాపు గంట నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. అయితే మహబూబాబాద్ రైల్వే స్టేషన్ సరైన సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
'అసోం రేప్ ఫెస్టివల్' తప్పుడు కథనంతో అమెరికా మీడియా కండకావరం
అసోంలో ‘రేప్ ఫెస్టివల్’ జరుగుతోందంటూ అమెరికాకు చెందిన నేషనల్ రిపోర్ట్ అనే వెబ్ సైట్ వివాదాస్పద కథనం ప్రచురించడం వెనక, పెచ్చరిల్లుతున్న మానభంగ నేరాల పట్ల ఆందోళన ప్రకటించడం, వాటిని నియంత్రించడంలో ఇండియా చిత్తశుద్ధి లేమిని ఎత్తిచూపడమే తమ ఉద్దేశమని సదరు వెబ్ సైట్ నిర్వాహకులు వివరణ ఇస్తున్నారు. అయితే, ఈ వివరణలో నిజమెంత? భారత దేశం మీద వారు చూపుతున్న అక్కరలో నిజాయితీ ఎంత? అన్నది చాలా ముఖ్యం. ఆ చర్చలోకి వెళ్లే ముందు, ఈ వార్తాకథనం పూర్వాపరాల్ని చూద్దాం. గంగలో పవిత్ర స్నానానికి ఉద్వేగ భక్తితో మూకుమ్మడిగా వెళ్తున్న నాగా సాధువుల ఫొటోతో పాటు, అసోంలో ‘రేప్ ఫెస్టివల్’ జరుగుతోందంటూ నేషనల్ రిపోర్ట్ పోస్ట్ చేసింది. సంక్షిప్తంగా, ఆ కథనం ప్రకారం, వేల సంవత్సరాలుగా గొప్ప ఆనవాయితీగా ఈ ‘రేప్ ఫెస్టివల్’అసోంలో ఏటేటా జరుగుతుంది. మగాళ్లు తోడేళ్లలా వెంట పడుతుంటే 7 నుంచి 16 ఏళ్ల ఆడపిల్లలు సురక్షిత స్థలాలకి పరుగులు తీయాలి, లేదా సామూహిక అత్యాచారానికి గురవ్వాలి. దీనికోసం మగవాళ్లు ఏడాది పొడుగునా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. విజేతగా నిలవడానికి ‘నేను క్రమం తప్పకుండా రోజూ రేప్ ప్రాక్టిస్ చేస్తాను. మా చెల్లిని, దాని స్నేహితురాళ్లనీ రేప్ చేస్తూనే ఉంటాను’ అని ఓ యువకుడు చెప్పినట్లు కూడా అందులో పేర్కొన్నారు. ఒక పన్నెండేళ్ల అమ్మాయి వివరించిన తన అనుభవం ఇది: ‘గతేడాది, నేను రేప్ తప్పించుకునే సురక్షిత వలయంలోకి దాదాపు కాలు పెట్టేశాను. కానీ, చివరి క్షణంలో 9 మంది మగాళ్లు నా మీదకి లంఘించి రేప్ చేశారు. నేను ఈ సంవత్సరం ఫెస్టివల్‌కి సిద్ధమయ్యేలా కోలుకున్నాను. నేను పాల్గోలేకపోతే, నన్ను రాళ్లతో కొట్టి చంపేస్తారు’. కెనడా నుంచి వచ్చిన మెత్తని మనసున్న ఓ తెల్లతోలు మారాజు- ‘ఇటువంటి అనాగరికమైన, వెనకబడిన దేశం నుంచి ఈ రోజే వెళ్లిపోతాన’ని చెప్పడంతో ఆ వ్యంగ్య కథనం ముగుస్తుంది. ఇప్పుడు తిరిగి, ఈ వెటకారపు వార్తని ప్రచురించడంలో నేషనల్ రిపోర్ట్ వెబ్ సైట్ ఉద్దేశం విషయానికి వద్దాం. ఆ వెబ్ సైట్ చెప్పుకుంటున్నట్టు దాని వెనక ఆక్రోశమే ఉందా, లేక పడమటి దొరల అక్కసు, అహంకారాలు ఉన్నాయా? ఓ ఇల్లు (లేదా ఒక సమాజం/ సమాజం) పరిశుభ్రంగా లేదని చెప్పడంలో రెండు విధానాలు- ఒకటి: ఆ ఇల్లు తనది అనుకొని, అశుభ్రంగా ఉండటం వల్ల బాధ పడి, లోపాన్ని సరిచేసే బాధ్యతతో వ్యాఖ్యానించడం; లేదా, రెండు: ఆ సిస్టమ్‌కి ఔట్సైడర్గా, పరాయిగా కలోనియల్ కంటితో, జాత్యహంకారపు బూతద్దాలతో చూస్తూ ఆ అశుభ్రాన్ని వేళాకోళం చేయడం. నేషనల్ రిపోర్ట్ వెబ్ సైట్ కచ్చితంగా ఎంచుకుంది ఈ రెండవ మార్గాన్నే. ఇండియాలో రేప్ ఉదంతాలు పెచ్చరిల్లి పోతున్నాయని, కొన్ని మరీ పైశాచికంగా ఉన్నాయని చెప్పడానికి ఎందరో భారతీయుల్ని క్షోభ పెట్టవల్సిన పనిలేదు. అంతర్జాతీయంగా రేప్‌లకు రాజధాని అమెరికా అని మర్చిపోయి ఎదుటివారి లోపాల్ని ఎంచడానికి తెగబడకూడదు. గన్ కల్చర్ మొదలుకొని, చీకటి సామ్రాజ్యంలో ఉన్న తీవ్రాతి తీవ్రమైన నేరాలకి కేంద్రమైన అమెరికాలోని మీడియా గురివిందగింజలా తన కింద నలుపు గుర్తించకపోవడం కండకావరమే. ఒక గొప్ప సంప్రదాయానికి నిబద్ధమైన ప్రతీకలైన నాగా సాధువుల ఫొటోని ఈ తప్పుడు కథనానికి వాడటం, మితిమీరిన మిడిసిపాటుతో ఆ వార్త ప్రచురించడం కోట్లాది మంది భారతీయుల్ని వేదనకి గురిచేసింది. అసోం ప్రభుత్వం పరువు నష్టం దావా వేసే ఆలోచనతో ఉండగా, భారత ప్రభుత్వం దీనినొక సైబర్ నేరంగా పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది. తమిళనాడులోని బాలకిషన్ అనే మహా రేపిస్టు స్ఫూర్తిగానే క్రీస్తుపూర్వం 43 నుంచి అస్సోం రేప్ ఫెస్టివల్ ప్రతి ఏటా జరుగుతుందని ఆ వెక్కిరింతల వార్తాకథనంలో రాయడం జాతివివక్షకి మించిన హేయమైన నేరం. -
పాఠశాలలో ముందుపాతరలు ఉన్నాయంటూ నకిలీ ఫోన్
రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలోని ఓ పాఠశాల అవరణలో మందుపాతరలు అమర్చినట్లు ఫోన్ కాల్ రావడంతో పాఠశాల యాజమాన్యం అప్రమత్తమైంది. పోలీసులకు సమాచారం అందించింది. దాంతో హుటాహుటన పోలీసులు పాఠశాలకు చేరుకుని, పాఠశాలలోని విద్యార్థులతోపాటు పరిసర ప్రాంతాలకు చెందిన దాదాపు 400 మందిని అక్కడి నుంచి తరలించింది. అనంతరం బాంబు నిర్వీర్య బృందాలు పాఠశాలలో అడుగడుగున క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టింది. దాదాపు మధ్యాహ్నం 1.30లకు వరకు పాఠశాలలో తనిఖీలు నిర్వహించి మందుపాతరలు లేవని బాంబు నిర్వీర్య బృందాలు నిర్థారణకు వచ్చాయి. దాంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. నకిలీ ఫోన్ కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. ఫోన్ కాల్ గుర్తించవలసి ఉందని, దానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆ ఘటన గురువారం చోటు చేసుకుంది.