బాబోయ్.. నేను చచ్చిపోలేదు! | Jackie chan condemns rumours about his death | Sakshi
Sakshi News home page

బాబోయ్.. నేను చచ్చిపోలేదు!

Published Mon, May 18 2015 7:20 PM | Last Updated on Thu, Sep 27 2018 3:15 PM

బాబోయ్.. నేను చచ్చిపోలేదు! - Sakshi

బాబోయ్.. నేను చచ్చిపోలేదు!

చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దాళ్ల వరకు ప్రతి ఒక్కరికీ అతడు ఫేవరెట్ నటుడు. ఫైటింగులకు ఫైటింగులు.. నవ్వులకు నవ్వులు. అతడెవరో ఈపాటికే అర్థమై ఉంటుంది కదూ.. అతడే అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ స్టార్ జాకీ చాన్. అలాంటి జాకీ చాన్ చచ్చిపోయాడంటూ ఇంటర్నెట్ ప్రపంచంలో ఒక్కసారిగా గగ్గోలు పుట్టింది. దాంతో.. తాను బ్రహ్మాండంగా బతికే ఉన్నానని, తాను విమాన ప్రమాదంలో చనిపోయినట్లు వచ్చిన కథనాలు చూసి షాకయ్యానని జాకీచాన్ చెప్పుకోవాల్సి వచ్చింది.

చైనా సోషల్ మీడియా వైబోలో తన పేరుతో 'రెడ్ పాకెట్స్' గురించి జరుగుతున్న స్కాంను కూడా నమ్మొద్దని ఇదే ప్రకటనలో ఇటు ట్విట్టర్లోను, అటు ఫేస్బుక్లో కూడా పెద్ద పోస్టింగ్ పెట్టాడు. తనకు ఒకే ఒక్క అఫీషియల్ వైబో పేజి ఉందని, అందువల్ల వేరే ఫేక్ పేజీలు చూసి మోసపోవద్దని కోరాడు. అమీర్ఖాన్ నటించిన 'పీకే' సినిమాను చైనాలో గతవారం చూసిన జాకీచాన్.. తన అభిమానుల కోసం పెద్ద లేఖనే రాశాడు. ప్రస్తుతం ఆయన కేన్స్లో జరుగుతున్న 68వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో బిజీగా ఉన్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement